విషయ రచన భాగస్వామి (కంటెంట్ కాంట్రిబ్యూటర్) ఏ విధంగా విషయాన్ని(కంటెంట్) పోర్టల్ లో పొందుపరచవచ్చు మరియు మార్పులు చేయవచ్చు... గమనిక : రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంచుకున్న అంశాలలో మాత్రమే మార్పులు చేయవచ్చును. “వికాస్ పీడియా పోర్టల్” లో మీరు విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకున్నందున మీరు ఈ పోర్టల్ లో సమాచారాన్ని/విషయాన్ని పొందుపరచవచ్చు. మీరు విషయాన్ని పొందుపరచాలంటే మొదటగా లాగిన్ అవ్వాలి. లాగ్ ఇన్ అవటానికి కుడివైపు పైన ఉన్న లాగ్ ఇన్ ను క్లిక్ చేసి, ఇ-మెయిల్, పాస్వర్డ్ మరియు డబ్బా లో ఉన్న కోడ్ ను నింపి లాగ్ ఇన్ ను క్లిక్ చేయండి. మీ పేరు కుడివైవు పైన కనబడితే మీరు లాగిన్ అయినట్లు. కొత్త పేజి ని జతచేయడానికి : మీరు ఎంచుకున్న వర్టికల్ కి వెళ్ళండి.ఉదా: వ్యవసాయం, ఆరోగ్యం, విద్య.. మీరు పెట్టదలచిన పేజి ని సెలెక్ట్ చేసి కొత్త ఐటం జతచేయుము పై క్లిక్ చేసి, పేజి ని ఎంచుకోండి. (ఆకుపచ్చని రంగులో ఉన్న బాక్స్ లో ఉండును). శీర్షిక లో పేజి యొక్క శీర్షిక (టైటిల్) ని రాయండి. సంక్షిప్త వర్ణన లో విషయం యొక్క సంక్షిప్త వివరణ (సమ్మరీ) రాయండి. విషయ వివరణ లో సంబందిత వివరణ రాయండి. తరువాత సేవ్ చేయుము పై క్లిక్ చేయండి, మీ పేజి సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇంతకుముందున్న పేజి ని సవరించాలనుకున్నా (రివ్యూ) లేదా ఆ పేజి లో మీరు కొత్తగా విషయాన్ని జోడించాలనుకుంటే : మీరు ఎంచుకున్న వర్టికల్ కి వెళ్ళండి (ఉదా: వ్యవసాయం, ఆరోగ్యం, విద్య) మీరు ఎడిట్ చేయదలచిన పేజి ని ఓపెన్ చేయండి. పేజి యొక్క శీర్షిక (టైటిల్) పైన ఉన్న ఎడిట్ పై క్లిక్ చేయండి. (ఆకుపచ్చని రంగులో ఉన్న బాక్స్ లో ఉండును). పేజి ఎడిట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడ సవరించాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి సవరించండి. ఒకవేళ కొత్తగా జోడించాలనుకుంటే ఆ పేజి లో ఎక్కడ జోడించాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి విషయాన్ని జోడించండి. సవరణలు చేసిన తరువాత, సేవ్ చేయుము పై క్లిక్ చేయండి, మీరు చేసిన సవరణలు సేవ్ అయిపోతాయి.