బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికార వర్గం (ఐఆర్ డిఎ) యొక్క వినియోగదారుల వ్యవహారాల విభాగం, ఇంటిగ్రేటెడ్ గ్రీవన్స్ మేజ్ మెంట్ సిస్టమ్ (ఐజిఎమ్ఎస్) ను ప్రవేశ పెట్టింది, ఇది ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదుచేసుకోవడం మరియు దాని స్థితిని గమనించే ఒక సాధనం. మీరు మీ సమస్యని ముందుగా బీమా కంపెనీతో నమోదు చేసుకోవాలి మరియు కంపెనీ ద్వారా దానిని పరిష్కరించిన పద్దతి మీకు సంతృప్తిని కలిగించక పోతే, దానిని ఐజిఎమ్ఎస్ ద్వారా ఐఆర్ డిఎ కి తీసుకు పోవచ్చును, దీనికి మీరు http://igms.irda.gov.in/ కి లాగ్ ఆన్ అవ్వాలి. మీరు కనుక బీమా కంపెనీ వారి ఫిర్యాఫు పరిష్కార వ్యవస్థను (గ్రీవెన్స్ సిస్టమ్ ) నేరుగా సంప్రదించ లేక పోతే, బీమా కంపెనీతో మీ సమస్యని నమోదు చేసుకునే వెసులుబాటును కూడా ఐజిఎమ్ఎస్ పొందు పరుస్తుంది. ఐజిఎమ్ఎస్ ద్వారా (అంటే వెబ్ ) మీ సమస్యని నమోదు చేసుకొవడానికి పలు రకాల ఇతర విధానాలు ఉన్నాయి ఇ – మెయిల్ ద్వారా (complaints@irda.gov.in), లేఖ వ్రాయడం ద్వారా (వినియోగ దారుల వ్యవహారాల విభాగం, బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అధికార వర్గం, 3వ అంతస్తు, పరిశ్రమ భవన్ , బషీర్ బాగ్ , హైదరాబాద్ – 4 కి మీ లేఖని పంపండి) లేదా ఐఆర్ డిఎ కాల్ సెంటర్ ని టోల్ ప్రీ నంబరు 155255 కి ఫోన్ లో సంప్రదించండి, వీటన్నిటి ద్వారా ఐఆర్ డిఎ ఎలాంటి ఖర్చు లేకుండా బీమా కంపెనీల పై మీకున్న ఫిర్యాదులను నమోదు చేస్తుంది. అలాగే దాని స్థితిని గమనించడానికి సహకరిస్తుంది. కాల్ అధారంగా ఫిర్యాదుల పత్రాన్ని నింపడంలో కాల్ సెంటర్ , మీకు సహకరిస్తుంది. అవసర మున్నప్పుడల్లా, దీనికి బీమా కంపెనీ యొక్క చిరునామా, టెలిఫోను నంబరు, వెబ్ సైట్ వివరాలు, ఇ-మెయిల్ ఐడి మొదలయిన వివరాలు మీకు అందజేయడం ద్వారా బీమా కంపెనీ లతో నేరుగా ఫిర్యాదులను దాఖలు చేసే సౌకర్యాన్ని ఇది కల్పిస్తుంది. ఐఆర్ డిఎ కాల్ సెంటర్ భావి వినియోగ దారులకు మరియు పాలసీ దారులకు సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది, 12 గంటలు 6 రోజులు సేవను ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సోమవారం నుండి శనివారం వరకూ హింది, ఇంగ్లీషు మరియు పలు భారతీయ భాషలలో అందజేయ బడుతుంది. ఐ ఆర్ డిఎ ఫిర్యాదు నమోదు చేయబడితే, బీమా కంపెనీతో ఈ విషయం లేవనెత్తి పరిష్కారం దొరకేలా చేయడానికి వీలుకలిగిస్తుంది. ఫిర్యాదు పరిష్కరించడానికి కంపెనీకి 15 రోజుల సమయం ఇవ్వబడుతుంది అవసరమైతే, ఐఆర్ డిఎ విచారణ జరుపుతుంది మరియు కూపీ లాగుతుంది. తదుపరి, వర్తించిన చోట, రిడ్రెసల్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రూల్స్ , 1998 నియమాల ప్రకారం బీమా లోక్ పాల్ ని సంప్రదించమని ఫిర్యాదు దారునికి ఐ ఆర్ డి ఎ సలహా ఇస్తుంది. నిరాకరణ ఈ చిన్న పుస్తకం మీరు సాధారణ సమాచారాన్ని మాత్రమే అందజేయాలని ఉద్దేశింప బడింది మరియు ఇది సంపూర్ణమైనది కాదు. ఇదొక బోధన చేయాలని తీసుకున్న చొరవ మాత్రమే మరియు మీకు న్యాయ పరమైన సలహా ఇవ్వడానికి కాదు. ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.