అపద సమయంలో అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు, సహాయం చేయగల సత్తా ఉన్న ఏకైక వ్యక్తిని ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అంటూ వేడుకోవడం పరిపాటి. భూమిపై ఉన్న ఇంధన వనరులు క్రమంగా నిండుకోవడంతో శక్తి కోసం ఇక సూర్యుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చమురు, సహజవాయువు నిల్వలు తరిగిపోవడం, బొగ్గు నిల్వలు అంతరించిపోవడం, జలవిద్యుత్ సమకూరకపోవడం, కరెంటు కోతలు...వీటన్నింటికీ అత్యుత్తమ పరిష్కారమార్గం సౌరశక్తి. సౌరవిద్యుత్ ఉత్పాదనకు అత్యంత అనుకూల దేశం భారత్. థార్ ఎడారిలో 35,000 చ.కి.మీ ప్రాంతాన్ని వివిధ సోలార్ ప్రాజెక్టుల కోసం నిర్దేశించారు. ఇవి గనుక కార్యరూపం దాలిస్తే 700 నుంచి 2,100 గిగా వాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 2020 నాటికి 19 బిలియన్ డాలర్లతో 20 గిగా వాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 2009లోనే ఒక ప్రణాళిక కూడా రూపొందింది. వివిధ ప్రభుత్వ భవనాల్లో, ఆసుపత్రుల్లో, హోటళ్ళలో సౌర విద్యుత్, సోలార్ ఉపకరణాల వాడకాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనలు కూడా రూపొందుతున్నాయి. దేశంలో ఏడాదికి కనీసం 300 రోజులు సూర్యుడి కాంతి పుష్కలంగా లభించడం విశేషం. ఇప్పటి వరకూ మొత్తం విద్యుత్ డిమాండ్‌లో సౌరశక్తి వినియోగం ఒక్క శాతానికి కూడా మించకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇదే కీలకం కానుంది. ప్రపంచవ్యాప్త గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే సౌరవిద్యుత్ ఉత్పత్తిలో అమెరికా తరువాతి స్థానం భారత్‌దే. సౌర విద్యుత్ ఉత్పాదనకు అయ్యే వ్యయం అధికంగా ఉండడం, సౌర ఉపకరణాల ఖరీదు అధికంగా ఉండడం లాంటి అవరోధాలు ఉన్నప్పటికీ దేశంలో క్రమంగా ఈ అంశాలపై అవగాహన పెరుగుతోంది. సౌరవిద్యుత్ మరింతగా వాడుక లోకి రావాలంటే మరింత చౌకగా దాన్ని ఉత్పత్తి చేసే, ఉపయోగించుకునే మార్గాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. సంప్రదాయక థర్మల్ విద్యుత్ ఉత్పాదన వ్యయం యూనిట్‌కు రూ. 5-రూ.8 దాకా ఉండగా సౌర విద్యుత్ ఉత్పాదన వ్యయం యూనిట్‌కు రూ.15 నుంచి రూ. 30 దాకా ఉంటోంది. రేపటి తరం సోలార్ ఎనర్జీ ఇంజినీర్ల శిక్షణ నిమిత్తం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆసియా-పసిఫిక్ దేశాలకు 5.2 మిలియన్ డాలర్లను కేటాయించింది. భారత్, చైనా దేశాలు దీని ద్వారా బాగా లబ్ధి పొందనున్నాయి. గ్రామీణ భారతంలో.... విద్యుత్ మౌలిక వసతులు లేకపోవడంతో గ్రామీణ భారతం బాగా వెనుక బడింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఏర్పా టు యోచన జీవం పోసుకుంది. ఒరిస్సాలో 3,000 గ్రామాలకు ఈ విధం గా 2014 నాటికి సౌరవిద్యుత్ అందిచేందుకు ప్రణాళికలున్నాయి. సాగు, తాగునీటి సరఫరాకు సౌరవిద్యుత్‌ను వాడుకునే అవకాశం ఉంది. 2006 నాటికి దేశంలో 7,068 సోలార్ పీవీ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ఏర్పా టయ్యాయి. వేడి నీటిని అందించేందుకు సౌరశక్తిని వినియోగించుకునే ఏ ర్పాట్లు ముమ్మరమవు తున్నాయి. బెంగళూరులో అత్యధికంగా ఈ విధమైన రూఫ్‌టాప్ సోలార్ వాటర్ హీటర్స్ ఉన్నాయి. ఇవి రోజుకు 200 మెగావాట్ల కు సమానమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఉపయోగించే వారికి బెంగళూరులో విద్యుత్ బిల్లులపై రాయితీలు కూడా ఇస్తున్నారు. నూతన నిర్మాణాల్లో సౌరవిద్యుత్ ఉపకరణాల ఏర్పాటు తప్పని సరిగా మారుతోంది. పుణెలో కూడా ఈ విధమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్నెన్నో సవాళ్ళు దేశంలో సౌరవిద్యుత్ ఉత్పాదనకు భూమి లభ్యత ప్రధాన అవరోధంగా పరిణమిస్తోంది. 20-60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కనీసం 1 చ.కి.మీ స్థలం అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో రూఫ్‌టాప్ పవర్ జనరే షన్ సిస్టమ్స్ ఏర్పాటు దేశానికి అత్యుత్త మమని నిపుణుల సూచన. వ్యక్తిగ తంగా వీటిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, వీటన్నింటినీ అనుసంధానం చేయ డం ద్వారా లోకల్ గ్రిడ్ లాంటిది ఏర్పాటు చేయవచ్చు. దీనికి అయ్యే ఖర్చు ప్రస్తుతానికి అధికంగానే ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అధిగ మించే అవకాశం ఉంది. మందకొడిగా ప్రగతి ప్రపంచవ్యాప్తంగా సోలార్ వినియోగం పెరుగుతోంది. అందుకు వీలుగా బేసిక్ సిలికాన్ మోనోక్రిస్టలైన్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉత్పత్తి కూడా పెరుగు తోంది. ప్రస్తుతం పీవీ సెల్ ఉత్పత్తిలో భారత్ 7వ స్థానంలో ఉంది. సోలార్ థర్మల్ సిస్టమ్స్ ఉత్పత్తిలో 9వస్థానంలో ఉంది.జపాన్, చైనా, అమెరికా ఈ విషయంలో ఎంతో ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు: సౌరశక్తి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకరిస్తోంది. 2010-11 బడ్జెట్లో ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ కింద రూ. 10 బిలి యన్లను కేటాయించింది. గతంతో పోలిస్తే ఇది రూ. 3.8 బిలియన్లు అధికం. సోలార్ ప్యానె ల్స్‌పై కస్టమ్స్ సుంకాలను 5 శాతం తగ్గించడంతో పాటు సోలార్ పీవీ ప్యానెల్స్‌పై ఎకై్సజ్ సుంకాన్ని ఎత్తివేశారు. ఈ చర్యల ఫలి తంగా సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ వ్యయం 15-20 శాతం దాకా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా లో కార్బన్ ఎనర్జీ ప్రాజెక్టు లకు నిధులను సమకూర్చే ఉద్దేశంతో ప్రభు త్వం రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్ స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. సోలార్ ఫోటోవాల్టా యిక్ పవర్ ప్లాంట్లకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో 70 శాతం సబ్సిడీని, ఇతర ప్రాంతా ల్లో 30 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. సౌరశక్తి- మైలురాళ్ళు క్రీ.పూ. 212: శత్రునౌకలను నాశనం చేసేందుకు కాంస్యం రేకులతో సూర్యకిరణా లను కేంద్రీకరణ. గ్రీకు శాస్తవ్రేత్త అర్కిమెడిస్ ఈ విధంగా చేశాడని చెప్పినా, ఆధారాలు లేవు. మతపరమైన కార్యక్రమాల్లో నిప్పును పుట్టించేందుకు అద్దాలను వినియోగించినట్లు చెబుతారు. 1767: తొలి సోలార్ కలెక్టర్‌ను రూపొం దించిన స్విస్ శాస్తవ్రేత్త హోరెస్ డి సాస్సురె. 1816: స్కాట్లాండ్కు చెందిన మతబోధ కుడు రాబర్ట్ స్టిర్లింగ్ తాను రూపొందించిన సోలార్ కుక్కర్‌కు పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు.1830: సర్ జాన్ హర్స్చెల్ తన దక్షిణా ఫ్రికా ప్రయాణంలో వంట కోసం సౌరశక్తి వినియోగించారు. 1839: ఫోటోవోల్టిక్ ఎఫెక్ట్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్తవ్రేత్త ఎడ్మండ్ బెక్యురల్1860: పలు రకాల సౌర శక్తి ఉపకరణా లను రూపొందించిన ఫ్రెంచ్ గణితశాస్తవ్రేత్త ఆగస్ట్ మాచెట్1860-61: సౌరశక్తితో నడిచే యంత్రా నికి పేటెంట్ పొందిన మొదటి వ్యక్తి అగస్టె మోచవుట్. సౌరశక్తితో పని చేసే ఆవిరియం త్రాన్ని ఆయన రూపొందించాడు. దాన్ని రిఫ్రి జిరేషన్ ఉపకరణానికి అనుసంధానికి ఐస్‌ను రూపొందించాడు. 1873: సెలీనియమ్ ఫోటో కండక్టివిటీని కనుగొన్న విలొగ్బి స్మిత్ బోలోమీటర్ను కనుగొన్న సామ్యూల్ పి. లాంగ్లే. సూర్యకిర ణాల కాంతిని, నక్షత్రాల కాంతిని కొలిచే సాధనమిది.1876-78: విలియమ్ ఆడమ్స్, ఆయన విద్యార్థి రిచర్డ్ డే కలసి అద్దాలను ఉపయో గించి 2.5 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే స్టీమ్ ఇంజిన్‌ను రూపొందించారు. ఆయన డిజైన్ ను పవర్ టవర్ కాన్సెప్ట్‌గా వ్యవహరిస్తారు. ఇది నేటికీ వాడుకలో ఉండడం విశేషం. కాంతి ప్రభావానికి గురైనప్పుడు సెలెనియం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని వీరు కనుగొన్నారు. 1883: ఛార్లెస్ ఫ్రిట్జ్ సూర్య కిరణాలను విద్యుత్‌గా మార్చగలిగాడు. కన్వర్షన్ రేటు 1-2 శాతం మాత్రమే ఉనప్పటికీ అప్పట్లో అదే ఓ అద్భుతం.1892-1905: అబ్రే ఎనియాస్ తొలి సో లార్ ఎనర్జీ కంపెనీ ది సోలార్ మోటార్ కంపె నీని స్థాపించారు. తొలి యంత్రాన్ని 2,160 డాలర్లకు విక్రయించారు. అది వారం రోజు లకే గాలివానకు కొట్టుకుపోయింది. రెండో యంత్రానికీ అదే గతి పట్టింది. కంపెనీ మూ తపడింది. హెన్రీ విల్సీ పగటి శక్తిని నిల్వ చేసుకొని రాత్రి పూట కూడా శక్తి ఉత్పత్తి చేయగల యంత్రాన్ని రూపొందించినా, దానికి ఆదరణ లభించలేదు. 1904: రాగి, కుప్రస్ ఆకై్సడ్ మిశ్రమం ఫోటోసెన్సిటివ్ అని విలియం హాల్వాచ్ గుర్తించారు. 1905: ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌పై సిద్ధాంతప త్రం సమర్పించిన అల్బర్ట్ ఐన్‌స్టీన్1908: సోలార్ కలెక్టర్‌ను కనుగొన్న విలియమ్ జె బెయిలీ, కార్నిగే స్టీల్ కంపెనీ1921: ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌ను వివరించే సిద్ధాంతానికి అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి.1932: కాడిమం సలె్ఫైడ్లో ఫోటోవోల్టిక్ ప్రభావాన్ని కనుగొన్న అడొబెర్ట్. 1921: ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సిద్ధాంతానికి అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి.1932: కాడిమం సలె్ఫైడ్లో ఫోటోవోల్టిక్ ప్రభావాన్ని కనుగొన్న అడొబెర్ట్. 1947: సౌరశక్తి ఆధారిత ఇళ్ళకు అమెరి కాలో పెరిగిన డిమాండ్1954: బెల్ ల్యాబ్స్‌కు చెందిన కాల్విన్ ఫుల్లర్, గెరాల్డ్ పియర్సన్, డారిల్ చాప్లిన్లు అనుకోకుండా, సిలికాన్‌ను సెమీకండక్టర్గా ఉపయోగించవచ్చునని కనుగొన్నారు. 6 శాతం సామర్థ్యపు రేటుతో సోలార్ ప్యానెల్‌ను తయారు చేసేందుకు ఈ పరిశోధన తోడ్పడింది. 1955: సోలార్ వాటర్ ీహటింగ్, పాసివ్ డిజైన్‌తో తొలి వాణిజ్య కార్యాలయ భవనాన్ని నిర్మించిన అర్కిటెక్ట్ ఫ్రాంక్ బ్రిడ్జర్స్1956: మొదటిసారిగా వాణిజ్యపరంగా సోలార్ సెల్ తయారీ. ఖరీదు అధికం1950-1960: అంతరి కార్యక్రమాల్లో సౌరశక్తి వినియోగం. 1958లో వాన్గార్డ్ 1 అంతరిక్ష నౌకను ప్రయోగించారు.విద్యుత్ ఉత్పత్తికి సౌరశక్తిని ఉపయోగించారు.1960: వాణిజ్యపరంగా లభ్యమయ్యే ఫోటోవాల్టిక్ సెల్స్‌లలో 14 శాతం సామర్థ్యా న్ని సాధించిన హాఫ్మాన్ ఎలక్ట్రానిక్స్1963: ప్రాక్టికల్ సిలికాన్ ఫోటోవోల్టిక్ మాడ్యూల్స్‌ను ఉత్పత్తి చేయడంలో విజయం సాధించిన షార్ప్ కార్పోరేషన్. 1965: చౌకలో సోలార్సెల్ను రూపొందించిన డాక్టర్ ఇలియన్ బెర్మాన్. ఒక్క వాట్‌కు రేటు 100 డాలర్ల నుంచి 20 డాలర్లకు తగ్గిపోయింది.1972: ప్రపంచంలోనే తొలిసారిగా యూనివర్సిటీ ఆఫ్ డెలావేర్లో థిన్ ఫిల్మ్ ఫోటోవోల్టిక్ (పీవీ), సోలార్ థర్మల్ సిస్టమ్స్‌పై పరిశోధనలకు గాను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ ఏర్పాటు1973: పీవీ / థర్మల్ హైబ్రిడ్‌తో తొలిసారిగా ఫోటోవోల్టిక్ (పీవీ) శక్తితో కూడిన ఆవాసాల ఏర్పాటు. 1981: సౌరశక్తి ఆధారిత ఎయిర్‌క్రాఫ్ట్ సోలార్ ఛాలెంజర్‌ను నిర్మించిన పౌల్ మెక్క్రీడీ1982: సోలార్ కార్ రూపకల్పన1986: ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరమైన థిన్ ఫిల్మ్ పవర్ మాడ్యుల్‌ను ఆవిష్కరించిన ఆర్కో సోలార్ కంపెనీ 2000 నుంచి ఈ రంగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. సమీపభవిష్యత్తులో సౌరశక్తితోనడిచే కార్లు మార్కెట్లో విరివిగా లభించే అవకాశం ఉంది. స్క్రీన్ ప్రింటెడ్ సోలార్ సెల్స్ రాకతో సోలార్ సెల్స్ ధరలు మరింతగా తగ్గే అవకాశం. సోలార్ ప్యానెల్లను రూఫ్టాప్గానే గాకుండా పక్క గోడలకూ అమర్చుకునే అవకాశం. సౌరశక్తి అంటే... ఫోటోవోల్టాయిక్స్ (పీవీ) ఉపయోగించడం ద్వారా నేరుగా లేదా కాన్సెన్ట్రేడెడ్ సోలార్ పవర్ (సీఎస్పీ) ఉపయోగించి పరోక్షంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీన్నే సౌరశక్తిగా వ్యవహరిస్తున్నారు. పీవీ విధానంలో కాంతిని ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌తో ఎలక్ట్రిక్ కరెంట్‌గా మారుస్తారు. సీఎస్పీలో విశాల స్థలంలో లెన్స్ లేదా అద్దాలు ఏర్పరిచి, సూర్యకాంతిని కేంద్రీకరింపజేసి శక్తిని ఉత్పత్తి చేస్తారు. సౌర, వాయు, బయోగ్యాస్ ఇంధనం లాంటి వాటన్నింటినీ ఒకే కేంద్రంలో ఉత్పత్తి చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. తద్వారా ఈ కేంద్రాలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. సౌరశక్తిని నిల్వ చేసుకునే వీలుంది. ఇందుకు గాను ప్రత్యేక సౌరఘటాలు లభ్యమవుతున్నాయి. ఇంట్లో ఉపయోగించుకొనే తీరు...సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, బ్యాటరీ, చార్జ్ కంట్రోలర్, వైరింగ్, సపోర్ట్ స్ట్రక్చర్‌తో ఇంట్లో సోలార్ సిస్టమ్ నెలకొల్పవచ్చు. ఒక కిలోవాట్ శక్తి వచ్చేందుకు 1-2 రోజుల సమయం పడుతుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉపయోగించుకోవచ్చు. ఒక కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఏడాది సుమారుగా కనీసం 1,600 కిలోవాట్ల శక్తిని అందిస్తుంది. ఈ సౌరశక్తిని సౌరఘటాల్లో నిల్వ చేసుకో వచ్చు. ఒక్కో సోలార్ ప్యానెల్లో 40 సోలార్ సెల్స్ ఉంటాయి. ఇలాంటి ప్యానెల్స్ 10-12 కలిపి ఉపయోగిం చుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ రకరకాల రంగుల్లోనూ లభిస్తాయి. కనీసం ఐదేళ్ళ వారంటీతో లభిస్తాయి. సంప్రదాయక శక్తి వనరులతో పోలిస్తే సౌరశక్తి వినియోగం మరింతగా పర్యావరణ అనుకూలం. కొన్ని విశేషాలు సూర్యకాంతి భూమిని చేరేందుకు సుమారుగా 8 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయంలో అది సెకనుకు 186,282 మైళ్ళ వేగంతో 93,000,000 మైళ్ళు ప్రయాణిస్తుంది. సౌరశక్తితో పరిశ్రమలు నడుస్తాయని డా విన్సి 1447లోనే ఊహించగలిగారు. నేటికీ సుమారు 2 బిలియన్ల మంది కరెంట్ సౌకర్యం లేకుండానే నివసిస్తున్నారు. ప్రపంజ జనాభాలో 5 శాతమే ఉన్న అమెరికన్లు మొత్తం శక్తి, ఇంధనాల్లో 26 శాతాన్ని ఉపయోగించుకుంటున్నారు. కరెంటును అధికంగా ఉపయోగించుకునే వాటిలో ఎలక్ట్రిక్ ఓవెన్లు, మైక్రోవేవ్‌లు, సెంట్రల్ ఎయిర్కండీషనింగ్లు అగ్రస్థానాల్లో ఉన్నాయి. యావత్ ప్రపంచ శక్తి అవసరాలను తీర్చగల సౌరశక్తి సూర్యుని నుంచి ఒక్క గంటలో భూమిని చేరుతుంది. సహారా ఎడారిలో కొద్దిభాగాన్ని ఫోటోవాల్టాయిక్ సెల్స్‌తో నింపేస్తే యావత్ ప్రపంచానికి సరిపడా శక్తి అవసరాలను తీర్చుకోవచ్చు. అన్ని టీవీ, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉపయోగించే సౌరశక్తినే. ఎన్నెన్నో ఉపకరణాలు సోలార్ వస్తువుల ధరలు అధికంగా ఉండటం తో చాలామంది ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల మొగ్గు చూపట్లేదు. వివిధ రకాల సోలార్ ఉత్పత్తులు వచ్చాయి. స్ట్రీట్‌లైట్స్, హోం లైటింగ్ సిస్టమ్స్, వాటర్ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంపులు లభిస్తున్నాయి. సోలార్ టోపీ ముందుభా గంలో చిన్నపాటి ఫ్యాన్ అమర్చి ఉంటుంది. ఎండ వేడికి ఈ ఫ్యాను తిరుగుతూ చల్లటి గాలి ని అందిస్తుంది. అపార్టమెంట్లపై సోలార్ ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇస్తోంది. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్)కు దరఖాస్తు చేసుకోవాలి. దీని ఆధ్వర్యంలోని ఏజెన్సీల వారు అపార్టమెంటును పరిశీలించి, ఎన్ని వాట్స్ విద్యుత్తు అవసరమన్నది అంచనా వేస్తారు. వారే ప్లాంటును ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు రూ. 3 లక్షల వరకు ఖర్చవు తుంది.సోలార్ ఎమర్జెన్సీ లైటుని ఎండలో 6 గంటలు ఉంచితే మూడు గంటల పాటు నిరంతరాయంగా బల్బు వెలుగుతుంది. రాత్ర వేళ అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వీటిని ల్యాంప్‌లుగా ఉపయోగించుకోవచ్చు. సోలార్ హోం లైటింగ్ సిస్టంలో నాలుగు బల్బులుంటాయి. వీటికి ఉండే సోలార్ ప్యానెల్‌ని డాబామీద నీడలేని ప్రాంతంలో ఉంచాలి. ఇది వేడికి ఛార్జి అవుతుంది. ఇంట్లో నాలుగు గదులుంటే వాటిలో ఒక్కొక్క దానిలో ఒక్కో బల్బును వెలిగించుకోవచ్చు. ఇంటి ఆవరణలో సోలార్ వీధి దీపాలను ఒక పోల్కి అమర్చి దానిపై సోలార్ ప్యానెల్ ఉంటుంది. ఎండకు ఛార్జింగ్ అవుతుంది. రాత్ర పూట వెలుగులు విరజిమ్ముతుంది. సోలార్ వాటర్ హీటర్ ని శాశ్వతంగా ఇంటి డాబాల మీద ఏర్పాటు చేసుకోవాలి. పగలు ఎండకు నీళ్లు వేడెక్కుతాయి. అలా వేడెక్కిన నీరు 24 గంటల పాటు 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో వెచ్చగా ఉంటాయి. మనం ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. నీరు నిలువ ఉండే ట్యాంకు పైపులైనుకు పఫ్ ఏర్పాటు ఉంటుంది. అది నీరు చల్లబడకుండా కాపాడుతుంది. వీటిని ఆపార్టమెంట్లకు అమర్చుకొంటే విద్యుత్తు వినియోగాన్ని భారీగా ఆదా చేయవచ్చు. సోలార్ పవర్ ఇన్వర్టర్ల ద్వారా ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు, టీవీ పనిచేస్తాయి. మూడు, నాలుగు గంటల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సోలార్ ప్యానెళ్లు ఎండకు ఛార్జి అయి, విద్యుత్ సరఫరా లేని సమయంలో పనిచేస్తాయి. సౌరశక్తి లెక్కింపు సోలార్ ఎనర్జీని కిలోవాట్ అవర్స్‌లో లెక్కిస్తారు. ఒక కిలోవాట్ = 1000 వాట్స్. ఒక కిలోవాట్ అవర్ అనేది 100 వాట్ల బల్బును 10 గంటల పాటు వెలిగించేందుకు వెచ్చించే విద్యుత్‌కు సమానం. మార్చు సోలార్ బైక్ పుణేకు చెందిన ఆయూబ్‌ఖాన్ పఠాన్, ఇమ్రాన్‌ఖాన్ పఠాన్ అనే ఇద్దరు బాబాయ్, అబ్బాయ్‌లు సోలార్ హైబ్రిడ్ ఎకోఫ్రెండ్లీ బైక్ రూపొందించారు. ఇంధనం అవసరం లేదు.కాలుష్యం ఉండదు. శబ్దమూ రాదు. ఇంటిదగ్గరే ఉన్నప్పుడు దీని విద్యుత్ ను సెల్ఫోన్లు, బల్బులు, ఫ్యాన్లు, కంప్యూట ర్లు, టీవీలకూ ఉపయోగించుకోవచ్చు. మోటారు బైకుకు అమర్చే సోలార్ పీవీ ప్యానెళ్ల సహాయంతో డీ సీ బ్యాటరీ సూర్య రశ్మి ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. దాని తో మోటారు బైకు వెనక చక్రానికి అమర్చిన డీసీ మోటారు పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎండ బాగా ఉండి, చార్జ్ అవుతున్న బ్యాట రీని మోటార్‌కు అనుసంధానిస్తే ఏకధాటిగా 200-250 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. బ్యాటరీలో విద్యుత్ ఎని మిది గంటల పాటు నిల్వ ఉంటుంది. బ్యా టరీకి మల్టీపర్పస్ సాచెట్ ఉంటుంది కాబ ట్టి వర్షాకాలంలో, సూర్యరశ్మి లేనప్పుడు ఇంట్లోని విద్యుత్‌తో చార్జచేసుకోవచ్చు.ఈ బైకు ధర రూ. 27 వేలు. సోలార్ ఛాలెంజ్ సూర్యరశ్మి తో నడిచే కారు తయారు చే యాలని 1980ల నుంచీ ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాల కొక సారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రే లియాలో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థ ల నుంచి అనేక మంది ఔత్సాహికులు తా ము రూపొందించిన కార్లతో పాల్గొంటారు. ఈ పందెం డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు సాగుతుంది. ఆధారము: సూర్య సౌర శక్తి కధ సౌర శక్తి సూర్యిడి కిరణాల నుండి వెలువడే శక్తి. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే బొగ్గు, నూనె, సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు. కానీ అపారమైన ఈ సౌరశక్తి నిధిని వాడాటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ సౌర శక్తి గురించి మరింత సమాచారాన్ని అందరికి అర్థమయ్యే రీతిలో అందించటానికి అరవింద్ గుప్తా సౌర శక్తి కధ అనే పుస్తకాన్ని రాశారు. ఈ సౌర శక్తి కధ పుస్తకాన్ని చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము : సైన్స్ ఇన్ తెలుగు బ్లాగ్ తరగని ఇంధనం... సౌర వికిరణం సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. శక్తి సంక్షోభం ఆధునిక సాంకేతిక ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఓవైపు క్షీణిస్తున్న సంప్రదాయ ఇంధన వనరుల లభ్యత... మరోవైపు పర్యావరణ విషతుల్యత... ప్రకృతి ప్రసాదితమైన సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం సౌర వెలుగులవైపు చూస్తోంది. భానుని కిరణాలే భవిష్యత్ శక్తి వనరుగా భావిస్తూ వడివడిగా అడుగులేస్తోంది. తరగని వనరుగా... సమస్త జీవకోటి మనుగడకు మూలాధారమైన సౌర శక్తితో పరిస్థితిని చక్కదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న శక్తి సంక్షోభానికి ప్రత్యామ్నాయం... సౌరకిరణమే. దేశ ఆర్థిక, సామాజిక ప్రగతికి శక్తి వెన్నెముక. ఒక దేశ తలసరి శక్తి వినియోగం ఆధారంగా ఆ దేశ అభివృద్ధిని పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్‌లో శక్తి సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. గుజరాత్, ఛత్తీస్గడ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ లోటు కనిపిస్తోంది. ఇక దక్షిణాది విషయానికి వస్తే... ఐదు రాష్ట్రాల్లోనూ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి కారణం కేవలం బొగ్గు వంటి సంప్రదాయ శక్తి వనరులపై ఆధారపడటమే. ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శక్తి భద్రతను సాధించాలంటే సౌరశక్తి వంటి పునర్వినియోగ శక్తి వనరులపై ఆధారపడటం తప్పనిసరి. సౌర శక్తే ఎందుకంటే? ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్‌లో స్థాపిత శక్తి సామర్థ్యం 2.54 లక్షల మెగావాట్లు. డిమాండు 3.50 లక్షల మెగావాట్లకుపైనే ఉంది. స్థాపిత సామర్థ్యంలో బొగ్గు ఆధారిత వాటా 60.2 శాతం. ఈ స్థాయిలో బొగ్గు మీద ఆధారపడటమే శక్తి లోటుకు కారణం. బొగ్గును అవసరాలకు తగ్గట్టుగా వెలికితీయలేక దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్‌లో విద్యుత్ సరఫరాలో సంభవించే నష్టం సుమారు 24 శాతం. జల విద్యుత్ ఉత్పాదనకు మెరుగైన అవకాశాలు ఉన్నా పర్యావరణ నష్టం, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఆశించిన రీతిలో విస్తరణ లేదు. అదే విధంగా సహజ వాయువు, దాని రూపాంతర షేల్ గ్యాస్, కోల్బెడ్ మీథేన్ (సీబీఎం) నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ వెలికితీతలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక అణుశక్తి విషయానికి వస్తే... మూడు దశల్లో అణుశక్తి కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ యురేనియం నిల్వల కొరత, రియాక్టర్ల నిర్మాణం-వాటి పరిశోధనల్లో జాప్యం కారణంగా ఆశించిన రీతిలో ఉత్పాదన లేదు. రియాక్టర్ల నిర్మాణం ఆలస్యమవుతుండటం, విదేశీ రియాక్టర్లపై ఆధారపడే విధానాన్ని అవలంబించడం కూడా అణుశక్తి ఉత్పాదనకు ఆటంకం ఏర్పడుతోంది. 2011, మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమా రియాక్టరు ప్రమాదం తర్వాత అణుశక్తి భద్రతపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు 2022, 2035 నాటికి అణుశక్తి ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించాయి. ఇక భారత్‌లోనైతే వీటి విస్తరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంప్రదాయేతర శక్తి వనరులు: సంప్రదాయ శక్తి వనరుల ద్వారా లక్ష్యాలను చేరుకోలేని కారణంగా పునర్వినియోగ, నవీన శక్తి వనరుల ఆవశ్యకత పెరిగింది. సౌరశక్తి, పవన శక్తి, జీవ శక్తి, చిన్న తరహా జల విద్యుత్ వంటివి ప్రధాన పునర్వినియోగ శక్తి వనరులు. జియో థర్మల్, హైడ్రోజన్, సముద్ర తరంగ శక్తులు ప్రధాన నవీన శక్తి వనరులు. మన దేశంలో ఈ రెండు రకాల సంప్రదాయేతర శక్తి వనరుల అభివృద్ధి వినియోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో 33 శాతం గ్రామీణ జనాభా, 6 శాతం పట్టణ జనాభాలో విద్యుత్ సరఫరా లేదు. ఇలాంటి తరుణంలో శక్తి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నవీన పునర్వినియోగశక్తి వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్లె ప్రాంతాల్లో కేవలం గృహ, వ్యవసాయ అవసరాలకు మాత్రమే కాకుండా గ్రామీణ నేపథ్య పరిశ్రమల అభివృద్ధికి కూడా విద్యుత్ సరఫరా అవసరం. వీటిని సాధించడంలో నవీన పునర్వినియోగ శక్తి వనరుల పాత్ర కీలకం అని చెప్పొచ్చు. సోలార్ శక్తి-రకాలు: ఇది అపారమైంది. అత్యధిక సౌర వికిరణం గుజరాత్, రాజస్థాన్, లడఖ్ ప్రాంతాలలో లభిస్తుంది. అతి తక్కువగా ఈశాన్య భారతంలో చేరుతుంది. సౌరశక్తిని రెండు రకాలుగా విభజిస్తారు. మొదటిది, సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం (సోలార్ ఫోటో వోల్టాయిక్స్). సౌర లాంతర్లు, సౌర విద్యుత్ వీధి దీపాలు, గ్రిడ్ ఆధారిత సౌరశక్తి, సౌర ఫ్యాన్లు మొదలైనవి సోలార్ ఫోటో వోల్టాయిక్స్ పరిధిలోకి వస్తాయి. రెండోది, సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే టెక్నాలజీ (సోలార్ థర్మల్). సౌర కుక్కర్లు, సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్, సోలార్ డ్రయర్లు, సోలార్ హీటర్లు మొదలైనవి సోలార్ థర్మల్ పరికరాలు. ఇలాంటి పరికరాలను విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే కొద్దీ సంప్రదాయ శక్తి వనరులపై భారం తగ్గుతుంది. ఖరీదే... అయినా: సౌర వికిరణం నుంచి ఉత్పత్తి చేయగల శక్తినే సౌరశక్తి అంటారు. ఏడాదిలో 300 రోజులపాటు భారత భూభా గంపై 5000 ట్రిలియన్ కిలోవాట్ అవర్ల సౌరశక్తి వచ్చి చేరుతుంది. బహుశా సౌరశక్తిని ఏడాదిపాటు పొందగలిగే అవకాశం ఉన్న అరుదైన దేశం మనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌరశక్తి రంగంలో అపార అవకాశాలు దేశానికి ఉన్నాయి. ఈ శక్తి ద్వారా ఎలాంటి పర్యావరణ కాలుష్యం సంభవించదు. బొగ్గు వంటి శక్తి వనరులతో పోలిస్తే సౌర శక్తి ఖరీదైంది. అయినప్పటికీ సాంకేతిక సమీకరణ, సామర్థ్యం పెంపుదల చర్యల ద్వారా అందుబాటు ధరల్లోకి సౌర యంత్రాలను, గ్రిడ్ ఆధారిత ఉత్పత్తిని తీసుకురావడం సాధ్యమవుతుంది. అమెరికా వంటి సమశీతోష్ణ ప్రాంత దేశాలు సౌర శక్తిని అత్యధిక ప్రాధాన్యతతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు భారత్‌కు ఇదేం కష్టం కాదు. 1980 నుంచి క్రమంగా సౌరశక్తి ఉత్పాదన, పరికరాల ధర తగ్గుతూనే ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం: సౌరశక్తి సామర్థ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2010, జనవరి 11న జవహర్లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్ (JNNSM)ను ప్రారంభించింది. 2022 నాటికి 20వేల మెగావాట్ల గ్రిడ్ ఆధారిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు, 20 మిలియన్ చదరపు మీటర్ల సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం (సోలార్ థర్మల్ కలెక్టర్ ఏరియా) ను అభివృద్ధి చేయాలన్నది ఈ మిషన్ లక్ష్యం. సౌరశక్తి ఉత్పాదన ఖర్చును తగ్గించి, దీర్ఘ కాలిక సౌర విధానాన్ని అవలంబించింది. దేశ వ్యాప్తంగా సౌరశక్తి విస్తరణ, వేగవంతంగా పరిశోధన అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహం, దేశీయ ముడి పరికరాల, ఉత్పత్తుల తయారీని పెంచడం మొదలైనవి ఈ మిషన్ ఇతర లక్ష్యాలు. ఈ మిషన్‌ను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ -లక్ష్యాలు: కాలం: 2010-13 1000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన 7 మిలియన్ చదరపు మీటర్ల సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం సాధించడం రెండో దశ - లక్ష్యాలు: కాలం: 2013-17 3,000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పాదన 15 మిలియన్ చదరపు మీటర్లకు సౌరథర్మల్ సంగ్రహణ ప్రాంతం విస్తరణ మూడో దశ-లక్ష్యాలు: కాలం: 2017-22 20,000 మెగావాట్లకు సౌరశక్తి ఉత్పాదన 20 మిలియన్ చదరపు మీటర్లకు సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతాన్ని సాధించడం ఈ మూడు దశల్లోనూ చివర్లో, మధ్యలో విశ్లేషణ చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాల్లో మార్పులు జరుగుతాయి. కేంద్రీకృత, వికేంద్రీకృత పద్ధతుల్లో దేశ వ్యాప్తంగా సౌర శక్తి ఉత్పాదన, వినియోగం, విస్తరణతో పాటు వాణిజ్య విద్యుత్ అందించలేని ప్రాంతాల్లో ఆఫ్‌గ్రిడ్ తరహా సౌరశక్తిని విస్తరించడానికి ఈ మిషన్ కృషి చేస్తుంది. మిషన్‌లో భాగంగా గ్రిడ్ ఆధారిత కొత్త సౌర ప్రాజెక్టుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మిషన్‌కు ముందున్న కార్యక్రమాలను నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా పొందుపరిచారు. మెగావాట్ స్థాయి సౌర ప్రాజెక్టులను 2011లో ప్రారంభించారు. ఆఫ్‌గ్రిడ్ తరహా సౌరశక్తి విస్తరణ ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో మినీ ఎస్పీవీ వ్యవస్థలను ఆమెదించారు. దీనిలో భాగంగా ఎస్పీవీతో నీటి పంపింగ్ వ్యవస్థలను, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (సీఎఫ్ఎల్) ఆధారిత ఎస్పీవీ లైటింగ్ వ్యవస్థలు (ఉదాహరణకు సోలార్ లాంతర్లు, హోంలైటింగ్, వీధి దీపాలు), ఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్స్) ఆధారిత లైటింగ్ వ్యవస్థల అభివృద్ధి సాంకేతిక పరమైన నిబంధనలను విడుదల చేశారు. బాంబే ఐఐటీ సౌర సేవలు: దేశ వ్యాప్తంగా సౌర వెలుగులు పంచేందుకు బాంబే ఐఐటీ తనవంతు సేవలనందించేందుకు ముందుకు వచ్చింది. తన ఆధ్వర్యంలో 10 లక్షల సోలార్ స్టడీ ల్యాంపులను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే విధంగా కిలోవాట్ సామర్థ్యం ఉన్న 23,500 ఎస్పీవీ వ్యవస్థలను గృహ అవసరాల కోసం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అందించే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టింది. సోలార్ థర్మల్‌లో భాగంగా 2011లో సోలార్ వాటర్ హీటింగ్ వ్యవస్థల రూపకల్పనకు సాంకేతిక నిబంధనలు జారీ చేయాల్సి ఉంది. సౌర మిషన్ రెండో దశలో ఆఫ్‌గ్రిడ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ అప్లికేషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోలార్ సిటీ: నగరాల్లో గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించి శక్తి సుస్థిరత సాధించే క్రమంలో అనేక దేశాల్లోని నగరాలు పునర్విని యోగ శక్తి లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీస్ కార్యక్రమాన్ని కేంద్ర నవీన ఇంధన పునర్వినియోగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పురపాలక సంఘాల భాగస్వామ్యంతో సౌరశక్తిని విస్తరించడం దీని ప్రధాన లక్ష్యం. కనీసం 10 శాతం శక్తి డిమాండ్‌ను సౌరశక్తి ద్వారా వచ్చే ఐదేళ్లలో భర్తీ చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. సోలార్ సిటీలో సౌరశక్తి మాత్రమే కాకుండా, పవన, జీవశక్తి, చిన్న తరహా జలవిద్యుత్, వ్యర్థాల నుంచి శక్తి ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తారు. అక్షయ ఊర్జా దుకాణాలు, సోలార్ బిల్డింగ్ డిజైన్ వంటి వాటిని ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రోత్సహిస్తున్నారు. 60 నగరాల్లో ఇలా అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల ఆధారంగా ఇప్పటివరకు 48 నగరాలను ఎంపిక చేశారు. నవీన పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి సాధించిన గ్రిడ్ ఆధారిత సౌరశక్తి స్థాపిత సామర్థ్యం 2765.81 మెగావాట్లు. ఆఫ్ గ్రిడ్ సౌరశక్తి (ఎస్పీవీ వ్యవస్థల) స్థాపిత సామర్థ్యం 209.89 మెగావాట్లు. 619 మిలియన్ చదరపు మీటర్లతో సౌర థర్మల్ సంగ్రహణ ప్రాంతం ఏర్పాటైంది. శక్తి స్వయం సమృద్ధి: దేశ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శక్తి స్వయం సమృద్ధి సాధించడానికి సౌరశక్తి విస్తరణ చాలా కీలకం. ఆఫ్‌గ్రిడ్ సౌర పరికరాల ద్వారా ప్రతి ఇంటిలో శక్తి లభ్యత పెరుగుతుంది. సౌర ఇంటి దీపాలు, వీధి దీపాలు, సోలార్ కుక్కర్లు, వాటర్ హీటర్ల వినియోగాన్ని విస్తరించగలిగితే చాలు, శక్తి సమృద్ధిలో ఎంతో మెరుగుదల నమోదవుతుంది. ఇందుకోసం ప్రజల్లో సౌరశక్తి పట్ల అవగాహనతో పాటు చైతన్యం తీసుకురావడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాలు, సూక్ష్మ రుణాల ద్వారా మరింత విస్తరించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో చైతన్యం తప్పనిసరి. ప్రధానంగా వాణిజ్య సముదాలు, స్కూళ్లు, పార్కుల్లో సౌరశక్తిని మరింత ప్రోత్సహించాలి. ఈ రంగాల్లో టెక్నాలజీ, పరికరాల కోసం ఇతర దేశాలపై ప్రస్తుతం అధికంగా ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ రంగానికి కావల్సిన పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు ఈ రంగంలో విద్యా కోర్సులను కూడా ప్రారంభించాలి. అవరోధాలు: 20-60 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తికి చదరపు కిలోమీటరు భూమి కావాలి. ఇది 250 ఎకరాలతో సమానం. అసలే స్థలాభావ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తోంది. స్థలం కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం. ఒకవేళ తప్పనిసరిగా కొన్నా ఆ స్థలం విలువను మించి అధికంగా సౌర శక్తి ఉత్పత్తి చేయాలి. ఇది మన ముందున్న ప్రధాన అవరోధం. అవకాశాలు: గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు. ఉన్నా నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందడం లేదు. 2004 నాటికి దేశంలో 80 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. వీటిలో 18 వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించలేని పరిస్థితి. ఇలాంటి పల్లెలకు సౌర వెలుగులే ప్రత్యామ్నాయం. సర్కారు చొరవే తారకమంత్రం: సోలార్ శక్తిని అందరికీ దరిచేర్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం పలు రూపాల్లో వ్యూహాలను అనుసరిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చాలవు. సామాన్యుడు సైతం సోలార్ వెలుగుల్లో విహరించేలా చర్యలు చేపట్టాలి. గృహ సముదాయాల పైకప్పులపై ఫోటో వోల్టాయిక్ ప్యానల్లను అమర్చుకునే దిశగా ప్రోత్సహించాలి. ఇప్పుడు టె లికమ్యూనికేషన్లో విప్లవం సాధించినట్లే సోలార్ పరిశ్రమను విస్తృతం చేయాలి. సోలార్ శక్తి వినియోగంలో అగ్ర దేశాలు దేశం సామర్థ్యం గిగావాట్లలో జర్మనీ 35.5 చైనా 18.3 ఇటలీ 17.6 జపాన్ 13.6 అమెరికా 12 స్పెయిన్ 5.6 ఫ్రాన్స్ 4.6 ఆస్ట్రేలియా 3.3 బెల్జియం 3 యూకే 2.9 భారత్ 2.3 సోలార్ శక్తి వినియోగంలో అగ్ర రాష్ట్రాలు రాష్ట్రం సామర్థ్యం మెగావాట్లలో గుజరాత్ 860.40 రాజస్థాన్ 666.75 మహారాష్ట్ర 237. 25 మధ్యప్రదేశ్ 195.315 ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) 92.9 సౌర శక్తి ఉత్పత్తి లక్ష్యం (మెగావాట్లలో) 2005 6.4 2010 10 2011 468.3 2014 జనవరి 2,208.36 2022 20 వేలు ఆధారము : సాక్షి ఎడ్యుకేషన్