కొవిడ్-19 టీకా అందరికీ ఒకే సమయంలో ఇవ్వబడుతుందా? టీకాల లభ్యతను బట్టి ప్రాధాన్యం మేరకు టీకా కోసం తీవ ముప్పుగల వర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. తొలి బృందంలో ఆరోగ్య, ముందువరుస సిబ్బంది, 2వ బృందంలో 50 ఏళ్లు దాటిన వ్యక్తులు, 50 ఏళ్లలోపు ఇతర వ్యాధులుగలవారు ఉన్నారు. టీకా తప్పనిసరిగా తీసుకోవాలా? కొవిడ్-19 టీకా వేసుకోవడం స్వచ్చందమే. కానీ, స్వీయరక్షణ, వ్యాధి వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ పూర్తి మోతాదులో టీకా తీసుకోవడం మంచిది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తి కూడా టీకా తీసుకోవడం అవసరమా? అవసరమే. ఈ వ్యాధిని ఎదుర్కొనగల బలమైన రోగనిరోధక శక్తి పెంపొందడంలో టీకా తోద్బడుతుంది. కొవిడ్-19 వ్యాధి (నిర్జారిత/అనుమానిత) సోకిన వారికి టీకా ఇబ్దే వీలుందా? కొవిడ్-19 వ్యాధి నిర్ధారిత లేదా అనుమానితులవల్ల టీకా కేంద్రాల్లో ఆ వ్యాధిని ఇతరులకు వ్యాపింపజేసే ముప్పు ఉంటుంది. అందువల్ల అటువంటి వారు వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత 14 రోజుల వరకూ టీకాను వాయిదా వేసుకోవాలి. స్వల్ప వ్యవధిలో ప్రయోగ పరీక్షలు ప్రవేశపెట్టిన ఈ టీకా సురక్షితమేనా? టీకాల భద్రత, సామర్థ్యం ప్రాతిపదికగా సంబంధిత ప్రమాణాల నియంత్రణ సంస్థలు ఆమోదించిన తర్వాతనే దేశంలో టీకాలు ప్రవేశపెట్టబడతాయి. ఒకటికన్నా ఎక్కువ టీకాలున్నపుడు ఏ టీకా వేయాలో ఎలా నిర్ణయిస్తారు? టీకాల తయారికి లైసెన్సు ఇచ్చేముందు నమూనా టీకాల భద్రత, సామర్థ్యంపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల సమాచారం మేరకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వాటిని నిశితంగా పరిశీలిస్తుంది. కాబట్టి లైసెన్స్ మంజూరైన కొవిడ్-19 టీకాలన్నీ సాపేక్షంగా భద్రత, సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే, తొలుత ఒక రకం, రెండోసారి మరొక రకం టీకాలను వాడకూడదు కాబట్టి పూర్తి మోతాదు కింద ఏదో ఒక రకాన్నే వినియోగిస్తారు. పేరు నమోదు సమయంలో ఫోటో గుర్తింపు అవసరమా? నమోదు చేసుకునే సమయంలో సమర్పించిన ఫోటో గుర్తింపు ధ్రువీకరణను టీకా వేసుకునేటపుడు తప్పక చూపాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రవేశపెట్టిన టీకా ఇతర దేశాల టీకాలతో పోలిస్తే సమర్ధమైనదేనా? అవును.. భారత్ టీకా ఇతర దేశాల టీకాలకన్నా సమర్థమైనడదే. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాతే వీటి భద్రత, సామర్థ్యం నిర్ధారించబడ్డాయి. నేను టీకాకు అర్హుడనని తెలిసేదెలా? అర్హులైన లబ్ధిదారులు ఏ టీకా కేంద్రంలో, ఏ రోజున, ఏ వేళకు టీకా వేయించుకోవాలో తెలుపుతూ వారి నమోదిత సెల్ నంబరుకు సంక్షిప్త సందేశం పంపబడుతుంది. లసన్టీదారుల నమోదు, టీకా విషయంలో అసౌకర్యం లేకుండా చూడటమే దీని ఉద్దేశం. టీకాకేంద్రం వద్దఫొటో గుర్తింపు చూపనివారికి టీకా ఇస్తారా? టీకా లబ్దిదారుల నమోదు, టీకా కేంద్రాల వద్ద తనిఖీ నిమిత్తం ఫొటో గుర్తింపు సమర్పణ తప్పనిసరి. ఆరోగ్యశాఖ వద్ద నమోదు చేసుకోకపోతే టీకా తీసుకోవడం వీలుకాదా? వీలుకాదు... టీకా కోసం లబ్ధిదారుల నమోదు తప్పనిసరి. ఆ తర్వాత మాత్రమే టీకా కోసం వెళ్లాల్సిన ప్రదేశం, సమయం గురించి సమాచారం పంపబడుతుంది. అర్హులైన లబ్ధిదారుల నమోదుకు అవసరమైన పత్రాలేమిటి? నమోదు కోసం ఈ జాబితాలోని వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఏదైనా సమర్పించవచ్చు: ఆధార్ కార్డు; డైవింగ్ లైసెన్స్; కార్మిక మంత్రిత్వశాఖ జారీచేసిన ఆరోగ్యభీమా స్మార్ట్ కార్ట్) గ్రామీణ ఉపాధిహామీ జాబ్ కార్ట్ ఎంపి/ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్ట్; పాన్ కార్ట్; బ్యాంకు/తపాలా శాఖ పాస్బుక్; పాస్పోర్ట్; పెన్షన్ పత్రం; కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ/ప్రభుత్వరంగ/పబ్లిక్ లిమిటెడ్ కంపెలు ఇచ్చే ఫొటో గుర్తింపు కార్డు; ఓటరు గుర్తింపు కార్ట్; ఎన్పిఆర్ కింద ఆర్జిఐ జారీ చేసే స్మార్ట్ కార్స్. టీకా తీసుకునే గడువు తేదీ గురించి లబ్ధిదారుకు ఎలా తెలుస్తుంది? ఆన్లైన్ నమోదు తర్వాత లబ్బిదారుల సెల్ నంబరుకు టీకాలిచ్చే గడువు తేదీ సమయం ప్రదేశం గురించి సంక్షిప్త సందేశం అందుతుంది. కేన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు మందులు వాడేవారు కొవిడ్-19 టీకా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు... ఒకటికన్నా ఎక్కువ ఇతర వ్యాధులున్నవారు కూడా కొవిడ్-19 టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటీబాడీస్ ఎప్పడు ఏర్పడతాయి? సాధారణంగా కొవిడ్-19 టీకా రెండో మోతాదు తీసుకున్న తర్వాత రెండు వారాలకు ఏంటీబాదీస్ స్థాయులు పెరుగుతాయి. టీకా కేంద్రం వద్ద తీసుకోవాల్సిన నివారణ! ముందు జాగ్రత్త చర్యలేమైనా ఉన్నాయా? కొవిడ్-19 టీకా వేశాక కనీసం 50 నిమిషాలు అక్కడే విశ్రాంతి తీసుకోవాలి. ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం అనిపిస్తే సమీపంలోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి.