మందుల కారణంగా కిడ్నీ కి ఎదురయ్యే సమస్యలు మందులు వాడుతుండగా శరీరములో ఇతర అంగాల కన్నా కిడ్నీకి ఎందుకు నష్టము కలుగుతుంది మందులు సేవించేటప్పుడు కిడ్నీకి అధికంగా నష్టం సంభవించడానికి రెండు ముఖ్య మైన కారణాలు కలవు. కిడ్నీ అధిక శాతం మందులను శరీరము నుండి బయటకు తొలగిస్తుంది ఈ యొక్క ప్రక్రియ సమయములో చాలా మందులు వాటి రూపాంతర పదార్ధములతో కిడ్నీకి నష్టము కలిగిస్తాయి . హృదయములో నుండి ప్రత్యేకమైన నిముషములో వచ్చే రక్తము యొక్క ఐదవ భాగము కిడ్నీలోనికి వెళుతుంది. బరువు మరియు పొట్టితనం అనుసారంగా శరీరములో అన్నింటి కన్నాఎక్కువ రక్తము కిడ్నీలోనికి వెళ్ళుతుంది ఈ కారణము చేత కిడ్నీకి నష్టము కలిగించే మందులు లేక ఇంకా వేరే పదార్దములు తక్కువ సమయములో మరియు అధిక మోతాదులో కిడ్నీలోనికి చేరుతుంది, ఈ కారణము చేత కిడ్నీకి నష్టం త్వరగా వాటిల్లే అవకాశము అధికముగా ఉన్నది. నొప్పిని తగ్గించే మందులు (Pain Killers) శరీరములోని చిన్న పెద్ద నొప్పులకు డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్ మందులు తీసుకోవడము సర్వ సాధారణం అయింది. ఈ తరహలో సొంత వైద్యము చేసుకొనుట వలన కిడ్నీ చెడిపోడానికి పెయిన్ కిల్లర్ మందులు అధిక బాధ్యత వహిస్తుంది. పెయిన్ కిల్లర్ మందులు అనగా ఏమిటి, వీటిలో ఉన్న మందులు ఏమిటి నొప్పి తగ్గించడానికి మరియు జ్వరము తగ్గించడానికి వాడే మందులని పెయిన్ కిల్లర్స్ అని అంటారు. ఈ ప్రకారముగా వాడే మందులలో ఐబృఫీన్, కిట్‌తో ప్రఫిన్, డైక్లోఫినాక్, సోడియుం, నిమేసులైడ, ఇంకా ఇతర మందులు మందుల కారణంగా కిడ్నీకి నష్టము కలుగచేసే ముఖ్య కరణము పెయిన్ కిల్లర్స్ మందుల కారణంగా కిడ్నీకి ఎదురయ్యే సమస్యలు పెయిన్ కిల్లర్స్ వలన సామాన్యమైన రోగి యొక్కకిడ్నీ చెడిపోయే ప్రమాదము ఉందా? లేదు. డాక్టర్ యొక్క సలహా ప్రకారము సామాన్య వ్యక్తికి సూచించిన మోతాదు మరియు సమయము వరకు తీసుకుంటే పెయిన్ కిల్లర్స్ వాడుట సురక్షితము. పెయిన్ కిల్లర్స్ వాడుట వలన కిడ్నీ చెడిపోయే ప్రమాదము ఎప్పుడు ఉంటుంది? డాక్టర్ యొక్క సలహా లేకుండా చాలా కాలము వరకు అధిక మోతాదులో మందులు ఉపయోగించే వారిలో కిడ్నీ చెడిపోయే ప్రమాదం అధికముగా ఉంటుంది. పెద్ద వయస్సు, కిడ్నీ వైఫల్యం, మధుమేహ రోగి, మరియు శరీరములో నీరు తక్కువ మోతాదులో ఉన్న ఇలాంటి రోగులు పెయిన్ కిల్లర్స్ వాడుట వలన ప్రమాదము కలగవచ్చు. కిడ్నీ వైఫల్యం ఉన్న రోగికి ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడుట సురక్షితము ? కిడ్నీ వైఫల్యం ఉన్న రోగికి పారాసిటమాల్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడుట అధిక సురక్షితము. చాలా మంది రోగులకి గుండె యొక్క సమస్యలకు చాలా వరకు ఆస్పిరిన్ సూచించబడుతుంది. అయతే దీని వలన కిడ్నీకు నష్టము కలుగుతుందా? గుండె యొక్క సమస్యలకు చాలా వరకు అస్పిరిన్ సూచించబడుతుంది అయితే తక్కువ మోతాదులో తీసుకునే సలహా ఇవ్వబడుతుంది అందుచేతనే కిడ్నీకి నష్టము కలగదు. ఇష్టానుసారమైన పద్ధతిలో తీసుకోబడిన పెయిన్ కిల్లర్స్ మందులు కిడ్నీలకు హానికరము కావచ్చు పెయిన్ కిల్లర్స్ వాడుట వలన చెడిపోయిన కిడ్నీ మళ్లి మంచిగా అవుతుందా? ఎప్పూడైతే పెయిన్ కిల్లర్స్ మందులు కొద్ది సమయము వరకు ఉపయోగించినప్పుడు ఆకస్మికంగా కిడ్నీ చెడిపోయుంటే ఆప్పుడు ఉచిత మైన చికిత్స మరియు పెయిన్ కిల్లర్స్ వాడుట మానివేస్తే కిడ్నీ మరల నయము అవుతుంది. పెద్ద వయస్సు ఉన్నవారు చాలా మంది రోగులు కీళ్ళు నొప్పి కొరకు నియమించిన విధంగా చాలాకాలము వరకు పెయిన్ కిల్లర్స్ వాడవలసి వస్తుంది ఇలాంటి కొంత మంది రోగులలో కిడ్నీ మెల్ల మెల్లగా చెడిపోతుంది. ఎలా అంటే మళ్లి తిరిగి నయము కానంతగా, ఇలాంటి రోగులుకు కిడ్నీ యొక్క క్షేమము కొరకు పెయిన్ కిల్లర్స్ మందులు డాక్టర్ యొక్క సలహామేరకు తీసుకోవడము మంచిది. చాలా కాలంగా పెయిన్ కిల్లర్స్ వాడుట వలన కిడీపై చూపే ప్రభావమును ప్రారంభ దశలో నిర్ధారణ ఎలా చేయవచ్చు? మూత్రపరీక్షలో ఒకవేళ ప్రోటీన్లు పోతునట్లయితే ఇది కిడీపై చూపే ప్రభావము యొక్క ప్రథమ గుర్తు కావచ్చు. కిడ్నీ ఎక్కువగా చెడిపోతే రక్త పరీక్షలో క్రియాటినిన్ యొక్క మోతాదు అధికముగా కనబడుతుంది. అమైనోగ్లైకోసైడ్స్ జంటమైసిన్ అను ఇంజక్షన్ ఎప్పూడైతే చాలాకాలము వరకు ఎక్కువ మోతాదులో తీసుకుంటారో లేదా పెద్ద వయస్సు కలిగి బలహీనమైన కిడ్నీ ఉన్న మరియు శరీరములో నీటి మోతాదు తక్కువ ఉన్న ఇలంటి రోగిలో ఈ ఇంజక్షన్ తీసుకోవడము ద్వారా కిడ్నీ చెడిపోయే ఆస్కారములు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ఇంజక్షన్ ఆకస్మికంగా ఆపివేసిన ఎడల అధికశాతం రోగులలో కిడ్నీ కొంత సమయానికి పూర్తిగా పని చేస్తుంది పెద్ద వయస్సు, మధుమేహ మరియు శరీరములో నీరు తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మందులతో కిడ్డపై విపరీతమైన ప్రభావము పడే భయము అధికముగా ఉంటుంది రేడియో కాంట్రాస్ట్ ఇంజక్షన్ ఎక్కువ వయస్సు కిడ్నీ వైఫల్యం, మధుమేహం, శరీరములో నీరు మోతాదు తక్కువగా ఉన్నవారు లేదా కిడ్నీకి నష్టం కలిగించే మందులు తీసుకునేవారు ఇలాంటి రోగులకు అయోడిన్‌తో కూడిన పదార్ధముల ఇంజక్షన్ ఇచ్చి ఎక్స్ రే పరీక్ష చేసిన తరవాత కిడ్నీ చెడిపోయే పరిస్థితిని తెలుసుకుంటారు. అధికశాతం రోగుల కిడ్నీకు కలిగిన నష్టము మరల మెల్ల మెల్లగా కోలుకుంటుంది ఆయుర్వేదిక్ మందులు ఆయుర్వేదిక్ మందుల ద్వార ఎప్పుడు ఎలాంటి దుప్ర్చబావము కలగదు అనేది తప్పుడు అభిప్రాయము ఆయుర్వేదిక్ మందుల తయారికి ఉపయోగించే అధిక దాతులు (సీసం, పాదరసం, మోదలగు)తో కిడ్నీకి నష్టము కలుగవచ్చు కిడ్నీ వైఫల్యం కలిగిన రోగులకు వివిధ రకముల ఆయుర్వేదిక్ మందులు చాలా వరకు ప్రమాదకరము కావొచ్చును. చాలా ఆయుర్వేదిక్ మందులలో పొటాషియం యొక్క మోతాదు అధికముగా ఉంటుంది అందుకే కిడ్నీ వైఫల్యం ఉన్న వారిక ప్రాణానికి హాని కలగవచ్చు ఆయుర్వేదిక్ మందులు కిడ్నీలకు పూర్తి సురక్షితము అనేది తప్పుడు అభిప్రాయాము