దాచటం మరియు కనుగొనటం వస్తువులు: బేబీ బొమ్మ లేదా మెత్తటి వస్తువులు ప్లాస్టిక్ పాత్ర లేదా ప్లాస్టిక్ కప్. దశలు బొమ్మతో మరియు ప్లాస్టిక్ పాత్ర లేదా కప్పుతో బిడ్డను ఆడుకోనివ్వండి. బిడ్డ గమనిస్తున్నప్పుడు బొమ్మను ఒక పాత్ర కింద దాచి పెట్టండి. బొమ్మ ఎక్కడుంది అని బిడ్డను అడగండి. పాత్ర పైకి లేపి బొమ్మను కనుగొనే విధంగా బిడ్డను ప్రోత్సహించండి మరియు బొమ్మను కనుగొనగానే బిడ్డను అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: ఒకసారి విన్న, చూసిన వస్తువును అక్కడ లేకపోయినా ఆ ప్రదేశంలో ఉన్నట్లుగా, విన్నట్లుగా బిడ్డ అనుకోవటం. ఈ కృత్యం వలన కండరాల అభివృద్ధితో పాటు వస్తువులు, ప్రదేశాలు, ఆకారాల పట్ల అవగాహన పెరుగుతుంది. స్వయంగా తినే ప్రక్రియ వస్తువులు: పిల్లలకు అనుకూలమైన ఆహార పదార్థాలు. దశలు పిల్లలు తేలికగా పట్టుకోగలిగే మరియు అనుకూలమైన ఆహార పదార్థాలను తయారుచేయాలి. ఆహార పదార్థాలను బిడ్డ అందుకోగలిగే దూరంలో ఉంచాలి. బిడ్డ ఆహారం దగ్గరకు వెళ్లి ఆహారాన్ని తన చేతులతో తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. బిడ్డ స్వయంగా తింటున్న ప్రతి ప్రయత్నాన్ని చిరునవ్వుతో సానుకూల పదాలతో ప్రశంసించాలి. బిడ్డని తన చేతి స్పర్శను అనుభూతి చెందనివ్వాలి. అవసరమైతే బిడ్డకు ఎలా సొంతంగా తినాలో మృదువుగా మార్గదర్శకత్వం ఇవ్వాలి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వల్ల బిడ్డలో స్వాతంత్ర్యం మరియు ఆహారంతో సానుకూల అనుబంధం ఏర్పడుతుంది. సొంతంగా తినడం నేర్చుకోవడం వల్ల తనలో సాధించామనే భావన పెంపొందుతుంది. నేను చదవగలను వస్తువులు: రంగు రంగుల బొమ్మల కార్డ్స్ లేదా బొమ్మల పుస్తకం. దశలు రంగురంగుల బొమ్మల కార్డ్స్ లేదా ఆకర్షణీయమైన బొమ్మల పుస్తకాన్ని ఎంచుకోండి. బిడ్డతోపాటు కూర్చుని వారికి బొమ్మలను ఒకదాని తర్వాత ఒకటి చూపించండి. తేలికగా అర్థమయ్యే పదాలతో బిడ్డకు బొమ్మలను వివరించండి. మీరు చూపించే బొమ్మలను, చెప్పే పదాలను బిడ్డ శ్రద్ధగా వినేటట్లు ప్రోత్సహించండి. బిడ్డకు బొమ్మలు చూపిస్తున్న సమయంలో నవ్వుతూ ఉత్సాహంతో బొమ్మలను చూపించాలి. కృత్యం ప్రాధాన్యత: వివిధ రకాల దృశ్య చిత్రాలు, వాటి పదాలను పరిచయం చేయడం ద్వారా బిడ్డలో అభిజ్ఞా కౌశలం మెరుగు పడడంతో పాటు సరదాగా భాషని నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఇంటి గురించి తెలుసుకోవడం వస్తువులు: ఏమీ లేవు. దశలు బిడ్డతో కలిసి ఇంటి చుట్టూ చిన్నపాటి నడకను కొనసాగించాలి. మీ బిడ్డకు రకరకాల వస్తువుల్ని, మనుషులను చూపిస్తూ వాటి గురించి మాట్లాడండి. మీరు గమనించే విషయాలను బిడ్డతో పంచుకోండి. ఉదాహరణకు: చెట్టును చూపిస్తూ చెట్టు మీద ఉన్న అందమైన పక్షిని గమనించమని బిడ్డతో చెప్పండి. మీ బిడ్డకు ఇష్టమైన వస్తువులను కనిపెట్టి, వాటి గురించి మాట్లాడండి మరియు వాటి మీద బిడ్డ నిమగ్నమయ్యేలా ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వలన బిడ్డలో భాషాభివృద్ధి, కొత్త పదాల పరిచయం మరియు ఇంటిలో ఉత్తేజ భరితమైన, కలిసి చర్చించుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ