ఇది గాఢత చెందిన శక్తి రూపంలో ఉంటుంది. శరీర నిర్మాణానికి కావలసిన నిర్మితపదార్ధాలను మరియు కొన్ని విటమిన్ల వినియోగానికి క్రొవ్వులు తోడ్పడుతాయి. కొవ్వుల నిచ్చే పదార్ధాలుః నూనెలు, మాంసం మరియు మాంస సంబంధఉత్పత్తులు, పెరుగు, వెన్న, నెయ్యి, కొన్ని రకాల చేపలు, గింజలు మరియు సోయాబీన్స్. మేలు మరియు కీడు చేసే క్రొవ్వులు ఆవశ్యక పదార్ధాలైన గ్లిసరాల్, కొవ్వు ఆమ్లాల తో అన్నిక్రొవ్వులు ఏర్పడతాయి. కొవ్వులలో గల క్రొవ్వు ఆమ్లాల రకం పై ఆధారపడి మేలు లేదా కీడురకపు క్రొవ్వులుగా చెప్ప బడతాయి. క్రొవ్వు ఆమ్లాలు అసంతృప్త, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలుగా విభజించడమైనది. అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఇవి మరల మోనొ (ఏక)అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు(ఎమ్యుఎఫ్ఎ),అనేక(పోలి) అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు (పియుఎఫ్ఎ)గా వర్గీకరించబడ్దాయి. పియుఎఫ్ఎ రెండు రకాలు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్లు (క్రొవ్వు ఆమ్లాలు) మరియు మార్పు చెందిన క్రొవ్వు ఆమ్లాలు. ఆహారపు వనరులలో ఎమ్యుఎఫ్ఎ – వేరుసెనగ పప్పు నూనె లేదానువ్వుల నూనె, ఆలీవ్ నూనె మొదలగునవి. పియుఎఫ్ఎ-జొన్న, సోయాబిన్,సేఫ్ ఫ్లవర్ , సన్ ఫ్లవర్ (పొద్దు తిరుగుడు పువ్వు)మొదలగు వాటినుండి తీసిన నూనెలు. ఒమెగా-3 క్రొవ్వు ఆమ్లాలు-చేపలు చేప నూనెలు.ఆకు కూరలైన పుదీన, పప్పు ధాన్యాలు గింజల నుండితీసిన నూనెలు, ఆవాలు, మెంతులు , మసాలాలు . (ట్రాన్స్ క్రొవ్వు ఆమ్లాలు)- రొట్టె,బిస్కెట్ల (బేకరి )ఉత్పత్తులు, బాగా ఎండిన లేదా వేయించిన చిరుతిళ్ళు, సమోసాల వంటి వాటిలో ఎక్కువగా వేయించడానికి మరల మరల వినియోగించే వనస్పతి వంటి నూనెలు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు పాలు, పాల ఉత్పత్తులు- నెయ్యి, వెన్న,పెరుగు.గ్రుడ్లు,మాంసఉత్పత్తులతోబాటు కొబ్బరి,పామ్ వంటి శాకీయనూనెలు , ఉదజని సంబంధిత (హైడ్రోజినేటెడ్)నూనెలలో (డాల్డ, వనస్పతి లాంటివి ) ఈ సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఆరోగ్య చిట్కా ఒమెగా 3 క్రొవ్వు ఆమ్లాలు మనం తినే ఆహారంలో అధికంగా ఉంటే రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డలుగా అవడం, హృదయ సంబంధిత వ్యాధులువచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కాని ట్రాన్స్ క్రొవ్వు ఆమ్లాలుమరియు సంతృప్త ఆమ్లాలు ఆహారంలో ఉంటే గుండెపోటువచ్చేప్రమాదం ఎక్కువవుతుంది. ఎందుకో మీకు తెలుసా? ఒమెగా-క్రొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిసరైడ్స్థాయిలను తగ్గిస్తాయి. కాని ట్రాన్స్ ఫాటీఆమ్లాలు మరియు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలుఆహారంలో కలిసి ఉం టే శరీరంమొత్తంలో కోలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు