ఒక ఆహారపదార్ధం కల్తీ చెయ్యబడిందనటానికి అది ఆహారపదార్ధం యొక్క గుణానికి మరియు నాణ్యతకు చెరుపు చేసే ద్రవ్యం అదనంగా కలపబడి ఉండవచ్చు,మానవులకు హానికలిగించవచ్చు లేదా నాసిరకమైన లేదా చౌక ద్రవ్యం అయ్యుండవచ్చు. తయారీలో,పొట్లం కట్టేటప్పుడు మరియు భధ్రపరచేటప్పుడు అనారోగ్యకరమైన పద్ధతి వల్లకూడా కలుషితం అయ్యుండవచ్చు. అందులో కుళ్ళిన పాడయిన జంతువుయొక్క లేదా కూరగాయల యొక్క లేదా కీటకాలవల్ల కుళ్ళిన మలినాలు మొత్తంగా కానీ ఒకభాగం కానీ,ఉండటం వల్ల మలినమయి ఉండవచ్చు తద్వారా మానవవినియోగానికి పనికిరావు. అందులో విషపూరితమయిన లేదా ఆరోగ్యానికి హానికలిగించే ఏదయినా భాగాలు కలిగియుండవచ్చు. అనుమతి లేని రంగులు కలపబడి ఉండవచ్చు. అనుమతి లేని సంరక్షణకారులను కలిపి ఉండవచ్చు లేదా కలిపిన సంరక్షణకారి ఆ ప్రయోజనానికి అనుమతించినదాని కన్నా మించిన మోతాదులోఉండవచ్చు. ఆ ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు స్వచ్చత ఆ నిర్దిష్టవస్తువుకు నిర్దేశించినప్రమాణాలకన్నా తక్కువగా ఉండవచ్చు. పాలు మరియు పాల ఉత్పత్తులు,తృణధాన్యాలు మరియు తృణధాన్య ఉత్పత్తులు,వంటనూనెలు,మసాలా లలో సాధారణంగా కల్తీ అవుతాయి. కల్తీజరగటం వల్ల ఆరోగ్యసమస్యలు ఎన్నో.కల్తీజరిగిన ఆహారపదార్ధాలను స్వీకరించటం వల్ల విషాహారానికి దారితీయవచ్చు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు