చిత్రాల పుస్తకంతో కథ చెప్పే సమయం వస్తువులు: చిత్రాల పుస్తకం. దశలు మీ బిడ్డ వయస్సుకు తగిన చిత్రాల పుస్తకాన్ని ఎంచుకోండి. మీరు మీ బిడ్డతో కలిసి కూర్చుని పుస్తకంలో వాటిని బిగ్గరగా చదవండి. పుస్తకంలోని చిత్రాల పేర్లను వేలితో చూపిస్తూ బిడ్డను వాటిని మరలా తిరిగి చెప్పే విధంగా ప్రోత్సహించండి. కథను వివరిస్తూ మీ ఆలోచనలను పంచుకుంటూ బిడ్డను ప్రశ్నలు అడగండి. పుస్తకంలోని చిత్రాలు లేక పాత్రలకు సంబంధించి కొత్త కథలు తయారు చేయండి. కలిసి చదువుకుంటూ, ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ నిమగ్నమయ్యే అనుభవాన్ని బిడ్డతో కలిసి ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: పుస్తకంలోని చిత్రాలను పేర్లతో పిలుస్తూ, చదవడం ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధి మెరుగవుతుంది. కథ చెప్పడం ద్వారా అభిజ్ఞా కౌశలం మరియు పుస్తకాల పట్ల, చదవడం పట్ల పిల్లల్లో అభిరుచి పెంపొందుతుంది. ఆహారపదార్థాలను వర్ణించటం వస్తువులు: అన్ని ఆహార పదార్థాలు. ఉదాహరణకు (అరటిపండు, ఉడకబెట్టిన కోడిగుడ్డు) మొదలైనవి. దశలు మీ బిడ్డకు ఏదైనా ఆహార పదార్థాన్ని చూపించి బిడ్డ వాటిని తాకి అనుభూతి చెందేలా చూడండి. బిడ్డకు అరటిపండును ఇచ్చి ఈ అరటిపండు తియ్యగా, జారిపోతూ నలపడానికి వీలుగా ఉందా? కోడిగుడ్డు వేడిగా మరియు గట్టిగా ఉందా? వంటి ప్రశ్నలను అడగాలి. మీ బిడ్డ ప్రతిస్పందనలను గమనించి బిడ్డ తిరిగి చెప్పేట్టు, మాట్లాడేట్టు ప్రోత్సహించండి. బిడ్డకు ఎక్కువ కొత్త పదాలను నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరిన్ని ఆహార పదార్థాలను చూపించాలి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వలన వివరణాత్మక పదాల పరిచయం, పదజాలం అభివృద్ధి జరుగుతుంది. భోజన సమయంలో పరిశీలనాత్మక, సంభాషణ నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. నీళ్లతో ఆడుకోవడం వస్తువులు: బకెట్ నీళ్ళు, పిల్లలకు అనువైన గ్లాసులు లేదా కప్పులు. దశలు ఒక బకెట్టుని నీళ్లతో నింపి సురక్షితమైన ఆట ప్రదేశంలో పెట్టండి. నీళ్లను తీయడానికి, ధారగా పోయడానికి బిడ్డకు అనువైన గ్లాసులు లేదా కప్పులను ఇవ్వండి. నీళ్ళు పోయడం, చిమ్మడం అనే ప్రక్రియలు స్వేచ్ఛగా తెలుసుకునేలా బిడ్డను ప్రోత్సహించండి. నీటితో ఆడే ఆటలు మరియు కృత్యాలను సానుకూలమైన పదాలతో బిడ్డకు వివరించండిసరదాలో మీరు కూడా పాల్గొని, నీటితో సాహసాన్ని కలిసి పంచుకునే సరదా ఆటగా మార్చండి. కృత్యం ప్రాధాన్యత: ఈ నీటి ఆట వలన పిల్లల్లో ఇంద్రియ అభివృద్ధి, సూక్ష్మ కండరాల నైపుణ్యాలు పెంపొందుతాయి. నీటితో సానుకూలమైన అనుబంధంతో పాటు కొత్త విషయాలు సరదాగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ధ్వని నమూనాలు వస్తువులు: ఏమీ లేవు. దశలు 'కా' 'కా' వంటి ధ్వని నమూనాలను సృష్టించండి. ధ్వని నమూనాలను సృష్టించి, బిడ్డను తిరిగి ఆ ధ్వనిని చేయమని అడగండి. మీ బిడ్డతో కలిసి ఆడుకోండి. కొత్త ధ్వనులను సృష్టించమని బిడ్డను అడగండి మరియు వాటిని మీరు అనుకరించండి. ధ్వని వేగం పెంచుతూ, కొత్త ధ్వనులను జోడిస్తూ బిడ్డకు సవాళ్ళను పెంచండి. సృజనాత్మక ధ్వని నమూనాలను ఒకరి తర్వాత ఒకరు చేయండి. బిడ్డతో కలిసి ఉల్లాసభరితమైన ధ్వనులతో సంపూర్ణ వాద్య గోష్టిని ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: ధ్వనులలో తేడాలను గమనించే శక్తి మెరుగవుతుంది. ధ్వనులను ఉత్పత్తి చేయడంలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఆటలో ఒకరి తరువాత ఒకరు అవకాశం తీసుకోవడం మరియు పరస్పరం కలిసి ఆడుకోవటం వంటివి ప్రోత్సహిస్తుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ