కళ్ళు చిట్లించి నవ్వటం వస్తువులు: ఏమీ లేవు. దశలు బిడ్డను చూసి చిరునవ్వుతో కళ్ళు చిట్లించి, ఆ ప్రక్రియను మరల మరల చేయండి. బిడ్డ మిమ్ములను గమనించి, అనుకరించేలా ప్రోత్సహించండి. మీరిద్దరు కలిసి ఎన్నిసార్లు నవ్వారు, కళ్ళు చిట్లించారు లెక్కించండి. బిడ్డ చేసిన ప్రతి ప్రయత్నానికి సానుకూలమైన మద్దతు ఇస్తూ, అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: ముఖ కదలికల ద్వారా సైగలతో సంభాషణ జరపడం బిడ్డ నేర్చుకుంటుంది. పరిశీలన నైపుణ్యాలు మరియు అనుకరించడం మెరుగవుతుంది. చిరునవ్వుతో కళ్ళు చిట్లించడం ద్వారా బిడ్డలో అనుసంధాన భావన పెంపొందుతుంది. నీటిని నింపటం వస్తువులు: ఖాళీ సీసా, మగ్గు, బకెట్, నీళ్ళు. దశలు ఖాళీ సీసాని చదునైన ఉపరితలంపై ఉంచండి. మగ్గుతో నీరు తీసుకుని సీసాలో నీళ్ళు పోయండి. ఈ ప్రక్రియను బిడ్డతో చర్చించి సీసాని నీళ్ళతో నింపమని చెప్పండి. మీ సహాయంతో బిడ్డ మగ్గులో నీటిని నింపి సీసాలో పోసే విధంగా చూడండి. బకెట్ ఉపయోగించి రకరకాలుగా పోసే అనుభవాన్ని బిడ్డను తెలుసుకోనివ్వండి. కృత్యం ప్రాధాన్యత: 'పోయటం' అనే ప్రక్రియ ద్వారా సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుంది. నీటితో ఇంద్రియ గ్రహణం తెలుస్తుంది. ఈ కృత్యాలను చర్చించటం ద్వారా పిల్లలో భాషాభివృద్ధి జరుగుతుంది. అమ్మలా నటించండి వస్తువులు: అమ్మ వస్తువులు, బొట్టు బట్టలు మొదలైనవి. దశలు తల్లి పాత్రను ఉల్లాసభరితంగా పోషించండి. తల్లి చేసే పనులు హావభావాలు మరియు మాట్లాడే విధానాన్ని అనుకరించండి. తల్లి చేసే పనులలో, అనుకరించే కార్యకలాపాలలో బిడ్డను నిమగ్నం చేయండి. (బిడ్డకు జోల పాడటం, ఇంటి చుట్టూ పనిచేయడం, ఫోన్లో మాట్లాడటం, పుస్తకం చదవడం మొదలైనవి.) తల్లిలా నటించే ఆటను గమనించడానికి పాల్గొనడానికి బిడ్డను ప్రోత్సహించండి. పరస్పర సంభాషణ మరియు ఊహాత్మక అనుభవాన్ని కలిగి ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: ఈ నటన వలన పిల్లలలో ఊహాత్మక ఆటలను, సృజనాత్మకతను పెంపొందుతుంది. సంరక్షకులు - బిడ్డ మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. బిడ్డ వివిధ రకాల పాత్రలను గమనించడానికి, అర్ధం చేసుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఈరోజు మనం ఏం చేసాము వస్తువులు: ఏమీ లేవు. దశలు నిద్రలేవటం, బట్టలు ధరించడం గురించి బిడ్డతో చర్చించడం ద్వారా మీ ఉదయాన్ని ప్రారంభించండి. ఆ రోజు చేసే పనులతో ముందుకు సాగుతూ, కృత్యాలను రోజులోని ఆయా సమయాలకు అనుసంధానించండి. తినటం, ఆడుకోవడం, ఇతర కృత్యాల గురించి బిడ్డతో మాట్లాడండి. మరింత నిమగ్నమయ్యే అనుభవం కోసం బిడ్డతో కలిసి ఈ కృత్యాలను చేయండి. రాత్రి నిద్రపోవడం గురించి చర్చించడంతో ముగించండి. ప్రతి కృత్యం గురించి తన అనుభవాలను, ఆలోచనలు పంచుకోవడానికి బిడ్డను ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: నిత్యకృత్యాలకు సంబంధించి చర్చించడం ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుంది. వరుస క్రమంలో పనులు చేసుకోవడం, సమయం గురించి అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల పాత్రలను పోషించడం మరియు సంభాషణ ద్వారా పిల్లల్లో పరస్పరం నేర్చుకునే సామర్థ్యం పెంపొందుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ