9 నెలలు

పడవేయడం సరదాగా ఉంటుంది!

వస్తువులు: సురక్షితమైన వస్తువు (ఉదాహరణ; బంతి, నలిపిన కాగితం).

దశలు:

మీ బిడ్డకు బంతి లేదా నలిగిపోయిన కాగితం వంటి సురక్షితమైన వస్తువును పట్టుకుని పడవేయడానికి ఇవ్వండి.

ఆ వస్తువును కింద పడవేయడానికి పిల్లవాడిని అనుమతించండి.

బంతి కింద పడి పైకి లేస్తుందని, కాగితం కిందే ఉంటుందని చెప్పండి.

ఈ ప్రక్రియను పునరావృతం చేయడానికి మరియు వివిధ వస్తువులతో ఆడుకోవడానికి పిల్లలను ప్రోత్సహించండి.

కృత్యం ప్రాధాన్యత: చేతి మరియు కంటి సమన్వయాన్ని అభివృద్ధి చేస్తుంది. కార్యకరణ సంబంధాన్ని పరిచయం చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు వినోదం మరియు ఇతరులతో కలిసి ఆడుకునే వాతావరణం ఏర్పడుతుంది.

దొర్లించుట మరియు అందుకొనుట

వస్తువులు: చిన్న ప్లాస్టిక్ సీసా, నీరు, మెరిసే కాగితం.

దశలు:

స్పష్టంగా కనిపించే ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ ని శుభ్రంచేసి దానిని సగం వరకూ నీటితో నింపాలి.

అందులో చిన్నచిన్న మెరిసేకాగితం ముక్కలనువేసి సీసా మూతని గట్టిగా బిగించాలి.

ఆ సీసాను పిల్లవాడి నుండి దూరంగా దొర్లించాలి.

పిల్లవాడిని ముందుకు జరిగి సీసాను అందుకునే విధంగా ప్రోత్సహించాలి.

పిల్లవాడు సీసాను అందుకోగానే అభినందించాలి.

కృత్యం ప్రాధాన్యత: పిల్లవాడిలో ప్రాకడం మరియు అందుకునే నైపుణ్యాలు, స్థూలకండరాల అభివృద్ధి జరుగుతుంది.

క్రియా పదాలు మరియు క్రియా ధ్వనులు

వస్తువులు: గిలక్కాయ.

దశలు:

ఏదైనా సురక్షితమైన వస్తువు తీసుకుని మీ బిడ్డతో పాటు కూర్చుని ఆ వస్తువును కదిలించడానికి, విసరడానికి మరియు తిప్పడానికి ప్రోత్సహించాలి.

మీ బిడ్డ చేస్తున్న కొత్త ధ్వనులను గమనించి, బిడ్డతో 'నువ్వు గిలక్కాయను కదిలించి ధ్వనులు చేశావు' అని సంభాషించండి.

పిల్లలకు ఆటను వివరించడానికి 'చుక్ చుక్ చుక్ చుక్' వంటి క్రియా పదాలు మరియు క్రియా ధ్వనులను సృష్టించి, ఆ ధ్వనులు, పదాలు పిల్లలు పలికే విధంగా ప్రోత్సహించాలి.

కృత్యం ప్రాధాన్యత: దీని ద్వారా ఇంద్రియ గ్రహణ మరియు భాషాభివృద్ధి మెరుగవుతుంది.

భోజన సమయంలో సంభాషణలు

వస్తువులు: పిల్లల ఆహారం.

దశలు:

ఆహారం తినిపించే సమయంలో వారికి పెడుతున్న ఆహార పదార్థాల గురించి పిల్లలతో సంభాషించండి.

పిల్లలు కోరుతున్న సూచనలలో ప్రత్యేకంగా ఎక్కువ కావాలని కనిపించినట్లయితే వాటికి నవ్వుతూ ప్రతిస్పందించాలి.

భోజన సమయంలో సంతోషంగా ఉంచడానికి మరియు సానుకూలమైన వాతావరణం కల్పించడానికి పిల్లలతో మాట్లాడుతూ తినిపించండి.

కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వలన భాషాభివృద్ధి మెరుగుదల, ఆహారం పట్ల సానుకూల భావన మరియు సంరక్షకులకు, పిల్లలకు మధ్య అనుబంధం దృఢమవుతుంది.

ఆధారం : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ