పౌష్టిక భారతం - ఆరోగ్య భారతం పౌష్టికాహారంతో ఆరోగ్య సౌభాగ్యం పొందిన పౌరులే సాధికార, స్వయంసమృద్ధ భారత్కు పునాది ఈ సంకల్పంతోనే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఏటా సెప్టెంబరులో 'జాతీయ పోషణ మాసోత్సవం' నిర్వహిస్తుంది. ఇదొక ప్రజా ఉద్యమంగా కొనసాగుతున్న నేపథ్యంలో "మన అంగన్వాడీ... మన "బాధ్యత" ఇతివృత్తంగా ఇప్పుడు 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. పోషకాహార పంపిణీకి మాత్రమే ఈ జాతీయ ప్రచార కార్యక్రమం పరిమితం కాదు. మాతృ సాధికారతను సామాజిక నిర్వహణతో ముడిపెడుతూ ఆరోగ్యకర, సమర్థ భారత్ కు ఇది మార్గం సుగమం చేస్తుంది. దేశంలో పోషకాహార లేమి నిర్మూలన, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోత్సాహం దిశగా కృషిలో 'పోషణ్ అభియాన్' విజయవంతమైన ప్రజా ఉద్యమంగా నిరూపితమైంది. దీనికి 2018 మార్చిలో శ్రీకారం చుట్టగా, ఇప్పుడు సెప్టెంబరు 9 నుంచి వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ లో 9వ జాతీయ పోషణ మాసోత్సవం-2026ను ప్రారంభించారు. ఆహారంలో కేలరీల అవసరం తీర్చడం ఒక్కటే చాలదు... ప్రోటీన్లు, సూక్ష్మపోషకాలు, ఆహార వైవిధ్యంపైనా దృష్టి సారించడం. అత్యావశ్యకం. ఈ మేరకు 'మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0'లలో భాగంగా సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. తద్వారా అంగన్వాడీ కేంద్రాలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, భాగస్వామ్య పాత్రతో కూడినవిగా మార్చారు. 'వండిన వేడి భోజనం' వడ్డింపు నిమిత్తం ప్రమాణాలను నిర్దేశించారు. ఇందులో భాగంగా అనుబంధ పోషక పంపిణీ కార్యక్రమం. పోషణ్ మాసోత్సవం-2026 కోసం 5 కీలక ప్రాథమ్యాలు ఆహార వైవిధ్యం- తగినంత ప్రోటీన్ ఆరోగ్యకర - విభిన్న వంటకాల ప్రదర్శన: వివిధ ఆహార సముదాయల్లో భాగమైన దాన్యాలు-చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, పాలు - పాడి ఉత్పత్తులు, గుడ్లు తదితర స్థానికంగా, చౌకగా లభించే, కొనుగోలు చేసే ఆహార పదార్థాలతో అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యకర, విభిన్న వంటకాల ప్రత్యక్ష ప్రదర్శనల నిర్వహణ. పోషణ సమ్మేళనం: ఆకర్షణీయ ప్రదర్శనలు, ఆటల ద్వారా స్థానికంగా లభ్యమయ్యే అత్యంత పోషకాహార పదార్థాలకు ప్రాచుర్యం కల్పించేలా పోషణ సమ్మేళనాలు సహా అధిక ప్రోటీన్ గల ఆహార పదార్థాలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలు. పోషణ వాటిక: పోషణ వాటికల ద్వారా లభించే ఉత్పత్తులతో పాటు స్థానికంగా లభించే కాలానుగుణ ఆహార పదార్థాల ప్రదర్శన సహా ఇంటి భోజనంలో వాటి క్రమబద్ద వినియోగం దిశగా అవగాహన కల్పన, ప్రోత్సాహం. అంగన్వాడీ కేంద్రాల్లో తాజా వేడి భోజనం (హెచ్ సి ఎం) వారాలవారీ వంటకాల మార్పిడి: స్థానికంగా లభించే పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కాలానుగుణ కూరగాయలతో వారంలో అన్ని రోజుల్లోనూ వైవిధ్యభరిత వంటకాలతో వేడి భోజనం వడ్డించేలా అంగన్వాడీ కేంద్రాల్లో వారాలవారీ వంటల మార్పిడి విధానం అమలు దిశగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రోత్సాహం. సామూహిక వేడి భోజనం రుచి చూసే కార్యక్రమాలు: తల్లిదండ్రులు, పంచాయతీలు, స్వయం సహాయ సంఘాలు, అంగన్వాడీ నిర్వహణ కమిటీల భాగస్వామ్యంతో ఆయా కేంద్రాల్లో వేడి భోజనాన్ని సమష్టిగా రుచి చూసే కార్యక్రమాల నిర్వహణ. సామాజిక యాజమాన్యం- జవాబుదారీతనం అంగన్వాడీ నిర్వహణ కమిటీ (ఏఎంసీ)ల క్రియాశీలత: అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఏఎంసీ లను క్రియాశీలం చేయాలి. సామాజిక భాగస్వామ్యానికి నాయకత్వం వహిస్తూ, సోషకాహార సేవల పంపిణీ సమీక్ష సహా పోషణ మాసోత్సవ కార్యకలాపాలకు ఇవి తోడ్పడతాయి. అలాగే, పోషణ మాపోత్సవాల సందర్భంగా కనీసం ఒక ఏఎంసీ సమావేశం నిర్వహణ తప్పనిసరి. ఎస్ ఎన్ పి మెనూ బోర్డు ప్రదర్శన: అబ్దిదారులలో రోజువారీ అవగాహన మెరుగు దిశగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఎస్ ఎన్ పి మెనూ బోర్డుల ఏర్పాటు తప్పనిసరి.భోజన నాణ్యతపై సమష్టి పర్యవేక్షణ: భోజనం నాణ్యత, పరిమాణాన్ని పర్యవేక్షించేందుకు ఏఎంసీలు మాతృ కమిటీల భాగస్వామ్యం తప్పనిసరి. పోషణ - బాల్య వికాసం సవరించిన గృహ సందర్శన కార్యక్రమం: దేశవ్యాప్తంగా 0-3 సంవత్సరాల వయస్సు గల బాలల కోసం 34 అభివృద్ధి లక్ష్యాలు ప్రాతిపదికగా సవరించిన గృహ సందర్శన కార్యక్రమం అమలుబాల్య సంరక్షణ: బాలల్లో మేధా వికాసం, పాఠశాల సంసిద్ధతకు తోడ్పడే సంరక్షణ. విద్యా కార్యక్రమాల అమలుకు ప్రోత్సాహం.సకాలంలో నిర్ధారణ పరీక్షలు - చికిత్సపై సలహా: గ్రామీణ ఆరోగ్య- పారిశుధ్య-పోషణ దినోత్సవాల సందర్భంగా బాలల జాతీయ ఆరోగ్య కార్యక్రమం ద్వారా పిల్లలకు సకాలంలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, చికిత్స దిశగా సలహాలు-సూచనలు. ప్రధానమంత్రి మాతృ వందన యోజనకు 10 సంవత్సరాలు పూర్తి తల్లులకు 100% రక్షణ: అర్హులైన గర్భిణులు, బాలింతల నమోదును వేగిరం చేయడం, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ప్రక్రియ సత్వర పూర్తి. తదితరాల కోసం ప్రత్యేక ప్రచారం,అవగాహన కల్పన- ఉపకరణాలు: పథకం ప్రయోజనాలు పొందే అర్హత, అట్టి వాయిదాలపై అవగాహన కల్పన, ప్రాంతీయ భాషలలో ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఉపకరణాల పంపిణీకి శ్రీకారం. (ఎస్ఎస్పీ) బోర్డు ఏర్పాటును తప్పనిసరి చేశారు. 'జాతీయ పోషణ్ మాసోత్సవం- 2026' కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమానికి పరిమితమైనది కాదు... ఇది ప్రజల భాగస్వామ్యంతో సాగే వేడుక. ఇందులో అంగన్వాడీ సేవల పర్యవేక్షణ, పోష్టికాహార వినియోగానికి ప్రోత్సాహం దిశగా అన్ని సామాజిక వర్గాల వారూ ప్రత్యక్ష పాత్ర పోషించాలి. తొలి 1,000 రోజుల జీవితంలో బాలలకు లభించే ఉత్తమ పోషకాహారం, శ్రద్ధతో కూడిన సంరక్షణే వారి మేధా వికాసానికి అత్యంత కీలకం. ఆధారం: న్యూ ఇండియా సమాచార్