ఫ్లోరైడ్ అధికంగా తీసుకోవడంవల్ల ఈవ్యాధి వస్తుంది.ఇది చాల బాధాకరమైన జబ్బు. ఫ్లోరైడ్లు ఫ్లోరిన్ యొక్క సంయోగ పదార్ధాలు. భూఉపరితలంలో లభించే నీటిలోకన్నా భుగర్భ జలాలలో ఫ్లోరైడ్లు అధికంగా ఉంటాయి. త్రాగే నీరు ఆహరం ద్వారా , టూత్ పేస్ట్, నోటిని శుభ్రం చేసుకునే ద్రవాలు, ఇతర దంత సంబంధమైన ఉత్పత్తుల నుంచి , మందులు, పరిశ్రమలనుంచి వచ్చే ఫ్లోరైడ్ దుమ్ము, పొగలద్వారా, ఫ్లోరైడ్ గల లవణాన్ని మరియు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని వినియోగించడం వలన ఫ్లోరైడ్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన శరీరంలో ఫ్లోరైడ్ ఉండవలసిన మోతాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ)మరియు భారతీయ ప్రమాణం(ఐఎస్)10500(1991) 1.5మిల్లీ గ్రాములు/ఎల్ మరియు 1.0 మిల్లీ గ్రాములు/ఎల్ మాత్రమే పరిమితమైనదిగాను మానవునిలో శోషణకు రక్షిత హద్దుగా ఉన్నది. భారత దేశంలో ఫ్లోరోసిస్ గల ప్రాంతాలుః భారతదేశంలో కనీసం 17 రాష్ట్రాలలో వ్యాపించింది. అందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో 50-100శాతం జిల్లాలపై ప్రభావంపడి ఒకేచోట ఉండే ప్రజలలోఅతిగా వ్యాపించి ఉంది. ఫ్లోరైడ్ విషతత్వం తీవ్రమైన విష ప్రభావం పరిశ్రమలనుండివచ్చే ఫ్లోరిన్ పొగల ద్వారా ఇది ఎక్కువగా వస్తుంది. 6-9 మిల్లీగ్రాములు ఎఫ్/కిలో గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రభావం ఏర్పడుతుంది. ఫ్లోరైడ్ యొక్క తీవ్రమైన విష ప్రభావ చిహ్నాలు మరియు లక్షణాలుః కడుపులో తిప్పడం, వాంతులు కావడం, అతిసారవ్యాధి, పొత్తి కడుపులోనొప్పి, శ్వాస సంబంధమైన బాధలు, హృదయ సంబంధితమైన పనులు తగిన విధంగా లేకపోవడం, బలహీనత, పక్షవాతం, స్పృహలేకపోవడం(కోమా)కు గురి కావడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఫ్లోరైడ్ విష ప్రభావం ఫ్లోరోసిస్ రావడానికి గల కారణాలు తాగడానికి, వంటకు ఫ్లోరైడ్ అధికంగా గల భూగర్భ జలాన్ని వినియోగించడం వలన ప్రధానంగా ఫ్లోరోసిస్ వస్తుంది. ఫ్లోరైడ్ లభించే వనరులన్నింటి నుండి సంబంధంలేకుండా శరీరంలోనికి తీసుకోవడంవల్ల, పోషకాహరలోపంవలనకూడ ప్రజలలో ఫ్లోరోసిస్ తీవ్రత పెరుగుతుంది. దీర్ఘకాలిక ఫ్లోరైడ్ విష ప్రభావ చిహ్నాలు దీర్ఘకాలిక ఫ్లోరైడ్ విష ప్రభావ చిహ్నాలు రెండు రూపాలుగా ఉన్నాయి. దంత సంబంధిత ఫ్లోరోసిస్ అస్థి సంబంధిత ఫ్లోరోసిస్ దంత సంబంధిత ఫ్లోరోసిస్ పిల్లల దంతాలలో మొదటి చిహ్నంగా ఎ నామిల్ పూత పోవడం దంత మినర లైజేషన్ ఏర్పడడానికి ముందుగానే అధిక ఫ్లోరైడ్కు బహిర్గతమైనప్పుడు దంత ఫ్లోరోసిస్ వస్తుంది. దంతాలు క్షీణించడం, పుచ్చిపోవడంవంటి రెండు రకాలైన దంతఫ్లోరోసిస్కి కొలమానాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఎనామిల్ పైన రంగు కోల్పోయిన అడ్డగీతలు ఏర్పడతాయి; పంటి ఇగురుపైన రంగులేకపోవడం ఉండదు. జతల దంతాలలో రంగుకోల్పోవడం ( ద్విపార్శ్వ సౌష్టవంతో) అస్థి సంబంధిత ఫ్లోరోసిస్ లక్షణాలుఃశరీరమంతటా వ్యాపించే అస్పష్టమైన నొప్పులు, మరియుకీళ్ళు బిగబట్టి కదలికలు తగ్గ డం సామాన్యమైన ప్రారంభ లక్షణాలు. ముందస్తు పరిశీలనలో కండర అస్థి సహిత లక్షణాలు ఉంటాయి. అస్థి సంబంధితంలేని అంశాలు నరాల బలహీనత, మానసికంగా కృంగుట చేతివేళ్ళు , కాలి వేళ్ళలో కంపనాలు , కండర బలహీనత మరియు బిగుసుకు పోవడం , కండరలలోనొప్పి, కండరశక్తి తగ్గడం, చర్మంపై బాధాకరమైన దద్దుర్లు , 7-10రోజులలో ఇవి పోతాయి. జీర్ణనాళ సంబంధిత సమస్యలుః పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, అతిసారం, మలబద్దకంమల విసర్జనలో రక్తంపడడం తలనొప్పి చాలచిన్న వయస్సులోనే దంతాలు ఊడిపోవడం రక్తహీనత చిన్న వయస్సులోనే వృద్ధాప్యం. రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఫ్లోరోసిస్ ప్రజారోగ్య సమస్య దీనిని వైద్య, మరియు ప్రజారోగ్య ఇంజనీరింగు నిపుణులు (నీటి సరఫరాను అమలు పరచే సంస్థలు) నిర్వహించవలసి ఉంటుంది. ఫ్లోరోసిస్ నిర్వహణలో మెలకువలు భూగర్భ జలాలు, ఉపరితలనీటిలో ఎక్కడైతే ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలను తెలుసుకొని ఆయా వనరులను తాగడానికి వంటకు వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్గించడం. స్థానికంగా ఉన్న అధిక ఫ్లోరైడ్ జలాలను తక్కువ ఫ్లోరైడ్ జలాలుగా మార్చి ఇళ్ళకు సామాజిక స్థాయీలకు ఫ్లోరైడ్ లేని నీటిని అందించడం. ఇంటి డాబాల నుండి వాన నీటిని, కొండ వాలు నుంచి నీటిని సేకరించి తదుపరి వినియోగానికి వాడుకోవడం. బావుల లోనికి నేరుగా వాననీటిని పంపించి సజల ఫ్లోరైడ్ ఉండేటట్లు బావి నీళ్ళను మార్చడం. వంటకు, తాగడానికి ఒక వ్యక్తికి దాదాపుగా రోజుకి 10లీటర్లు కావాలి. రక్షితనీటిని మెలకువగా వినియోగించాలి. పరిశుభ్రం కాని నీటిని ఇంటి పనులకు స్నానానికి, బట్టలుతకాడానికి, శుభ్ర పరచుకోవడానికి మోదలగు వాటికి ఉపయోగించు కోవచ్చు. మరగించడంవలన ఫ్లోరైడును తొలగించలేము. వ్యతిరేక ద్రవాభి సరణక్రమత (ఆర్ ఒ) సాంకేతికతా విధానం తప్ప, ప్రస్థుతమున్న నీటి వడపోత సామగ్రులు లేదా నీటిని శుద్ధిపరచే విధానాలు ఏవికూడ ఫ్లోరైడ్ను తొలగించలేవు. సామాజిక పరంగా ఫ్లోరైడ్ లేకుండా చేసే సాంకేతిక విధానాలు నల్గొండ సాంకేతిక విధానం సున్నం- పటిక వినియోగం- ఖర్చు తక్కువ విధానం. కొంత శిక్షణతోఇంటి కొరకు, సామాజికస్థాయీలకు సరిపడుతుంది. ప్రశాంతి సాంకేతికత చురుకైన అల్యూమినను నీటిలోకి పంపించడం.చేతి పంపులకు కలపడానికి ఇంటికొరకు సామాజిక అవసరాలకు వినియోగించే వడపోతలు అందుబాటులోఉన్నాయి. ఇది సులభంగా పనిచేయించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఐసిఒహెచ్ టెక్నిక్: బొగ్గుగా మారిన ఎముక పదార్ధంమరియు బొగ్గు దుంగలు వినియోగిస్తారు.ఇది సరళమైన, తక్కువఖర్చు విధానం. ఈ విధానం(యూనిట్ ) 1-3 నెలల వరకు పనిచేస్తుంది. వ్యతిరేక ద్రవాభిసరణక్రమతా-నీటిని శుభ్రపరచే విధానం: ఎక్కువ ఖరీదైనది. నిర్వహణకూడ ఖర్చుతో కూడినది. అయినప్పటికినీచిన్న పరిశ్రమలకు లేదా సామాజికస్థాయి కూర్పులకు ఇది ఆదర్శమైనది. ఆహారనియమాల అనుబంధ ప్రక్రియ ముఖ్యంగా పిల్లలు, ఎదిగే వయస్సులో గలవారు మాంసకృత్తులను, కాల్షియమ్ను మరియు విటమిన్ సి ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. అధికంగా ఫ్లోరైడ్గల వాటిని ఉదాహరణకు తేనీరు, నల్ల ఉప్పు ( కాలానమక్ ) , రాతి ఉప్పు, పొగాకు వక్క అధిక ఫ్లోరై డ్ గల భుగర్భ జలాలను వినియోగించి ఆహారాలను పెంచడం వంటి విధానాలను మానివేయాలి . దంతాలకు ఉపయోగించే ఫ్లోరై డ్తో ఉన్న దంత సంబంధిత పేస్టుల తయారీలో జాగ్రత్త వహించాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు