ఈ చిన్న పుస్తకం గురించి వివరణ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారవర్గం (ఐఆర్‌డిఎ) వారి ద్వారా ఈ చిన్న పుస్తకం జీవిత బీమా పై ఒక మార్గదర్శినిగా రూపొందించబడినది మరియు ఇది సాధారణ సమాచారం మాత్రమే అందజేస్తుంది. ఇందులో ఇవ్వబడిన. సమాచారం ఏదీ కూడా ఒక బీమా పాలసీ యొక్క నియమాలు మరియు షరతులను మార్చవు లేదా అధిగమించవు. ఒక పాలసీ గురించిన నిర్దిష్టమైన సమాచారం కొరకు లేదా మరే ఇతర అదనపు సమాచారం కొరకు ఒక లైసెన్సు పొందిన ఏజెంటును లేదా (బోకరును లేదా ఐఆర్డిఎతో నమోదు చేయబడిన ఒక బీమా కంపెనీని సంప్రదించగలరు. జీవిత బీమా జ్లీవిత బీమా అనేది మానవ జీవితంతో ముడివడియున్న సంభావ్యత: అనగా మరణం, అంగవైకల్యం, ద్భుర్టటన, ఉద్యోగ విరమణ మొదలయినవంటి వాటికి ఆర్థికపరమైన. సంరక్షణనిచ్చే సాధనం. స్వాభావికమైన మరియు ద్యుర్టటన కారణాల వల్ల మరణం మరియు అంగవైకల్యం సంభవించే అపాయలకు మానవ జీవితం లోబడి యుంటుంది. మానవ జీవితం ముగిస్తే లేదా ఒక మనిషి చనిపోవడం వలన, లేదా తాత్కాలికంగా అంగవైకల్యాన్ని పొందితే కుటుంబానికి ఆదాయం నష్టపోవడం జరుగుతుంది. మానవ జీవితానికి విలువకట్టలేకపోయినప్పటికీ, భావి సంవత్సరాలలో నష్టపోగల ఆదాయంపై ఆధారపడి డబ్బు రూపంలో ఆ విలువ మొత్తాన్ని నిర్ధారించవచ్చును. అందువల్ల, జీవిత బీమా విషయంలో, బీమా చేయబడే మొత్తం (నష్టం జరిగితే చెల్లింంబడుతుందని హామీ ఇవ్వబడే మొత్తం) ఒక లాభంగా పరిగణించడం జరుగుతుంది. పాలసీ నడుస్తున్న వ్యవధిలో జీవిత బీమా చేయబడిన వ్యక్తి మరణించినట్లయితే, లేదా ఒక ద్యుర్టటన కారణంగా, అంగవైకల్యం పొందినట్లయితే, ఖచ్చితమైన మొత్తాన్ని జీవిత బీమా పధకాలు అంజేస్తాయి. మీరు జీవిత బీమాను ఎందుకు కొసుగోలువేయాలి : మనందరూ ఈ క్రింది అపాయాలను ఎదుర్కొంటాము- మరి తొందరగా మరణించడం మరీ ఎక్కువ కాలం జీవించడం జీవిత బీమా ఈ క్రింది కారణాల వల్ల అవసరం: మీరు అకస్మాత్తుగా మరణిస్తే మీ కుటుంబానికి కొద్దోగొప్పో ఆర్ధికపరమైన మద్దతు పొందగలదని నిర్ధారించుకోవడానికి. మీ పిల్లల విద్యా మరియు ఇతర అవసరాలకు డబ్బు ఖర్చుచేయడానికి . భవిష్యత్తు కొరకు ఒక సేవింగ్స్ ప్లాన్‌ను కలిగియుండడం, దాంతో పదవీ విరమణ. తరువాత నిరంతరం ఆదాయం లభించే మార్గం మీకుండేలా చూసుకోవడానికి. తీవ్రమైన రుగ్మత లేదా ద్యుర్ణటన కారణంగా మీ రాబడి తగ్గిపోతే, మీకు అదనంగా ఆదాయం లఅభిస్తున్నదని నిర్ధారించుకోవడానికి. ఇతర ఆర్థిక పరమైన సంభావ్యత. పరిస్థితులను ఎదురొ; స్య వడానికి వురియు జీవన. సరళి అమరాలకు డు ఉండేలా చూసుకో వడానికి. జీవిత బీమా ఎపరికి అవసరం అవుతుంది: ప్రాథమికంగా చూస్తే . కుటుంబాన్ని పోషించవలసిన వారు మరియు ఆదాయాన్ని సంపాదించేవారికి జీవిత బీవూ అవసరమవుతుంది. కుటుంబానికి వారు చేసే దోహదానికి ఉన్న ఆర్థిక విలువను దృష్టిలో పెట్టుకుని, గృహిణులకు కూడా జీవిత బీమా ఆచ్చాదన అవసరం అవుతుంది. చివరికి పిల్లలకు కూడా వారి భావి ఆదాయ సంభావ్యత ఆపాయంలో ఉంటుంది కనుక వారికి కూడా జీవిత బీమా అవసరమే. జీవిత బీమా ఎంత కావాల్సి ఉంటుంది: మీకు అవసరమయిన జీవిత బీమా ఆచ్చాదన పలు అంశాలపైన ఆధారపడి ఉంటుంది, అవేంటంటే. మీపై ఆధారపడే వాళ్ళెంతమంది ఉన్నారు. మీకేవైనా అప్పులు మరియు కుదవపెట్టడాలు ఉన్నాయా. మీ కుటుంబానికి ఏరకం జీవనవిధానాన్ని మీరు సమకూర్చాలనుకుంటు-న్నారు. మీ పిల్లల చదువుకు మీకెంత డబ్బు అవసరమవుతుంది. మీ పెట్టుబడి అవసరాలేమిటి. మీరంతవరకూ భరించగలరు. మీ బీమా అవసరాలను అర్ధం చేసుకునేందుకు మరియు సరైన ఆచ్చాదన గురించి మీకు. సలహా చెప్పడానికి మీరొక బీమా ఏజెంటు లేదా బోకరు సహాయాన్ని తీసుకోవాలి. జీవిత బీమా పాలసీ రకాలు టెరమ్ బీమా టెరమ్ బీమాతో నిర్హిష్టమైన సమయానికి సంరక్షణ. పొందడానికి మీరు ఎంమకోవచ్చును. మరణం లేదా మొత్తంగా మరియు శాశ్వతంగా అంగవైకల్యం సంభవిస్తే (ఆప్రయోజనం అందజూపబడిత్రే మీపై ఆధారపడిన. వారికి డబ్బు వెల్లింంబడుతుంది. టెరమ్ బీమాలో సాధారణంగా, బీమా చేయబడిన. వ్యక్తి ఆ వ్యవధి పూర్తయేంతవరకూ జీవించి ఉంటే ప్రయోజనం ఏది చెల్లింంబడదు. వోల్లైన్ ఇన్న్యూరెన్స్ హోల్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో, జీవితాంతం సంరక్షణ మీకు హామీ ఇవ్వబడుతుంది. హోల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ మరణ ప్రయోజనాన్ని వెల్లిస్తుంది, దాంతో మీ మరణం తరువాత సంభవించే ఆర్థికపరమైన నష్టానికి విరుద్ధంగా మీ కుటుంబం పరిరక్షింపబడుతుందని మీరు నిశ్చితంగా ఉండవచ్చును. మీ వారసులకు మీ వురణానంతరం చెందే విధంగా ఒక అస్తిని రూపొందించడానికి ఇదొక చక్కని సాధనం. ఎండోమిట్ పాలనీ ఒక ఎండోమెంట్ పాలసీ అనేది సేవింగ్‌కు లింకు చేయబడిన పాలసి . దీనికి నిర్దిష్టమైన పరిపక్వత చెందే తేదీ ఉంటుంది. మరణం లేదా అంగవైకల్యం లాంటి. దురదష్టకర సంఘటన పాలసీ వ్యవధిలో మీకు జరిగితే బీమా చేయబడిన. మొత్తం మీ ప్రయోజనదారులకు లభిస్తుంది. వ్యవధి పూర్తయేంతవరకూ మీరు జీవించి ఉంటే, పాలసీ పరిపక్వత చెందిన మీదట డబ్బు మీకు చెల్లింంబడుతుంది. మనీ బ్యాక్ ప్లానులు లేదా క్యాష్ బ్యాక్ ప్లానులు ఈ ప్లానుల క్రింద బిమా వేయబడిన మొత్తంలో కొంత శాతం మొత్తం బీమా చేయబడిన. వ్యక్తికి నిర్దిష్టమైన. సమయాలలో సర్వైవల్ ప్రయోజనంగా చెల్లించబడుతుంది. వ్యవధి ముగిసిన తరువాత మిగిలిన శేష మొత్తం పరిపక్వత విలువగా చెల్లింపబపడుతుంది. పాలసీ వ్యవధిలో బీమా చేయబడిన మొత్తానికి చెల్లింపబడిన సరై వ్రవల్ ప్రయోజనాలతో సంబంధం లేకుండా, జీవిత బీమా సంరక్షణ కల్పించబడుతుంది. వీల్ణలకు పాలనీలు ఈ రకం పాలసీలు తల్లి లేదా తండ్రి/పిల్లల జీవితాలపై పిల్లల ప్రయోజనం కొరకు తీసుకోబడతాయి. జీవితంలో పిల్లలు పలు రకాల దశలను చేరుకున్నప్పడు తల్లిదండ్రులు నిధులను పొందేలా ఇలాంటి పాలసీ ద్వారా ప్లాను చేసుకోవచ్చును. కొన్ని బీ కంపెనీలు పాలసీ వ్యవధిలో తల్లిదండి/పతిపాదకుడు దురదష్టవశాత్తూ మరణిస్తే ప్రీమియమ్ని మాఫ్చేస్తారు. వీన్యుటీ (పెన్టల్స్ ప్లానులు ఉద్యోగి ఎవరైనా పదవీ విరమణ. చేస్తే అతను ఇంకెంతమాత్ర. జీతాన్ని పొందరు, కాని క్రమబద్ధంగా ఆదాయ అవసరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యువిటీ లాంటి వాటిని ఏకమొత్తంగా చెల్లించడం జరుగుతుం ది, వీటిని సత్వరంగా ఖర్చుచేయడం జరుగుతుంది లేదా తెలివిగా పెట్టుబడి పెట్టకపోవచ్చును, దిని ఫలితంగా తన పదవీ విరమణ తరువాత క్రమబద్ధంగా రాబడిని ఆ ఉద్యోగి పొందలేడు. అందువల్లనే. పెన్షన్ అనేది . పదవీ విరమణ తరువాత ఆదర్శవంతమైన. పద్ధతి, ఎందుకంటే, ప్రయోజనాలు క్రమబద్ధమైన ఆదాయ రూపంలో లభిస్తాయి కనుక. మనం సంపాదించే సమయంలో పదవీ విరమణ తరువాత సమయంలో సంరక్షణ లభించేలా క్రమపద్ధతిలో ఆదాయం వస్తున్నప్పుడు వృథ్యాష్యం కొరకు దాచిపెట్టడం మంచి తెలివైన పని. వధ్యాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికీ తప్పని సరిగా ఉండితీరాలి. రెండు రకాల ఏన్యుటీలున్నాయి (పెన్షన్ ప్లానులు). వొన్సువెంటనే లభించే వీన్వుటీ వెనువెంటనే లభింవే ఏన్యుటి విషయంలో, బీమా కంపెనీ నుండి ఏన్యుటీ చెల్లింపు వెను వెంటనే ప్రారంభమవుతుంది. వెనువెంటనే చెల్లించే ఏన్యుటీ కొనుగోలు ధర (ప్రీమియమ్) ఒక కిస్తీలో ఏకమొత్తంగా చెల్లించవలసి ఉంటుంది. డిఫర్డ్ ఏన్యుటి డిఫర్డ్ ఏన్యుటీ పాలసీ క్రింద, బీమా కంపెనీకి ఆ వ్యక్తి క్రమబద్ధంగా, నిహిత షయస్సు/ నిహిత తేదీ పరకూ, ప్రీమియమ్ చెల్లిస్తారు. ప్రీమియమ్ ఏకమొత్తంగా చెల్లించే అవకాశం కూడా ఉన్నది. వడ్డీతో బాటుగా ఫండ్ పెరగుతూ ఉంటుంది. నిర్దిష్టమైన తేదీన ఫండ్ అందుబాటులో ఉంటుంది. బీమా కంపెనీ ఫండులను పెట్టుబడి పెట్టే బాధ్యతను తీసుకుంటుంది మరియు పాలసీ దారునికి నిహిత వయస్సు /నిహిత తేదీన పన్ను రహితంగా కార్పస్ ఫండ్‌లోని 1/3 వంతును నగదీకరణ చేసుకోవచ్చును. ఫండులో మిగిలిన 2/3 మొత్తం ఏన్యుయిటెంట్ కొరకు ఏన్యుటీని (పెన్షన్) నికొనుగోలుచేయడానికి వినియోగించడం జరుగుతుంది. యూనిట్ లింక్డ్ బీమా పాలసి యూనిట్ లింక్డ్ బీమా పాలసీలు (యుఎల్ఐపిలు) పెట్టుబడి మరియు సంరక్షణ సంయోగంతో అందజేయబడతాయి మరియు మీ ప్రీమియమ్‌లు ఎలా పెట్టుబడి పెట్టబడుతున్నాయో అనే దానిపై సరళతను మరియు ఐచ్చికతను మీకు కలిగిస్తాయి. యూనిట్ లింక్ ప్లానులలో, పెట్టుబడి యొక్క రిస్క్ పోర్ట్‌ఫోలియోను, మీరు పెట్టుబడిదారులు కనుక మీరే భరిస్తారు. విలక్షణంగా మీరు పెట్టుబడి పెట్టగల ఫండుల అభిమతాన్ని మీకు పాలసీ అందజేస్తుంది. పాలసీ జీవిత కాలంలో విభిన్న ఫండుల మధ్య ఒకదాని నుండి మరొకదానికి మారే సరళత కూడా మీకుంటుంది.. ఒకయుఎల్ఐపి విలువ మీరు పెట్టుబడి పెట్టిన యూనిట్ల ప్రస్తుతం అమలులో ఉన్న విలువకి లింకు చేయబడి ఉంటుంది, ఇది తిరిగి ఫండు యొక్క నిర్వహణ. సామర్ధ్యతపై ఆధారపడి. ఉంటుంది. మరణం లేదా శాశ్వతంగా అంగవైకల్యం సంభవించినట్లయితే, బీమా చేయబడిన మొత్తాన్ని (మీకు ఆచ్చాదన: కల్పించిన పరిధి వరకూ) అందజేస్తుంది, దాంతో అకస్మాత్తుగా కలిగిన. ఆర్థిక పరమైన. నష్టానికి మీ కుటుంబం పరిరక్షింపబడుతుందనే దైర్యం మీకుంటుంది. ఒక యుఎల్ఐపికి వివిధ స్థాయీలలో అపాయాలు మరియు ప్రయోజనాలు ఉంటాయి. యూనిట్ లింక్డ్ పాలసీలకు కొన్ని ఛార్జీలు వర్తిస్తాయి మరియు ప్రీమియమ్‌లో మిగిలిన భాగం మాత్రమే మీరు ఎంచుకునే. పండ్/ఫండులలో పెట్టుబడిపెట్టడం జరుగుతుంది. మీరు భరాయించవలసిన ఛార్జీలు ఎంతో మీ బీమా కంపెనీని లేదా ఏజెంటును మీరు ప్రశ్నలను వేసి తెలుసుకోవడం మంచిది. ఒక యుఎల్ఐపి పాలసీని కొనుగోలువేసేముందుగా మీరు భరించగల అపాయాన్ని మరియు పెట్టుబడిపెట్టగల స్థోమతను మీరు మదింవుచేసుకోవడం చాలా ముఖ్యమైన పని. పాలసీ యొక్క నియమాలు మరియు షరతులను జాగ్రత్తగా మీరు చదవాలి మరియు లాక్-ఇన్ వ్యవథి, సరెండర్ విలువలు, సరెండర్ చేస్తే విధించే ఛార్జీలు తో సహా పాలసీ వేోషతలను కూడా మీరు తప్పక చదవాలి. పైన. పేర్కొనబడిన ప్లానుల రకాలన్నీ యుఎల్ఐపి ప్లాన్ క్రింద అందజూపబడవచ్చును. తరుచుగా అడగబడే ప్రశ్నలు సాంవ్రదాయకమైన జీవిత బీమా ఒక పాలసీని కొనుగోలుపేసే ముందుగా నేను వరిశీలించవలసిన విషయాలు ఏమిటి ? రాబడికి హామీ ఇవ్వబడిందా, లాక్-ఇన్ వ్యవధి ఎంత, చెల్లించవలసిన ప్రీమియమ్ వివరాలు, ప్రీమియమ్ చెల్లించడంలో విఫలమయితే పర్యవసానాలేమిటి, పాలసీని పునరుద్ధరించడానికి షరతులేమిటి మరియు పాలసీ నియమాలేమిటిి, తగ్గించబడే ఛార్జీలేమిటి బుణం తీసుకునే సౌకర్యం ఉందా -ఈ విషయాలన్నిటినీ మీరు తప్పక తెలుసుకోవాలి. వ్రతిపాదన మరియు అందులో వెల్లడింపబడిన విషయాల ప్రాముఖ్యత ఏమిటి ? ఒక _ ప్రతిపాదనలో వెల్లడించబడ్డ విషయాలు ఒక _ పాలసీని జారీచేసేందుకు . (అండర్సైట్ చేయడానికి ఆధారం మరియు అందువల్ల తప్పుడు ప్రకటనలు లేదా వెల్లడింపులు దావాని నిరాకరించే అవకాశానికి దారితీయవచ్చును. జీవిత బీమా కొరకు సమర్సింపవలసీన ప్రత్యేక వైద్య నివేదికలు ఏమిటి ? నిశ్చితమైన కొన్ని ప్రతిపాదనలలో, చేరే సమయంలో ఉన్న వయస్సును బట్టి, పరిపక్వత _ సమయంలో వయస్సును బట్టి, బిమా చేయబడిన మొత్తం, కుటుంబ చరిత మరియు వ్యక్తితగత: చరిత్రపై ఆధారపడి, ఒక అపాయాన్ని పరిగణించడానికి ప్రత్యేక వైద్య నివేదికలు అవసరం కావచ్చును. ఉదా. ప్రతిపాదన చేసిన వారు బరువు అధికంగా ఉంటే, ఎలక్ష్టో కార్డియోగ్రామ్, గ్లూకోజు టాలరెన్స్ పరీక్ష మొదలయినటువంటి. ప్రత్యేక వైద్య నివేదికలు అవసరం కావచ్చును, అలాగే. బరువు బాగా తక్కువగా ఉన్న ప్రతిపాదకులకు ఛాతి మరియు ఊపిరితిత్తుల ఎక్స్-రే నివేదికలతో సహా ఆవసరం కావచ్చును. సాంప్రదాయకమైన జీవిత బీమా పాలసీలో పెయిడ్-అప్ వేల్యూ అంటే అర్థం ఏమిటి ? ఒక నిశ్చితంగా నిర్వచించబడిన వ్యవధికి లేదా దాని తరువాత ప్రీమియవ్లు చెల్లించితే వురియు తదుపరి ప్రీమియవ్లు చెల్లించకపోతే, బీమా చేయబడిన మొత్తం దానికి సరిపోయే నిష్పత్తిలో మొత్తం తగ్గించబడుతుంది బీమాచేయబడిన పూర్తి మొత్తానికి నిష్పత్తి అసలు పాలసీలో నిర్ధారించబడిన మొత్తం సంఖ్యకు అసలు చెల్లించబడిన ప్రీమియమ్‌ల నిష్పత్తిలో నే ఇదికూడా ఉంటుంది. ఉదాహరణకు-బీమా చేయబడిన మొత్తం రూ. 1 లక్ష అయితే, మరియు మొత్తంగా చెల్లించవలసిన ప్రీమియమ్‌ల సంఖ్య 20 అనుకుంటే (20సంవత్సరాల పాలసి, ప్రీమియమ్ చెల్లించే పద్ధతి వార్షికం అని ఊహించబడుతున్నది) మరియు 10 వార్షిక వ్రీమియమ్లు చెల్లించిన తరువాత చెల్లించలేకపోతే, పాలసీకి పెయిడ్-అప్ వైల్యూ రూ. 50,000. పెయిడ్-అఆప్ వేల్యూ= వెళ్లించిన ప్రీమియమ్‌ల సంఖ్య /వెళల్లింపవలసిన ప్రీమియమ్‌ల సంఖ్య ౫ బీమా చేయబడిన మొత్తం=10/20100000=50000/-. దీనర్ధం, ముందులాగానే పాలసీ అమలులో ఉంటుంది, అయితే 11వ ప్రీమియమ్ చెల్లించవలసిన తేదీ నుండి బీమా చేయబడిన మొత్తం మొదట్లో ఉన్న ఆసల్దెన రూ.1,00,000/-కి బదులుగా రూ. 50,000/& అయిపోతుంది. పాలసీ రద్దయి. పోవకముందు దీనికి జముఅయిన బోనస్ కూడా కూడబడుతుంది. ఉదాహరణకు, రద్దయిపోయిన తేది వరకూ కూడుకున్న బోనస్ రూ. 35,000/-అయిత్తే మొత్తం పెయిడ్-అప్ వేల్యూ50000 + 35000=85000 అవుతుంది. సాంవ్రదాయకమైైన జీవిత బీమా పాలసీలో సరెండరు _ విలువను ఎలా లెక్కిస్తారు ? పెయిడ్ అప్ వేల్యూలో కొంత . శాతంగా సరెండరు. విలువ అనుమతించబడుతుంది. సరెండర్ విలువ సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ ప్రకారం లెక్కించబడతుంది,ఇది చెల్లించిన ప్రీమియమ్‌లు మరియు పూర్తయిన వ్యవధిని బట్టి ఉంటుంది. సాంవ్రదాయకమైన జీవిత బీమా పాలసీలో పాలనీ మీద బుణాన్ని ఎలా లెక్కిస్తారు? పాలసీ నియమాలు కనుక బుణాన్ని ఇవ్వడాని అనుమతిస్తే సరెండరు విలువ యొక్క శాతంగా బుణం లెక్కించబడుతుంది. వరివక్వత చెందిన తరువాత సమర్పించవలసిన కాగితాలేమిటి ? దావా చేయగలిగిన మొత్తాన్ని తెలియపరుస్తూ, పాలసీ పరిపక్వత తేదీకి 2 నుండి 3 నెలలు ముందుగానే పాలసీ దారునికి డిస్పార్ట్ వోవర్ని జతపరుస్తూ బిమా కంపెనీ సాధారణంగా సమాచారం పంపుతారు. పాలసీ బాండ్స్, డిస్పార్ట్ వోవర్ సంతకం చేసి , సాక్షి సంతకం పెట్టించి వెనువెంటనే బీమా కంపెనీకి తిరిగి పంపాలి, దాంతో బీమా కంపెనీ దావా చెల్లింపు చేయడానికి వీలుకలుగుతుంది. పాలసీని కనుక వేరే ఎవరిపేరునైనా అప్పగించబడితే (ఎసైన్ చేయబడితే) , డిస్పార్ట్ని ఇచ్చే ఎసైనర్కి ఎసైనీకి (కార్యనియుక్తినిక్సి మాత్రమే. దావా మొత్తం చెల్లింపబడుతుంది. పరిష్కార అభిమతం (సెటిల్మెంట్ అన్షన్) అంటే ఏమిటి ? పరిష్కార అభిమతం అంటే అర్ధం, పరిపక్వత. _ చెందిన తరువాత వచ్చే డబ్బులను ఒక నిర్వచించబడిన పద్ధతిలో (కాంట్రాక్ట్ ప్రారంభంలోనే నియమాలు వురియు షరతులు నికిష్టంగా ముందుగానే తెలియపరవడం జరుగుతుంది) అందుకోవడానికి పాలసీదారునికి అందుబాటులో ఉంచే ఒక సౌకర్యం. పాలనీ అమలు జరువుతున్న సమయంలో బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే సాధారణంగా సమర్పించవలసిన కాగితాలు ఏమిటి ? సాధారణంగా సమర్పించవలసిన ప్రాథమిక కాగితాలు మరణ ధృవీకరణ పత్రం, దావా పత్రం, పాలసీ బాండ్. వైద్య సహాయకుని ప్రమాణ పత్రాలు ఆసుపత్రి ప్రమాణ. వత్రం, ఉద్యోగమిచ్చిన యజమాని ప్రమాణ పత్రం, పోలీసు మరణ విచారణ నివేదిక మరణానంతర నివేదిక (పోస్ట్-మార్చెమ్) మొదలయినటుపంటి కాగితాలను కూడా వర్తించిన. విధంగా సవుర్చించవుని అడుగవచ్చును. దావాకి సమర్చించవలసిన వాటిని గురించి సాధారణంగా పాలసీ బాండ్లో వెల్లడించడం జరుగుతుంది. యూనిట్ లింక్డ్ బీమా పాలసీలు (యుఎల్ఐపిలు) యూనిట్ లింక్డ్ పాలనీలలో సరెండర్ విలును ఎలా లెక్కింపడం జరుగుతుంది? సరెండర్ విలువను సాధారణంగా ఫండ్ విలువలో నుండి సరెండర్ ఛార్జీని తగ్గించి లెక్కిస్తారు. సరెండర్లు, పరిపక్వత పొందిన తరువాత దావా, స్విచ్ మొదలయిన వాటి కొరకు ఎన్ఎవిని ఎలా లెక్కిస్తారు? బీమావేసిన వారు (ఇన్స్యూరర్స్ సాయంకాలం 3.00 నిముషాల వరకూ అందుకున్న వెల్లే దరఖాస్తుల విషయంలో, (ఉదా. సరెండరు, పరిపక్వత పొందిన తరువాత దావా, స్విచ్ మొదలయినవి) అదే. రోజు ముగింపు సమయంలో అమలులో ఉన్న ఎన్ఎవి వర్తిస్తుంది. బీమాచేసిన వారు (ఇన్స్యూరర్) సాయంకాలం 3.00 నిముషాల తరువాత అందుకున్న చెల్లే దరఖాస్తుల విషయంలో, (ఉదా. . సరెండరు, పరిపక్వత పొందిన తరువాత దావ్కా స్విచ్ మొదలయినవి) తరువాత వ్యాపార రోజు ముగింపు సమయంలో అమలులో ఉన్న ఎన్ఎవి వర్తిస్తుంది. యూనిట్ ఫండ్ అంటే ఏమిటి ? యుఎల్ఐపవీ నుండి పెట్టుబడిపై రాబడులకు హామీ ఇవ్వబడదు. పాలసీదారులచే ఎంచుకోబడిన ఫండులలో, చెల్లించబడిన ప్రీమియముల నుండి అన్ని ఛార్జీలు మరియు రిస్క్ కవరీజీకి కేటాయించబడిన మొత్తంను తీసివేయగా మిగిలిన మొత్తాలను కలపగా ఏర్పడిన మొత్తాన్ని యూనిట్ఫండ్ ఆంటారు. ఒకయూనిట్ అంటే ఏమిటి ? ఒకయూనిట్ లింక్డ్ పాలసీలో ఫండ్ యొక్క ఒక అంశం. యుఎల్ఐపీ ఎలాంటి రకాల ఫండ్లని అందజూపుతుంది ? ఒక వ్యక్తి పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ _ ప్రొఫైల్ మరియు సమయ పరిధికి అనువుగా ఉండే విస్తత శ్రేణి ఫండ్లను బీమా కంపెనీలు చాలామటుకు అందజూపుతారు. విభిన్న ఫండ్లు విభిన్న మైన. రిస్క్ ప్రాఫైళ్ళను కలిగియుంటాయి. రాబడి సమర్థత కూడా ఒక ఫండు నుండి మరొక దానికి మారుతుంది. ఒకయుఎల్ఐవీలో పెట్టుబడిపై రాబడులకు హామీ ఇవ్వడంజరుగుతుందా? యుఎల్ఐవీ నుండి పెట్టుబడిపై రాబడులకు హామీ ఇవ్వడం యూనిట్ లింక్డ్ పథకాలలో/పాలసీలలో, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడి రిస్క్ పాలసీ దారుడే భరించాలి. ఎంచుకున్న యూనిట్ లింక్డ్ ఫండ్ (లు) పనితీరుపై ఆధారపడి అతని/ఆమెపెట్టిన పెట్టుబడులపై పాలసీ దారుడు లాభాలను లేదా నష్టాలను పొందవచ్చును. ఒక ఫండ్ యొక్క గత పనితీరు ఫండ్ యొక్క భావి పనితనాన్ని తప్పనిసరిగా సూచించదు అని తప్పక గమనించాలి. ఒకయుఎల్ఐపిలో ఛార్జీలు, ఫీజులు మరియు తగ్గించే మొత్తాలు ఏమిటి? మారుతూ ఉండే ఛార్జి లతో బీమా చేసే వివిధ కంపెనీలు యుఎల్వీలను అందజూపుతారు. మొత్తం మీద ఛార్జి చేసే విభిన్న రకాల ఫీజులు మరియు ఛాక్టీలు క్రింద సూచించబడ్డాయి. అయితే సమయం గడిచిన కొద్దీ ఫీజులను మరియు ఛార్జీలను మార్చే హక్కును బీమా కంపెనీలు కలిగియున్నారని గుర్తుంచుకోవాలి. వ్రీమియమ్ు కేటాయింవు ఛార్జి పాలసీ క్రింద యూనిట్లని కేటాయించకముందు ఛార్జీల క్రింద సర్దుబాటు చేసే ప్రీమీయమ్లో కొంత శాతం ఇవి. కమీషన్ ఖర్చులు కాకుండా ఈ ఛార్టీలలో సాధారణంగా ప్రారంభ మరియు రెన్యూవల్ ఖర్చులు కూడా కూడియుంటాయి. మోర్ట్రాలిటీ ఛార్జీలు ప్లాన్ క్రింద బీమా ఆచ్చాదన ఖర్చును భరించడానికి చేసే ఛార్జీలు ఇవి. వయస్సు, ఆచ్చాదన మొత్తం, ఆరోగ్యస్థితి మొదలయినటువంటి పలు అంశాలపై మోర్దాలిటీ ఛార్టీలు ఆధారపడి ఉంటాయి. ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలు ఫండ్‌ని యాజమాన్యం చేయడానికి విధించే ఫీజులు ఇవి మరియు నెట్ ఎసెట్ వేల్యూని (ఎన్ఎవి) లెక్కించే ముందు వీటిని తగ్గిస్తారు. పాలసీ/పరిపాలనా ఖర్చులు ఇవి ప్లాన్‌ను అమలుచేయడానికి విధించే ఫీజులు మరియు వీటిని యూనిట్లని రద్దుచేయడం ద్వారా విధించడం జరుగుతుంది. ఇవి పాలసీ వ్యవధి అంతటా ఏకరీటులో (ఫ్లాట్) లేదా ముందుగా నిర్ధారించబడిన రేటులో మారుతూ ఉంటాయి. అర్చణ (సరెండర్) ఛార్జీలు పాలసీ షరతులలో తెలియపరచినట్లుగా వర్తించిన చోట యూనిట్లని పరిపక్వతకి ముందే. పాక్షికంగా లేదా పూర్తిగా నగదీకరణ చేయడంపై అర్పణ ఛాక్టీలను తగ్గించవచ్చును. ఫండ్ మార్పిడి (స్విచ్చింగ్ు ాక్టీలు మామూలుగా ఛార్జి లేకుండా ఒక సంవత్సరంలో పరిమిత సంఖ్యలో ఫండ్ మార్పిడులను అనుమతించడం జరుగుతుంది, తదుపరి మార్పిడులకు ఒక ఛార్జి విధించబడుతుంది. సేవాపన్నుతగ్గింవులు యూనిట్లని కేటాయించడానికి ముందుగా ప్రీమియ్ యొక్క రిస్క్ భాగం నుండి పర్తించే సేవా పన్ను తగ్గించబడుతుంది. అన్ని ఛార్జీలు మరియు రిస్క్ కవర్‌కి ప్రీమియమ్ కొరకు ప్రీమియ్లో తగ్గించే డబ్బు తరువాత మిగిలిన డబ్బుని యూనిట్లని కొనడానికి వినియోగించబడుతుందని పెట్టుబడిదారులు గమనించాలి. వళతిపాదనను సంతకం చేస్ ముందు తనిఖీ చేసుకోవలసిన విషయాలు ఏమిటి? ఆమోదించ బడిన అమ్మకాలకు సంబంధించిన కరపత్రాన్ని ఈ క్రింది వాటి కొరకు మీరు తనిఖీ చేసుకోవాలి- పాలసీ క్రింద తగ్గించబడగల ఛార్జీలన్నిటిని పరిపక్వతకు ముందే సరెండరు చేస్తే చెల్లించవలసిన ఛార్జీలు విశేషతలు మరియు ప్రయోజనాలు పరిమితులు మరియు మినహాయింపులు రద్దుకావడం మరియు దాని పర్యవసానాలు ఇతర వెల్లడింపులు జీవిత బీమా కౌన్సిల్ ద్వారా నిర్జారించబడినట్లుగా 6% మరియు 10% రాబడులు రాగల రెండు సందర్భాలలో చెళల్లింపబడగల ప్రయోజనాలను విశేషంగా చూపిస్తూ ఉదాహరణలను ప్రదర్శించాలి. యూనిట్లని కొనుగోలువేయడానికి వ్రీమియమ్లో ఎంత మొత్తం ఉవయోగింపబడుతుంది ? ప్రీమియమ్ యొక్క మొత్తం డబ్బు యూనిట్లని కొనుగోలువేయ-డానికి కేటాయించబడదు. పలు రకాల ఛార్జీలు, ఫీజులు మరియు తగ్గింపులకు విడిగా తీసిపెట్టి మిగిలిన మొత్తాన్ని యూనిట్లను కొనుగోలుచేయడానికి కేటాయిస్తారు. అయితే . యూనిట్లను కొనుగోలుచేయడానికి వినియోగించే పరిమాణం వథకం నుండి పథకానికి మారుతుంది. యూనిట్లని కేటాయించే మొత్తం ఖర్చు తిరిగి ప్రీమియమ్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకనగా, చెల్లించిన ప్రీమియమ్ నుండి ఛాక్టీలను మినహాయించుకోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే యూనిట్ల కేటాయింపుకు వినియోగిస్తారు. పాలసీని కొనుగోలు వేసిన తరువాత, పాలసీతో సంతప్తివెందకపోతే, వ్రీమియమ్ని తిరిగి ఇచ్చేయమని అడిగి తీసుకోపమ్చనా ? పాలసీ నియవూలు వురియు షరతులతో పాలసీదారుడు అంగీకరించకపోత్తే . ప్రీమియమ్ని తిరిగి వాపసు చేయమని పాలసీ దస్తావేజులను అందుకున్న 15 రోజుల లోపల (ఫ్రీ లుక్ వ్యవధి) అడుగవచ్చును. యూనిట్లను రద్దు చేసుకున్నందువల్ల విధించిన ఛార్జీలతో సహా ఫండ్. విలువ పాలసీదారునికి తిరిగీ వాపసుచేయబడుతుంది, అయితే వైద్య పరీక్షలు, స్టాంప్ డ్యూటి మరియు ఆచ్చాదన కల్పించిన వ్యవధికి రిస్క్ ప్రీమియమ్ నిష్పత్తిలో తగ్గించుకుని మిగిలిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. నెట్ ఎసెట్ వేల్యూ (ఎన్ఎవి) అంటే ఏమిటి ? ఒక నిశ్చయింపబడిన తేదీన ఫండ్ యొక్క ప్రతి యూనిట్ విలువని ని ఎన్ఎవి అంటారు. సంబంధిత బీమా కంపెనీ వెబ్‌సైట్‌పైన ప్రతి ఫండ్ యొక్క ఎన్ఎవి ప్రదర్శించబడుతుంది. పాలసీ వ్యవధిలో అపాయం కలిగినట్టయితే వెల్లించబడే వ్రయోజనం ఏమిటి? పాలసీ షరతుల ప్రకారం పాలసీ వ్యవధిలో బీమా చేయబడిన వ్యక్తి కి ఆపాయం సంభవించినట్లయిత్తే బీమా చేయబడిన. మొత్తం మరియు/లేదా ఫండ్ యూనిట్ల యొక్క విలువ సాధారణంగా చెల్లింపంబడుతుంది. పాలసీ వరిపక్వత పొందిన తరువాత చెల్లించబడే ప్రయోజనం ఏమిటి ? పాలసీ పరిపక్వత చెందిన మీదట, ఫండ్ యూనిట్ల విలుప, ఏవైనా బోనసులుంటే వాటితో కలిపి చెల్లింంబడుతుంది. క్రమంగా చెల్లించే ప్రీమియమ్ కాకుండా అదనంగా డబ్బులను పెట్టుబడి పెట్టపమ్బనా ? అవును, వారి అభిమతం ప్రకారం క్రమబద్ధంగా చెల్లించే ప్రీమియమ్ పైన మించి అదనంగా డబ్బులను పెట్టుబడి పెట్టవమ్బను, అయితే. పథకం లో ఈ వెసులుబాటు అందుబాటులో ఉండడాన్ని బట్టి ఇలా చేయవచ్చును. ఈ సొకర్యం“టాప్-అప్"సాకర్యం అని పిలువబడుతుంది. ఒక యుఎల్ఐపీ పాలసీని తీసుకున్న తరువాత పెట్టుబడి పెట్టే ఫండ్‌ను మార్చుకోవచ్చునా ? అవును, స్విచ్ అభిమతం ఒక పాలసీ లోని పెట్టుబడులను ఒక ఫండ్ నుండి మరొక దానికి మార్చుకునే వీలును కలిగిస్తుంది, . అయితే, పథకం లో ఈ వెసులుబాటు అందుబాటులో ఉండడాన్ని బట్టి ఇలా చేయవచ్చును. నిర్దిష్టమైన సంఖ్యలో సాధారణంగా ఖర్చేమి లేకుండా ఇలా మార్పిడులను చేసుకోవచ్చును, అయితే నిర్దిష్టమైన సంఖ్యను అధిగమించిన తరువాత. ఫీజు ఛార్జి చేయబడుతుంది. పాక్షికంగా నగదీకరణ/డబ్బును తీసుకోవడం చేయవచ్చునా ? అవును, పథకాలలో “పాక్షికంగా డబ్బును తీసుకునే” అభిమతం బహుశ కలిగి ఉండవచ్చును, పాలసీలో పెట్టుబడిన మొత్తంలో కొంత భాగాన్ని తీసుకోవడానికి ఇది వీలు కలిగిస్తుంది. యూనిట్లలో కొంత భాగాన్ని రద్దు చేయడం ద్వారా ఇలా చేయడానికి వీలుకలుగుతుంది. వ్రీమియమ్ని వెల్లించడం ఆవీపేస్తే ఏమి జరుగుతుంది ? ప్రారంభమయిన 3 నంవత్సరాల లోపల మానివేస్తి-ప్రారంభం నుండి కనీసం మూడు వరుస సంవత్సరాల పాటు _ ప్రీమియమ్‌లు చెల్లించకపోతే, వెనువెంటనే బీమా ఆచ్చాదన నిలిచిపోతుంది. అనుమతించే ప్యవధిలోవల తిరిగి పునరుద్ధరించడానికి బీమా కంపెనీ వారు బహుశ అవకాశం కలిగించవచ్చును; పాలసీని కనుక ఆ వ్యవధి లోపల పునరుద్ధరించకపోతే, పాలసీ మూడవ వార్షికోత్సవం తరువాత లేదా పునరుద్ధరణ అనుమతించబడిన. వ్యవథి ముగింపు వద్ద, ఏది తరువాత వస్తే అప్పటి సరెండరు విలువ చెల్లించబడవచ్చును. మీకేదైనా స్యధను కలిగింపే సమన్య ఉంటే? బీమా నియంత్రణ మరియు అభివద్ధి ఆధికారవర్గం (ఐఆర్‌డిఎ యొక్క వినియోగదారుల వ్యవహారాల విభాగం, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేజ్మెంట్ సిస్టమ్ (ఐజిఎమ్ఎస్)ను ప్రవేశపెట్టింది, ఇది ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదుచేసుకోవడం మరియు దాని స్టితిని గమనించే ఒక సాధనం. మీరు మీ సమస్యని ముందుగా బీమా కంపెనీతో నమోదు చేసుకోవాలి మరియు కంపెనీ ద్వారా దానిని వరిష్కరించిన పద్ధతి మీకు సంతవ్తిని కలిగించకపోతే, దానిని ఐజిఎమ్ఎస్ ద్వారా ఐఆర్డిఎకి మీరు తీసుకుపోవచ్చును, దీనికి మీరు www.igms.irda.gov.in కి లాగ్ ఆన్ అవ్వాలి. మీరు కనుక బీమా కంపెనీ. వారి ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను (గ్రివెన్స్ సిస్టమ్) నేరుగా సంవ్రదించలేకపోత్కే బీమా కంపెనీతో మీ సమస్యని నమోదుచేసుకునే వెసులుబాటును కూడా ఐజీఎమ్ఎస్ పొందువరుస్తుంది. ఐజిఎమ్ఎస్ ద్వారా (అంటే వెబ్స్మీ సమస్యని నమోదువేసుకోవడమే కాకుండా, మీ ఫిర్యాదుని నమోదు చేసుకోవడానికి వలు రకాల ఇతర _ విధానాలు ఉన్నాయి-ఇ-మెయిల్ ద్వారా (compalints@irda.gov.in), లేఖ వ్రాయడం ద్వారా ( వినియోగదారుల వ్యవహారాల విభాగం, బీమా (క్రమబద్ధీకరణ మరియు అభివద్ధి ఆధికారవర్గం, ౩వ అంతస్తు, పరిశ్రమ్ భవన్, బషీర్‌బాగ్, హైదరాబాద్-4కి మీ లేఖని పంపండి) లేదా ఐఆర్‌డిఎ కాల్ సెంటర్‌ని టోల్ ఫ్రీ సంబరు 155255కి ఫోన్లో సంప్రదించండి, వీటన్నిటి ద్వారా ఐఆర్‌డిఎ ఎలాంటి ఖర్చు లేకుండా బీమా కంపెనీలపై మీకున్న ఫిర్యాదులను నమోదు “ చేస్తుంది, అలాగే దాని స్థితిని గమనించడానికి సహకరిస్తుంది. కాల్ ఆధారంగా ఫిర్యాదుల ప తాన్ని నింపడంలో కాల్ సెంటర్ మీకు సహకరిస్తుంది. అవసరమయినప్పుడల్లా, దీనికి బీమా కంపెనీ యొక్క చిరునామా, టెలిఫోను నంబరు,వెబ్సైట్ వివరాలు, ఇ-మెయిల్ ఐడి మొదలయిన విపరాలు మీకు అందజేయడం ద్వారా బీమా కంపెనీలతో నేరుగా ఫిర్యాదులను దాఖలువేసే సౌకర్యాన్ని ఇది కల్పిస్తుంది. ఐఆర్‌డిఎ కాల్ సెంటర్ భావి వినియోగదారులకు మరియు పాలసీ దారులకు సమగ్రమైన సమాభారాన్ని అందిస్తుంది,12 గంటలు ౫6 రోజులు సేవను ఉదయం తి గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ సోమవారం నుండి శనివారం వరకూ హింది, ఇంగ్లీషు మరియు. పలు భారతీయ భాషలలో అందజేయబడుతున్నది. ఐఆర్డిఎతో ఫిర్యాదు నమోదు చేయబడితే, బీమా కంపెనీతో ఈ విషయం లేవనెత్తి పరిష్కారం దొరికేలా చేయడానికి వీలుకలిగిస్తుంది. ఫిర్యాదును వరిష్కరించడానికి కంపెనీకి 15 రోజుల సమయం ఇవ్వబడుతుంది. అవసరమయితే, ఐఆర్‌డిఎ విచారణ జరువుతుంది మరియు కూపీ లాగుతుంది. తదువరి, వర్తించిన చోట, రిడ్రైసల్ ఆఫ్ వబ్లిక్ గ్రీవెన్సెస్ రూల్స్, 1998 నియమాల 'వ్రకారం బీమా లోక్‌పాల్‌ని సం వ్రదింపమని ఫిర్యాదుదారునికి ఐఆర్‌డిఎ సలహ ఇస్తుంది. నిరాకరణ ఈ చిన్న వుస్తకం మీరు సాధారణ సమాఛారాన్ని మాత్రమే అందజేయాలని ఉద్దేశింపబడింది మరియు ఇది సంపూర్ణమైనది కాదు. ఇదొక బోధన చేయాలని తీసుకున్న చొరవ మాత్రమే మరియు మీకు న్యాయపరమైన సలహా ఇవ్వడానికి కాదు. ఆధారం : జీవిత బీమా పైన చిన్న పుస్తకం