మూత్రమార్గం యొక అంటు వ్యాధి (Urinary Tract Infection) కిడ్నీ మూత్రవాహిని, మూత్రాశయం, మరియు మూత్రనాళిక ల యొక్క కలయిక మూత్రమార్గముగా ఏర్పడతాయి వీటిలో సూక్ష్మ జీవుల వలస కలిగే అంటు వ్యాడీని(Urinary Tract Infection-UTI) అంటారు మూత్రమార్గము లో అంటు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ముత్రమర్ధాలలో వేరు వేరు భాగాలలో సంక్రమణ యొక్క ప్రభావము యొక్క లక్షణాలు వివిధముగా ఉంటాయి. ఈ యొక్క లక్షణాలు సంక్రమణ యొక్క పరిమాణమును బట్టి తక్కువ లేదా ఎక్కువ పరిమాణములో కనబడవచ్చును. రోగులలో అధిక శాతం కనబడే లక్షణాలు: మూత్రం పోసే సమయములో చికాకు లేదా నొప్పి కలగడం. మూత్రము అనేక సార్లు రావడము మరియు చుక్కలు చుక్కలుగా రావడము. జ్వరము రావడము. మూత్రాశయ అంటు వ్యాధి యొక్కలక్షణాలు: కడుపు క్రిందటి భాగము (పెల్వి) లో నొప్పి ఉండుట . ఎరుపు రంగులో మూత్రము వచ్చుట. కిడ్నీ యొక్కఅంటు వ్యాధి లక్షణాలు: చలితో కూడిన జ్వరము వచ్చుట నడుములో నొప్పి రావడము బలహీనంగా అనిపించడము. ఒక వేళ సరియైన చికిత్స చేయకుంటే ఇలాంటి సంక్రమణ ప్రాణాంతకము కూడా కావచ్చు. మూత్రం పోసే సమయములో చికాకు లేదా తరచుగా రావడము మూత్రమార్గములో అంటు వ్యాధి లక్షణాలు మూత్రమార్గములో తరచుగా అంటు వ్యాధి రావడానికి గల కారణాలు పమిటి మూత్రమార్గములో తరచుగా సంక్రమణ రావడము మరియు సరియైన చికిత్స చేసిన తరువాత కూడా రక్తము పోవడానికి అనేక కారణాలు క్రింద వ్రాయబడినవి: మహిళలలో మూత్రనాళిక చిన్నదిగా ఉండటము వలన మూత్రాశయములో సంక్రమణ త్వరగా జరుగవచ్చును. డయాబెటిస్‌లో రక్తము మరియు మూత్రములో గూకోజ్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉండటము వలన పెద్ద వయుసులో ఉన్న పురుషులలో ప్రోస్టేట్ గ్రంధి పెరగడము ద్వారా మరియు పెద్ద వయస్సు లో ఉన్న అనేక మంది మహిళలలో మూత్రనాళిక చిన్నదిగా అయినప్పుడు మూత్ర విసర్జన సమయములో ఇబ్బందికరంగా ఉంటుంది మరియు మూత్రాశయము పూర్తీగా ఖాళీ అవ్వదు. మూత్రమార్గాములో రాళ్ళు ఏర్పడుట. మూత్రమార్గాములో ఆటంకము: మూత్రనాళిక చిన్నదిగా అయినపుడు (Stricture Urethra) లేదా కిడ్నీ మరియు మూత్రావాహిని యొక్క మధ్య భాగము చిన్నదిగా అయినప్పడు (Pelvi Ureteric Junction) ఇతర కారణాలు: మూత్రాశయములో సామాన్యంగా పని చేసే తత్వములో లోపము వలన (Neurogenic Bladder) పుట్టుక తోనే మూత్రమార్గములో నష్టం కలగడము ద్వారా మూత్రము మూత్రాశయము నుండి మూత్రవాహినిలో వెనుకకు పోవడము (Vesico Uretric Reflux), మూత్రమార్గమూలో క్షయ (TB) వ్యాధి ప్రభావము వలన కాని ఇతర వ్యాధుల ప్రభావము గాని కారణాలు కావచ్చు మూత్రమార్గములో అడ్డంకి వలన మూత్రములో అనేకసార్లు అంటు వ్వాధి రావడానికి ముఖ్య కారణము మూత్రమార్గములో తరచుగా సంక్రమణ వలన కిడ్నీకి ఎలాంటి నష్టం కలుగుతుంది సాదారణంగా: చిన్ననాటి తరవాత మూత్రమార్గములో తరచుగా కలిగే అంటు వ్యాధి వలన కిడ్నీకి ఎలాంటి నష్టం కలగదు. కానీ మూత్రమార్గములో రాళ్ళు, అడ్డంకులూ లేదా క్షయ వ్యాధి ఇంకా ఇతర ఉనికి వలన మూత్రమార్గములో అంటు వ్యాధితో కిడ్నీకి నష్టము కలిగే అవకాశము కలదు . పిల్లలలో వచ్చే మూత్రమార్గము యొక్క ఇన్ఫెక్షన్ సరైన సమయానికి చికిత్స చేయకపోతే కిడ్నీకి తిరిగి కోలుకోలేని రీతిలో నష్టం కలగొచ్చును,. అందుచేతనే మూత్రమార్గము యొక్క ఇన్ఫెక్షన్ సమస్య ఇతర వయస్సులో కంటే పిలలలో అధికంగా ఉంటుంది . మూత్రమార్గములో ఇన్ఫెక్షన్ యొక్క నిర్ధారణ: మూత్రము ను మైక్రోస్కోప్ తో చేయబడే పరీక్షలో చీము కణాలు (Pus Cells) కలిగి ఉంటే మూత్రమార్గములో ఇన్ఫెక్షన్ యొక్క సూచనగా నిర్ధారించావచ్చును. మూత్రము యొక్క కల్టర్ మరియు సెన్సిటివిటి (Urine Culture & Sensitivity) యెక్కపరీక్ష: మూత్రము యొక్క కల్చర్ మరియు సెన్సిటివిటి (Urine Culture & Sensitivity) పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియా రకం మరియు దాని చికిత్సకు సమర్థవంతమైన మందు గుర్చిన సమాచారము తెలియజేయబడును. మూత్రమార్గము అంటు వ్యాధి కొరకు సమర్థవంతమైన చికిత్స చేయడానికి మూత్రము యొక్క కల్చర్ పరీక్ష చాలా ముఖ్యమైనది ఇతర పరీక్షలు: రక్తం యొక్క పరీక్షలో కనుగొన్న శ్వేత కణాల యొక్క అధిక మోతాదును బట్టి అంటు వ్యాధి యొక్క ప్రభావం కనుక్కోవచ్చును. మూత్రమార్గములో తరచుగా కలగే అంటువ్యాధి కారణలు యొక్కనిర్ధారణ ఏ ప్రకారముగా అవుతుంది మూత్రములో తరచుగా చీము కలగడము మరియు సంక్రమణ యొక్క చికిత్స పై ప్రభావము లేకపోవడము వంటి కారణాలు ఈ క్రింద విధంగా పరీక్ష చేయబడుతుంది. కడుపు భాగము యొక్క ఎక్ష్సే మరియు సోనోగ్రఫి ఇంట్రా వీనస్ ఫైలో గ్రపీ (IVP) మేక్బురేటింగ్ సిస్టోయురేతరోగ్రాం (MCU) మూత్రములో టీ.బి. యొక్క బ్యాక్టీరియా నిర్ధారణ (Urinary AFB) యురాలోజిస్ట్ (Urologist) ద్వారా ప్రత్యేకమైన మైన దుర్బిన్ లాంటి పరికరముతో మూత్రనాళిక మరియు మూత్రాశయం లోపల భాగాములో పరీక్ష చేయుట ద్వారా (Cystoscopy) స్త్రీలకు సంభందించిన వైద్యురాలు (Gynaecologist) ద్వారా పరీక్ష విధానము మూత్రమార్గములోని ఇన్ఫెక్షన్ యొక్కచికిత్స నీరు అధికముగా తీసుకోవాలి అంటు వ్యాధి ఉంటే రోగులకు నీరు అధిక మోతాదులో తీసుకోమని డాక్టర్ సలహా ఇస్తారు . కిడ్నీలో సంక్రమణ కారణంగా కొందరికి అధికముగా వాంతులు అవుతాయి. అలాంటివారిని ఆస్పత్రిలోచేర్చుకొని గూకోజ్ ఎక్కించే అవసరము వుంటుంది. మూత్రమార్గములో ఇన్ఫెక్షన్ ఉంటే నీరు అధికముగా తీసుకోవాలి మందుల ద్వారా చికిత్స మూత్రాశయములో ఇన్ఫెక్షన్ అవస్థ ఉన్న రోగికి సామాన్యంగా క్రోటైమెకై జోల్,సెపెలోస్పోరిన్ లేదా క్వినోలోన్స్ గ్రూపుకు చెందిన మందుల ద్వారా చికిత్స చేయబడుతుంది. ఈ మందులు సామాన్యంగా ఏడు రోజులు సూచించబడుతుంది . కిడ్నీ యొక్క ఇన్ఫెక్షన్ చాలాతీవ్రంగా ఉన్న రోగిలో అక్యూట్ ఫిలోనైప్రిటీస్ (Acute Phylonephritis) ఉంటుదీ. ఇలాంటి రోగికి మొదట్లో ఇంజక్షన్ ద్వారా యాంటీబయాటిక్ ఇవ్వబడుతుంది. సాదారణంగా సేపెలోస్పోరిన్, క్వినోలోన్స్, ఎమినో గ్లెకో సైడాస్, సమూహం యొక్క ఇంజక్షన్ ఇస్తారు. మూత్రము యొక్క సెన్సిటిప్టి యొక్క నివేదిక సహాయముతో అధిక ప్రభావము గల మందులు లేదా ఇంజక్షన్లు కానీ నిర్ణయిస్తారు. ఆరోగ్యము సరిగ్గా ఉన్న కూడా 14 రోజులు ఈ చికిత్స కొనసాగిస్తారు. చికిత్స చేసిన తరువాత మూత్రపరీక్ష ద్వారా చికిత్స యెంత ప్రయోజనకరంగా ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చును. చికిత్స యొక్క మందులు వాడిన తరువాత మూత్రములో చీము లేకపోతే ఇన్ఫెక్షన్ నియంత్రణ కనపడుతుంది మూత్రమార్గములో ఇన్ఫెక్షన్కలగడానికి గల కారణాలు మరియు వాటి యొక్క చికిత్స అవసరమైన పరీక్షల సహాయముతో ఒక వేళ మూత్రమార్గాములో ఇన్ఫెక్షన్ తరచుగా వస్తుంటే ఈ పరిస్థితి ఏ కారణం చేత వస్తుందో తెలుసుకోవడానికి మరియు చికిత్స యొక్క ఫలితం లేక పోతే అవసరమైన పరీక్షల సహాయముతో మరియు పరీక్ష యొక్క నివేదికను దృష్టిలో ఉంచుకొని మందులలో అవసరమైన మార్పులు చేస్తూ లేదా కొందరు రోగులకి ఆపరేషన్ చేయబడుతుంది. మూత్రమార్గములో క్షయవ్యాధి (TB) మూత్రమార్గాలలో ని క్షయ వ్యాధి (TB) శరీరం పైనే వివిధ అంగాల పైన ప్రభావము చూపుతుంది మరియు కిడ్నీ పైన ప్రభావము 4 నుండి 8 శాతం ఉంటుంది. మూత్రమార్గములో అనేక సార్లు ఇన్ఫెక్షన్ కలగడానికి మూత్రమార్గములో క్షయవ్యాధి ఒక కారణము. మూత్రమార్గము యొక్క ఇన్ఫెక్షన్ చికిత్స సఫలము కావాలంటే తరచుగా ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు తెలుసుకోవడం అవసరము మూత్రమార్గములో క్షయ యొక్కలక్షణాలు ఈ వ్యాధి సామాన్యంగా 25 నుండి 40 సంవత్సరాల వయస్సులో మరియు మహిళలలో పోలిస్తే పురుషులలో అధికముగా కనబడుతుంది 20 నుండి 30 శాతం రోగులలో ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనబడవు. కానీ వేరే సమస్యల పరీక్షలు చేస్తునపుడు అకస్మాతుగా ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనబడతాయి. మూత్రమార్గము యొక్క ఇన్ఫెక్షన్ చికిత్స సఫలము కావాలంటే తరచుగా ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు తెలుసుకోవడం అవసరము మూత్రములో మంటగా ఉండటము తరచుగా మూత్రము రావడము మరియు సామాన్యమైన చికిత్స ద్వారా నయంకాక పోవడము మూత్రము ఎరుపుగా రావడము 10 నుండి 20 శాతం రోగులలో సాయంకాలములో జ్వరము రావడము, అలసట అనిపించడం, బరువు తగ్గడం, ఆకలి కలగకపోవడము ఇంకా తదితర కారణాలలో క్షయ యొక్క లక్షణాలు కనబడతాయి మూత్రమార్గములో క్షయ యొక్క తీవ్రమైన ప్రభావము చేత అధికముగా సంక్రమణ కలగడం, రాళ్ళు ఉండటము, రక్తం పై ఒత్తిడి పెరగడము మరియు మూత్రమార్గములో అడ్డంకి కరణముగా కిడ్నీలో వాపు రావడముతో కిడ్నీ చెడిపోవడము లాంటి సమస్యలు కలుగవచ్చును. మూత్రమార్గములో తరచుగా ఇన్స్క్షన్ కలగడము క్షయకి కారణం అవుతుంది మూత్రూముల్లో పనితణ 1. మూత్ర పరీక్ష: ఇది చాల ముఖ్యమైన పరీక్ష అవుతుంది. మూత్రము లో చీము లేదా రక్త కణాలు ఈ రెండూ కనబడుట మరియు మూత్రము యసిడిక్ గా ఉండుట . నిర్దిష్ట విధానములో ఖచ్చితమైన మూత్ర పరీక్ష (Urinary AFB) చేయడము ద్వర మూత్రములో క్షయ యొక్క బ్యాక్టీరియా ఆనవాలు తెలుసుకోవచ్చును. మూత్ర కల్చర్ పరీక్షలో ఎలాంటి బ్యాక్టీరియా కనబడక పోవడము (Negative Urine Culture) 2.సోనోగ్రఫి : ప్రారంభంలో ఈ యొక్క పరీక్షలో ఎటువంటి నిర్ధారణ చేయలేము. ఒకవేళ తరచుగా శయ యొక్క అధిక ప్రభావముతో కిడీపై వాపు ఉన్న లేక దాని పరిమాణం తగ్గినట్లుగా కనబడుతుంది. 3. ఐ.వి.పి (I.V.P) ఈ పరీక్ష చాలా ఉపయోగకరము ఎందుకంటే క్షయ కారణంగా మూత్రవాహిని పరిమాణము తగ్గి ఉండి కిడ్నీ ఆకారములో మార్పు కలిగి (వాపు లేదా పరిమాణము కాలుగుట) మరియు మూత్రాశయము యొక్క పరిమాణము తగ్గి ఉండడము లాంటి ఇబ్బందులు గమనించవచ్చు. 4. ఇతర పరీక్షలు చాలామంది రోగులలో మూత్రనాళిక మరియు మూత్రాశయమును దుర్బిన్ (Cystoscopy) లేదా బయపోప్ లాంటి పరికరము ద్వారా పరీక్ష చాలా సహాయకరమైన నిర్ధారణగా ఉంటుంది. మూత్రమార్గములోక్షయ యొక్క చికిత్స 1.మందులు మూత్రమార్గములోని శయకు ఊపిరితిత్తుల క్షయకు ఉపయోగించె మందులే వాడుతారు. సర్వ సాదరాణంగా మొదట నాలుగు రకాల మందులు మరియు దాని తరువాత మూడు రకాల మందులు ఇవ్వబడుతాయి. 2. ఇతర చికిత్స విదానాలు ముత్రమర్ధాలలో క్షయ కారణంగా మూత్రమార్గములో అడ్డంకి కనపడితే దీని చికిత్స దుర్బిన్ లేదా ఆపరేషన్ ద్వారా చేయబడుతుంది. ఒకవేళ రోగి కిడ్నీ సంపూర్ణంగా చెడిపోతే అలాంటి కిడ్నీని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. మందులు తీసుకున్న తర్వాత కూడా రక్త పోటు ఎక్కువగా వున్నచో కిడ్నీపరీక్షలు చేయవలసి వుంటుంది.