కొన్ని ఆహార పదార్ధాలలో విష మిశ్రితాలు సహజంగానే ఉంటాయి. ఆయా పదార్ధాలను మనంతీసుకున్నట్లయితే మన ఆరోగ్యం చెడిపోతుంది. మన ఆహారంలో ఉండే కొన్ని ముఖ్యమైన విష పదార్ధాలు- సైనొజెనిక్ గ్లైకొసైడ్స్ కొన్ని మొక్కలు కాస్సావా , కర్రపెండలం టాప్యొక మరియు జొన్న వంటిమొక్కల తీనే భాగాలలో ఇవి ఉంటాయి. తాజాగా తొక్క తీసిన కస్సానా ను తినడం,చేదుగాఉన్ననులేదాదెబ్బతిన్న వాటిని తినక పోవడం వలన విష కారకాలకు దూరం కావచ్చు. తాజాగా తొక్క తీసిన కస్సవాను వండేముందు ప్రవహించే నీటిలోకడగడం ద్వారా గ్లైకొసైడ్స్ అన్నికూడ తొలగింపబడతాయి. హీమో గ్లూటినైన్లు పందిరి చిక్కుడు, దొంతచిక్కుడు, ఉలవలు వంటి కొన్ని మొక్కలలో ఈవిష పదార్ధముంటుంది. ఎర్రరక్తకణాలను దగ్గరగా కూర్చుతాయి. వేడిమి వలన ఈ విషపదార్ధాలు నశించిపోతాయి. లేథ్రిజమ్ లేదా న్యూరొలేథ్రిజమ్ జీనస్ లేథ్రిస్కు చెందిన కొన్ని పప్పులను ను తినడంవలన నరాల సంబంధమైన జబ్బులు వస్తాయి. లేథ్రిస్ సటైవస్ ప్రధానంగా దీనితోబాటు ఉండడం కారణంగా(దీనినేగడ్డి బఠాణి(గ్రాస్ పీ),కేసరిపప్పు అంటారు) ఈ విష పదార్ధంలో ఉండే న్యూరొటాక్సిన్ బీటా- ఆక్జలైల్ ఎల్-ఆల్ఫ,బీటా- డైయమినో ప్రోపియోనిక్ ఆమ్లం (ఒడిఎపి, దీనినే బీటా-ఎన్-ఆక్జైల్ అమైనో-ఎల్-ఆలనైన్, బిఒఎఎ అంటారు) వలన నరాలు బిగపట్టడం జరుగుతుంది. దీని కారణంగా పక్షవాతం వస్తుంది.కాళ్ళల్లో బలం తగ్గడంలేదాకదలించలేకపోవడమనే లక్షణం కన్పిస్తుంది.కండరాలలో కొవ్వు తగ్గడంవలన పిరుదులు పలుచనకావడం లేథ్రిజమ్ యొక్క ప్రత్యేక లక్షణం. తీసుకోవలసిన ముందు జాగ్రత్తలుఃకేసరి(ఎర్ర)పప్పు తినకపోవడమే శ్రేయస్కరం.ఒకవేళ తినాలనుకుంటే కేసరిపప్పు గింజలను బాగా వేడిచేసిన తర్వాత ఆ నీటిని తీసివేయాలి. ఫ్లాట్యులెన్స్ వాయువు కారకాలు శనగలు, కందులు, లీమాబీన్స్, మినుములు, పెసలుమొదలగు లెగ్యూమ్ జాతి పప్పు గింజలలోధిక పరిమాణంలో వాయువులను ఉత్పత్తిచేసే (ఫాట్యులెన్స్) ఉండి జీర్ణక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. ప్రేగులలో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది. శనగలను భుజించినప్పుడు అత్యధికంగాను, పెసలను భుజించినప్పుడు అల్పంగాను ఫ్లేట్యులెన్స్ ఉత్పత్తి అవుతుంది. ఓక రాత్రంతా అపరాలను నానబెట్టి, ఆనీటిని పారబోసి తర్వాత వండుకున్నట్లయితే ఫ్లేట్యులెన్స్ కారకాన్నిఉత్పత్తిచేయడం తగ్గిపోతుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు