విత్తనాల కోసం పండించే ఆ పంటను ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో పండిస్తున్నారు. అనిలిన్ డైలకు పూర్వం కుసుమ (శాఫ్ ఫ్లవర్) విత్తనాలను వంటకాల కలరింగ్ కోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ విత్తనాల నుంచి తీసిన నూనె వంటనూనెగా విరివిగా వాడుకలో ఉంది. న్యూట్రిషనల్ వాల్యూ వంద గ్రాముల కుసుంభ నూనెలో: కొవ్వులు - 38గ్రా దీన్లో: శాచురేటెడ్ ఫ్యాట్ - 3.7గ్రా పాలీశాచురేటెడ్ ఫ్యాట్ - 28గ్రా మోనోశాచురేటెడ్ ఫ్యాట్ - 4.8గ్రా సోడియం - 3గ్రా పొటాషియం - 687మి.గ్రా కార్బొహైడ్రేట్స్ - 34గ్రా ప్రొటీన్ - 16గ్రా విటమిన్ బి12 - 88శాతం కుసుమ నూనెతోపాటు పువ్వుల్ని కూడా వంటకాల్లో వాడతారు. కుంకుమ పువ్వులా వంటకాలకు రంగు తెచ్చే చవక పువ్వు ఇది. కాబట్టి దానికి బదులుగా కుసుమ నూనెను వాడొచ్చు. కుసుమ విత్తనాల నుంచి తీసే మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్...ఈ రెండు నూనెలను కూరగాయల వేపుళ్లకు వాడొచ్చు. ఈ నూనెతో తక్కువ వేడిని ఉపయోగించే బేకింగ్ కోసం వాడొచ్చు. సాస్ తయారీలో వాడొచ్చు. డీప్ ఫ్రైలకు ఉపయోగించొచ్చు. సలాడ్ డ్రెసింగ్‌కు వాడొచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు: ఈ నూనెలో యాంటిఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి గుండెకు మేలు చేస్తుంది. ఈ నూనెకు వాడితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. దీన్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఈ నూనె శరీరంలో కొవ్వులా పేరుకోదు. పైగా శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి లావు తగ్గాలనుకునే వాళ్లు వంటకాల్లో ఈ నూనెను వాడటం మేలు. ఆధారము: ఆంధ్రజ్యోతి