23.12.2022న జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు 2023 జూన్-జూలైకి సంబంధించి 'సచివాలయం సంస్కరణలు ' 7వ నివేదికను విడుదల పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం విడుదల చేసింది. 2023 జూన్-జూలైకి సంబంధించి 'సచివాలయం సంస్కరణలు ' నివేదిక 7వ నివేదిక ముఖ్య అంశాలు:- స్వచ్ఛత కార్యక్రమాలు, జాప్యం తగ్గింపు 3.22 లక్షల ఫైళ్లను పరిశీలించారు. పనికిరావని గుర్తించిన 1.96 లక్షల ఫైళ్లలో 1.49 లక్షల ఫైళ్లను తొలగించారు. అందిన 9.70 లక్షల ఫిర్యాదుల్లో 8.63 లక్షల ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి (పరిష్కార రేటు-88.94%) జూన్-జూలై, 2023లో 40.64 లక్షల చదరపు అడుగుల స్థలం జరిగి వినియోగంలోకి వచ్చింది. జూన్-జూలై, 2023లో పనికి రాని వస్తువుల విక్రయం ద్వారా రూ.37.56 కోట్ల ఆదాయం లభించింది. 7,186 ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంచడం అన్ని మంత్రిత్వ శాఖలు/ ప్రభుత్వ శాఖలు జాప్యం జరుగుతున్న అంశాలను గుర్తించాయి. పాక్షికంగా ఆలస్యం/పూర్తిగా ఆలస్యం జరుగుతున్న విభాగాలను గుర్తించారు.(60 పూర్తిగా ఆలస్యం; 19 పాక్షికంగా ఆలస్యం) 43 మంత్రిత్వ శాఖలు/విభాగాలు ప్రతినిధి బృందం 2021-2023 క్రమాన్ని సమీక్షించి, సవరించాయి 40 మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో డెస్క్ ఆఫీసర్ విధానం అమలులో ఉంది. ఇ-ఆఫీస్ అమలు, విశ్లేషణ ఇ-ఆఫీస్ 7.0 అమలు కోసం గుర్తించిన మొత్తం 75 మంత్రిత్వ శాఖలు ఇ-ఆఫీస్ 7.0ని అమలు చేస్తున్నాయి. కేంద్ర సచివాలయంలో 9.24 లక్షల యాక్టివ్ ఫిజికల్ ఫైళ్లు 27.44 లక్షల క్రియాశీల ఇ-ఫైళ్లు ఉన్నాయి జూన్, 2023 నెలలో 10 మంత్రిత్వ శాఖలు/విభాగాలు 100% ఇ-రసీదులు కలిగి ఉన్నాయి జూన్‌లో ఇ-రసీదులు మే 2023లో 91.43% నుండి 91.92%కి పెరిగాయి ఉత్తమ విధానాలు టెలికమ్యూనికేషన్ శాఖ : ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కోసం టెలికమ్యూనికేషన్స్ శాఖ, సంచార్ భవన్లో ఒక స్క్రాప్ రూమ్ ను జిమ్‌గా మార్చింది. 23 జూన్ 2023న జిమ్ ప్రారంభమయ్యింది. బయోటెక్నాలజీ శాఖ : దరఖాస్తుదారులు ప్రతిపాదనలను సమర్పించడానికి, అన్ని పథకాల వివరాలు రూపొందించడానికి, సిబ్బందికి ఒకేచోట సమాచారం అందించడానికి వీలుగా ఇ-బుక్, INTRADBT, eProMIS ప్రారంభమయింది. ప్రతిపాదనల విడుదల కోసం వేచి ఉండకుండా ఏడాది పొడవునా వివిధ పరిశోధన, అభివృద్ధి పధకాల క్రింద పోటీ పరిశోధన మంజూరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సమర్పించడానికి బయోటెక్నాలజీ విభాగం eProMIS ద్వారా దరఖాస్తుదారులను స్వీకరిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ : ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడం, శిక్షణ కోసం శాఖ అనేక చర్యలు చేపట్టింది. వార్షిక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్‌తో పాటు, శాఖలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులలో 30% మంది దక్షత ప్రోగ్రామ్‌లో తమ శిక్షణా మాడ్యూళ్లను పూర్తి చేశారు. ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండేలా ఇంట్రానెట్ పోర్టల్‌ను శాఖ అభివృద్ధి చేసింది,. సమాచార వ్యాప్తి , పరిపాలనా విధానాల డిజిటలైజేషన్లో సహాయపడుతుంది. పోర్టల్‌లో కాన్ఫరెన్స్ రూమ్ బుకింగ్, స్టేషనరీ కోసం ఆన్లైన్ అభ్యర్థన, VIP రిఫరెన్స్‌ల స్థితి, OMలు/ఆర్డర్ల అప్లోడ్, నోటీసు బోర్డు, డ్యాష్‌బోర్డ్, నిర్దిష్ట రోజున జరిగే సమావేశాలు, ముఖ్యమైన ఫారమ్‌ల డౌన్లోడ్ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలు దీనిలో పొందుపరిచారు. ఆధారం : PIB