జంతువును ఊహించండి వస్తువులు: ఏమీ లేవు. దశలు నేల మీద కూర్చుని జంతువు చేసే పనులు మరియు ధ్వనులను అనుకరించండి. మీరు నటించిన జంతువు పేరేమిటో ఊహించమని బిడ్డను అడగండి. మీరు నటించిన జంతువు పేరు సరిగా చెప్పగానే బిడ్డను అభినందించండి. వివిధ రకాల జంతువుల కదలికలు మరియు అవి చేసే ధ్వనులను సరదాగా మరలా మరలా చేయండి. కృత్యం ప్రాధాన్యత: పరిశీలన ద్వారా అభిజ్ఞా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. జంతువుల ధ్వనులు మరియు కదలికలు తెలుసుకోవడం వలన పిల్లల్లో పదజాలం అభివృద్ధి జరుగుతుంది. రంగును తాకండి వస్తువులు: రంగుల వస్తువులు లేక కార్డులు. దశలు బిడ్డకు రంగు రంగుల వస్తువులు లేదా కార్డులను అందించండి "ఎరుపు రంగును తాకండి" అని బిడ్డకు చెప్పండి మరియు మీరు చెప్పిన రంగుగల వస్తువును తాకడానికి బిడ్డను ప్రోత్సహించండి. చెప్పిన రంగును తాకగానే బిడ్డను అభినందించి ఉత్సాహాన్ని కలిసి పంచుకోండి. కృత్యం ప్రాధాన్యత: రంగులను గుర్తించే నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సానుకూల మద్దతు బిడ్డకు ఇవ్వడం వలన పొరపాట్లు చేసినా ఆత్మవిశ్వాసంతో కొత్త విషయాలు నేర్చుకుంటారు. అమ్మ చెప్పింది వస్తువులు: ఏమీ లేవు. దశలు బిడ్డతో 'అమ్మ చెప్పింది' అనే ఆటను ప్రారంభించండి. 'అమ్మ కూర్చోమంది' 'అమ్మ నిలబడమంది' అనే ఆదేశాలను బిడ్డకు ఇవ్వండి. బిడ్డ ఆదేశాలను అనుసరించేలా ప్రోత్సహించండి. బిడ్డ మీ ఆదేశాలను సరిగా చేయగానే వారిని అభినందించండి. బిడ్డ వినడం మరియు ప్రతిస్పందించే నైపుణ్యాలను సవాలు చేయడానికి వివిధ రకాల సరదా ఆటలను ప్రయత్నించండి. కృత్యం ప్రాధాన్యత: పిల్లల్లో వినికిడి నైపుణ్యాలు మరియు సూచనలను అనుసరించే సామర్థ్యం మెరుగుపడుతుంది. సంచిలో ఏముంది? వస్తువులు: సంచిలో సురక్షితమైన మరియు బాగా తెలిసిన ఆట బొమ్మలు. దశలు బిడ్డను కళ్ళు మూసుకోమని చెప్పండి. సంచిలో నుండి ఒక్కో వస్తువుని బయటకు తీసి బిడ్డకు అందించండి. వస్తువును తాకి, అనుభూతి చెందమనండి. ఇప్పుడు ఆ వస్తువు ఏమిటో కనిపెట్టమని చెప్పండి. వస్తువును సరిగా ఊహించేలా బిడ్డను ప్రోత్సహించండి మరియు సరిగా చెప్పినట్లయితే అభినందించండి. బిడ్డకు సరైన సమాధానం తోయటానికి ఆధారాలను అందజేయండి. కృత్యం ప్రాధాన్యత: ఇంద్రియ జ్ఞానాభివృద్ధి మరియు వస్తువులు ఊహించడం వలన అభిజ్ఞా కౌశలం మెరుగుపడుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ