ఒకే ఒక కిడ్నీఉంటే ఏ వ్యక్తికైనా శరీరంలో ఒకే ఒక కిడ్నీ ఉందంటే సహజంగా దాని గురించి చింత అధికముగా ఉంటుంది. అందు చేతనే ఈ విషయానికి సంబందించిన అనేక సందేహాలను తీర్చే ప్రయత్నం చేయబడింది ఒకే కిడ్నీ ఉన్న వ్యక్తిలో రోజువారీ జీవితంలో ఎలాంటి ఇబందులు ఉంటాయి. ఒకే కిడ్నీ ఉన్న వ్యక్తి తన అనుదిన చర్యలో కష్టించి పని చేయడములో కానీ సహవాసములో కానీ ఎలాంటి నష్టము ఉండదు . సాధారణంగా ప్రతి వ్యక్తి శరీరములో రెండు కిడ్నీలు ఉంటాయి కానీ ఈ కిడ్నీలలో పనితత్వం ఎక్కువగా ఉంటుంది ఇవి శరీరానికి అవసరం అయ్యే ప్రతీ ముఖ్యమైన అవసరాలను ఈ ఒక్క కిడ్నీ సంపూర్ణంగా చేసుకుపోతాయి. అధిక శాతం ఒక్క కిడ్నీ ఉన్న వారు, వారి జీవితాని సామాన్యంగా గడుపుతారు. వారికి ఒక్క కిడ్నీ ఉన్న సంగతి అధిక శాతం అరుదైన పరీక్షలు చేస్తే కానీ తెలియదు. ఒకే కిడ్నీఉండటానికి గల కారణాలు ఏంటి ఒకే కిడ్నీఉండటానికి ఈ విధమైన కారణాలు: కొందరికి పుట్టుకతో ఒకే కిడ్నీ ఉండడం . ఆపరేషన్ కారణంగా కొందరికి ఒక కిడ్నీ తీయబడుతుంది, కిడ్నీ తీయడానికి గల ముఖ్య కారణాలు కిడ్నీలలో రాళ్ళూ ఉండటం, చీము ఉండటం లేదా చాలా కాలంగా మూత్రపిండాల మార్గాలలో అడ్డంకులు ఉన్న కిడ్నీలు పని చేయడం ఆపివేస్తాయి లేదా కిడ్నీ కాన్సెర్ యొక్క లక్షణాలు కనపడిన యెడల, కిడ్నీ మార్పిడి చేసిన వ్యక్తిలో కిడ్నీ ఒకే పని చేస్తుంది. పుట్టుకతో ఒకే కిడ్నీ ఉండే వారి శాతం ఎంత ఉంటుంది పుట్టుకతోటే ఒకే కిడ్నీ ఉన్న వారి సంఖ్యా స్త్రీలలో కన్నా పురుషులలో అధికంగా ఉంటుంది. ఈ అవకాశం దాదాపుగా 750 వ్యక్తులలో ఒక్కరికి ఉంటుంది. ఒకే కిడ్నీ ఉన్న వ్యక్తి అనుదిన జీవనవిధానం లో కానీ సామాన్య జీవితం గడుపుటలో ఎలాంటి కష్టం ఉండదు . ఒకేకిడ్నీఉన్నవ్యక్తిని ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి సామాన్యంగా ఒకే కిడ్నీ ఉన్న వ్యక్తికి ఎలాంటి కష్టం కలగదు కానీ ఈ వ్యక్తి ని బ్యాలన్సు లేని (స్పైర్ పయ్య) లాంటి వాహనం తో పోలుస్తారు. రోగికి ఒకే కిడ్నీ ఉండటము వలన అది కాస్త చెడిపోతే శరీరంలో మూత్రపిండాల యొక్క పని ఆగిపోతుంది. ఒక వేళ ఈ కిడ్నీ సమయానికి పనిచేయక పోతే శరీరం పై దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాని కే నష్టం కలగొచ్చు, ఇలాంటి వ్యక్తికి డయాలసిస్ అవసరం కలగవచ్చును. ఒకే కిడ్నీఉన్నవ్యక్తికి అది చెడిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఒకే కిడ్నీ యొక్క మూత్రమార్గములో రాళ్ళు ద్వారా ఆటంకం కలగడం ఒక వేళ కడుపు భాగాములో ఆపరేషన్ చేసేటప్పుడు కిడ్నీ నుంచి మూత్రము పోసే ద్వారములో ఒక్క దారి (మూత్రావాహిని) ని మరిచిపోయి మూసివేస్తాయి. కుస్తీ, బాక్సింగ్, కరాటే ఫుట్ బాల్, హాకీ, లాంటి ఆటలు అడుతునపుడు కిడీపై గాయం కావచ్చును . ఒకే కిడ్నీఉన్న వ్యక్తులు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి మంచి నీటిని చాలా ఎక్కువగా తాగాలి కిడ్నీకి గాయం అయ్యే క్రీడలలో పాల్గొనవద్దు మూత్రము పోసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్న వెంటనే సరియైన వైద్యునిచే చికిత్స చేయించాలి . డాక్టర్ యొక్క సలహ లేనిదే ఏ మాత్రలు వాడవద్దు సంవత్సరానికి ఒకసారి అయిన డాక్టర్ వద్దకు వెళ్లి తమ యొక్క రక్తపోటును పరీక్ష చేయించాలి, ఇంకా డాక్టర్ సలహా మేరకు రక్త పరీక్ష మూత్రపరీక్ష ఇంకా కిడ్నీ సోనోగ్రఫి చేయించాలి. ఎలాంటి రకమైన చికిత్సలు కానీ లేదా ఆపరేషన్ కానీ చేయవలసి వస్తే మీకు ఒకే కిడ్నీ ఉన్న విషయం డాక్టర్కి తెలపాలి. పుట్టుకతోనే చాలా మంది మనుషులలో ఒక కిడ్నీ మాత్రమే ఉంటుంది.