మధుమేహం శరీరానికి ప్రధాన ఇంధన వనరు అయిన గ్లూకోజును ఎలా ప్రభావితం చేస్తుందన్న వ్యాధి. సాధారణముగా ఇన్సులిన్ అనే హార్మొను శరీర కణాలు గ్లూకోజును తీసుకునేందుకు తద్వారా అదిశక్తిగా ఉపయోగపడేలా సహాయము చేస్తుంది. అయితే మధుమేహం ఉన్నవ్యక్తిలో అవసరంమేరకు ఇన్సులిన్ ఉత్పత్తికాకపోవటమో లేదా ఇన్సులిన్ ను శరీరకణాలు గుర్తించలేకపోవటమో లేదా రెండిటికలయిక. దీనివల్ల శరీరకణాలు లభిస్తున్న చక్కెరను గ్రహించలేకపోతాయి,తద్వారా రక్తములో చక్కెరస్థాయిపెరిగేందుకు దారితీస్తుంది. మూత్రములో చక్కెర ఉన్నప్పుడు లేదా ఉపవాసం తర్వాత లేదా మామూలు భోజనముఅయ్యాక 2గంటలతర్వాత రక్తములో చక్కెర 100మిల్లీలీటర్లకు 120మిల్లీగ్రాములకన్నా అధికంగా ఉంటే ఆవ్యక్తికి మధుమేహం ఉన్నట్లు. మధుమేహం లక్షణాలు మితి మీరిన మూత్రం ఉత్పత్తి (పాలియురియా) ఎందుకనగా మితి మీరిన రక్త చక్కెరను శరీరం మూత్రము ద్వారా వదిలించుకోవటానికి ప్రయత్నిస్తుంది. మూత్రములో కోల్పోయిన ద్రవాల నష్టాలను పూడ్చుకునేందుకు గాను విపరీతమైన దప్పిక మరియు ద్రవాలను అధికంగా తీసుకోవటం(పాలిడిప్సియా) అధిక రక్త గ్లూకోజు కంటిని ప్రభావితం చెయ్యటం వల్ల దృష్టి మసకబారటం,కంటిఅద్దాలను తరచూ మార్చాల్సిరావటం జరుగుతుంది. శక్తి లేక పోవటం వల్ల ఆకలి పెరుగుతుంది చక్కెరను మామూలుగా ఉపయోగించుకొలేకపోవటం వల్ల శరీరం కొవ్వును కండరాలను ఇంధనంగా వాడటం వల్ల వివరించలేని విధంగా బరువు తగ్గుతుంది లభ్యమయ్యే చక్కెరను ఉపయోగించుకోలేకపోవటం వల్ల సోమరితనం లేదా అలసట తెగిన గాయాలు త్వరగా మానక పోవటం ఈ లక్షణాలు రక్తచక్కెర కొద్దిగా పెరగినట్లయితే తక్కువగానే కనిపిస్తాయి. మధుమేహం రూపాలు మధుమేహానికి మూడు ప్రధాన రూపాలున్నాయి వర్గం1 వర్గం2మరియు గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహం వర్గం1మధుమేహం లేదా ఇన్సులిన్ మీద ఆధారపడ్డ మధుమేహం చాలా చిన్నవయసులో మొదలవుతుంది ఇన్సులిన్ లోపము వల్ల కలుగుతుంది దీనికి చికిత్శ ఉందికానీ పూర్తిగా నయము కాదు. ఇంజక్షన్ల వల్ల ఇన్సులిన్ ను అందించటం ప్రధాన చికిత్శా మార్గము. ఆహారములో మార్పులు మరియు శారీరక వ్యాయామాలు ఇన్సులిన్ ఇంజక్షన్లు రక్తములో చక్కెర స్థాయిని నియంత్రించటములో సహాయం చేస్తాయి మరియు చిక్కులను పరిమితం చేస్తాయి వర్గము2 మధుమేహం లేదా ఇన్సులిన్ మీద ఆధారపడని మధుమేహం మెల్లగా మొదలవుతుంది, వాడుకగా చేయించే రక్తపరీక్షలలో బయటపడుతుంది సాధారణంగా స్థూలకాయం వారిని లేదా బరువు ఎక్కువగా ఉన్నవారిని ప్రభావితులను చేస్తుంది. మధ్య ఊబకాయం (నడుము చుట్టూ ఉండే కొవ్వు), వ్యక్తులకు ఇన్సులిన్ నిరోధకాన్ని కలిగించటంలో ప్రేరకంగా ఉంటుందని తెలుస్తూ ఉంది. మందులు, నియమిత అహారం, బరువు తగ్గేందుకు మరియు రక్తములో చక్కెరస్థాయి పెరిగేందుకు వ్యాయామాలు చెయ్యటం వంటి జీవనశైలిలో మార్పులు అన్నీ చికిత్సలో భాగాలు గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహం అన్ని గర్భధారణల లోను 1-2 శాతం ఇది సంభవిస్తుంది మరియు ప్రసవానంతరం మెరుగుపడటం కానీ పూర్తిగా నయమవటం కానీ జరుగుతుంది. దీనితో ప్రభావితులైన వారిలో 1-2శాతము మహిళలు తదనంతర జీవితములో వర్గము2 మధుమేహానికి గురవచ్చు. గర్భధారణ నుంచి ప్రసవకాలం వరకూ వచ్చే మధుమేహంకు పూర్తిగా చికిత్శచేయవచ్చు కానీ గర్భధారణ సమయం మొత్తమూ తల్లికీ బిడ్డకూ మధుమేహ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా వైద్యపర్యవేక్షణ శ్రద్ద అవసరం. తల్లి అదుపులేని రక్తచక్కెర వల్ల బాధ పడవచ్చు. ఇలాంటి మహిళలకు సహజ ప్రసవం సాధారణంగా కష్టమవుతుంది. భారీ పరిమాణములోని శిశువు మరియు ఇతరచిక్కులు మరణానికి దారితీయటంతో సహా బిడ్డకు ప్రమాదాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నతల్లికి జన్మించిన పిల్లల వారు పెద్దయ్యాక మధుమేహానికి గురికావచ్చు. మధుమేహానికి సంబంధిత చిక్కులు తీవ్రమైన చిక్కులు రక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లై సెమియా) మధుమేహాన్ని నయం చేసేందుకు మందులు వాడుతున్నదశలో శీఘ్రంగా. తీవ్రంగా రక్త చక్కెర స్థాయి తగ్గటాన్నిరక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లైసెమియా) అని అంటారు. అధిక మోతాదులో ఇన్సులిన్ వాడటం,ఆహారములో పిండిపదార్ధములు చాలినంత లేక పోవటం, నోటి ద్వారా తీసుకునే యాంటీ బయాటిక్ మందులతో పాటు మద్యం తీసుకోవటం, లేదా మితి మీరిన వ్యాయాయం వల్ల కలగవచ్చు. సాధారణ రోగలక్షణాలు నీరసం, చెమటలుపట్టటం, కలత చెందటం, గుండె దడ, తలతిప్పటం మధుమేహ వ్యాధిగ్రస్తులెవరన్నా రక్తములో గ్లూకోజు మాంద్యము (హైపోగ్లైసెమియా) బారిన పడితే వారికి తక్షణం చక్కెరకానీ గ్లూకోజుకానీ ఇవ్వాలి మరియు వైద్యుడిని సంప్రదించాలి. కెటొఎసిడోసిస్ అదుపులేని మధుమేహం కెటొఎసిడోసిస్ కి దారితీస్తుంది ఇదొక తీవ్రమైన స్థితి మరియు అపస్మారకానికి దారి తీయవచ్చు. ప్రారంభదశలో రోగికి తీవ్రమైన దప్పిక, నీరసం మరియు వాంతులతో కూడిన లేక వాంతులు లేని నిదుర మత్తు. ఇది ఒత్తిడికి మరియు తీవ్ర అంటువ్యాధులకు గురయినప్పుడు సంభవిస్తుంది. ఇది వచ్చిందని అనుమానం కలిగినప్పుడు తక్షణం ఆసుపత్రికిరోగిని తీసుకువెళ్ళాలి అంటువ్యాధులు మధుమేహము గలవారు క్షయ,చర్మ మూత్రాశయద్వారము మరియు పాదాలఅంటువ్యాధులకు గురవుతారు. ఆలస్యముగా నయమయే ప్రక్రియవల్ల అదుపులేనిపాదాల అంటువ్యాధుల వల్ల కణజాలము యొక్కమృతికి(గాంగ్రిన్) దారితీయవచ్చు తద్వారా ఆ పాదము యొక్క భాగాన్నితొలగించవలసిరావచ్చు. చిన్నా పెద్దా రక్తవాహికలు దెబ్బతినవచ్చు(ఆంజియోపతి)తో సహా దీర్ఘకాలపు చిక్కులుఉన్నాయి. చిన్నరక్తవాహికలు దెబ్బతినటం మైక్రోఆంజియోపతికి దారితీయవచ్చు.అది ఈ క్రిందివాటిలోఒకదానికికానీ ఎక్కువవాటికి కానీ కారణమవవచ్చు: మధుమేహనేత్రాంతఃపటలవైకల్యం ఇందులోనేత్రాంతఃపటలం దెబ్బతిని తీవ్రదృష్టిలోపానికి లేదాఅంధత్వానికి దారితీయవచ్చు. మధుమేహనరాలవ్యాధి ఇది అసాధారణమైన,తగ్గిపోయిన స్పర్శకు దారితీస్తుంది,పాదాలతో మొదలై చేతివేళ్ళకు చేతులకు పాకుతుంది. మధుమేహకండరాలవ్యాధి అనేది నరాలవ్యాధి వల్ల కలిగే బలహీనత మధుమేహమూత్రపిండాలవ్యాధి,మూత్రపిండాలు దెబ్బతినటంవల్ల తీవ్రమైనమూత్రపిండాల వైఫల్యానికి గురిచేస్తుంది తదనంతరం రక్తశుద్ధి అవసరమవుతుంది. వయోజనులలో మూత్రపిండాలు విఫలమవ్వటానికి మధుమేహం అన్నది ఒకసాధారణకారణం స్థూలరక్తనాళమయవ్యాధి హృదయకోశరక్తనాళమయవ్యాధికి దారితీస్తుంది దానికి వేగంగారక్తనాళాలు గట్టిపడడటమొకకారణం. మధుమేహనిర్వహణ మధుమేహానికి చికిత్శ ఉంది కానీ పూర్తిగా నయం కాదు మందులుకాకుండా ఆహారము మరియు వ్యాయాయము మంచిచికిత్సాప్రణాళికలు ఆహారము సాధారణ భారతీయ ఆహారము మధుమేహానికి తగినది.అయినప్పటికీ పోషకాహారము ఎంతతీసుకోవాలనేది వ్యక్తి యొక్క వయసు,లింగము,బరువు,పొడవు,శారీరకశ్రమ మరియు శరీరధర్మసంబంధమైన అవసరాలను బట్టి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఉండాల్సిన దానికన్నా పదిశాతము తక్కువ శరీరబరువు ఉండేలా చూసుకోవాలి మొత్తము కాలరీలలో 60-65%శాతము పిండిపదార్ధాల నుంచి, 15 -20శాతము మాంసకృత్తులనుంచి, 15 -20శాతము కొవ్వునుంచి. రక్తచక్కెరమీద పిండిపదార్ధాల ప్రభావంగురించితెలిపే గ్లిసెమిల్ ఇండెక్స్ తక్కువగా ఉండే తృణధాన్యాలను పైన పొట్టుతో లేదా కాయధాన్యాలను తీసుకోవటం అభిలషణీయం. సరైన పరిమాణాల్లో ఫలాలను తీసుకోవచ్చు. మాంసకృత్తులను శాఖాహారవనరుల నుండిస్వీకరించటం మంచిది ఎందుకనగా అవి ఆహారానికి వినియోగము లేనిపదార్ధాన్ని అందిస్తాయి మరియు జంతుమాంసకృత్తులు కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడతాయి. వ్యాధితీవ్రత తక్కువగా ఉంటే కాలరీలు తక్కువగా కలిగియున్న ఆహారము మరియు చక్కెరవినియోగమున్న మిఠాయిలను,జాములు జల్లీలను తీసుకోకపోతే సరిపోతుంది. తీవ్రత పెరుగుతున్నప్పుడు వైద్యుని లేదా ఆహారశాస్త్రజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం.వారికి రక్తచక్కెర అంచనా దానితోపాటు మందులమోతాదులో హెచ్చింపులు తగ్గింపులు మరియు ఆహారపుసలహాలు తప్పనిసరి గర్భధారణ సమయములోని మధుమేహం వైద్యపర్యవేక్షణ జాగ్రత్తగా జరగాలి.ఆమెప్రతి కిలోగ్రాముకు 30-35కిలో కాలరీలశరీరబరువును తీసుకొనితీరాలి.ఆమె ఆహారములో శరీరబరువుకు తగ్గట్టుగా ప్రతి కిలోగ్రాముకు 1.5 -2 .5 గ్రాముల మాంస కృత్తులు ఉండాలి.గర్భధారణ మొత్తము సమయములో బరువులో 12కిలోగ్రాములకు మించకూడదు.తల్లీబిడ్దలకు చిక్కులెదురవ్వకుండా ఉండేందుకుగాను రక్తచక్కెర స్థాయిని గర్భిణీగా ఉన్నంతకాలము సాధారణస్థాయిలోనే కొనసాగించాలి. వ్యాయాయము వ్యాయాయము ఎవరికైనా మంచిదే ముఖ్యంగా మధుమేహముతో ఉన్నవారికి.మధుమేహం ఉన్నవారిలో క్రమంగా వ్యాయామం చేసేవారిలో మందుల అవసరం తక్కువగా ఉంటుంది. వ్యాయామ పద్ధతులను తీసుకునే ఆహరము మరియు ఇన్సులిన్/నోటిమందులమోతాదు వంటివాటి మీద ఆధారపడి ఎంపికచెసుకోవాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు