సంపూర్ణ ప్రోటీన్ మన శరీరానికి ప్రోటీన్ ఒక అత్యంత ముఖ్యమైన పోషకాంశం. కండరాల నిర్మాణం, కణాల మరమ్మత్తు, రోగ నిరోధక శక్తి పెంపు వంటి ప్రతి పనిలోనూ ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ప్రతి కణం, ప్రతి హార్మోన్, ప్రతి ఎంజైమ్ తయారీలో ప్రోటీన్ భాగస్వామ్యం ఉంటుంది. పుట్టగొడుగులు ప్రోటీన్ పరంగా పప్పు దినుసులు, సోయా అంత సమృద్ధిగా లేకపోయినా, తక్కువ కేలరీలు, ప్రత్యేకమైన విటమిన్లు, ఖనిజాలతో ఆహారంలో వైవిధ్యాన్ని తీసుకువస్తాయి. మూడింటినీ కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య పోషకాహారం సాధ్యమవుతుంది. పుట్టగొడుగులు పుట్టగొడుగులు మొక్కలు కావు, ఇవి 'ఫంగై' అనే ప్రత్యేక జీవ వర్గానికి చెందినవి. అడవుల్లో, తేమతో కూడిన ప్రాంతాల్లో సహజంగా పెరిగే వీటిని క్రమంగా మనుషులు సాగు చేయడం నేర్చుకున్నారు. పుట్టగొడుగుల సాగుకు నేల అవసరం లేదు. వరి గడ్డి, ఇతర వ్యవసాయ వ్యర్థాలను మాధ్యమంగా ఉపయోగించి, చీకటి గదుల్లో తేమ, ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ వీటిని పెంచుతారు. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది.భారతదేశంలో బటన్ మష్రూమ్, పాల మష్రూమ్ వంటి రకాలు ఎక్కువగా సాగు చేస్తారు. కేవలం 20-25 రోజుల్లోనే పంట చేతికి రావడం వల్ల, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఆర్జించే అవకాశం రైతులకు ఉంటుంది. పుట్టగొడుగుల పోషక విలువ పుట్టగొడుగుల్లో ప్రోటీన్ శాతం సోయాతో పోలిస్తే తక్కువగా ఉన్నా, ఇవి తక్కువ కేలరీలతో అధిక పోషకాలను అందించే ప్రత్యేకమైన ఆహారంగా నిలుస్తాయి. ప్రోటీన్: ప్రతి 100 గ్రా. పుట్టగొడుగుల్లో సుమారు 3-4 గ్రా. ప్రోటీన్ ఉంటుంది, ఇది తక్కువగా అనిపించినా, తక్కువ కేలరీలతో లభించే నాణ్యమైన ప్రోటీన్. విటమిన్ డి: సూర్యరశ్మికి బహిర్గతమైన పుట్టగొడుగుల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది, ఇది మొక్కల ఆధారిత ఆహారాల్లో అరుదైన లక్షణం. విటమిన్ బి: రిబోఫ్లావిన్, నియాసిన్ వంటి బి-విటమిన్లు శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి. సెలీనియం, పొటాషియం: యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కేలరీలు, కొవ్వు: బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారికి అనువైన ఆహారం. పుట్టగొడుగులను సూప్‌లు, కూరలు, సలాడ్లలో వాడటం వల్ల ఆహారానికి రుచి, పోషకాలు రెండూ జతచేరతాయి. వీటిలో ఉండే బీటా-గ్లూకాన్ అనే పీచు పదార్థం రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పప్పు దినుసులు పప్పు దినుసుల పోషక విలువ కందులు, పెసలు, శనగలు, మినుములు వంటివి ప్రోటీన్‌తో పాటు అనేక ఇతర పోషకాంశాలకు కూడా గొప్ప వనరు. ప్రోటీన్ : ప్రతి 100 గ్రాములలో సుమారు 20-25 గ్రా. ప్రోటీన్ లభిస్తుంది, ఇది శాఖాహారుల ప్రధాన ప్రోటీన్ వనరుగా పనిచేస్తుంది. పీచు పదార్థం : జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఇస్తుంది. ఐరన్ (ఇనుము) : రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా మహిళలకు అవసరమైన పోషకం. ఫోలేట్ (విటమిన్ బి9): గర్భిణీ స్త్రీలకు, కణాల విభజనకు అత్యంత అవసరమైన విటమిన్. పొటాషియం, మెగ్నీషియం: గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడతాయి. కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది, వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా సురక్షితమైనవి. క్రమం తప్పకుండా పప్పు దినుసులను ఆహారంలో చేర్చు కోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. సోయా సోయా పోషక విలువ ఇది 'సంపూర్ణ ప్రోటీన్' వనరు. శరీరానికి అవసరమైన అన్ని రకాల ఎసెన్షియల్ అమినో ఆసిడ్లు సోయాలో లభిస్తాయి, సాధారణంగా మొక్కల ఆధారిత ఆహారాల్లో అరుదైన లక్షణం. ప్రోటీన్ : ప్రతి 100 గ్రాముల సోయాలో సుమారు 36-40 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది మాంసంతో సమానమైన ప్రోటీన్. అమినో యాసిడ్లు: లైసిన్, ల్యూసిన్ వంటి ముఖ్యమైన అమినో యాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి, కండరాల నిర్మాణానికి ఇవి కీలకం. కాల్షియం : ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా పాలు తీసుకోని వారికి ప్రత్యామ్నాయ కాల్షియం వనరు. ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సోయాలో ఉండే ప్రోటీన్ నాణ్యత చాలా ఎక్కువగా ఉండటం వల్ల శరీర దారుఢ్యం పెంచుకోవాలనుకునే వారికి, క్రీడాకారులకు సోయా ఒక ఆదర్శవంతమైన ఆహారంగా మారింది. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డా. ఆర్.ప్రభావతి, విషయ నిపుణులు, (హోమ్ సైన్స్) కె.వి.కె., గరికపాడు, ఎన్.టి.ఆర్