బాల్యారంభ ప్రేరణ కోసం తగిన వాతవరణాన్ని అందించడం

ఆట సామాగ్రి

తల్లిదండ్రులు పిల్లలతో విభిన్న మార్గాల్లో నిమగ్నమవ్వడానికి, ఇంద్రియ ప్రేరణ మరియు ఆట యొక్క ఫలితంలో నాణ్యతను పెంచడంలో ఆట సామాగ్రి సహాయపడతాయి. ఈ ఆట సామాగ్రిని ఎల్లప్పుడూ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇంట్లోనే సహజ వాతావరణంలో సులభంగా కనిపించే వస్తువులు మరియు పదార్థాలను ఉపయోగించడం వల్ల సుస్థిరంగా, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించవచ్చు. సంరక్షకులు గృహ లేదా వ్యర్థ పదార్థాలైన కప్పులు, గీసాలు మరియు మిగిలిపోయిన బట్టల ముక్కలను ఉపయోగిస్తూ- ఇట్-యువర్సెల్ఫ్ (DIY) బొమ్మలను కూడా సిద్ధం చేయవచ్చు. సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలో దేశీయ మరియు సాంస్కృతికంగా పొందుపరిచిన బొమ్మలు కూడా సహాయపడతాయి.

ప్రేరణ చర్యలు

బాల్యారంభ సంవత్సరాలలో, పిల్లలు వారి అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా విభిన్న అనుభవాల ద్వారా నేర్చుకుంటారు. ఈ ప్రయాణంలో సంరక్షకులకు మద్దతుగా నెలవారీ ప్రేరణ కృత్యాల క్యాలెండర్ను క్రింది విభాగం వివరిస్తుంది. సిఫార్సు చేయబడిన కృత్యాలు పిల్లల వయస్సు ప్రకారం వర్గీకరించబడినప్పటికీ, సంరక్షకులు పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. ఒకవేళ పిల్లవాడు వారి వయస్సుకి సూచించిన కృత్యాలను ఇప్పటికే చేయగలిగితే, సంరక్షకుడు కృత్యాలలో సంక్లిష్ట స్థాయి పెంచవచ్చు. ఒకవేళ పిల్లలు వారి వయస్సుకి సూచించిన కృత్యాలను చేయలేకపోతే, సంరక్షకుడు సంక్లిష్ట స్థాయి తగ్గించవచ్చు. చివరగా, రాబోయే విభాగంలో సూచించబడిన కృత్యాలు మరియు సామాగ్రి భారతదేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సూచించబడ్డాయి. వీటిని స్థానిక మరియు సాంస్కృతిక సందర్భాలకు అనుగుణంగా సవరించాలి. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు పిల్లల దినచర్యలో ప్రేరణ కృత్యాలను ఖచ్చితంగా చేర్చాలి.

రక్షణ మరియు భద్రతకు భరోసా

చిన్న వయస్సులో, శిశువు లేదా పసిపిల్లలు వారి శారీరక మరియు మానసిక భద్రత కోసం సంరక్షకునిపై పూర్తిగా ఆధారపడతారు. అందువల్ల, బిడ్డకు హాని జరగకుండా సంరక్షకుడు కొన్ని ఉత్తమ పద్ధతులను అనుసరించాలి. అన్ని వస్తువులు విషపూరితమైనవి మరియు ప్రమాదకరం కానివిగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ద్వారా పిల్లల ఆట స్థలం సురక్షితంగా ఉంచాలి.ఎత్తు నుండి పడిపోవడం లేదా బరువైన వస్తువులు మీద పడడం వల్ల కలిగే శారీరక గాయం నుండి వారిని రక్షించాలి, పర్యవేక్షించాలి. పిల్లల భావోద్వేగాలను ప్రేమతో, గౌరవంతో, హింసరహిత, పరస్పర సంబంధాల ద్వారా ఒత్తిడి లేకుండా చేయాలి.

లింగ ప్రతిస్పందన పరస్పర చర్యలు

బాల్యారంభ సంవత్సరాల్లో, పిల్లలు వారి పరిసరాలు మరియు వారి సంరక్షకుల చర్యల నుండి నేర్చుకుంటారు. వారు పెరిగేకొద్దీ, వారు అబ్బాయి లేదా అమ్మాయి అంటే ఏమిటో అన్నది గమనించడం ద్వారా తెలుసుకుంటారు. అందువల్ల, ఇద్దరికీ కూడా అభివృద్ధి చెందడానికి మరియు ఎదగడానికి సమాన అవకాశాలు ఉండేలా చూసుకోవడం చాలా కీలకం. సంరక్షకులు వారి స్వంత లింగ వివక్ష గురించి తెలుసుకోవాలి మరియు పిల్లల అభ్యాసంపై పరిమితులను విధించే సంభాషణలు మరియు చర్చలకు దూరంగా ఉండాలి. లింగ వివక్షతకు ఉదాహరణలు అబ్బాయిల కంటే అమ్మాయిలు శారీరకంగా లేదా మానసికంగా బలహీనంగా ఉన్నారని భావించడం, అబ్బాయిల కోసం కార్లు కొనుగోలు చేసేటప్పుడు అమ్మాయిలకు బొమ్మలు మరియు వంట సామాగ్రి బొమ్మలను అందించడం మరియు అబ్బాయిలు 'ధైర్యవంతులు' అని మరియు అమ్మాయిలు 'అందంగా ఉన్నారని' ప్రశంసించడం.

సవాళ్లతో కూడిన పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు సానుకూల మార్గదర్శకత్వం

సంరక్షకులకు కొన్నిసార్లు పిల్లల ప్రవర్తనలు సవాలుగా అనిపించవచ్చు. ఉదా: పెద్దలు వారిని ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ శిశువులు పేచీ పెట్టడం లేదా ఏడవడం చేయవచ్చు. కొన్నిసార్లు, వారు కొట్టడం, కొరకడం, నేలపై పడడం, తన్నడం, కేకలు వేయడం లేదా "లేదు" అని చెప్పడం చేస్తారు. అటువంటి పరిస్థితులలో, పిల్లల ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని సంరక్షకులు అర్థం చేసుకోవాలి. పిల్లవాడు ఆకలితో ఉన్నాడా, నిద్రపోతున్నాడా లేదా నిర్లక్ష్యంగా ఉన్నాడా? అలా చేయడం వల్ల సంరక్షకుడు బిడ్డను శాంతింపజేయడానికి తగిన విధంగా స్పందించాలి. 'సరైన' ప్రవర్తనను సున్నితంగా రూపొందించడం మరియు వారు సరైన ప్రవర్తనను ప్రదర్శించినప్పుడు వారిని మెచ్చుకోవడం వలన పిల్లలకు వారి స్వీయ-నియంత్రణలో, అసౌకర్య భావోద్వేగాలలో లేదా పరిస్థితులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

ఆధారం : మహిళా శిశు సంక్షేమ శాఖ