నెప్రోటిక్ సిండ్రోమ్ కిడ్నీకి సంబంది0చిన ఈ వ్యాధి వయస్సుతో నిమిత్తము లేకుండా శరీరములో వాపు కలుగుతుంది. కానీ ముఖ్య ముగా ఈ వ్యాధి పిల్లలో అధికముగా చూడవచ్చు సరియైన చికిత్సతో సంపూర్ణంగా నియంత్రణ కావడము తరవాత మరల వాపు కనబడటము ఈ యొక్క ప్రక్రియ సంవత్సరాల తరబడి జరగుతుంది ఇది నెప్రోటిక్ సిండ్రోమ్ యొక్క విశేషము .చాలా కాలంగా ఎదురయ్యే ఈ సమస్య ఇంటిల్లిపాటికి చింత కలిగించే విషయము అవుతుంది నెప్రోటిక్ సిండ్రోమ్ తో కిడ్నీ పైన ఎలాంటి ప్రభావము పడుతుంది అన్ని బాషలలో ఒకే మాట చెబుతారు అది కిడ్నీ శరీరములో జాలి(ఫిల్టర్) వలె పని చేస్తుంది దీని ద్వారా శరీరములో అనవసరమైన ఉద్గారించే పదార్థాలతోపాటుగా నీరును మూత్రము ద్వారా బయటకు పంపుతుంది. నెప్రోటిక్ సిండ్రోమ్‌లో కిడ్నీలో జాలి(ఫిల్టర్) పెద్దదిగా అవడముతో శరీరములోని అనవసరమైన ఉద్గారించే పదార్థాలను నీరును వీటితోపాటు శరీరానికి అవసరమైన ప్రోటీను (మాంసకృత్తి) కూడా మూత్రము ద్వారాబయటకు వెళ్ళిపోతుంది. దీని వలన శరీరములో ప్రోటీను యొక్క మోతాదు తగ్గిపోతుంది మరియు వాపు వస్తుంది. మూత్రము ద్వారా వెళ్లిపోతున్న ప్రోటిను మోతాదు ను బట్టి రోగి యొక్క శరీరములో వాపు తగ్గవచ్చు లేదా పెరుగుతుంది. నెప్రోటిక్ సిండ్రోమ్ లో వాపు ఉన్న కూడా కిడ్నీ అనవసరమైన ఉద్గారించే పదార్థాలను దూరము చేసే పనితత్వము యావత్ చేస్తూ వుంటుంది అంటే కిడ్నీ చెడిపోయే ప్రమాదము చాలా తక్కువ. పిల్లలలో తరచుగా వాపు రావడానికి ముఖ్య కారణమూ నేప్రోటిక్ సిండ్రోమ్ నెప్రోటిక్ సిండ్రోమ్ సమస్యలకు కారణాలు ఏమిటి నెప్రోటిక్ సిండ్రోమ్ కలగడానికి గల ప్రత్యేక కారణాలు ఏమియు కనిపించవు. శ్వేతకణలలో లింఫోసైట్లు యొక్క పనితత్వము తగ్గుట కారణమ చేత వ్యాధి కలుగుతుంది అని నమ్ముతారు. ఆహారములో పరివర్తన లేదా మందులప్రభావము వలన అని అనుకోవడము తప్పుడు అభిప్రాయం. నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క ముఖ్య లక్షణాలు ఈ వ్యాధి ముఖ్య ముగా రెండు నుండి నాలుగు సం||ల వయస్సు గల పిల్లలలో కనబడుతుంది ఇతర వయస్సు గల వ్యక్తులలో ఈ వ్యాధి సంఖ్య పిల్లలతో పోలిస్తే చాలా తక్కువగ కనబడుతుంది ఈ వ్యాధి యొక్క ప్రారంభ దశ జ్వరము లేదా దగ్గు తరవాత కనబడుతుంది వ్యాధి యొక్క ప్రధమ లక్షణాలు ముఖ్య ముగా కంటి క్రింద మరియు ముఖము పై వాపు కనబడుతుంది. కంటి పై వాపు కలగడము ద్వారా రోగి మొదటిగా కంటి డాక్టర్ వద్దకు పరీక్ష చేయించడానికి వెళ్తారు ఈ యొక్క వాపు రోగి రాత్రి నిద్రించి ఉదయాన లేచినప్పుడు అధికముగా కనబడుతుంధి అది ఈ వ్యాధి కి గుర్తు . ఈ యొక్క వాపు దినములో అధికమవుతూ మెల్ల మెల్లగా తగ్గుతుంది మరియు సాయంత్రము లోగ పూర్తిగా తగ్గుతుంది వ్యాధి అధికమైన కొద్ది కడుపు ఉబ్బుతుంది, మూత్రము తగ్గుతుంది, శరీరములో పూర్తిగా వాపు కలుగుతుంది మరియు బరువు పెరుగుతారు . అనేక సార్లు ముత్రములో నురుగు రావడము మరియు ఏ స్థలములో మూత్రము పోస్తారో అక్కడ తెల్లటి మరక కనబడటము జరుగుతుంది. ఈ వ్యాధిలో మూత్రము యెర్రగా ఉండడము , ఊపిరి బిగపట్టడము మరియు రక్తపోటు అధికము కావడము లాంటి లక్షణాలు కనిపిస్తాయి శరీరములో వాపు, ముత్రములో ప్రోటీన్లు, రక్తము లో తక్కువ ప్రోటీన్లు, మరియు కొలెస్టాల్ పెరగడము నేప్రోటిక్ సిండ్రోమ్ సూచన నేప్రోటిక్ సిండ్రోమ్ వలన ఎలాంటి గంభీరమైన హాని కలుగుతుంది నేప్రోటిక్ సిండ్రోంలో అనుకోకుండా కలిగే హాని లో కడుపు లో సంక్రమణ (Peritonitis),పేద్ద నరము (ముఖ్యముగా కాళ్ళవద్ద) రక్తము సెకరించ బడుట (Venous Thrombosis) మరియు . నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క నిర్ధారణ 1.మూత్రపరీక్ష : మూత్రము లో అధిక మోతాదులో ప్రోటీన్లు పోవడము ఇది నేప్రోటిక్ సిండ్రోమ్ నిర్ధారణకు గొప్ప సంకేతం మూత్రము లో శ్వేతకణాలు , రక్తకణాలు లేదా రక్తము పోకుంటే ఈ వ్యాధి నిర్ధారణ కు గొప్ప సంకేతం. 24 గంటలలో మూత్రము లో ప్రోటీన్ల మోతాదు 3 గ్రా కన్నా అధికముగా ఉంటే మూత్ర పరీక్ష కేవలము రోగ నిర్ధారణ కు కొరకు కాదు దాని చికిత్స కొరకు విశేషముగా అవసరము మూత్రము లో ప్రోటీన్లు ఒకవేళ ఆగిపోతే చికిత్స సఫలమైనట్టు. 2. రక్త పరీక్ష : అధికశాతం రోగులలో హిమోగ్లోబిన్ ,శ్వేత కణాల మోతాదు ఇతర పరీక్షలు అవసరాన్ని బట్టి చేయ బడుతుంది . మూత్రపరీక్ష నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క నిర్ధారణ కొరకు మరియ చికిత్స చేయడానికి చాలా అవసరము నిర్ధారణ కొరకు అవసరమైన పరీక్ష నేప్రోటిక్ సిండ్రోమ్ నిర్ధారణ కొరకు తీసుకునే రక్త పరీక్షలో ప్రోటీన్ (అల్బుమిన్ ) తక్కువగా ఉండాలి మరియు కొలెస్టాల్ పెరగడము అవసరము సామాన్యంగా రక్త పరీక్షలో క్రియాటినిన్ యొక్క మోతాదు సాధారణంగా ఉంటుంది. నేప్రోటిక్ సిండ్రోమ్ ఇతర విశేషమైన పరీక్షల : డాక్టర్ ద్వారాఅవసరమైన అనేక సార్లు చేయబడే విశిష్టమైన రక్త రీక్ష లలో ఎ.ఎస్.ఓ. టైటర్, ఎ ఎన్.ఎ టెస్ట్, ఎయిడ్స్ యొక్క పరీక్ష , హెపటైటిస్ బి యొక్క పరీక్ష తదితర మైనవి ఉంటాయి. 3. రేడియోలాజికల్ పరీక్ష: ఈ యొక్క పరీక్షలో కడుపు మరియు కిడ్నీ సోనోగ్రాఫి ఇంకా చాతి యొక్క ఎక్స్-రే తదితర పరీక్షలు ఉంటాయ నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క చికిత్స నేప్రోటిక్ సిండ్రోమ్ చికిత్స లో ఆహార నియమములో కొన్ని విశేషమైన సవదనలు మరియు అవసరము ఉన్న మందులు వాడడము .అత్యంత ఉత్తమము . 1. ఆహారములో నియమాలు వాపు మరియు మూత్రము తక్కువగా వస్తుంటే రోగికి తక్కువ నీరు మరియు ఉప్పు తగించమని సలహా ఇస్తారు అధికశాతం పిల్లలో ప్రోటీన్లు సామాన్య మోతాదులో తీసుకోమని సలహా ఇస్తారు. సంక్రమణ కారణంగా నేప్రోటిక్ సిండ్రోమ్ లో వాపు తరచుగా రావచ్చు అందుకే సంక్రమణ రాకుండా నివారించడము ఉత్తమము 2. సంక్రమణ యొక్క చికిత్స నివారణ అ నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క విశేషమైన చికిత్స మొదలు పెట్టకుముందు పిల్లలలో ఎలాంటి సంక్రమణ సమస్య ఉన్నదో అలంటి సంక్రమణ నివారించడము చాలా అవసరము అ నేప్రోటిక్ సిండ్రోమ్ వ్యాధి ఉన్న పిల్లలకు జలుబు,జ్వరము ,ఇంకా తదితర సంక్రమణ కలిగే అవకాశాలు అదికంగా ఉంటుంది . చికిత్స సమయములో సంక్రమణ పెరగవచ్చు అందుకే చికిత్స సంక్రమణ కలుగ కుండా దీని నిమిత్తము త్వరగా అత్యవసర చికిత్స చేయడం అవసరము . 3. మందుల ద్వారా చికిత్స సామాన్యమైన చికిత్స వాపును త్వరగా నియంత్రించడానికి మూత్రము అధిక మోతాదులో రావాలి అని ఈ మందులు డైయురిటిక్స్ లాంటివి ఇవ్వబడుతుంది . విశేషమైన చికిత్స నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క సఫలమైన చికిత్స కు అధికముగా ప్రచారములో ప్రభావితమైన మందు ప్రేడినిసోలోన్ స్తేరైడ్ వర్గము యొక్క మందు .కొంత మంది రోగులలో పేడినిస్తోలోన్ మందు తో ఎలాంటి ఫలితాలు ఉండక పోతే ఇతర మందుల ప్రయోగము చేయడబతుంది. ప్రేడినిసోలోన్ ఏమి పని చేస్తుంది ఎలా చేస్తుంది ప్రేడినిసోలోన్ మూత్రం ద్వారా పోవుచున్న ప్రోటీన్ల ను ఆపడానికి పనిచేయు మందు . ఈ మందు ఎంత మోతాదులో ఇవ్వాలో అది పిల్లల యొక్క బరువు మరియు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి నిర్ణయిస్తారు ఈ మందు ఎంత కాలము వరకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇది విశేషమైన డాక్టర్ ద్వారానిర్ణయింప బడుతుంది. ఈ మందు తీసుకుంటున్న అధిక రోగిలలో ఒకటి నుంచి నలుగు వారాలలోపు మూత్రము లో ప్రోటీన్లు పోవడము ఆగిపోతుంది నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క చికిత్స లో ప్రేడినిసోలోన్ అన్నిటి కన్నా అధికముగా ఉపయోగించబడే మరియు ప్రభవంతమైన మందు తక్కువ సమయములో కనబడే దుప్రభావాలు /విపరీతమైన ప్రభావము ప్రేడినిసోలోన్ మందు యొక్కదుప్రభావాలు ఎలా ఉంటాయి ప్రేడినిసోలోన్ నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క చికిత్స లో ముఖ్యమైన మందు కానీ ఈ మందు వలన కొన్ని దుప్రభావాలు కూడా ఉన్నాయి. ఈయొక్క దుప్రభావాలు తగ్గించడానికి ఈ మందును డాక్టర్ యొక్క సలహా మేరకు తీసుకోవాలి. అధికముగా ఆకలి వేయడము బరువు పెరగడము, అసిడిటి రావడము, (కడుపు లేదా చాతి లో మంటగా అనిపించడము) స్వభావములో చికాకుగా అనిపించడము సంక్రమణ కలుగే అవకాశాలు అధికము అవడము రక్తపోటు అధికమవడము మరియు శరీరము లో అరుపులు అధికమవ్వడము. ఎక్కువ సమయములో కనబడే దుప్రభావాలు / విపరీతమైన ప్రభావంతమైన పిల్లలలో అభివృద్ధి తగ్గడము (పొడవు తక్కువగా పెరగడము ) ఎముకల బలహీనత . చర్మాన్ని లాగినపుడు వదులుగా అనిపించడము కడుపు క్రింద భాగాములో గులాబీ రంగు గీతలు పడడము ముఖ్య ముగా శుక్లాలు (Cataract) కలిగే భయము కావడము ఇలాంటివి. ఇంత అధికముగా ప్రబావము గల ప్రేడినిసోలోన్ మందు తీసుకోవడము పిల్లలకు లాభదాయకమా అవును సామాన్యంగా ఈ మందు అధిక మోతాదులో చాలాసమయము వరకు తీసుకుంటే అప్పుడు మందు యొక్క విపరీతమైన దుష్ప్రభావాలూ కలగడానికి భయము కలదు. డాక్టర్ సలహా మేరకు సూచించిన మోతాదులో మరియు తక్కువ సమయము వరకు ఉంటుంది. ఎప్పుడైతే ఈ మందు డాక్టర్ యొక్క సూచనల మేరకు తీసుకుంటారో అప్పుడు గంభీరమైన మరియు పరీతమైన దుష్ప్రభావాలూ ప్రారంభములోనే నిర్ధారణ అవడము చేత త్వరగా చికిత్స లో అవసరమైన పరివర్తనల ద్వారానివారించవచ్చు . కానీ రోగిత్రి ఎదురయ్యే సమస్యలు మరియు ప్రమాదముల ముందు మందు ద్వారా కలిగే విపరీతమైన దుప్రభావాలూ తక్కువ హానికరము. అందువలన అధిక లాభము కొరకు కొన్ని విపరీతమైన దుప్రభావాలనూ స్వికరిచడము కంటే వేరే దారి లేదు డాక్టర్ యొక్క సంరక్షణలో సరైన చికిత్స తీసుకోవడము ద్వారా ప్రేడినిసోలోన్ యొక్క విపరీతమైన దుప్రభావాలనూ తగ్గించవచ్చును. అధిక శాతం పిల్లలలో చికిత్స చేసిన మూడు లేక నాలుగో వారము మూత్రములో ప్రోటీన్లు పోవడము తగ్గిన వాపు లాంటి సమస్యలు అలానే ఎందుకు ఉంటాయి ప్రేడినిసోలోన్ తీసుకోవడం ద్వారా ఆకలి పెరుగుతుంది అధికముగా ఆహారము తీసుకోవడము ద్వారా శరీరములో కొవ్వు పేరుకుపోతుంది అందు కారణమ చేత మూడు లేక నాలుగు వారాలలో వాపు వచ్చినట్టు కనబడుతుంది. వ్యాధి యొక్కవాపు మరియు కొవ్వు సేకరించబడిన వాపు ఎలా ఉంటుంది ఈ రెండింటి మద్యలో తేడ ఎలా తెలుసుకోవచ్చు నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క వ్యాధి పెరగడానికి కారణం అయిన వాపు కంటి క్రింద మరియు ముఖము పైన కనబడుతుంది ,ఇది ఉదయము అధికముగా ఉంటుంది మరియు సాయంకాలములో తగ్గుతుంది దీనికి తోడుగా కాళ్ల లో కూడా వాపు కనబడుతుంది ఎల్లప్పుడూ ముఖము, భుజాలు, మరియు కడుపు పైన కొవ్వు సేకరించబడుతుంది ,అందుకే అక్కడ వాపు లాగా అనిపిస్తుంది . ఈ యొక్క వాపు ప్రభావము దినమంతా సమానాంతరంగా కనబడుతుంది. కంటి, పైన మరియు కాళ్ళ పైన వాపు ఉండక పోవడము ముఖము యొక్క వాపు ఉదయము ఎక్కువగా మరియు సాయంత్రము తగ్గడము ఈ లక్షణాలు నేప్రోటిక్ సిండ్రోమ్ వల్ల కాదు ఇది చూడతగ్గవి. పిల్లలలో కనబడే ఈ వ్యాధిలో కిడ్నీ చెడిపోయే ప్రమాదము తక్కువగా ఉంటుంది నేప్రోటిక్ సిండ్రోమ్ కారణము చేత కలుగే వాపు మరియు మందు యొక్క దుప్రభావము కారణముగా కొవ్వు సేకరించబడిన వాపు మద్య తేడా కనుక్కోవడము ఎందుకు ముఖ్యము నేప్రోటిక్ సిండ్రోమ్ యొక్క కారణముగా వాపు ఉంటే మందు యొక్క మోతాదు పెంచడమో లేదా మార్పును మరియు తోడుగా మూత్రము పెంచే మందులూ అవసరము పడుతుంది కొవ్వు సేకరించబడటానికి కారణమైన వాపు లాంటిదిగా అనిపించడము ప్రేడినిసోలోన్ మందు ద్వారా నియమించిన చికిత్స ప్రభావము చూపిస్తుంది , దీని ద్వారా వ్యాధి పై నియంత్రణ లేక పోతే వ్యాధి అధికమవడం లాంటి చింత అవసరము లేదు, సమయముతో పాటుగా ప్రేడినిసోలోన్ మందు యొక్క మోతాదు తక్కువ కావడముతో కొన్ని వారముల తరవాత వాపు కూడా మెల్ల మెల్లగా తగ్గుతుంది మరల సాధారణ స్థితికి చేరుతుంది. మందుల ద్వారావచ్చిన వాపు ను తగ్గించడానికి ఎలాంటి మందులు వాడినా కుడా రోగికి ప్రమాదకరము కావచ్చు. ప్రేడినిసోలోన్ మందు యొక్క చికిత్స విజయవంతం కాలేకపోతే అప్పుడు ఉపయోగించబడే ఇతర మందులు ఏమిటి నేప్రోటిక్ సిండ్రోమ్ లో ఉపయోగించే ఇతర మందులలో లివమిజోల్ , మీతైల్ ప్రేడినిసోలోన్, సైక్లో పాస్ఫమైడ్, స్బోస్త్సిన్, ఎం.ఎం.ఎఫ్ (M.M.F)ఇతర మందులు . నేప్రోటిక్ సిండ్రోమ్ లో వ్యాధి ద్వారామరియు మందుల కారణంగా కనపడే వాపు మద్య వ్యత్యాసం గమనించడము చాలా అవసరము నేప్రోటిక్ సిండ్రోమ్ లో పిల్లలకు కిడ్నీబైయోప్సి ఎప్పుడు చేయబడుతుంది ? నేప్రోటిక్ సిండ్రోమ్ లో కిడ్నీ బైయోప్సి యొక్క అవసరము క్రింద వ్రాయబడిన పరిస్థితిలో చేయబడుతుంది: వ్యాధి యొక్క నియంత్రణ కొరకు అధిక మోతాదులో చాలా సమయము వరకు ప్రేడినిసోలోన్ మందు తీసుకోవలసి వాస్తే - ప్రేడినిసోలోన్ తీసుకున్న తర్వాత కూడా వ్యాధి నియంత్రణ కాక పోవడము. అదికశాతము పిల్లలకు నేప్రోటిక్ సిండ్రోమ్ రావడానికి బాధ్యతాయుతమైన వ్యాధి మినిమల్ చేంజ్ డిసిసస్ (Minimal Change Disease) అవుతుంది పిల్లలో ఐతే ఈవ్యాధి మినిమల్ చేంజ్ డిసిసస్ కారణంగా కాక పోతే. ఎలా అంటే (మూత్రము లో రక్తకణాలు ల పరిస్థితి,రక్తములో క్రియాటినిన్ యొక్క మోతాదు అధికము అవడము కొమ్బిమేంట్చ-ఇ -3 యొక మోతాదు అధికము అవడము మరియు ఇతర కారణాలు ) ఇలాంటి సమయములో కిడ్నీ బైయోప్సి చేయడము అవసరము అవుతుంది ఎప్పుడైతే ఈ వ్యాధివయస్సులో ఉన్నవారికి (పెద్దవారికి ) వస్తుందో అప్పుడు సాధారణంగా చికిత్స, కిడ్నీ బైయోప్సి తరవాత చేయబడుతుంది. నెప్రోటిక్ సిండ్రోమ్ యొక్కచికిత్సనియంత్రణనెప్రోలజిస్ట్ ఏరీతిగా చేస్తారు నెప్రోటిక్ సిండ్రోమ్ యొక్క చికిత్సలో సరి అయిన నియంత్రణ కొరకు మంచి వైద్య నిపుణుడు (డాక్టర్) యొక్క నిర్ధారణ చాలాఅవసరము ఈ యొక్క పరీక్షలో సంక్రమణ యొక్క ప్రభావము,రక్తపోటు బరువు ,మూత్రము లో ప్రోటీన్ల మోతాదు మరియు అవసరనుసారంగా రక్త పరీక్షలు చేయబడుతాయి . ఈ యొక్క సమాచారమును ఆధారముగా చేసుకొని డాక్టర్ ద్వారా మందులలో అవసరమైన మార్పులు చేయబడుతుంది. నెప్రోటిక్ సిండ్రోమ్ ఎప్పుడు నయము అవుతుంది సరిఅయిన చికిత్సతో పిల్లల మూత్రము నుండి అల్బుమిన్ పోవడము ఆగిపోతుంది మరియు ఈ వ్యాధి కొంత సమయానికే నియంత్రణలోకి వస్తుంది కానీ కొంత సమయము తరవాత దాదాపు అందరి పిల్లలలో వాపు మరల కనబడుతుంది ఇలాంటి పరిస్థితిలో మళ్లి చికిత్స చేయలిసివస్తుంది .ఏ రీతిగా వయస్సు పెరుగుతుందో అదే రీతిగా మెల్ల మెల్లగా వ్యాధిపునరావృతం అయ్యే ప్రక్రియ తగ్గుతుంది . 11 నుండి 14 సంవత్సరాల వయస్సు తర్వాత అధికశాతం పిల్లలలో ఈ వ్యాధిపూర్తిగా నయము అవుతుంది. చాలా సమయము- సంవత్సరాల వరకు కలిగే ఈ వ్యాధి వయస్సు పెరిగిన కొలది పూర్తిగా నయము అవుతుంది