ష్యాడో ప్లే డిలైట్ వస్తువులు: కాంతి మూలం (దీపం లేదా ఫ్లాష్ లైట్), చదునైన ఉపరితలం. దశలు మసక వెలుతురు ఉన్న గదిలో దీపం ఏర్పాటు చేయండి. సాధారణ వస్తువులను ఉపయోగించి లేదా మీ చేతులతో నీడలను సృష్టించండి. నీడను చూడటానికి మరియు అన్వేషించడానికి పిల్లలను ప్రోత్సహించండి. నీడలకు పేరు పెట్టి చర్చించండి. నీడలను పేర్లతో పిలుస్తూ, వాటిని వెంటాడే సున్నితమైన ఆటలో పాల్గొనండి. కృత్యం ప్రాధాన్యత: కళ్ళతో గమనించే నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఊహా శక్తికి ప్రేరణ ఇస్తుంది. నీడ యొక్క మాయా ప్రపంచాన్ని పిల్లవాడు అన్వేషిస్తున్నప్పుడు పరస్పరం మాట్లాడుకునే చర్చను ప్రోత్సహిస్తుంది. శరీర భాగాలను కనుగొనడం వస్తువులు: ఏమీ లేదు. దశలు సౌకర్యవంతమైన మరియు ఉల్లాసభరితంగా బిడ్డతో కూర్చోండి. "నీ చేయి ఎక్కడ ఉంది?నీ ముక్కు ఎక్కడ ఉంది" అని బిడ్డను అడగండి. చెప్పిన శరీర భాగాలను చూపించడానికి బిడ్డను ప్రోత్సహించండి. చిరునవ్వుతో బిడ్డలు చెప్పినదానిని సానుకూలంగా బలపరుస్తూ ప్రశంసించండి. క్రమంగా కొత్త శరీర భాగాలను పరిచయం చేస్తూ, కృత్యాన్ని పునరావృతం చేయండి. కృత్యం ప్రాధాన్యత: నిర్దిష్ట శరీర భాగాలకు అనుసంధానించి పదాలను సరదాగా చెప్పటంతో పిల్లల భాషా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. సరదాగా వ్రాయటం వస్తువులు: క్రేయాన్/పెన్సిల్ మరియు కాగితం. దశలు బిడ్డతో కూర్చుని, వారు చూస్తున్నప్పుడు పెన్సిల్/క్రేయాన్ను ఉపయోగించి కాగితంపై వ్రాయండి. బిడ్డను ఏ చేతితోనైనా, ఏ విధంగానైనా క్రేయాన్ను పట్టుకోనివ్వండి. బిడ్డ చేసే ఏ రకమైన గుర్తులు లేదా గీతలకైనా వారిని ప్రశంసించండి. బిడ్డ అనుసరించడానికి సరదాగా వివిధ ఆకారాలను గీయండి. కృత్యం ప్రాధాన్యత: సూక్ష్మకండర నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది మరియు సృజనాత్మక వ్యక్తీకరణను పరిచయం చేస్తుంది. సంతోషకరమైన పాటల సమయం వస్తువులు: ఏమీ లేదు. దశలు సరళమైన, ఉల్లాసభరితమైన పాటను ఎంచుకోండి. బిడ్డతో కూర్చుని లేదా నిలబడి ఉల్లాసభరితంగా ఉండండి. ఉత్సాహంగా, ఆనందంగా ఎంచుకున్న పాటను పాడండి. పాడటంతో పాటుగా అదనపు వినోదం కోసం చేతులను కదిలించడం లేదా చప్పట్లు కొట్టడం వంటివి చేయండి. హావభావాలను అనుకరించమని ప్రోత్సహించడం ద్వారా పిల్లలను నిమగ్నం చేయండి. కృత్యం ప్రాధాన్యత: పాట ద్వారా భాషా అభివృద్ధిని ప్రోత్సహించటమే కాక తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి పాడటంలోని ఆనందాన్ని పంచుకునేటప్పుడు వారి మధ్య బంధాన్ని బలపేతం చేస్తుంది. ఆధారం : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ