ఎముకలు బలహీనమవడం ఖనిజ లవణాల లోపం - కాల్షియమ్, విటమిన్-డిల లోపం ఆస్టియో పోరోసిస్ ఎలా వస్తుంది. ఎముకలలో ఉండే ద్రవ్య రాశి తగ్గిపోవడం. ఎముకల సర్వ సాధారణ జీవ క్రియకు సంబంధించిన జబ్బు. ఎముక దృఢమైన వెలుపలి కర్పరం (కార్టెక్స్-రక్షణ కవచం) తోను, లోపలి భాగం నార (ఫైబర్ )వంటి ట్రాబిక్యులే తో ఉండి బలమైన ఎముకగా రూపొందుతుంది. ముపై అయిదేళ్ళ వయస్సు వచ్చే వరకు ఎముక ద్రవ్య రాశి స్థిరమైన అభివృద్ధితో ఉంటుంది. పూర్తి రూపాన్ని పొందేటంత వరకునూ తిరిగి నిర్మితమయ్యే వరకు , విరిగి నప్పుడు అతుక్కోవడం, అభివృద్ధి చెందడం జరుగుతుంది. నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఎంత వరకైతే ఆభివృద్ధి అవుతుందో అంతకన్నా మించి నట్లైయితే ఎముక చిట్లి పోవడం ఎముకలో గల ద్రవ్య రాశి తగ్గి పోవడమే గాకుండా ఎముకలో గల కాల్షియమ్ కూడ తగ్గుతుంది. స్త్రీలలో వయస్సుతో ఏర్పడే ఎముక నష్టం తోబాటు బహిష్టు ఆగిపోయే దశలో స్త్రీ సంబంధిత హార్మోన్ (ప్రధానంగా ఈస్ట్రోజెన్) స్థాయిలు తగ్గిపోవడం ఫలితంగా ముఖ్యంగా కార్టిక్యులార్ , ట్రాబెక్యులార్ ఎముక నష్టం జరుగుతుంది. వారిలో ఆస్టియో పోరోసిస్ వచ్చినట్లయితే కార్టిక్యులార్ , ట్రాబెక్యులార్ ఎముక నష్టం 30-40 శాతం ఏర్పడి ఎముకలు సున్నితమై పెళుసుబారి విరగడానికి సిద్ధంగా ఉంటాయి. ఆస్టియొపోరోసిస్ రావడానికి గలకారకాలు ఆస్టియొపోరోసిస్ రావడనికి వివిధ కారణాలున్నాయి. వయస్సు సర్వసాధారణమైన కారకం. వయస్సు పెరుగుతున్న కొద్దీ సరిపడినంతగా కాల్షియమ్ తీసుకోకపోతే కాల్షియమ్ లవణం క్రమంగా తగ్గిపోతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉన్న ( ఉదా|| మెనోపాజ్- బహిష్టు ఆగిపోయిన తర్వాత) స్త్రీలలో మిగిలిన వారిలో కన్నా తొందరగా ఆస్టియొ పోరోసిస్ వస్తుంది. మగవారిలో ఎముక సాంద్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఆస్టియొపోరోసిస్ అంత సులభంగా రాదు. వయసు పై బడినవారిలో - ముఖ్యంగా స్త్రీలలో సాధారణంగా చిన్నగా ఉన్న ఎముకలు తేలికగా ఉండి సాంద్రత తక్కువగా ఉంటుంది. దీని వలన వీరిలో ఆస్టియొపోరోసిస్ ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. గర్భిణీ స్త్రీలు , పాలిచ్చే తల్లులకు ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. తల్లి గనుక తగినంత కాల్షియమ్ను ఆహారంలో తీసుకోక పోయినట్లయితే పిండం పెరుగుదలకు, శిశువు పాలకు సరఫరా కావలసిన కాల్షియమ్ తల్లి ఎముకల నుంచి జారుతుంది. చిన్నతనంలో తల్లులు కావడం, ఏటికేడాది పిల్లలు పుట్టడం , మరియుబిడ్డ పుట్టడానికిముందు పుట్టిన తర్వాత ఒత్తిడిచెందే కాలంలో పోషక విలువలు తక్కువగాగల ఆహారాన్ని తీసుకోవడం వల్ల సర్వ సాధారణంగా భారత దేశపు స్త్రీలలో ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. పొగ త్రాగడం, మద్యపానం , స్థిరంగా కూర్చుని ఉండే జీవన విధానాలద్వారా ఆస్టియోపోరోసిస్ పెరిగే అవకాశం ఎక్కువైంది. బలహీనమైన ఎముకలు సులభంగా విరుగుతాయి ముందుకు వంగి నిల్చునే విధానాలవలన ఆయా వ్యక్తులకు ఎముకలకు సంబంధించిన ఇతర సమస్యలు వస్తాయి. రోగ చిహ్నాలు -లక్షణాలు ఎముక విరిగే దాకా చాలా మందికి వారిలో ఆస్టియొపోరోసిస్ ఉందని తెలియదు. ఏ ఇతర లక్షణాలు సామాన్యంగా ఉండవు- కొంత మంది ముసలి వారు తాము కొద్దిపాటిగా పొట్టిగా అయినట్లు లేదా నడుము వంగినట్లు గా గుర్తిస్తారు. ఆస్టియొపోరోసిస్ ఉన్న ముసలి వారు కింద పడితే తుంటి ఎముక విరిగే ప్రమాదం ఉంటుంది. ఆస్టియోపోరోటిక్ ఎముక చాలా నెమ్మదిగా నయమవుతుంది. కీళ్ళనొప్పులు ఉన్న వారిలోఆస్టియోపోరోటిక్ ఎముక చాలనొప్పిగా ఉండి జీవితం దుర్భరంగా ఉంటుంది. రాకుండా జాగ్రత్తలు- చికిత్స చిన్న వయస్సులోనే ఎముక ఆరోగ్యాన్నిచూసుకోవడం ప్రధానం. ఆమెకు లేదా అతనికి ఆస్టియోపోరోసిస్ ఉన్నదని చెప్పినప్పుడు ఇంకనూ జరిగే ఎముక నష్టాన్ని రాకుండా చూసుకోవాలి. మందులద్వారా చికిత్స పొందుతున్న వారిలో ఎముక నష్టం నెమ్మదిగా జరుగుతుంది. కాల్షియమ్ను పూరించడానికి కావలసిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులిచ్చే సలహాను పాటించాలి. ఆస్టియోపోరోసిస్ చికిత్సలో ఆహారనియమాలను పాటించి శారీరక వ్యాయామాలను చేయడం ప్రధానమైన అంశాలు. ఆరోగ్యకరమైన, కాల్షియమ్ సమృద్ధిగా ఉన్న వివిధ ఆహారపదార్ధాలను తీసుకోవడంతోబాటు నడక పరుగెత్తడంవంటి క్రమం తప్పని వ్యాయామాలద్వారా ఎముకలు దృఢత్వాన్ని పొందుతాయి.బరువువిషయంలో శిక్షణ లేదా ప్రత్యేక వ్యాయామాలు సూచిస్తారు.కిందపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు సర్వసాధారణంగా ఆస్టియోపోరోసిస్ రాదు కాని తర్వాతి కాలంలో రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కటి సమతులాహారాన్ని తీసుకోవడంతో బాటు కాల్షియం సమృద్ధిగాగల ఆహారాలను ( పాలు, వెన్న, పెరుగు, ఆకుకూరలు మరియు సిట్రస్ (నిమ్మజాతి) పండ్లను )తినాలి. ఉత్సాహంగా ఉండడానికి ఆటలు బాగా ఆడాలి. పరుగు, దుమకడం వంటి క్రీడలలో పాల్గొనాలి. నాట్యం చేయ్యడంలాంటివి చేయాలి. పొగ త్రాగడం మానివేయాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు