తట్టు పూత మారు పేరు రూబెల్లా, దీనికి కారణ జీవి వైరస్ లక్షణాలు తట్టు అనే జ్వరం తీవ్రంగా వ్యాప్తి చెందే శ్వాసకోశాల ఇన్ఫెక్షన్ ఫ్లూ వంటి లక్షణాలు మరియు దగ్గు, ఎర్రబడి నీరు కారుతున్నటు వంటి కళ్ళు, కారుతున్న ముక్కు వంటి లక్షణాలు కూడా కనబడవచ్చు నోటి లోపలి భాగంలో ఎర్రటి గుండ్రటి మచ్చలు వాటి మధ్య భాగం నీలం తెలుపు కలిపినట్టు వుండడం వ్యాప్తి చెందడం తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ తట్టు సూక్ష్మజీవి (వైరస్) దగ్గు, తుమ్ములు వ్యాధిగ్రస్ధులకు దగ్గరగా మెసలడం వ్యాధిగ్రస్ధుల ముక్కు, గొంతుల స్రావాలు నేరుగా చేతులతో ముట్టుకొనడం మూలాన వ్యాప్తి చెందుతుంది ఈ క్రిములు వ్యాధిని వ్యాపించే శక్తి కలిగి 2 గంటల వరకూ గాలిలో జీవించి వుంటాయి వ్యాధిగ్రస్ధులైన వారు వ్యాధి లక్షణాలు కనపడే 4 రోజుల ముందు, లక్షణాలు బయటపడిన 4 రోజుల తరువాత కూడా వ్యాధిని వ్యాపింపచేసే స్ధితి లేదా శక్తి కలిగి ఉంటారు ఆచరించ గలిగిన సాధారణ చిట్కాలు వైద్యుల సలహా మేరకు టీకాలు వేయించుకోవడం పౌష్ఠికాహార లోపం వున్న పసి పిల్లలలో ఇది ప్రాణాంతక జబ్బుకావచ్చు ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు