ఇవి వంటలో,ఆహారపు రుచిని పెంచేందుకు గాను ఉపయోగించే అనుబంధఅహారపదార్ధాలు వీటిని చాలా తక్కువపరిమాణాలలో వాడతారు,పౌష్టికతను పెంచటములో వీటిపాత్ర బాగా పరిమితం. ఈ మసాలాలలో కొన్ని ఐరన్,ఛాయాలోహాలు,యాంటీఆక్సిడెంట్స్ మరియు పొటాసియం సమృద్ధిగా కలిగిఉంటాయి. ఈ మసాలాలలో మిరపకాయలు,ధనియాలు లాంటివి కొంతమేరకు బీటా -కెరటీన్ అందజేస్తాయి. పచ్చిమిరపకాయలలో సి విటమిన్ మరియు బీటా-కెరటీన్ కలిగిఉంటాయి. సుగంధద్రవ్యాలు (పసుపు లాంటివి) టానిన్ న్ను(పసుపు లాంటివి) ఎక్కువగా కలిగి ఉంటాయి.ఇవి శరీరం ఇనుమును స్వీకరించేటప్పుడు జోక్యం చేసుకుంటాయి. సుగంధ ద్రవ్యాలలో చాలా రకాలైన ఔషదపరంగా చురుకైన కోలిన్,బయోజెనిక్ అమిన్స్ లాంటి ద్రవ్యాలు ఉంటాయి. వీటిలో ఇంగువ,వెల్లుల్లి వంటివి క్రిమిసంహారక నిరోధకశక్తినిచ్చే గుణాన్ని కలిగియుంటాయి మరియు కుళ్ళబెట్టే బాక్టీరియాను అడ్డగిస్తాయి. పసుపు మరియు లవంగాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడాంట్స్ ను కలిగియుంటాయి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు