యాంటీఆక్సిడెంట్స్ కు పండ్లు మంచి ఆధారవనరు. పండ్లలో విటమిన్ సి బాగా లభిస్తుంది.ఉసిరి,జామకాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా లభిస్తుంది. మామిడి మరియు బొప్పాయి లాంటి పచ్చటి పళ్ళలో విటమిన్ -ఎ కు ముందుండే రూపమైన బీటా కెరొటిన్ ఉంటుంది. మామూలు అరటిపళ్ళలో పిండిపదార్ధాలు ఎక్కువగా ఉండి శక్తినిస్తాయి. ఎండబెట్టిన పళ్ళలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఆహారానికి అనుపానాన్ని కలగజేసి, ప్రేవుల్లో కదలికకు ఉపకరించే పెక్టిన్ ను ఫలాలు కలిగిఉంటాయి. గుర్తుంచుకోదగ్గ ఆరోగ్యచిట్కాలు ఋతువుల్లో దొరికే ఫలాలను తినాలి.(జామ.ఉసిరి,సీతాఫల)ఆయా ఋతువుల్లో ఇవి చౌకగా దొరుకుతాయి. అన్ని ఫలాలు తాజాగా,పండాక తింటే రుచికరంగానూ,బలవర్ధకంగానూ ఉంటాయి. ఫలాల పైన ఉండే తొక్కను తీసివేసి తిన్నాసరే ఆ పండును పూర్తిగా నీటితో కడిగి తినాలి.ఫలాల(జామ.ఆపిల్)పై ఉండే పై తినదగ్గపైతొక్కను అలాగే ఉంచి లేదా బాగా తక్కువగా తొలగించి తినాలి. ఈ తొక్కలో కానీ దాని కింద కానీ విటమిన్లు,ఖనిజాలు,పీచు ఉంటాయి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు