బాల్యారంభ ప్రేరణ యొక్క ప్రాముఖ్యత మరియు అవసరం గర్భధారణ సమయంలోనే శిశువు యొక్క జీవశాస్త్రీయ, ఇంద్రియాల (సెన్సరీ) ఎదుగుదల ప్రారంభమవుతుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, పిండం ఎదుగుతున్న కొద్దీ వినడం, రుచిని అర్థం చేసుకోవడం, వాసన గుర్తించడం, సమాచారం గ్రహించడం, నొప్పిని, ఒత్తిడిని, ఉష్ణోగ్రతను అనుభవించగలదు. వినికిడి లేదా చూపు (విజన్) కంటే ముందుగా వాసన, రుచి (టేస్ట్) వంటి గ్రహణ శక్తులు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల కొన్ని రుచుల పట్ల శిశువుకు ఆసక్తి లేదా వ్యతిరేకత ఏర్పడుతుంది. తల్లి మాట్లాడే భాష గర్భస్థ శిశువుకు వినిపిస్తుంది. దీనివల్ల పుట్టినతరువాత భాషా అభివృద్ధిపై ప్రభావం ఉంటుంది. స్పష్టమైన పదాలు పూర్తిగా వినిపించకపోయినా, మాటల శృతి (రిథమ్) మరియు మెలోడీ శిశువు గ్రహించగలుగుతుంది. పుట్టిన తర్వాత తన సొంత భాషను ఇతర భాషల నుంచి వేరు చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. గర్భ సంస్కారం "గర్భ సంస్కారం" అనగా గర్భధారణ నుండే శిశువును ఉత్తేజపరచడం, విద్యా సంబంధ విషయాలను తెలియచెప్పడం, ఆరోగ్యంగా ఉండేలా చేయడం మొదలైన అర్ధవంతమైన ఆచారాలను అనుసరించడం.తల్లి మరియు శిశువు కలిసి ఎదుగుతారు, ఒకరి ప్రభావం మరొకరిపై ఉంటుంది. అందువల్ల తల్లి ఆహారం పోషకాలతో, ఆరోగ్యకరంగా ఉండాలి. అలాగే, తల్లికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేలా కుటుంబసభ్యులు సహాయపడాలి. తల్లి చుట్టూ ఆరోగ్యకరమైన, ప్రేరణిచ్చి మద్దతుగా ఉండే వాతావరణాన్ని కల్పించడం వల్ల పుట్టిన శిశువు ప్రపంచాన్ని సానుకూలంగా చూడగలుగుతాడు. గర్భధారణ మరియు ప్రసవానంతర మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు స్వీయప్రేమ, స్వీయసంరక్షణను పెంపొందించుకోవడంశారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే చర్యలు చేపట్టడం. సమతుల ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి, నిద్ర పోవడం సానుకూల భావాలను ప్రోత్సహించడం, ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచడం. ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులు – క్రమమైన వ్యాయామం, యోగా, ధ్యానం, నడక, మ్యూజిక్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం.కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి లేదా ఇతర గర్భిణీ స్త్రీల నుండి / నమ్మదగిన వ్యక్తుల నుండి మానసిక మద్దతు పొందడం. తల్లి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వైద్యులతో సంప్రదించడం. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సహాయాన్ని తీసుకోవడం. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే పుట్టబోయే శిశువుకు కూడా ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. బాల్యారంభ ప్రేరణ (Early Childhood Stimulation) పుట్టినప్పుడు శిశువు మెదడు కేవలం 25% మాత్రమే అభివృద్ధి చెందుతుంది. కానీ మొదటి మూడు సంవత్సరాలలో 75% వరకు మెదడు అభివృద్ధి చెందుతుంది. శిశువు మెదడు పెద్దవారి మెదడుతో పోలిస్తే రెట్టింపు చురుకుగా పనిచేస్తుంది. ఈ వయస్సులో శిశువు కొత్త నాడీ సంబంధాలను (synapses) ఏర్పరచుకుంటుంది. ప్రేరణ (stimulation) ద్వారా శిశువు వివిధ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అత్యంత ముఖ్యమైన విషయాలు ప్రతి పిల్లాడు అభివృద్ధి చెందగల మెదడుతో పుడతాడు. పిల్లలందరూ ఒకే వేగంతో, ఒకే విధంగా ఎదగరు. కానీ సరైన సంరక్షణ, ప్రేరణ (stimulation) ద్వారా వారి మెదడులో కొత్త సంబంధాలు (connections) ఏర్పడతాయి. పిల్లాడు ఆడ లేదా మగ అయినా సమస్య లేదు. పిల్లాడు తెలుపు లేదా నల్లగా ఉన్నా తేడా లేదు. పిల్లాడు లావుగా లేదా సన్నగా, పొడవుగా లేదా చిన్నగా ఉన్నా ప్రభావం ఉండదు. పిల్లాడు ఏ సమాజంలో, ఏ దేశంలో పుట్టినా అంతరం లేదు. ముఖ్యమైనది పిల్లాడి ఆరోగ్యం మరియు మెదడు అభివృద్ధి. మేధస్సుకి మగపిల్లా, ఆడపిల్లా అనే తేడా ఉండదు. రంగుద్వారా నిర్ణయించబడదు. మెదడు అభివృద్ధి చెందినప్పుడు కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం మొత్తం మారుతుంది. బాల్యారంభ ప్రేరణ (Early Childhood Stimulation) అంటే ఏమిటి? శిశువు అభివృద్ధిని పెంచేందుకు ఉద్దేశ్యపూర్వకంగా చేపట్టే చర్యలను "ప్రేరణ కృత్యాలు" (stimulation activities) అంటారు. ఇది కేవలం కొన్ని వ్యాయామాల సమాహారం కాదు, తల్లి, తండ్రి, సంరక్షకులు మరియు శిశువు మధ్య నిరంతర సంబంధం. శిశువు అభివృద్ధి, పరిపక్వత (maturation) మరియు విద్య (learning) మధ్య పరస్పర చర్య ద్వారా జరుగుతుంది.శరీర భాగాల పెరుగుదల, మరియు వాటి మధ్య సమన్వయ నైపుణ్యాలు (motor & coordination skills) పిల్లల వయస్సుతోపాటు సహజంగా అభివృద్ధి చెందుతాయి. మేధస్సు నైపుణ్యాలు (cognitive skills) - సమాచార అనుసంధానం, భాషా అభివృద్ధి, జ్ఞాపకశక్తి స్వాభావికంగా వయస్సుతో పాటు ఏర్పడతాయి. ఇది స్థిరమైన క్రమంలో (fixed sequences) జరుగుతుంది. ఇది అభ్యసన ద్వారా జరుగుతుంది.కొన్ని నైపుణ్యాలను సాధించడానికి అభ్యాసం (practice) మరియు మార్గదర్శనం (guidance) అవసరం. ఉదా: పిల్లలు అక్షరాలను చదవడం, మాట్లాడడం, పజిల్స్ పరిష్కరించడం, మనోనిగ్రహం (self-regulation) వంటి నైపుణ్యాలను సాధించాలి, సంరక్షకులు పిల్లల అభివృద్ధికి సహాయపడాలి. ఇందులో ప్రేరణ చాలా కీలకం. సరైన ప్రేరణ లేకపోతే, పిల్లల మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు. అందువల్ల, బాల్యారంభ దశలో సరైన శిక్షణ, అనుభవాలు, ప్రేమ, సంరక్షణ చాలా ముఖ్యం. బాల్యారంభ ప్రేరణ (Early Childhood Stimulation - ECS) లక్ష్యాలు ఒక వ్యక్తి యొక్క మొదటి మూడు సంవత్సరాల జీవితం భవిష్యత్తులో అతని ఆరోగ్యం, చదువు మరియు ఉత్పాదక సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, బాల్యారంభ ప్రేరణ (ECS) కృత్యాల ప్రధాన ఉద్దేశ్యం పిల్లల అభివృద్ధికి తగిన అవకాశాలను అందించడం. శిశువు ఆరోగ్యకరమైన అభివృద్ధిని నిర్ధారించడం: తల్లిపాలు (breastfeeding) టీకాలు (immunisation) నోటిద్వారా ద్రవ చికిత్స (ORT) తొలి ఆహారాలు (weaning foods) తక్కువ ఖర్చుతో పోషకాహారం (low-cost nutritious food) పెరుగుదల పర్యవేక్షణ (growth monitoring) భద్రత మరియు విశ్వాసాన్ని పెంపొందించడం:పిల్లలకు ప్రేమ, ఆదరణ, రక్షణ, మార్గదర్శనం అందించడం.సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సహాయం పొందగలరని తెలియజేయడం. మేధో ఉత్సుకతను పెంచడం:పరిశోధన, అన్వేషణ, ప్రయోగాలు చేసేందుకు అవకాశాలు కల్పించడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేయించడం. భాషాభివృద్ధిని ప్రోత్సహించడం:పిల్లలతో మాట్లాడటం, కథలు చదవడం, పాటలు పాడటం ద్వారా భాషా నైపుణ్యాలను పెంపొందించడం.పిల్లలకు సంజ్ఞలు మరియు పదాలు ఉపయోగించి భావాలు వ్యక్తీకరించటానికి అవకాశం ఇవ్వడం. శారీరక నైపుణ్యాలు అభివృద్ధి చేయడం:సరైన కండరాల సమన్వయం (muscular coordination)ప్రాథమిక చలన నైపుణ్యాలు (motor skills)వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ (personal hygiene habits) అభివృద్ధి సామాజిక అవగాహన పెంపొందించడం:పిల్లలు స్వయంగా తమ అవసరాలను, ఇతరుల అవసరాలను గుర్తించగలిగేలా చేయడం. సామాజిక పరిసరాలకు అనుకూలంగా ఉండే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ప్రాథమిక విలువలను అలవర్చడం:దయ (sympathy), సహనము (tolerance), మానవతా విలువలు (kindness), గౌరవం (respect) వంటివి నేర్పించడం. పోషణ సంరక్షణ వ్యవస్థ (Nurturing Care Framework) పోషణ సంరక్షణ వ్యవస్థ (Nurturing Care Framework) ఐదు అనుబంధ, విడదీయరాని అంశాల మీద ఆధారపడుతుంది. మంచి ఆరోగ్యం (Good Health) తగిన పోషకాహారం (Adequate Nutrition) భద్రత మరియు రక్షణ (Safety and Security) ప్రతిస్పందిత సంరక్షణ (Responsive Caregiving) బాల్యారంభ విద్యావకాశాలు (Opportunities for Early Learning) ఈ ఐదు అంశాలు పిల్లలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవసరం. శిశువు మెదడు మొదటి మూడు సంవత్సరాల్లో అనేక సామాజిక, భావోద్వేగ, భాష, జ్ఞాన సంబంధ నైపుణ్యాలను గ్రహిస్తుంది. పిల్లలు తమ అనుభవాలను ఆకళింపు చేసుకునే సమయమిది.పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన అంశం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో ఏర్పడే భద్రతా సంబంధం (attachment bond). చిన్న వయస్సులో జీవించడానికి, శారీరక అవసరాలకు, భావోద్వేగాలకు, శిశువులు పూర్తిగా సంరక్షకులపై ఆధారపడే పరిస్థితి ఉంటుంది. అందువల్ల సంరక్షకుల ప్రవర్తన బాల్యారంభ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. అనుకూలమైన, స్థిరమైన, నమ్మదగిన సంరక్షణ అనేది పిల్లల భద్రత మరియు అభివృద్ధికి కీలకం. ఆధారం : మహిళా శిశు సంక్షేమ శాఖ