పాదరక్షల వర్గీకరణ మరియు జతచేయటం వస్తువులు: నాలుగు వేర్వేరు రకాల పెద్దవాళ్ళ మరియు చిన్న పిల్లల పాదరక్షలు. దశలు పెద్ద మరియు చిన్నవాళ్ళ పాదరక్షలను ఒక గుంపుగా కలిపి వేయండి. పెద్ద మరియు చిన్న పాదరక్షలను ఎలా సైజులవారీగా వర్గీకరించుకోవాలో బిడ్డకు చూపించాలి. వర్గీకరించిన పాదరక్షలన్నిటినీ గుంపుగా కలిపి వేసి బిడ్డను సొంతంగా వాటిని క్రమబద్ధీకరించమని అడగాలి. పెద్ద మరియు చిన్న పాదరక్షలను సైజుల వారీగా సరిగా వేరు చేయగానే బిడ్డను అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: బిడ్డను వివిధ సైజుల వారీగా ఉన్న వస్తువులను గమనించి, వేరు చేసి, వర్గీకరించే పనిలో సరదాగా నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించండి. దీనివలన బిడ్డలో అభిజ్ఞ కౌశలం పెంపొందుతుంది. బంతితో ఆడుకొనుట వస్తువులు: మెత్తని బంతి లేక చుట్టిన మేజోళ్ళు. దశలు మృదువైన బంతిని ఉపయోగించండి లేక బంతిలాగా ఒక జత మేజోళ్ళని చుట్టండి. ఆడుకోవడానికి బిడ్డకు బంతిని ఇవ్వండి. బంతిని బిడ్డకు విసురుతూ 'విసురు' అనే పదాన్ని ఉపయోగించండి. బంతితో వెనుకకి ముందుకు విసురుతూ బిడ్డతో సరదాగా గడపండి. కృత్యం ప్రాధాన్యత: స్థూల కండరాల అభివృద్ధి పెరుగుతుంది. కంటి–చేతి సమన్వయంతో పాటు ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం పరిచయం అవుతుంది. బొమ్మతో దాగుడుమూతలు వస్తువులు: బొమ్మ లేక టెడ్డీబేర్. దశలు ఆట బొమ్మను దాచిపెట్టి బిడ్డను 'బొమ్మ ఎక్కడ ఉంది?' అని అడగాలి. బిడ్డ ఆట బొమ్మను కనుగొనే విధంగా ఉత్సాహం నింపాలి. బిడ్డ బొమ్మను కనుగొన్న ప్రతిసారీ అభినందిస్తూ సరదాగా మరల మరల ఆటను కలిపి ఆడాలి. బిడ్డలో ఈ ఆట వలన ఏకాగ్రత, మేధస్సు మరియు ఊహా శక్తి పెరుగుతుంది. కృత్యం ప్రాధాన్యత: ఈ ఆట వలన బిడ్డల ఏకాగ్రత, ఊహా శక్తి, అభిజ్ఞ కౌశలం పెరుగుతుంది. రంగుల చేతులు వస్తువులు: కుంకుమ, పసుపు మరియు ఇంటిలో ఉపయోగించే సురక్షితమైన రంగులు, పెద్ద కాగితం లేక అట్టముక్క. దశలు పెద్ద కాగితం కానీ అట్ట ముక్క కానీ కాన్ వాస్ లాగా క్రింద పరవండి. పసుపు, కుంకుమ వంటి సురక్షితమైన పదార్థాలను బిడ్డకు ఇవ్వండి. బిడ్డను ఆ రంగులతో తన చేతులను ముంచి కాన్ వాస్ మీద అద్దే విధంగా ప్రోత్సహించండి. రంగులను పరిచయం చేయడానికి సానుకూలమైన పదాలను ఉపయోగిస్తూ సృజనాత్మకతను బిడ్డతో కలిపి ఆనందంగా జరుపుకోవాలి. బిడ్డ స్వేచ్ఛగా కొత్త కొత్త రంగులను రంగులతో సృష్టించడానికి అనుమతించాలి. కృత్యం ప్రాధాన్యత: బిడ్డలో సృజనాత్మకతను మరియు ఇంద్రియ గ్రహణాన్ని మెరుగుపరుస్తుంది. రంగులను పరిచయం చేస్తుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ