ఆహార రంగులు ఆరోగ్యం ఆహారం ఇంకా ఆకర్షణీయంగా మరియు తినాలనిపించేలా ఉండటానికి గాను రంగులను వాడతారు. రంగులు ప్రకృతి సిద్ధమైనవి లేక కృత్రిమమైనవి కావచ్చు, క్లోరోఫిల్, అన్నాట్టొ మరియు కారామిల్ అనేవి ప్రకృతి రంగులు. రసాయనాలైన కృత్రిమ రంగులు ఎక్కువగా రంగు ఇచ్చే సామర్ధ్యం కలవి. అవి ఆహారంలో సమంగా వ్యాపించి, నిలకడగా ఉంటాయి. వీటి ఖర్చు తక్కువ. బాగా పరీక్షించిన పిమ్మట కొన్నిరంగులను వాడ వచ్చునని నిర్ధారించారు. వీటిని పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ అంటారు. వాడకూడని రంగులు వాడిన లేక ఎక్కువ మోతాదులో రంగులు వాడితే, అనేక రకములైన విష పూరితమైన లక్షణాలు కనపడవచ్చును. భారత దేశంలో అనుమతించిన రంగులు. అనుమతించిన రంగులు ఈ క్రింద ఇవ్వ బడ్డాయి. పసుపు రంగు కొరకు టార్ర్టజైన్ మరియు సన్ సెట్ ఎల్లో(సూర్యాస్తమయ సమయంలో కనిపించే పసుపు రంగు). ఎరుపు రంగు కొరకు కార్మొసైన్, పొన్ క్యు - 4 ఆర్ మరియు ఎరిత్రాసిన్. నీలి రంగు కొరకు బ్రిలియంట్ బ్లూ మరియు ఇండిగా క్యారఫైన్. ఆకు పచ్ఛ కోసం ఫాస్ట్ గ్రీన్. ఐస్ క్రీములు, బిస్కెట్లు, మద్యం కాని పానీయాలకు మరియు జెల్లీలు లాంటి రకరకాలైన ఉత్పత్తులకు పై రంగులు వాడతారు. రంగులు ఒక గ్రాముకి 100 మైక్రో గ్రాము లేక కిలోగ్రాముకి ఒక గ్రాము చొప్పున మాత్రమే వాడవలెను. కాని బఠాణి గింజలకు, నిల్వ ఉంచిన బొప్పాయికి, పళ్ళరసాలకు, ఫ్రూట్ స్క్వాష్ లకు, జెల్లీలకు, జామ్ లకు కిలోగ్రాముకి 200 మైక్రో గ్రాము వాడవచ్చును.అయితే, ఆహారాన్ని వడ్డించేటప్పుడు లేదా భుజించే టప్పుడు అది 100 మైక్రో గ్రాములు దాటకూడదు. విషప్రభావం మరియు ఆహారపు రంగులు కొన్ని రంగులు ఆమోదించిన పరిమాణంలో వాడినగాని విషప్రభావం చూపిస్తాయి. కాని కొన్ని మాత్రం ఆమోదించిన ప్రమాణం దాటితే విషప్రభావం చూపుతాయి. ఉదాహరణకి పోన్ క్యుఆర్ – సొంఫ్ లో దీనియొక్క ఉనికి స్కూలు పిల్లల నాలుకపై గ్లోసిటిస్ వచ్చేట్టు చేస్తాయి. టార్ర్టజైన్ కొంత మందికి పడదు. ఎరిత్రోసిన్ అయోడిన్ ను నిలిపివేసి గోయ్ టర్ ను కలగజేయును. నాన్ ఫుడ్ కలర్స్, నేత లో వాడే రంగులను చాలా వరకు ఆహారంలో వాడతారు ఇవి చాలా ప్రమాద కరమైనవి.ఉదాహరణకి బిర్యానిలో, లడ్డులో కలిపే మెటనిల్ పసుపు, నీరసాన్ని, తల త్రిప్పుటను, వాంతులను మరియు సయనోసిస్ ను కలుగ జేయును. వైద్య చిట్కాలు. శ్రేయస్కరమైన రంగులను, హానికరమైన రంగులను వేరు చేసి తెలుసుకొనుట కష్టము. కావున బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐయస్) ధృవీకరించిన రంగుల ఉత్పత్తులను కొనుట క్షేమము.ఆమోదించని రంగులు వాడిన, ఆహార పదార్ధాలను మానుట మంచిది. ఉదాహరణకి - చాక్లెట్లు, మిఠాయిలు, చల్లనిపానీయాలు, సాంఫ్, కూరగాయలలో కారెట్లు, బఠాణీలు, వండిన వంటలు మరియు మాంసాహారము. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు