స్నానం చేసే సమయంలో నీరు పోయడం వస్తువులు: ఒక చిన్న ముగ్గు లేదా పాత్ర మరియు నీరు. దశలు స్నానం చేసే సమయంలో బిడ్డకు ఒక చిన్న ముగ్గు లేదా పాత్రను అందించండి. పాత్ర నుండి ముగ్గులోకి నీళ్ళు ఎలా తీసుకోవాలో మరియు నీళ్ళు ఎలా పోయాలో బిడ్డకు చూపించండి. బిడ్డ సొంతంగా ముగ్గులోకి నీరు తీసుకొని పోసే విధంగా ప్రోత్సహించండి. ఈ స్నానం చేసే సమయాన్ని నవ్వుతూ, సరదాగా బిడ్డతో కలిసి గడపండి. కృత్యం ప్రాధాన్యత: ఈ స్నానం చేసే సమయంలో పిల్లలకు ఒక సానుకూల అనుబంధం ఏర్పడుతుంది. ఈ కృత్యం పిల్లలకు మిగతా పనులకంటే భిన్నంగా సరదాగా తోస్తుంది. దీంతో పాటు ఇంద్రియాల పనితీరు మరియు చలన కండరాల అభివృద్ధి జరుగుతుంది. పేర్చుట మరియు పడేయటం వస్తువులు: ఒకే పరిమాణం గల 3 ఆట వస్తువులు. దశలు మీరు ఆట వస్తువులను ఒకదాని మీద ఒకటి పేర్చి, పేర్చిన ప్రతిసారీ పైన పెట్టాలని బిడ్డకు చెబుతూ వస్తువుని పెట్టే క్రమాన్ని బిడ్డకు చూపించాలి. బిడ్డ ఆట వస్తువులను పేరుస్తున్నప్పుడు ఆ చిట్టి చేతులకు తల్లి సహాయం అందించాలి. మీ బిడ్డ చివరి వస్తువును పైన ఉంచినప్పుడు వారిని దగ్గరకు తీసుకొని సంతోషాన్ని వ్యక్తం చేయాలి. పేర్చిన వస్తువులను బిడ్డ వాటిని కదలించి పడవేసేలా ప్రోత్సహించాలి. ఆ పనిని బిడ్డతో కలిసి సరదాగా ఆస్వాదించాలి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యాలు బిడ్డలో చలనకండరాల అభివృద్ధికి, కంటి చేతి సమన్వయానికి మరియు సమతుల్యత కొరకు ఉపయోగపడుతుంది. బిడ్డను దగ్గరకు తీసుకుని బిడ్డ విజయాన్ని అందరూ కలిసి జరుపుకోవడం వలన బిడ్డలో ఆత్మవిశ్వాసం పెరిగి నేర్చుకోవడం అనేది సరదాగా మారుతుంది. కథ సమయం వస్తువులు: ఏమీ లేదు (డైపర్ మార్చే సమయం). దశలు బిడ్డకు డైపర్ మార్చే సమయంలో బిడ్డ రెండు చేతులను పట్టుకుని తల వరకు చాచండి. ప్రపంచంలో అతి పొడవైన బిడ్డ గురించి సరదాగా కథ చెప్పడం ప్రారంభించండి. కథ చెప్పేటప్పుడు ఆకర్షణీయమైన మరియు ఉల్లాసభరితమైన స్వరాన్ని ఉపయోగిస్తూ బిడ్డ ఎంత పొడవుగా ఉన్నారో వర్ణిస్తూ కథ చెప్పాలి. సమయం ఉన్న ప్రతిసారీ బిడ్డకు కథను మరలా మరలా చెప్పే అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆనందించాలి. కృత్యం ప్రాధాన్యత: కథ చెప్పడం వల్ల పిల్లలు భాషలో కొత్తపదాలు నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం మెరుగుపడుతుంది. ఇది నా ముఖం వస్తువులు: ఏమీ లేదు. దశలు బిడ్డతో పాటు కూర్చుని బిడ్డ ముఖంలోని ప్రతి అవయవాన్ని వేలితో చూపిస్తూ వాటిని ఏమని పిలుస్తారో బిడ్డకు తెలియజేయాలి. ఉదా: కనుపైపు చూపిస్తూ ఇది కన్ను అని బిడ్డకు తెలియజేయాలి. వేలితో బిడ్డ కన్ను వైపు వేలితో చూపిస్తూ కన్ను అని పలికే విధంగా బిడ్డను ప్రోత్సహించాలి. కన్ను, ముక్కు, నోరు మొదలగునవి చెప్పినట్లుగా ఇతర అవయవాలను కూడా బిడ్డకు పరిచయం చేస్తూ వాటిని పలకమని చెప్పాలి. బిడ్డ వారి శరీర అవయవాలను తాకి పలకడానికి ప్రయత్నం చేసినప్పుడు అభినందించాలి, ఇదే విధిగా ప్రతి అవయవానికి మరల మరల బిడ్డ చెప్పే విధంగా చేయాలి. కృత్యం ప్రాధాన్యత: శరీర భాగాలు పరిచయం, జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కృత్యం ద్వారా బిడ్డ అవయవాన్ని తాకి గుర్తించడాన్ని ప్రోత్సహించాలి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ