విద్యుత్ఘాతము ఈ విధమైన ఘాతాన్ని గుర్తించడం తేలిక ఎందుకంటే రోగి కరెంట్ తీగల ప్రక్కన లేదా విద్యుత్పరికరాల ప్రక్కన పడి ఉంటారు చికిత్స రోగిని ముట్టుకునే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేసే విషయం మరచిపోకూడదు. రోగికి శ్వాస ఆడుతుంటే కోలుకునే స్థితి లో పడుకోబెట్టాలి. రోగికి శ్వాస ఆగిపోయినట్టైతే వంటనే నొటి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, గుండె మర్దన మొదలు పెట్టాలి. రోగికి అప్పడే సృహ తప్పినట్టైతే నీటి నుంచి తొలగించి కోలుకునేటట్టు పడుకోబెట్టాలి. (కాళ్ళు పైకి తల కాళ్ళ కన్నా క్రిందకు వుండే విధంగా చూడాలి) వైద్యుని, కొరకు ఆంబులెన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టాలి. నీటిలో మునిగిపోవడం చికిత్స శ్వాస మార్గాన్ని శుభ్రం చేయాలి. రోగికి శ్వాస ఆడుతున్నదా లేదా గమనించాలి గుండె కొట్టుకుంటునదా లేదా పరీక్షించాలి. శ్వాస ఆగిపోతే నొటి ద్వారా కృత్రిమ శ్వాస అందిచడం మొదలు పెట్టి, అదే సమయంలో గుండె మర్దన కూడా చేయాలి. రోగికి అప్పుడే సృహ తప్పినట్టైతే నీటి నుంచి బయటకు తీసిన వెంటనే కాళ్ళకంటే తల కొంచెం క్రిందకు వుండే విధంగా పడుకోబెట్టాలి. వైద్యునికొరకు లేదా ఆంబులెన్స్ కొరకు వెంటనే కబురు చేయాలి. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు