తెలంగాణ డయాగ్నోస్టిక్స్ (Telangana Diagnostics) అనేది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. పేద, మధ్యతరగతి రోగులకు ఉచితంగా నాణ్యమైన రోగనిర్ధారణ (డయాగ్నోస్టిక్) సేవలను అందించడానికి దీనిని ప్రారంభించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ (Telangana Diagnostics) ముఖ్య ఉద్దేశాలు తెలంగాణలోని ప్రతి పౌరునికి నాణ్యమైన డయాగ్నోస్టిక్ సేవలను ఉచితంగా అందించడం. పేద, మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడం. ఖచ్చితమైన రోగనిర్ధారణ ద్వారా సరైన సమయంలో చికిత్సను ప్రారంభించడం. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం. చికిత్సలో ఆలస్యాన్ని మరియు ఆరోగ్య సమస్యలను తగ్గించి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. హబ్ అండ్ స్పోక్ మోడల్ (Hub and Spoke Model) ఈ విధానాన్ని మొదట హైదరాబాద్‌లో ప్రారంభించారు.57 రకాల రక్త, మూత్ర పరీక్షలతో దీనిని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 134 రకాల పరీక్షలను (పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబియల్) 489 స్పోక్స్ ద్వారా అందిస్తున్నారు. జిల్లాలకు విస్తరణ హైదరాబాద్‌లో సాధించిన విజయం తర్వాత, ప్రభుత్వం ఈ సేవలను అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లా డయాగ్నోస్టిక్ హబ్‌లు ఉన్నాయి.ఈ హబ్‌లన్నీ వారంలో 7 రోజులు, 24 గంటలు (24/7) పనిచేస్తాయి. రేడియాలజీ సేవలు పాథాలజీతో పాటు, రేడియాలజీ సేవలను (USG, టెలి ECG, ఎక్స్-రే, మేమోగ్రామ్, 2D ECHO) కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్లో 51 హబ్‌ల ద్వారా అందిస్తున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలో 20 మినీ రేడియాలజీ హబ్‌లు, జిల్లాల్లో 31 రేడియాలజీ హబ్‌లు పనిచేస్తున్నాయి. సాంకేతికత మరియు పనితీరు అన్ని హబ్‌లలో అత్యాధునిక బయో-డైరెక్షనల్ పరికరాలు ఉన్నాయి. నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటారు. రోగుల నమోదు, శాంపిల్స్ సేకరణ, బార్-కోడ్ జనరేషన్, రవాణా, మరియు రాత్రికి రాత్రే శాంపిల్స్ ప్రాసెస్ చేయడం కోసం ప్రత్యేకంగా LIMS సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పరీక్షల నివేదికలను (Reports) రోగులకు SMS లింక్ ద్వారా ఫోన్‌కు పంపుతారు మరియు స్పోక్స్ వద్ద ప్రింటెడ్ రిపోర్టులను ఇస్తారు. తప్పులను తగ్గించడానికి ఆటోమేషన్‌ను ఉపయోగిస్తున్నారు. రిపోర్ట్ వెరిఫికేషన్ సమయం (TAT) 12 గంటలు మరియు SMS డెలివరీ సమయం 24 గంటలుగా ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించడానికి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నిరంతరం కృషి చేస్తోంది. ఆధారం: తెలంగాణ డయాగ్నస్టిక్స్ కార్యక్రమం