పరిచయం వేసవిలో మనం సాదారణంగా చూసే సమస్య వడదెబ్బ. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తిని కొల్పోయినపుడు వడదెబ్బ సంభవిస్తుంది. దీనికి గురైతే వెంటనే వైద్యుని సంప్రదించాలి, చికిత్స చేయించుకోవాలి . కారణాలు వడదెబ్బకు ముఖ్యమైన కారణం నీరు తాగకుండా ఎండలో ఎక్కువసేపు ఉండి పని. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఊష్ణోగ్రత ఎక్కువ అవుతుంది, అప్పుడు శరీరంలో కణాలు చచ్చిపోతాయి. దాంతో శరీరంలో మార్పులు జరుగుతాయి. ఎక్కువ వడదెబ్బకు గురయ్యేవారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఊబకాయలు మద్యం తాగేవారు వృధ్దులు గుండె జబ్బుగలవారు లక్షణాలు ఊష్ణోగ్రత శాతం – 102 ఫారన్ హీట్ ఉంటే కండరాల బలహీనత తలనొప్పి వికారం బలహీనత కళ్ళు తిరిగి పడిపొవడం ఊష్ణోగ్రత శాతం – 106 ఫారన్ హీట్ ఉంటే చర్మం ఎర్రగా కందిపోవడం గుండె వేగంగా కొట్టుకోవడం అధిక ఆయాసం తలనొప్పి సతమతమవడం, వింతగా ప్రవర్తించడం, తక్కువ రక్తపోటు ఒక వేళ ఊష్ణోగ్రత 105 ఫారన్ హీట్ మించితే మెదడు పనితీరు మందగిస్తుంది. ఊష్ణోగ్రత శాతం – 106 ఫారన్ హీట్ ఉంటేచర్మం ఎర్రగా కందిపోవడంగుండె వేగంగా కొట్టుకోవడంఅధిక ఆయాసంతలనొప్పిసతమతమవడం, వింతగా ప్రవర్తించడం,తక్కువ రక్తపోటుఒక వేళ ఊష్ణోగ్రత 105 ఫారన్ హీట్ మించితే మెదడు పనితీరు మందగిస్తుంది. చికిత్స వడదెబ్బకు గురైనవారిని ముందుగా నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. వారి శరీరాన్ని చల్లటి నీళ్లతో తుడవాలి. ఎదైనా గుడ్డను తడిపి దానిపై వారిని పడుకోబెట్టడం వల్ల వేడిని నివారించవచ్చు. ఒక వేళ శ్వాస అందనట్లైతే ఇతరుల నోటి ద్వారా శ్వాసను అందజేయాలి. శరీరాన్ని పావుగంటకు ఒకసారి తడిగుడ్డతో తుడవాలి. శరీరం నుండి కోల్పోయిన నీటిని సమతుల్యం చేయాలంటే వారికి మజ్జిగ, నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరి నీళ్ళు, వేడి తగ్గించి ఒంటిని చల్లబరిచే పుదీన రసం , లస్సీ, కొత్తిమీర వేసిన మజ్జిగ మొదలైనవాటిని తాగించాలి. ఇలా చేయడం ద్వార వారిని తిరిగి సాదారణ స్దితికి తీసుకురావచ్చు. వడదెబ్బకు గురికాకుండ తీసుకోవలసిన జాగ్రత్తలు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే వెంట గొడుగున తీసుకువెళ్ళాలి. శరీరాన్ని ఎండబారి నుండి కాపాడుకోవడానికి లేతరంగుల, నిండైన, కాటన్ వస్త్రాలు, దుస్తులను ధరించాలి. ఎక్కువగా నీరు తాగాలి, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు రెండుపూటల ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం శ్రేయస్కరం. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను, కూరగాయలను, దోసకాయలు, కొబ్బరిబొండాలు, ఆకు కూరలు, ఖర్బూజ, రాగి అంబలి, జొన్న జావ వంటివి తీసుకోవాలి.