చిన్న పిల్లల్లో అతిసారవ్యాధి తరువాత, తరచూ వచ్చి ప్రాణాంతకంగా మారే జబ్బు. ఇది ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం 5 సం.లలోపు పిల్లలకి సంక్రమిస్తుంది. పోషకాహార లోపం, విటమిన్ ఎ లోపం, పూర్తి కోర్సు టీకాలు ఇవ్వకపోవడం, చిన్న పిల్లల్ని చలికి, వర్షానికి తడవనివ్వడం ముఖ్య కారణాలు. కారక జీవులు: బాక్టీరియా మరియు ఫ్లూ సంబంధిత వైరస్ లు వ్యాపించే సమయం: ఆగస్టు నుండి నవంబర్ వరకు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు: పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. ఇతర పి.హెచ్.సి. సిబ్బందికి సహాయం అందించాలి. ప్రజలందరికీ సమాచారం, ఆరోగ్య విద్య అందించడంలో తోడ్పడాలి. పిల్లల్ని నీళ్ళలో, వర్షంలో, చలిలో ఆడుకోకుండా, తిరగకుండా ఉండేటట్లు తల్లితండ్రులకి అవగాహన ఏర్పరచాలి. వ్యాధి లక్షణాలు: జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో కష్టం, నీరసించిపోవడం. వ్యాధిని సరైన సమయంలో గుర్తించి యాంటిబయాటిక్స్, మందులు, ఆవిరి పట్టడం వంటివి డాక్టరు సూచనపై తల్లిదండ్రులు సరిగా అమలుపరిచేటట్లు సహాయం చేయాలి. పిల్లలు బావిలో దూకి ఈదడం, నీళ్ళలో నానడం, ఇతరులతో ఆడడం, ఆరుబయట చలిగాలికి ఎదురుపడడం వంటివి నివారించాలి. అవసరమైతే స్పెషలిస్టు సలహా, సేవ ఏర్పాటు చేయాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు