ఈశాన్య ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి పథకం (ఎన్ఈఐడీఎస్) 2017ను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) అమలు చేస్తోంది. 01.04.2017 నుంచి అమల్లోకి వచ్చేలా 12.04.2018న ఈ పథకాన్ని నోటిఫై చేశారు. ఎన్ఈఐడీఎస్-2017 కోసం దరఖాస్తుల ప్రక్రియ 31.03.2022న ముగిసింది. ఈ పథకం కింద, సుమారు రూ.10117.50 కోట్ల పెట్టుబడుల కోసం 1211 దరఖాస్తులు అందాయి. వీటిలో, ఇప్పటి వరకు రూ.7551.12 కోట్ల పెట్టుబడితో 926 అర్హత కలిగిన పారిశ్రామిక కేంద్రాలు (షరతులతో కూడిన నమోదులతో సహా) నమోదయ్యాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని తెలిపారు. ఆధారం : PIB