ద్రవాభిసరణ పీడనం, ద్రవతుల్యతను నిర్వహించడంలో సోడియమ్ ఆవశ్యకతగలదు. సామాన్యకండర బాధల ఉపశమనానికి ఇది అవసరం. గ్లూకోజ్, గేలక్టోజ్ మరియు అమైనో ఆవ్లూలను ప్రేవులు శోషణంచేసుకోవడానికి సోడియమ్ ప్రమేయముంటుంది. గుండె కొట్టుకోవడం ప్రారంభానికి, నిర్వహించడానికి దీని ఆవశ్యకత ఉంది. సోడియమ్ ఉండే పదార్ధాలుః వంట కాలలో వినియోగించే సాధారణ ఉప్పులో ప్రధానంగా సోడియమ్ ఉంటుంది. అన్ని ధాన్యాలు, ఆకు కూరలు, గింజలు, గ్రుడ్లు మరియు పాల ల్లోను ఉంటుంది. పోషకాలల్లో సోడియమ్ సంబంధిత అవ్యవస్థలు సాధారణ వ్యక్తులందరికి సోడియమ్ రోజుకి 5-10 గ్రాములు తీసుకునే ఆవశ్యకతగలదు. కుటుంబ చరిత్రలో అధిక రక్త పీడనం గలవారెవరైనా ఉంటే ఆ కుటుంబపు వ్యక్తులు వారు వాడే సోడియమ్ పరిమాణాన్ని 5 గ్రాములకన్నా తక్కువకు తగ్గించాలి. అధిక రక్త పీడనంతో బాధపడే రోగులు వారి ఆహారంలో రోజుకి కేవలం 1 గ్రాము మాత్రమే ఉండాలి. 10 గ్రాముల సోడియమ్ క్లోరైడ్ (సాధారణ ఉప్పు) లో 4 గ్రాముల సోడియమ్ ఉంటుంది. జబ్బులు స్థాయి లోపాలు సోడియమ్ లోపముంటే గనుక సీరమ్ సోడియమ్ స్థాయి సాధారణ స్థాయికన్నాతక్కువగా పడిపోతుంది. ఈ స్థితినే హైపోనేట్రీమియా అంటారు . అతిసారం (డయేరియా), వాంతులు దీర్ఘకాల మూత్రనాళ సంబంధిత రోగాలు దలగున్నవి సోడియం లోపానికి దారితీస్తాయి. సోడియమ్ లోపం వలన రక్తపీడనం తగ్గడం, ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. నీటిలోకరిగిన ఉప్పును తీసుకుంటే సామాన్యంగా శరీరం తేరుకుంటుంది. అధికంగా ఉంటే అధిక స్థాయిలో సోడియమ్ ఉంటే సీరమ్ సోడియమ్ స్థాయి పెరుగుతుంది. ఈస్థితినే హైపర్ నేట్రీమియా అంటారు. సామాన్యంగా దీని వలన కొన్ని హార్మోనులలో ఎక్కువతక్కువలు ఏర్పడతాయి. రక్త పీడనంపెరగడం (హైపర్ టెన్షన్), శరీరంలో నీరు చేరడం తో ఎడిమా రావడం. వంటి లక్షణాలు హైపర్ నేట్రీమియాలో కన్పిస్తాయి. కొంత వరకు మూత్రపిండాల సమస్యలు కూడ ఏర్పడతాయి. గర్భవతులకు అధిక రక్తపీడనం కల్గే అవకాశం ఉంటుంది. కొన్ని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు