భారత దేశానికి పునరుత్పాదకత ఇంధన వనరులే ప్రత్యామ్నాయం భారతదేశ జనాభా 146 కోట్లు దాటింది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన స్థాయిలోనే మన దేశ ఇంధన అవసరాలు కూడా పెరిగాయి. మనం గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల కోసం ఆయా దేశాలపై పూర్తిగా ఆధారపడి ఉండటం.. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా, ఏ సంక్షోభం ఎదురైనా మనకు ఇంధన కష్టాలు తప్పటంలేదు. మనదేశం PPAC (పెట్రోలియం ప్లానింగ్ & అనాలసిస్ సెల్ ) నివేదిక ప్రకారం 2021-22కు గాను 212.2 MT క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. సుమారు 85% క్రూడ్ ఆయిల్, LPG అవసరాల్లో 60% పైగా దిగుమతుల పై ఆధారపడుతున్నాం. ఇంధన వినియోగంలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాం. భారత దేశం విదేశీ చమురుపై ఆధారపడడానికి కారణాలు పెరుగుతున్న డిమాండ్ : పరిమిత ఉత్పత్తి పెరుగుతున్న జనాభా వలన డిమాండ్ పెరుగుతుంది. దీనితోపాటు పరిమిత దేశీయ చమురు వనరులు, ఉత్పత్తి వలన దిగుమతులు భారం పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి : ఇటీవల భారత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనది ఒకటి. 2025-26కుగాను వృద్ధి రేటు 76% గా నమోదు అయింది. రవాణా రంగం విస్తరణ : వాహన విక్రయాలు, వివిధ రవాణా రంగాలు ఎదుగుతున్న కారణంగా చమురు వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. 2024 కు గాను భారతదేశంలో ఆటో మొబైల్ రంగం 26 మిలియన్ల విక్రయాలను నమోదు చేసింది. పెట్రోకెమికల్ ఉత్పత్తులు : చమురు నుండి వచ్చే రసాయనాలతోనే ప్లాస్టిక్,ఎరువులు తయారీ ఆధారపడి ఉన్నాయి. పునరుత్పాదక శక్తి పునరుత్పాదక వనరుల పెరిగినప్పటికీ అవి పరిశ్రమల్లో, రవాణా రంగంలో పెట్రోలియం ఉత్పత్తులను భర్తీ చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చమురు దిగుమతుల వలన దిగుమతి ఖర్చులు పెరిగి ఆర్థికభారం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి మారకపు వలన బలహీన పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయాలు ఇథనాల్ బైండింగ్ : పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చు.విద్యుద్దీకరణ - రవాణా రంగం : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా చమురు వినియోగం తగ్గించుకోవచ్చు. దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్ వర్క్ ను వినియోగించడం ద్వారా గిరాకీ పెంచవచ్చు. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం సాంప్రదాయ ఇంధన వనరుల నుండి పునరుత్పాదక వనరుల వైపు మారడం వల్ల చమురు దిగుమతి డిమాండ్ తగ్గుతుంది. సౌర, పవన, జీవశక్తి వనరుల వినియోగం పెంచడం మూలాన చమురు డిమాండ్ తగ్గుతుంది. 2026 మార్చి నాటికి భారతదేశం పునరుత్పాదక ఇంధనవనరుల శక్తిసామర్థ్యం 274 గిగావాట్లకు చేరుకుంది. దేశీయంగా ఇంధన వనరులు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు పెంచడం ద్వారా సమృద్ధి సాధించి దిగుమతిని తగ్గించవచ్చు. వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం ద్వారా కూడా దిగుమతి భారాలు తగ్గుతాయి. వ్యూహాత్మక ప్రణాళిక దిగుమతులపై కొన్ని దేశాలపై ఆధారపడకుండా వివిధ దేశాల నుండి చమురు సేకరించడం. ప్రజా రవాణా - ప్రజలు తమ వ్యక్తిగత వాహనాల కంటే ప్రజారవాణా వినియోగించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. వృథాగా విద్యుత్తును దుర్వినియోగం చేయకుండా ఉండడం ద్వారా చమురు దిగుమతి డిమాండ్ ను తగ్గించవచ్చు. ప్రభుత్వ పథకాలు మరియు చర్యలు ఇథనాల్ బ్లెండింగ్ ప్రొగ్రామ్ : ప్రభుత్వం ఏప్రిల్ 2026 నుండి 20% ఇథనాల్ బ్లెండింగ్ (E20) తప్పనిసరి చేసింది. ఇథనాల్ ప్లాంట్లను స్థాపించడానికి సబ్సిడీ అందిస్తుంది. 2030 నాటికి 30% బ్లెండింగ్ కు చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రవాణారంగం : EV వినియోగం పెంచుటకు ప్రభుత్వం పీఎం-ఈ డ్రైవ్ పథకం, పిఎంఈబస్ పథకాలను ప్రారంభించింది. పునరుత్పాదకశక్తి : ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరులను పెం చ డా ని కి వివిధ పథకాల ప్రారంభించింది. పీఎం – కుసుమ్, సూర్యఘర్ యోజన వంటి పథకాలను తీసుకొచ్చింది. వ్యూహాత్మక నిల్వలను (SPR) సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇంధన దిగుమతులపై కొన్ని దేశాలపై ఆధారపడకుండా 41 దేశాల నుండి దిగుమతులను ప్రభుత్వం విస్తరించింది. ప్రజల బాధ్యత ఇంధన కొరత నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యత వ్యవహరించాలి. ఇంధన పొదుపు పాటించే చర్యలు చేపట్టాలి. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, ప్రజారవాణా అయిన బస్సు, రైలు, ఇతర వాహనాలను ఆశ్రయించాలి. ఇంధన పొదుపు చర్యలను ప్రతి ఒక్కరూ పాటిస్తే. చాలా వరకూ ఈ కొరతను అధిగమించవచ్చు. ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని ఇళ్లపై సోలార్ ప్యానెళ్లకు మారవచ్చు. ఈవీ వాహనాలను వినియోగం పెంచాలి. ఆధారం : మన బడి మాస పత్రిక