వంశపారంపరముగా సోకే వ్యాధి పోలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి వంశపారంపరముగా కిడ్నీ వ్యాధి పొందిన రోగులలో పోలిసిస్టిక్ కిడ్నీ డిసీస్ (పి.కే.డి) చాల ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధి కిడ్నీ మీద తన ప్రభావము చూపిస్తుంది. రెండు కిడ్నీలలో పెద్ద సంఖ్యలో సిస్టు (నీళ్ళతో నిండిన బుడగలు) తయారవుతాయి. క్రానిక్ కిడ్నీ ఫెల్యూర్ యొక్క ముఖ్య కారణములలో పోలిసిస్టిక్ కిడ్నీ డిసీస్ కుడా ఒక కారణం. చాల రోగులలో కిడ్నీ కాకుండా ఇలాంటి సిస్టు లివర్, తిళ్లి, నరాలు మరియు మెదడు నాళము పై కుడా కనబడుతుంది. పోలిసిస్టిక్ కిడ్నీ డిసీస్ యొక్క వ్యాప్తి పి.కే.డి వివిధ దేశాలలో, జాతులలో, స్త్రీ మరియు పురుషులలో ఒకే విధముగా ఉంటుంది. అంచనప్రాకరం: ప్రతి 1000 మందిలో ఒకరికి ఇది కనబడుతుంది. పోలిసిస్టిక్ కిడ్నీడిసీస్ ఎవరికి రావచ్చు పెద్దలలో అయ్యే పోలిసిస్టిక్ కిడ్నీ డిసీస్ ఆటోజోమత్ దోమినస్ట్ కాటగరీలో ఒక వంశపారంపరముగా సోకే వ్యాధి. ఇందులో మొత్తం సంతానంలో నుండి 50 శాతం అంటే సగం సంతానానికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. పి.కె.డి. వ్యాధిని ఎందుకు నివారించాలేము సాదారణంగా పి .కె. డి. వ్యాధి సోకినపుడు వ్వడీ యొక్క వయస్సు 30 నుండి 40 సంవత్సరాలుగా ఉంటుంది. కావున ఈ వయస్సులో వారు సంతానం కలిగి ఉండవచ్చు. అందుచేత పి .కె. డి. వ్యాధిని ముందుతరం వారికి వ్యాపించకుండా ఆపలేము మూత్రపిండాల (కిడ్నీ పైన పి.కె. డి. యొక్క ప్రభావము ఎలా ఉంటుంది పి. కె. డి. లో రెండు కిడ్నీలలో నీటి బుడగలు లాంటి సిస్టలు అధిక సంఖ్యలో కనబడతాయి అనేక ఆకారాలలో సిస్టల లోపల నుంచి చిన్న చిన్న ఆకరాల సిస్టలు ఉంటాయి. వీటిని సాధారణ కంటి చూపుతో చూడడము అసాధ్యము . మరియు పెద్ద సిస్టలు 10 సె.మీ కన్నా అధికంగా ఉండవచ్చును. సమయానుసారంగా ఈ చిన్న పెద్ద సిస్టల ఆకారము లో పెరుగుదల ఉంటుంది. అందుచేత కిడ్నీల యొక్క ఆకారము కూడా పెరుగుతూ ఉంటుంది . సిస్టల పెరుగుదల చేత కిడ్నీలు పనిచేసె భాగల పై ఒత్తిడి పెరుగుతుంది అందుచేత రక్తము పై కూడా ఒత్తిడి అధికంగా పడుతుంది, మరియు కిడ్నీ ఒక్క పనితత్వము క్రమేణా తగ్గుతుంది . సంవత్సరాల తరువాత చాలా మంది రోగుల యొక్క కిడ్నీలు చెడి పోతాయి. పి.కె.డి.యొక్కలక్షణాలు ఏమిటి సామాన్యంగా 30 నుండి 40 సంవత్సరాల వరకు వ్యాధి యొక్క లక్షణాలు గుర్తించలేము, కానీ దాని తరువాత చూపే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వంశ పారంపరంగా వచ్చే కిడ్నీ వ్యదిలలో పి.కె. డి. అధికంగా వచ్చే వ్యాధి రక్తము యొక్క ఒత్తిడి లో అభివృది కలగడము కడుపులో నొప్పి లేదా కడుపులో గ్యాస్, ఇంకా పొట్ట పెరగడము మూత్రములో రక్తం పడుట మూత్రము లో అనేకసార్లు ఇన్ఫెకషన్ కావడము కిడ్నీలలో రాళ్ళు ఉండటము వ్యాధి అధికం అయినప్పుడు క్రానిక్ కిడ్నీ ఫైయిల్యూర్ లక్షణాలు కూడా కనిపించడము మొదలుతుంది. కిడ్నీ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు అధికం . పి.కె.డి. వ్యాధి రోగ నిర్ధారణ అయిన ప్రతి రోగికి కిడ్నీఫెయిల్ అవుతుందా పి.కె. డి. వ్యాధి రోగ నిర్ధారణ అయిన వారందరికీ కిడ్నీలు చెడి పోవు కానీ పి.కె. డి. వ్యాధి ఉన్న 60 సం వయస్సు ఉన్నవారిలో 50 శాతం అలాగే 70 సం వయస్సు ఉన్నవారిలో 60 శాతం చెడిపోయే పరిస్థితి ఉంటుంది. పి.కె. డి.యొక్కవ్యాధి ఏ విధంగా నిర్ధారణ అవుతుంది .సోనోగ్రఫి అనే పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతుంది . ఈ పరీక్ష చాల తక్కువగ నిర్ధారణ అవుతుంది. సి.టి. స్కాన్ : పి .కె. డి. . వ్యాధిలో సిస్టల యొక్క ఆకారము చాలా చిన్నధిగ ఉంటే సోనోగ్రాఫి పరీక్ష ద్వారా కనుక్కోవటం కష్టం కాబట్టి సి.టి. స్మాన్ ద్వారా కనుక్కోవడం సులభం. ఫ్యామిలీ హిస్టరీ ఒక వేళ కుటుంబంలో ఎవరికైనా పి .కె. డి. వ్యాధి ఉంటే మిగిలిన కుటుంభ సభ్యులకు అధికంగా సోకే అవకాశం అధికంగా ఉంది. మూత్రము మరియు రక్త పరీక్ష మూత్రములో సంక్రమణ మరియు రక్తం యొక్క మోతాదు కనుక్కోవడం మూత్ర పరీక్ష మూత్రములో వ్యాధి యొక్క సంక్రమణ మరియు రక్తం యొక్క మోతాదు కనుక్కోవడము ద్వాం రక్త పరీక్ష రక్తంలో యూరియా, క్రియాటినిన్, యొక్క మోతాదు బట్టి కిడ్నీల యొక్క పని తీరును కనుకోవ జన్యుపరమైన పరీక్ష శరీరం యొక్క నిర్మాణం మరియు క్రోమోజోముల ద్వారా నిర్ధారణ అవుతుంది. కొన్ని క్రోమోజోముల యొక్క లోపం వలన కూడా పి .కె. డి. వ్యాధి వస్తుంది. భవిష్యత్తులో ఈ క్రోమోజోముల యొక్క పరిస్థితిని ప్రత్యేకమైన పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పి .కె. డి. వ్యాధి చిన్న వయస్సులో రావచ్చా లేదా అని తెలుసుకొనే వీలుంటుంది. పి.కె.డి. వ్యాధిలోకిడ్నీ వైఫల్యం సమస్యను ఎ విధంగా నివారించవచ్చు పి.కె. డి. ఒక వంశాపారంపరంగా వచ్చే వ్యాధి. ప్రస్తుతానికి దీనిని నివారించడానికి మరియు నిర్మూలించడానికి ఎలాంటి మార్గాలు లేవు. పి .కె. డి. వంశాపారంపరంగా వచ్చే వ్యాధి కాబట్టి ఒక వేళ్ల కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే డాక్టర్ యొక్క సలహా మేరకు ఇతర కుటుంభ సభ్యులు కూడా సోనోగ్రఫి పరీక్ష ద్వార. ఈ వ్యాధి వాళ్ళకి ఉందా లేదా తెలుసుకోవడం అవసరం. వేరే ఎలాంటి మార్గాలు లేవు. పి.కె.డి. యొక్క చికిత్స : పి.కె. డి. నయంకాని వ్యాధి ఐనా కుడా చికిత్స చేయించడం ఎందుకు అవసరం చికిత్స తరువాత ఈ వ్యాధి నయము కాదు కానీ ఈ వ్యాధికి చికిత్స చేయడం చాలా అవసరం. ఎందుకంటే చికిత్స చేయడం ద్వారా కిడీకి జరిగే నష్టం నుండి కాపాడగల్గవచ్చు. ఇంకా కిడ్నీలు చెడిపోకుండా కాపాడే అవకాశం ఉంటుంది. పి .కె. డి. వంశాపారంపరంగాగా వచ్చే వ్యాధి కాబట్టి వ్యాధి ఉన్న రోగి యొక్క ఇతర కుటుంభ సభ్యులు వ్యాధి యొక్క పరిక్షా చేయించుకోవడం అవసరం. ముఖ్య మైన చికిత్స: అధిక రక్తపోటును ఎల్లప్పుడూ నియంత్రణ చేయాలి. మూత్ర విసర్జన సమయములో సంక్రమణ గాని మూత్రము లో రాళ్ళుగాని లేదా ఏ ఇతర ఇబందులు ఎదురైనా వెంటనే అవసరమైన చికిత్స చేయించాలి. శరీరం పైన దురద, మంట లేక వాపు లేకపోతే రోగి అధిక మోతాదులో నీళ్లు తీసుకోవాలి . దీని ద్వారా సంక్రమణ (Infection), రాళ్లు ఇంకా అనేక సమస్యలు తగ్గించడానికి సహాయం అవుతుంది . కడుపులో వచ్చే నొప్పి యొక్క చికిత్స విధానం సున్నితంగా కిడ్డలకు నష్టము లేదా వాటి పై ప్రభావం చూపని ప్రత్యేకమైన మందులు వాడాలి కిడ్నీలు చెడి పోయిన తరువాత క్రానిక్ కిడ్నీ ఫెయిల్యుర్ యొక్క చికిత్స. పైన మనము చదివిన ప్రకారముగా జాగ్రతలు పాటిస్తూ చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పి.కె. డి. వ్యాధి ఎంత త్వరగా గుర్తించబడితే అంత త్వరగా చికిత్స చేయడం లాభం అవుతుంది.