జత ఎక్కడుంది? వస్తువులు: స్పష్టమైన జతలతో ఉన్న వివిధ వస్తువులు. ఉదా: తాళం మరియు తాళం చెవి, బూట్లు మరియు మేజోళ్ళు. దశలు జతలుగా ఉండే వస్తువుల పేర్లను పేర్కొంటూ తాళం మరియు తాళం చెవి జతను పరిచయం చేయండి.ఒక వస్తువును చూపించి దాని జత ఎక్కడుంది? అని అడగండి.సరిపోలే వస్తువును కనుగొని, దాని జతతో ఆ వస్తువుని జత చేసేలా శిశువుకి సహాయం చేయండి.ప్రతి జతను సరిపోల్చడంలో బిడ్డ సాధించిన విజయాన్ని అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: వస్తువులు మరియు వాటి ఉపయోగాల మధ్య అనుబంధాన్ని గుర్తించడం ద్వారా అభిజ్ఞానైపుణ్యాలు మెరుగుపడతాయి. నా పేరు వస్తువులు: ఏమీ లేవు. దశలు బిడ్డను నీ మొదటి పేరేమిటి? అని అడగండి.బిడ్డ ప్రతిస్పందించినప్పుడు అది నిజం. నీ పేరు ఏమిటంటే అని బిడ్డ మొదటి పేరు చెప్పండి.బిడ్డను నీ చివరి పేరేమిటి? అని అడగండి. బిడ్డ చెప్పగానే మరలా చెప్పండి.బిడ్డ తన వయసును తన వేళ్ళ ద్వారా చూపించడం నేర్పించండి. వారి ప్రయత్నాలను ఆనందంగా కలిసి పంచుకోండి.మాట్లాడేటప్పుడు బిడ్డ తన రెండు పేర్లను ఉపయోగించడాన్ని ప్రోత్సహించండి. వారి భాగస్వామ్యాన్ని అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: పిల్లల్లో స్వీయ అవగాహన పెంపొందించడానికి సహాయపడుతుంది మరియు కొత్త వ్యక్తులకు తమను తాము పరిచయం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం వస్తువులు: ఏమీ లేవు. దశలు ‘పార్కులో ఏమి చేయవచ్చు?’ అని బిడ్డను అడగండి.‘ఎక్కడం’ ‘దూకడం’ లాంటి కృత్యాలను చేయడానికి బిడ్డను ప్రోత్సహించండి.బిడ్డ చేసినట్టుగా మీరు అనుకరించి వారు ఎంత బాగా చేస్తున్నారో అని మెచ్చుకోండి.మీరు చేయాలనుకుంటున్న ఒక కృత్యాన్ని చేసి, బిడ్డను దానిని అనుకరించమని చెప్పండి.కొత్తగా, ఆసక్తికరమైన విషయాలు ఒకరితో ఒకరు ఇంకేమి నేర్చుకోగలరో ఆలోచించండి. కృత్యం ప్రాధాన్యత: పిల్లలు వారి స్వంత ఆసక్తులు మరియు సామర్థ్యాల గురించి ఆత్మవిశ్వాసంతో ఉండడానికి, మీతో కలిసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. లెక్కించడం సరదా వస్తువులు: మూడు చిన్న వస్తువులు (ఉదా: బొమ్మలు, బిల్డింగ్ బ్లాక్స్). దశలు బిడ్డ ముందు మూడు వస్తువులు ఉంచండి.ప్రతి వస్తువును వేలితో బిడ్డకి చూపిస్తూ, ఇద్దరం కలిసి లెక్కిద్దాం అని చెబుతూ, ఒకటి, రెండు, మూడు అని లెక్కించండిలెక్కించేటప్పుడు ప్రతి వస్తువును తాకేలా బిడ్డను ప్రోత్సహించండి.లెక్కించడం అనే ప్రక్రియను మరల మరల చేయండి. బిడ్డ లెక్కించడానికి చేసే ప్రయత్నాలను అందరూ కలిసి ఆనందంగా జరుపుకోండి. కృత్యం ప్రాధాన్యత: లెక్కించడం మరియు వస్తువులను గుర్తించడం ద్వారా పిల్లల్లో అభిజ్ఞానైపుణ్యాలు మరియు చిన్న వయసులో గణిత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ