చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి (Varicella-zoster). లక్షణాలు ముఖం, వీపు, ఛాతీ భాగములో దురదతో కూడిన ఎఱ్ఱగ వచ్చు చర్మవ్యాధి. నీటితో కూడిన బొబ్బలు వస్తాయి. ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసము, ఆకలి తగ్గుట, తేలికపాటి కడుపునొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎలా వ్యాపిస్తుంది చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన; వారు తుమ్మినప్పుడు - దగ్గినప్పుడు - వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించి - ఈ జబ్బు వస్తుంది. ఇది ఒకరినుండి ఇంకోకరికి సోకే అంటువ్యాధి. చర్మముపై లక్షణాలు కనపడక ముందు 2 రోజులనుండి - దద్దుర్లు పూర్తిగమాని, మచ్చలుగా తయారయ్యేంతవరకు ఈ క్రిములు ఆరోగ్యవంతులకు సోకే అవకాశం వుంటుంది. చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది. చిన్నపిల్లల సంరక్షణ సంస్థలు, పాఠశాలలు, మురికి వాడలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు, చిట్లించరాదు. వీలైనంతవరకు పిల్లలకు గోళ్ళు లేకుండా చేయాలి, రాత్రులలో- తెలియకుండా గీచుకోకుండునట్లు - చేతులకు శుభ్రమైన గుడ్డకాని, గ్లౌజులుకాని తొడగాలి. పిల్లలకు ఈ జాగ్రత్త నేర్పించాలి, చెప్పాలి. వీలైనంతవరకు చల్లని నీటితో/గోరువెచ్చని నీటితో స్నానము చేయించిన దురదలు కాస్త తగ్గుతాయి. కాలమిన్ లోషన్ తో చర్మముపై పూత దురదను కాస్త తగ్గిస్తుంది. జ్వరము, దగ్గు అధికంగా వున్నా, డాక్టరును సంప్రదించి వైద్యం చేయించడం అవసరం. ఆస్పిరిక్ లాంటి మందు వాడరాదు. సులభంగా జీర్ణమగు అహార పధార్దాలు, ద్రవపదార్దాలు తీసుకోవాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి. వాడినబట్టలను - వేడినీళ్ళతో శుభ్రపరచాలి. ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. నివారణ చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయించుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కలిగే చర్యలు చేపట్టాలి. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు