ఇది బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వలన వస్తుంది. ఈ వ్యాధికి గురయ్యే ముఖ్య భాగాలు ముఖం, గొంతు. ఇది సాధారణంగా రెండు సం. లోపల పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధితో ఉన్న పిల్లలు తెరలు తెరలుగా, పక్షి కూతవలె బెదురుగొలుపుతూ శ్వాస తీసుకుంటారు. కారణాలు బ్యాక్టీరియా - బోర్డెటెల్లా పెర్ట్యూసిన్ వ్యాప్తి వ్యాధిగ్రస్ధులు తుమ్మినప్పుడు, దగ్గినపుడు తుంపర్ల (లాలాజలం) ద్వారా వ్యాపిస్తుంది. మరియు ముక్కు చీమిడి ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. లక్షణాలు సాధారణంగా వ్యాధి లక్షణాలు. వ్యాధి సంక్రమించిన 7 నుండి 17 రోజులు తర్వాత ప్రారంభమవుతాయి. సాధారణంగా 2 సం. లోపు పిల్లల్లో కన్పిస్తుంది. ఈ లక్షణాలు 6 వారాల లోపు తగ్గుతాయి. ఈ వ్యాధి 3 దశలుగా విభజింపబడింది. మొదటి దశ - ముక్కు నీరు, కన్నీరు కారటం, ఆకలి తగ్గుట, నీరసంగా ఉండటం, రాత్రి పూట దగ్గు మరియు తుమ్ములు రెండవ దశ - తెరలు తెరలుగా దగ్గుతో పాటు పక్షి వలె శ్వాస తీసుకొనుట. మూడవ దశ - ఇది నయమయ్యే దశ ఇది నాలుగవ వారం తర్వాత మొదలవుతుంది. ఈ దశలో దగ్గు ఉంటుంది. కానీ తీవ్రంగా ఉండదు. ఈ వ్యాధి పెద్దల్లో వస్తే 2 వారాల లోపు తగ్గుతుంది. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు