డయాలసిస్ రెండు మూత్రపిండాలు పనిచేయడం ఆపివేసినప్పుడు అట్టి స్థితిలో వాటిని కృత్రిమమముగా పనిచేయించే విధానాన్ని డయాలసిస్ అంటారు డయాలసిస్ యొక్కపని ఏమిటి కింద తెలుపబడినవి డయాలసిస్ చేసే ముఖ్యమైన పనులుః క్రియాటినిన్, యూరియా లాంటి వ్యర్థ ఉత్పత్తులను రక్తంలో నుంచి వేరు చేసి శుద్ధి పరచడం. శరీరములో నుంచి అధిక నీటిని తీసివేసి తగిన మోతాదులో నీరు నిలువ ఉండేలా చూసుకోవడం. పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలను శరీరంలో తగిన మోతాదులో ఉంచడం. శరీరంలో జమ అయిన అధిక యాసిడ్ (ఆమూల)ను తగ్గించి తగిన స్థాయిలో ఉంచడం. డయాలసిస్ ఎప్పడు అవసరం పడుతుంది? మూత్రపిండాల పనితీరు తగ్గడం లేదా మూత్రపిండాలు మొత్తంగా పనిచేయడం ఆపివేసినపుడు మందులు వాడుచున్నా మూత్రపిండ రోగ లక్షణాలు (వాంతులు, ఆతురత, నీరసముగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో బాధ లాంటివి) ఎక్కువైనప్పడు, ఇట్టి అవస్థలో డయాలసిస్ అవసరం పడుతుంది. రక్త పరీక్షలో సీరం క్రియాటినిన్ 8–10 మీ.గ్రా. కంటే అధికముగా ఉన్నదని నిర్ధారించి నప్పడు డయాలసిస్ చేయించవలెను. మూత్రపిండాలు మళ్ళీ పనిచేయడం ప్రారంభిస్తాయా? తేడు. క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులలో డయాలసిస్ తరువాత కూడా మూత్రపిండాలు పని చేయవో. ఆట్టి రోగులలో డయాలసిస్ మూత్రపిండాలను కృత్రిమముగా పనిచేయించే ఒక ప్రత్యామ్నాయము మరియు వారి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉంచుకోవడానికి క్రమము తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం చాలా అవసరం. కాని ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులలో కొద్ది సమయం కొరకు డయాలసిస్ అవసరము ఉంటుంది. ఇట్టి రోగులలో కొన్ని రోజుల తరువాత మూత్రపిండాలు పూర్తిగా పనిచేస్తాయి. కొద్దిసమయం తరువాత వీరికి డయాలసిస్ లేదా మందుల అవసరము ఉండదు. డయాలసిస్ మూత్రపిండాలను కృత్రిమముగా పనిచేయించే ఒక పత్యామ్నాయము డయాలసిస్ ఎన్నిరకములు హిమోడయాలసిస్: ఇట్టి రకమైన డయాలసిస్‌లో మెషీన్, ప్రత్యేకమైన ద్రవము (డయాల్సటి) సహాయముతో కృత్రిమ మూత్రపిండం (డయలైసర్) రక్తాన్ని శుద్ధి పరుస్తుంది. పెరిటోనియల్ డయాలసిస్: ఇట్టి రకమైన డయాలసిస్‌లో ఒక ప్రత్యేకమైన క్యతేటర్ నాళమును వేసి, ప్రత్యేకమైన మందు సహాయముతో శరీరములో వ్యర్థ పదార్థాలను త్రోసివేసి శుద్ధి చేస్తుంది. ఇట్టి డయాలసిస్‌లో మెషీన్ యొక్క అవసరము ఉండదు. డయాలిసిస్ తో రక్తశుద్దికరణము ఏ సిద్దాంతము పై ఆధారితమైనది? హిమోడయాలిసిస్ లో కృత్రిమ కిడ్నీ మరియు కృత్రిమ నాళము మరియు పెరిటోనియాల్ డయాలిసిస్ లో కడుపు పెరిటోణియం సెమి పెర్మియబుల్ మెంబ్రేన్ తరహ పని చేస్తుంది. నాళము యొక్క సన్నని రంద్రముల నుండి నీరు, శార, అనవసరమైన యురియా, క్రియాటినిన్ లాంటి పదార్దములు బయటికి రావచ్చును. కాని శరీరముకు అవసరమైన పెద్ద పదార్దములు అంటే రక్త కణములు బయటికి రాలేవు. డయాలిసిస్ ప్రక్రియలో సెమి పెర్మియబుల్ మెంబ్రేన్ ఒక పక్క డయాలిసిస్ ద్రవము ఉంటుంది మరియు ఇంకో పక్క రక్తము ఉంటుంది. అస్మోసిస్ మరియు డైఫుజన్ సిద్ధాంతము ప్రకారము రక్తముకు అనవసరమైన పదార్దములు అధిక నీరు రక్తమునుండి డయాలిసిస్ ద్రవము పారుతు బయటకి వెళ్ళుతుంది. కిడ్నీ ఫెల్యూర్ వల్ల సోడియం, పొటాషియం మరియు ఆసిడ్ యొక్క పరిమాణములోని పరివర్తనలను సరి చేయడం ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఏట్టి రోగులకు హిమోడయాలిసిస్ మరియు పెరిటోనియాల్ డయాలిసిస్ చికిత్స కొరకు వెళ్ళవలెను? క్రానిక్ కిడ్నీ ఫెల్యూర్ చికిత్సలో రెండు రకములైన డయాలిసిస్ ఉపయోగకరమైనవి. రోగి రెండు రకములైన డయాలిసిస్ యొక్క లాభ నష్టాలను కనుగొనిన తరువాత వారి యొక్క ఆర్థిక స్థితి, తమ శరీర స్వభావము, ఇంటి నుండి హిమోడయాలిసిస్ గల దూరము లాంటివి దృష్టిలో పెట్టుకొని ఎ రకమైన డయాలిసిస్ చెసుకోవలో నిర్ణయం తీసుకోవాలి. భారత దేశములో హిమోడయాలిసిస్ తక్కువ ఖర్చుతో. రెండు మూత్రపిండాలు పనిచేయడం ఆపివేసిన రోగులు డయాలసిస్‌తో చాలా సమయం వరకు జీవించవచ్చు. డయాలసిస్ మొదలు పెట్టిన తరువాత ఆహార అలవాటులలో మార్పులు అవసరమూ? అవును. డయాలసిస్ మొదలు పెట్టిన రోగులు సంతులిత పరిమాణములో ఆహారము మరియు నీరు తీసుకోవలెను. ఉప్ప తక్కువ ఉన్న ఆహారము మరియు పొటాషియం ఇంకా పాస్ఫరస్ పెరగకుండా చూసుకోవడం లాంటి సూచనలు చేస్తారు. డయాలసిస్ కన్నా మందుల ద్వారా ఉపసమనం పొందే రోగులకు ఆహార అలవాట్లలో చాలా మార్పులు చేస్తారు. వీరికి అధిక ప్రోటీన్ మరియు విటమిన్ ఉండే ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు. డయాలిసిస్ తీసుకొనే రోగులు తప్పని సరిగ ఆహార అలవాట్లలో మార్పులను పాటించవలెను. హిమోడయాలసిస్ (రక్తము యొక్క డయాలసిస్) ప్రపంచ వ్యాప్తముగా డయాలసిస్ చేసుకొనే వారిలో పెద్ద సమూహము ఇట్టి రకమైన (హిమోడయాలసిస్) చేయించుకుంటారు. హిమోడయాలసిస్ పద్దతిలో మెషీన్ ద్వారా రక్తాన్ని శుభ్రం చేస్తారు. హిమోడయాలసిస్ ఎలా చేయబడుతుంది హిమోడయాలసిస్ మెషీన్ లోపల ఉన్న సిస్ట్ పంప్ సహాయముతో శరీరములో నుంచి 250-300 మి.గ్రాముల రక్తమును ప్రతి నిముషానికి శుద్ధి చేయడానికి కృత్రిమ మూత్రపిండములోకి పంపబడుతుంది. రక్తము గట్టి పడకుండా హెపరీన్ అనే మందును వాడుతారు. హిమోడయాలసిస్ మెషీన్ మరియు రోగి మధ్యలో కృత్రిమ మూత్రపిండము ఉండి రక్తాన్ని శుద్ధి పరిచే ప్రక్రియను చేస్తుంది. రక్తము శుద్దీకరణకు హిమోడయాలసిస్ మెషీన్ శరీరం లోపలికి వెళ్ళదు. కృత్రిమ మూత్రపిండములో రక్తం శుద్దీకరణము మెషీన్ ద్వారా ఒక పత్యేకమైన మందు (ద్వలీస్తే) సహాయముతో అవుతుంది. శుద్ధి చేయబడిన రక్తము మరల శరీరములోనికి పంపబడుతుంది. హిమోడయాలసిస్ ప్రక్రియ నాలుగు గంటల వరకు జరుగుతుంది. ఈ సమయములో శరీరములోని రక్తమంతా 12 సార్లు శుద్ధి చేయబడుతుంది. హిమోడయాలసిస్ ప్రక్రియలో ప్రతిసారి రక్తము ఎక్కించడము అవసరము అవుతుంది. రక్తములో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నప్పడే లేదా డాక్టర్‌కి అవసరము అనిపించినప్పడే రక్తము ఇవ్వడమన్నది ఒక తప్ప ధోరణి. హిమోడయాలసిస్ (డయాలసిస్ మెషీన్ సహాయముతో రక్తాన్ని శుద్ధి చేసే ఒక సరళమైన విధానము) శుద్దీకరణం కొరకు రక్తాన్ని శరీరములో నుంచి బయటకు ఎలా తీస్తారు రక్తాన్ని తీయడానికి క్రింద చెప్పబడిన ముఖ్య పద్దతులు పాటిస్తారు. డబుల్ ల్యుమేన్ క్యతేటర్ ఎ.ఐ.వి. ఫిష్ణుల మరియు గ్రాఫ్ట్. డబుల్ ల్యుమేన్ క్యతేటర్ అత్యవసర పరిస్థితులలో మొదటిసారి హిమోడయాలసిస్ చేయడానకి ఇది అధిక ప్రచారములో ఉన్న పద్ధతి. ఇందులో క్యాతేటర్ (ముక్కులో) చ్చే త్వరగా హిమోడయాలసిస్ చేయబడతుంది. ఈ క్యతేటర్ గొంతులో, భుజములో లేదా ముక్కులో పెడతారు. దీని సహాయముతో ప్రతీ నిముషానికి 300 నుంచి 400 మి. గ్రాముల రక్తం శుద్ధి కొరకు తీయబడుతుంది. ఈ క్యతేటర్ యొక్క బయట భాగములో రెండు వేరు వేరు నాళాలుగా విభజింపబడింది. నాళము యొక్క భాగము రక్తాన్ని శరీరములో నుండి బయటకు తీయడములో మరియు రెండో భాగము తిరిగి లోనికి పంపించడం చేస్తాయి. శరీరములోకి పోయే మొదటి నాళము యొక్క రెండు భాగములు ఒక్కటిగా అయిపోతాయి. అవి లోపల నుండి రెండు భాగాలుగా విభజింపబడుతుంది క్యతేటర్కి సంక్రమణ చెందే అవకాశము ఉన్నందువలన స్వల్ప వ్యవధి (3-6 వారాలు) కొరకు హిమోడయాలసిస్ పద్ధతిని ఇష్టపడతారు. ఎ.ఐ.వి.ఫిష్ణుల హిమోడయాలసిస్ ప్రసిద్ధ, సురక్షితము మరియు ఉత్తమమైన పద్ధతి. ఈ పద్ధతిలో చేయి పైన ధమని, సిరాను ఆపరేషన్ ద్వారా జోడిస్తారు. ధమనిలో నుండి అధిక ఒత్తిడితో వస్తున్న రక్తం సిరలోకి పోతుంది. దీని కారణంగా అన్ని నాళాలు ఉబ్బుతాయి. నాళాలు ఉబ్బడానికి మూడు నుండి నాలుగు వారాల సమయం పడుతుంది. తరువాత నాళాలను హిమోడయాలసిస్ ఉపయోగము కొరకు వాడవచ్చు. ఇందువలన మొదటిసారి త్వరగా హిమోడయాలసిస్ చేయడానికి ఫిష్ణుల తయూరు చ్ సి ఉపయోగించలేము. ఇలా ఉబ్బిన నాళాలను రెండు వేరు వేరు ప్రదేశాలలో ప్రత్యేకమైన రెండు లావు ఫిష్ణుల నీడిల్ (సూది) వేయబడుతుంది. ఈ ఫిష్ణుల నీడిల్ సహాయముతో హిమోడయాలసిస్ కొరకు రక్తాన్ని బయటకు తీసి శుద్ధి అయిన తరువాత శరీరములోనికి పంపించవచ్చు. ఫిష్ణుల సహాయముతో నెలలు మరియు సంవత్సరాల పాటు మోడయాలసిస్ చేయవచ్చు. ఫిష్ణుల చేయబడిన చేయితో తేలికైన అన్ని దినవారి పనులు చేయవచ్చు. ఎ.ఐ.వి. ఫిష్ణులాకు పత్యేకమైన రక్షణ ఎందుకు అవసరము? క్రోనిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో అంతిమ వ్యవస్థ యొక్క ఉపచారము కొరకు హిమోడయాలసిస్ చేయవలసి ఉంటుంది. ಇಟ್ಲಿ రోగుల జీవనము నియమిత డయాలసిస్ పై ఆధారపడి ఉంటుంది. ఎ.ఐ.వి. ఫిష్ణుల సరిగ్గా పనిచేస్తే హిమోడయాలసిస్ కొరకు తగిన రక్తము తీసుకోవలసిఉంటుంది. ఎ.ఐ.వి. ఫిష్ణుల యొక్క ఉబ్బిన నాళంలో ఒత్తిడితో అధిక మొత్తంలో రక్తము ప్రవహిస్తుంది. ఒక వేళ ఎ.ఐ.వి. ఫిష్ణులకు దెబ్బ తగిలితే ఉబ్బిన నాళంలో నుండి అధిక మొత్తంలో రక్తప్రవాహము కూడా జరగవచ్చు. ఇట్టి స్థితిలో రక్త ప్రవాహాన్ని నియంత్రణ చేయక పోతే కొద్ది సమయంలోనే రోగి చనిపోవచ్చు. క్లుప్తముగా, డయాలసిస్ చేయించుకొనే రోగుల జీవనము ఎ.ఐ.వి. ఫిస్టుల యొక్క కార్య క్షమత ఆదారపడి ఉంటుంది ఎ.ఐ.వి. ఫిషులను చాలా సమయుము వరకు సంతోషముగా ఉపయోగించడానికి ఏ భద్రతా లక్షణాలు అవసరము? ఎ.ఐ.వి. ఫిష్ణుల సహాయముతో చాలా సమయము (సంవత్సరాల) పాటు తగిన మోతాదులో డయాలసిస్ కొరకు రక్తము దొరుకుటకు క్రింద చెప్పబడిన సూచనలు పాటించాలి. నియమముగా వ్యాయామము చేయడము, చేసిన తరువాత నాళము ఉబ్బి ఉన్నదానికి ఇంకా తగిన మోతాదులో దానిలో నుండి రక్తము దొరకుటకు చేయు వ్యాయామము అవసరము. ఫిష్ణుల సహాయముతో హిమోడయాలసిస్ ప్రారంభించిన తరువాత చేయి వ్యాయామము చాలా అవసరము. రక్తము యొక్క ఒత్తిడి తక్కువ కావడం కారణంగా ఫిష్టులాపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దీని కారణంగా ఫిష్టులా ఆగిపోవడం జరుగవచ్చు. దువలన రక్తము యొక్క ఒత్తిడి తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిష్టులా చేసిన తరువాత క్రమము తప్పకుండా రోగి దినములో మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నము, రాత్రి) ఫిష్ణుల సరిగ్గా పని చేస్తుందో లేదో చూసుకోవాలి. ఖ్యముగా గుర్తు పెట్టుకోవలసింది ఫిష్ణులా అకస్మాత్తుగా పనిచేయడం ఆపివేస్తే రోగి మరణిస్తాడని. ఫిష్ణులా చేసిన చేయిపై ఎప్పడూ ఇంజెక్షన్ తీసుకోకూడదు. ఆ నాళములో గూకోజ్ లేదా రక్తము కూడా ఎక్కించకూడదు. రక్త పరీక్షల కొరకు ఉపయోగించకూడదు. ఫిష్టులా చేసిన చేయిపై బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించ కూడదు. ఫిష్టులా చేసిన చేయితో అధిక బరువు ఉన్న వస్తువులు ఎత్తకూడదు. చేయిపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ప్రత్యేకముగా పడుకునేటప్పడు. ఫిష్టులాకు ఎట్టి విధమైన దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఆ చేతికి వాచ్, జ్యువెలరీ లాంటివి ఒత్తిడి పెంచేవి వేసుకోకూడదు. ఒక వేళ అకస్మాత్తుగా ఫిష్ణులకు దెబ్బ తగిలి రక్తము ప్రవహిస్తున్నప్పుడు తొందర పడకుండా వేరే చేతితో బాగా ఒత్తిడితో రక్త ప్రవాహమును ఆపవలెను. హిమోడయాలసిస్ తరువాత ఉపయోగించే పట్టీని గట్టిగా కట్టడం ద్వారా రక్త ప్రవాహమును ఆపవచ్చును. తరువాత డాక్టర్ని సంప్రదించవలెను. రక్త ప్రవాహమును ఆపకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ప్రాణానికి ప్రమాదం కావచ్చు. ఫిష్టులా చేసిన చేయిని శుభ్రముగా ఉంచుకోవలెను. ఇంకా హిమోడయాలసిస్ చేసే ముందు సబ్బుతో కడుగవలెను. హిమోడయాలసిస్ తరువాత ఫిష్ణులా నుంచి రక్తాన్ని ఆపడానికి చేయిపై ప్రత్యేకమైన పట్టీతో కట్టవలెను. కిడ్నీ రోగుల పధ్రమ పరీక్ష కొరకు క్రియాటినిన్, సోనోగ్రఫీ, మూత్రపరీక్ష చేయవలసి వుంటుంది. గ్రాఫ్ట్ ఏ రోగులలో అయితే చేతి నాళాలు ఫిష్ణులకు అనుగుణంగా లేవో వారికి గ్రాఫ్ట్‌ను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్ధముతో తయారు చేసిన కృత్రిమ నాళము సహాయముతో ఆపరేషన్ చేసి చేయి లేదా కాళ్ళలోని లావు ధమని మరియు సిరాతో జోడిస్తారు. ఫిష్టులా నీడిల్ ను గ్రాఫ్ట్‌లో హిమోడయాలసిస్కు కావలసిన రక్తము తీయడానికి మరియు తిరిగి పంపివేయటానికి తోడ్పడుతుంది. చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియ అయినందువలన చాలా తక్కువ రోగులు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. హిమోడయాలిసిస్ మెషీన్ యొక్క పనితీరు ఏమిటి హివెయోడయాలసిస్ వెుషీన్ యొక్క ముఖ్యమైన కార్యములు కింద తెలుపబడినవి. హిమోడయాలసిస్ మెషీన్ యొక్క పంప్ రక్తాన్ని శుద్ధి చేసేందుకు శరీరములోని రక్తాన్ని తీసుకొని అవసరమైన స్థాయిలో దాని పరిమాణాన్ని తగ్గించడం లేదా పెంచడం చేస్తుంది. మెషీన్ ప్రత్యేకమైన ద్రవము (ది అలిజెట్) ను తయారు చేసి కృత్రిమ మూత్రపిండము అయిన డయలైజర్ లోకి పంపుతుంది. మెషీన్ దిఅలిజెట్ యొక్క ఉష్ణోగ్రత బైకార్బోనేట్లను తగిన స్థాయిలో ఉంచుతుంది. మెషీన్ ఈ దిఅలిజెట్ను తగిన స్థాయి మరియు తగిన ఒత్తిడితో కృత్రిమ మూత్రపిండము లోనికి పంపుతుంది. రక్తములోని అనవసర చెత్తను దూరము చేసిన తరువాత (ది అలిజెట్)ను బయటకు తెస్తుంది. కిడ్నీ ఫెల్యూర్ వల్ల శరీములోని వాపు మరియు అధిక నీరు జమ అవుతుంది. డయాలిసిస్ క్రియలో మెషిన్ శారిములోని అధిక నీరును తీసువేస్తుంది. డయలైజర్ (కృతిమ కిడ్నీ రూపకల్పన ఎలా ఉంటుంది డయలైజర్ దాదపుగా 8 ఇంచుల పొడువు మరియు 1.5 ఇంచుల వెడల్పులో ఒక పారదర్షిక ప్లాస్టిక్ చేయబడుతుంది. ఇందులో 10,000 వెంట్రుకల లాంటి సన్నని నల్లలు ఉంటాయి. ఈ నాళ్లలను ఒక ప్రతేయమైన పరదర్షిక పదార్ధముతో చేయబడిన జోల్లి (సెమి పెర్మియబుల్ మెంబ్రేన్)తో తయారు అవుతుంది. ఇట్టి సన్నని నాళ్లల నుండి రక్తము లోనికి వెళ్లి శుద్ధి చేయబడుతుంది. డయలైజర్ పైన మరియు క్రింద భాగములో ఈ సన్నని నాళములు దగ్గరగా ఉండి ఒక పెద్ద నాళముగ తయారు అవుతుంది. ఇందులో రక్తమును తీసుక వెళ్ళే పెద్ద నాళము (బ్లడ్ టూబ్బింగ్) జత చేయబడుతుంది. డయలైజర్ పైన మరియు క్రింద భాగములోని చివరిలో పెద్ద నాళము జత చేయబడుతుంది. దీనివల్ల మెషిన్ లో నుండి శుద్ధి చేయబడిన డైలయజిట్ ద్రవము లోనికి వెళ్లి బయటకు వస్తుంది. డయలైజర్ (కృతిమ కిడ్నీ తో రక్తము యొక్కశుద్దికారణము: శుద్ధికారణము కొరకు శరీరములోనికి వచ్చే రక్తము కృతిమ కిడ్నీలోనికి ఒక నాళము ద్వార లోనికి వెళ్లి వేల కొలదిగా ఉన్న సన్నని నల కాలములలో ఉంటుంది. కృతిమ కిడ్నీ మరో వైపు నుండి ఒత్తిడితో వచ్చే దియలిజేట్ ద్రవము శుద్ధికారణము కొరకు సన్నని నాళములో అన్ని వైపుల పారుతుంది. డయలైజర్‌లో రక్తము పైనుండి క్రిందికి మరియు డయలిజేట్ ద్రవము క్రింది నుండి పైనికి విపరీత దిశలో ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియలో సెమి పెర్మియబుల్ మెంబ్రేన్‌తో తయారు అయిన సన్నని నాళము నుండి రక్తములో ఉన్న క్రియటినిన్, యూరియా లాంటి అనవసరమైన పదార్దములు డయలిజేట్లో కలిసి బయటకు వస్తాయి. ఇట్టి తరహ కృతిమ కిడ్నీలో ఒక వైపు నుండి వచ్చే చెడు రక్తము రెండో వైపు నుండి బయటకు వస్తుంది. అప్పుడు రక్తము శుద్ధి చేయ బడుతుంది. చాలా కొద్ది మంది రోగులలో హిమోడయాలిసిస్ మెషీన్ కొనుక్కొని శిక్షణ పొందిన కుటుంబ సభ్యుల సహాయం తో ఇంట్లోనే హిమోడయాలిసిస్ చేసుకోవచ్చు. భారత దేశములో ఈ ప్రక్రియను హోం డయాలిసిస్ అంటారు. దీని కొరకు సమయము, శిక్షణ మరియు ధనం అవసరము అవుతుంది. హిమోడయాలిసిస్ ప్రక్రియ పీడాదాయకము మరియు క్లిష్టమైనదా? లేదు, హిమోడయాలిసిస్ ప్రక్రియ సరల్లమైనది మరియు పీడన రహితముగా చేప్పబడినది. ඩ් రోగులకైతే చాలాసంవత్సరాలుగా డయాలిసిస్ అవసరము అవుతుందో వారు కేవలము హిమోడయాలిసిస్ కొరకు హాస్పిటల్ వచ్చి హిమోడయాలిసిస్ ప్రక్రియ తరువాత ఇంటికి వెళ్లిపోతారు. చాలా రోగులు ఈ ప్రక్రియలోని నాలుగు గంటల సమయాన్ని పడుకోవడం, టి. వి చూడడం, సంగీతాన్ని వినడం మరియు వారికి ఇష్ట మైన పుస్తకాన్ని చదవడంతో గడిపేస్తారు. ఈ ప్రక్రియలో చాలా రోగులు టీ, బ్రేక్ ఫాస్ట్ మరియు చల్లని పదార్దములు తీసుకోవడం ఇష్ట పడతారు. డయాలిసిస్ ప్రకియలో పట్టి విధమైన సమస్యలు ఎదుర్కోవచ్చు? డయాలిసిస్ ప్రకియలో ఎదుర్మోనే సమస్యలలో రక్త ప్రవాహము లో తగ్గుదల. కాళ్ళలో నొప్పి, బలహీనముగా అనిపించడం. వాంతులు రావడం, గుండెలో మంట మొదలగునవి. హిమోడయాలిసిస్ యొక్క ముఖ్యప్రయోజనాలు మరియు నష్టాలూ ఏమిటి హిమోడయాలిసిస్ యొక్క ముఖ్య ప్రయోజనాలు తక్కువ ఖర్చుతో డయూలిసిస్ హాస్పిటల్లో ప్రత్యేకముగా శిక్షణ పొందిన స్టాఫ్ మరియు డాక్టర్లు చేయడం ద్వారా హిమోడయాలిసిస్ సురక్షితమైనది. తక్కువ సమయములో ఎక్కువ ఉపచారము. వ్యాధి సోకే అవకాశము తక్కువ. ప్రతి రోజు చేయించుకునే అవసరము ఉండదు. వేరే రోగులతో కలవడం మాట్లాడము ద్వార మానసిక ఒత్తిడి తగ్గుతుంది. హిమోడయాలిసిస్ యొక్క ముఖ్య అప్రయోజనాలు ప్రతి నగరము/ ఊరిలో ఈ వ్యవస్థ ఉండనందున చాలా మార్లు బయటకు వెళ్ళవలసిన అవసరము వస్తుంది. హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు సమయాన్ని పాటించడం తప్పనిసరి. ప్రతి సారి ఫీస్టుల నీడల్ పెట్టించుకోవడం చాలా నొప్పితో కూడినది. ఆహారం తీసుకోవడంలో జాగ్రతలు తీసుకోవాలి. హిమోడయాలిసిస్ యూనిట్ నడుపడం ఖర్చుతో కూడినది మరియు దీన్నినడుపడానికి ప్రత్యేకముగా నిష్ణాతులైన స్టాఫ్ మరియు డాక్టర్ల అవసరము. హిమోడయాలిసిస్ తక్కువ ఖర్చుతో లభించే ఒక సురక్షిత మరియు ప్రభావ వంతమైన చికిత్స. హిమోడయాలిసిస్ రోగుల కొరకు ప్రత్యేకమైన సూచనలు చాలా సమయము వరకు స్వాహస్తముగా ఉండుటకు నియమితముగా హిమోడయాలిసిస్ చేసుకోవలెను. దీనిని ఆపివేయడం లేదా మార్పులు చేయడం ప్రాణమునకే హానికరము. రెండు హిమోడయాలిసిస్ నడుమ శరీరము యొక్క బరువును అదుపులో పెట్టుకోవడానికి ఆహార జాగ్రత్తలు(నీరు మరియు ఉప్పు తగ్గించడము) తీసుకోవడం అవసరము. హిమోడయాలిసిస్ తో పాటుగా రోగి నియమితముగా మందులు తీసుకోవడం ఇంకా డయాబెటిస్ మరియు రక్త ఒత్తిడిపై నియంత్రణ చాలా అవసరము పెరిటోనియాల్ డయాలిసిస్ మూత్రపిండం ఫెయిల్ అయిన రోగులకు డయాలిసిస్ అవసరము పడినప్పుడు డయాలిసిస్ కు మరో పేరు పెరిటోనియాల్ డయాలిసిస్. పెరిటోనియాల్ డయాలిసిస్ ఏమిటి కడుపు లోపలి నరాలను మరియు అవయవాలను వాటి స్థానములో పట్టి ఉంచే ఒక్క పరికరము ఈ పరికరము సెమి పర్మియబుల్ అంటే జల్లెడ లాగ ఉంటుంది. ఈ జల్లెడ ద్వార జరిగే రక్త శుద్దీకరణ విధానమును పెరిటోనియాల్ డయాలసిస్ అంటారు. వచ్చే అంశాలలో పెరిటోనియాల్ డయాలసిస్‌ను సంక్లిప్తముగా పి.డి. అని అంటాము. పెరిటోనియాల్ డయాలిసిస్ (పి.డి) ఎన్నిరకములు పెరిటోనియాల్ డయాలిసిస్ ముఖ్యముగా మూడు రకములు: ఐ. పి.డి. ఇంటర్మిటింట్ పెరిటోనియాల్ డయాలిసిస్ సి.ఎ. పి.డి. కంటిన్యూస్ ఎంబుగ్యూలేటరి పెరిటోనియాల్ డయూలిసిస్ సి.సి. పి.డి. కంటిన్యూస్ సైక్లిక్ పెరిటోనియాల్ డయాలిసిస్ ఎయిడ్స్ మరియు కాన్సర్ రోగుల కిడ్నీలు కిడ్నీకిడ్నీ మార్పిడిలో ఉపయోగపడవు. ఐ. పి.డి. ఇంటర్మిటెంట్ పెరిటోనియాల్ డయాలిసిస్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగులకు తక్కువ సమయం కొరకు డయాలిసిస్ అవసరం అయినప్పుడు ఈ డయాలిసిస్ చేస్తారు. రోగులను మత్తులోనికి పంపకుండా పొట్ట క్రింది భాగాన్ని ప్రత్యకమైన ద్రవంతో నయం చేయబడుతుంది. ఆ ప్రాంతములో చాలా లావుగ వున్న నాళమును కడుపులో వేసి ప్రత్యేకమైన ద్రవము(పెరిటోనియాల్ డయాలిసిస్ ఫూయిడ్) సహాయంతో రక్తములోని వ్యర్ధ పదార్థాలను తీసి వేసారు. ఈ డయాలిసిస్ ప్రక్రియ 36 గంటల వరకు జరుగుతుంది. ఈ సమయములో 30 నుండి 40 లీటర్ల ప్రవాహమును శుద్దీ కరణం కొరకు ఉపయోగిస్తారు. పి.డి. డయాలిసిస్ ప్రతి మూడు నుండి ఐదు రోజులకు ఒక సారి. పి.డి. డయాలిసిస్ లో పడక మీద ఎటు తిరగకుండా పడుకోవలసి ఉంటుంది. ఇందువలన ఈ డయాలిసిస్ అనుకూలము కాదు. సి.ఎ. పి.డి. కంటిన్యూస్ ఎంబుగ్యూలేటరి పెరిటోనియాల్ డయాలిసిస్ (CAPD) సి.ఎ.పి.డి. కంటిన్యూస్ ఎంబుగ్యూలేటరి పెరిటోనియాల్ డయాలిసిస్ అనగా పమిటి? సి.ఎ. పి.డి. అంటే: సి - కంటిన్యూస్ , ఇందులో డయాలిసిస్ నిరంతరముగా చేయబడుతుంది. ఎ. -ఎంబుగ్యూలేటరి, దీని ప్రకారము రోగి తమ సాధారణ పనులు చేసుకోవచ్చను. పి.డి.-పెరిటోనియాల్ డయాలిసిస్ యొక్క ఒక ప్రక్రియ. సి.ఎ. పి.డిలో రోగి తమ ఇంట్లోనే ఉంటూ మందు లేకుండా మెషిన్ సహాయంతో డయాలిసిస్ చేసుకోవచ్చు. పాశ్చాత్య దేశాలలో క్రానిక్ కిడ్నీ ఫైయిలుర్ రోగులు ఈ డయాలిసిస్ చేసుకుంటారు. సి.ఎ.పి.డి. యొక్క విధానము: ఈ డయాలిసిస్ ప్రక్రియలో అనేకమైన నాళములు ఉన్న (CAPD Catheter) కడుపు క్రింది భాగములో ఒక చిన్న కాటు వేసి పెట్టబడుతుంది. నాళము సిలికాన్ లాంటి ప్రత్యేకమైన పదార్ధంతో చేయబడుతుంది. ఇది మెత్తనిది మరియు కడుపులో సౌకర్యవంతముగా ఉంటుంది కడుపు మరియు అవయవాలకు హాని కలిగించదు. ఈ నాళము ద్వార రోజుకు మూడు నుండి నాలుగు సార్లు రెండు లీటర్ల డయాలిసిస్ ద్రవము కడుపులోకి వేయబడుతుంది మరియు నిర్ణీత సమయానికి ద్రావణి బయటకు తీయబడుతుంది. పి.డి. ద్రవము ఎంత సమయము కడుపులో ఉంటుందో అ సమయాన్ని (CWELL TIME) అంటారు. ఈ ప్రక్రియలో, రక్తములోని చెత్తను డయాలిసిస్ ద్రవము వడపోసి రక్తం శుద్ధికరణ చేయబడుతుంది. డయాలిసిస్ కొరకు ప్లాస్టిక్‌తో చేసిన మృదువైన బ్యాగులో రెండు లీటర్ల ద్రవము కడుపులో వేసిన తరువాత ఖాళ్లి బాగ్ ను నడుముకి కట్టుకొని సౌకర్యముగా తిరగవచ్చును. ఈ డయాలిసిస్ ప్రక్రియ రోజంతా నడుస్తుంది మరియు రోజుకు మూడు లేదా నలుగు సార్లు ద్రావణి మార్చ బడుతుంది. పి.డి. లో ద్రవ మార్పిడి ప్రక్రియ కాకుండా రోగి వేరే సమయములో తమ యొక్క పనులు చేసుకోవచ్చు. కడుపులో నుండి వచ్చిన వ్యర్ధ పదార్థాలు మరియు అశుద్ధమైన ద్రవము అదే ప్లాస్టిక్ బాగ్ లోకి తీసిన తరువాత దానిని బయటకు పారేస్తారు. సి.ఎ. పి.డి. క్రమము తప్పకుండా ప్రతి రోజు చేసుకోవలసి ఉంటుంది. సి.ఎ. పి.డి. రోగులు ఆహార అలవాట్లలో ఎట్టి మార్పుల సలహాలను సూచిస్తారు సి.ఎ. పి.డి. ప్రక్రియలో కడుపు లోనుండి బయటకు వచ్చే ద్రవముతో పాటు ప్రోటీన్ కూడా బయటకు వస్తుంది. ఇందువలన నియమితముగా అధిక ప్రోటీన్ ఉన్న ఆహారము తీసుకోవడం చాలా ఆవశ్యకము. రోగి ఎంత ఉప్పు, ప్రోటీన్ పదార్థాలు, ఇంకా నీరు తీసుకోవాలో మీ డాక్టర్ రక్తములోని ఒత్తిడి మరియు లేబరేటరి రిపోర్ట్ చూసిన తరువాత నిర్ణయిస్తారు. సి.ఎ. పి.డి. రోగులు అధిక ప్రోటీన్ ఉన్న ఆహారము తీసుకోవడము చాలా ఆవశ్యకము సి.ఎ. పి.డి. చేసుకునే సమయుములో రోగికి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? సి.ఎ. పి.డి. యుక్క ) ప్రమాదాలలో పేరిటోణియిటిస్ (కడుపులో తిప్పడం) . సి.ఎ. పి.డి. క్యాతేటర్ బయటకు వచ్చే స్థానములో సంక్రముణ (Exit Site Infection) మరియు వీరైకచనాలు వంటివి కలుగడం. సి.ఎ. పి.డి. రోగులలో ముఖ్య ప్రమాదము ప్రోతోనియాల్ సంక్రమణ, దీనినే పేరిటోణియిటిస్ అంటారు. కడుపులో నొప్పి, జ్వరం రావడం మరియు పొట్టలో నుండి వచ్చే ద్రవము మురుకి కావడం. ఇవి పేరిటోణియిటిస్ సంకేతాలు. సి.ఎ.పి.డి.యొక్క ముఖ్యప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటి? సి.ఎ. పి.డి. యొక్క ముఖ్య ప్రయోజనాలు : డయాలిసిస్ కొరకు రోగి హాస్పిటల్ కు వెళ్ళవలసిన అవసరం లేదు. రోగి ఇంట్లోనే ఉంటూ డయాలిసిస్ చేసుకోవచ్చు. స్థలము మరియు సమయము కొరకు చింత ఉండదు. రోగి దినచర్యలు మరియు తిరుగడం లాంటివి చేసుకోవచ్చును. ఆహార అలవాట్లలో తక్కువ మార్పులు. ఈ ప్రక్రియ మెషిన్ సహాయం లేకుండ జరుగుతుంది. సూది పెటుకునే నొప్పి నుండి విముక్తి వుంటుంది. సంక్రమణ చెందకుండా వుండడానికి తీసుకునే జాగ్రతలు సి.ఎ. పి.డి. ప్రక్రియలో చాలా ముఖ్యము సి.ఎ. పి.డి. యొక్క ముఖ్య అప్రయోజనాలు ప్రస్తుత సమయంలో ఈ చికిత్స చాలా ఖర్చుతో కూడినది ఇందులో పేరితోడియిటిస్ సంభవించే అవకాసం ప్రతి దినము క్రమము తప్పకుండ మూడు లేదా నాలుగు సార్లు జాగ్రతగా ద్రవమును మార్చవలెను. ఈ బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుంది. ఈ ప్రకారముగా ప్రతి దినము నిర్దేశించిన సమయాన్నికి జాగ్రతగా సి.ఎ. పి.డి. చేయడం మానసికముగా చాలా ఒత్తిడితో కూడినది. కడుపులో ప్రతిసమయము క్యాతేటర్ మరియు ద్రవము ఉండడం ఒక సమస్య సి.ఎ. పి.డి. కొరకు ద్రవముతో ఉన్న బరువైన బ్యాగ్ తగిలించుకొని తిరుగడం అనుకూలముగా ఉండదు. సి.ఎ. పి.డి. యొక్క ముఖ్య ప్రయోజనం సమయము మరియు స్వేచ్ఛ