పోషక నష్టం అనేది ఉష్ణోగ్రత మీద, వండే సమయాన్ని బట్టి మరియు పోషకం మీద ఆధారపడిఉంటుంది. పప్పులు మరియు కాయ ధాన్యములు పప్పులు, ధాన్యములు, మాంసములో ఉన్న ప్రోటీన్లు, కొవ్వు మరియు పిండి పదార్థాలు మామూలుగా వండుట వలన తక్కువగా పోతాయి. బియ్యం కడుగుట వలన 40 శాతం థైయామిన్ మరియు నికోటినిక్ ఆసిడ్ పోతాయి. వరిని సగం ఉడికించి, ఆ బియ్యాన్ని వాడుట వలన, బియ్యాన్ని కడిగినా మరియు గంజి వార్చి నప్పటికి, తక్కువ విటమిన్లు మరియు ఖనిజాలు పోతాయి కూరగాయలు. వండడానికి ముందు కూరగాయలు చిన్నముక్కలుగా కోసి, గాలిలో చాలా సమయం వరకు ఉంచుట వలన, విటమిన్లు ప్రత్యేకంగా సి విటమిన్లను కోల్పోతాయి. పెద్ద ముక్కలుగా కోసి, మరుగుతున్న నీటిలో వెంటనే వేసి, తక్కువ సమయం వరకు వండుట శ్రేయస్కరం. మూత ఉన్న పాత్రలో కూరగాయలను తక్కువ నీటితో వండి, మరియు త్వరగా భుజించుట మంచిది. లీచింగ్ (విటమిన్లు నీటిలో కలిసివోవుట)ను ఆవిరిపరచుట ద్వారా ఆపవచ్చును. ఉప్పు వేసిన నీటిలో కూరగాయలను వండి, వండిన నీటిని తీసివేస్తే కొన్ని ప్రోటీన్లను నష్ట పోతాము. వండిన నీటిని పారవేసిన, సోడియం,పొటాషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలను లీచింగ్ (విటమిన్లు నీటిలో కలిసివోవుట) ద్వారా కోల్పోవచ్చును. కావున వంట తక్కువ నీటితో వండు కోవాలి లేదా వండిన నీటిని సూప్స్ లో కాని గ్రేవీలలోకాని వాడుకోవాలి. నీటితో వండుతున్నప్పుడు ఎ విటమిన్ మరియు కెరోటిన్ పోవు. వ్రేళ్ళు, దుంపలు ఎన్ని రకాలుగా వండిన వాటిలోని పోషకాలు ఎక్కువగా పోవు. వాటి మీద పైపొర పోషకాలు లీచింగ్(విటమిన్లు నీటిలో కలిసివోవుట) ద్వారా పోకుండా కాపాడుతుంది. కావున ఇటువంటి కూరగాయలు పొరతో సహా వండి, అవసరానికి ముందు పొరను వలిచి వేస్తే మంచిది. వడ్డించే ముందు వండిన కూరగాయలను ఎక్కువ సేపు బయట ఉంచిన సి విటమిన్ ను కోల్పోయే అవకాశం ఉంది. పశు సంబంధిత ఉత్పత్తులు. సాంప్రదాయ పద్ధతి లో వండుట వలన గుడ్లు కొన్ని పోషక విలువలను తక్కువగా కోల్పోయే అవకాశం కలదు. పాలను ఎక్కువగా మరిగించి తేమగా ఉన్నచోట ఎక్కువ సేపు నిల్వ ఉంచితే, పాలు ఎర్రబడి ప్రోటీన్ విలువ తగ్గిపోవును. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు