ఎల్పిజి కనెక్షను క్రమబద్ధీకరణ సిలిండర్ / లు, ప్రెషరు రెగ్యులేటరు మరియు CV స్వాధీనంలో ఉన్న అధీకృత కస్టమర్ ఆచూకీ అందుబాటులో ఉంది/లేదు. పరికరాలు & ఎస్వీ కలిగిన వ్యక్తి పేరిట కనెక్షన్ బదిలీ చెయడానికి అసలు వినియోగదారు నుండి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. పంపిణీదారు దగ్గర అందుబాటులో ఉన్న సమ్మతి లేఖ ఫార్మాటులో అనుమతి లేఖను LPG పంపిణీదారుకు సమర్పంచాలి. వాస్తవంగా కనెక్షన్ కలిగిన వ్యక్తి ఆయిల్ కంపెనీ కి ఆ బదిలీపై ఎలాంటి క్లెయిము చెయనని వాగ్దానాన్ని సమర్పిచాలి. దీనికి సంబంధించిన ఫార్మాటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది. పంపిణీదారు రికార్డుల్లోని వివరాలను ధృవీకరిస్తాడు. అన్ని సక్రమంగా ఉంటే, అసలు ఎస్వీ హోల్డర్ పేరును తో TVని సిద్ధం చేస్తాడు. ఆయిల్ కంపెనీ గుర్తించిన వ్యక్తికి సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. పరికరాలు కలిగిన వ్యక్తినుంచి ఆసమయంలో ఉన్న రేటు ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్‌ను సేకరిస్తారు మరియు తాజా ఎస్వీ అతని / ఆమె పేరు పై జారీ చేస్తారు. ఎస్వీ గాని పోతే ఎస్వీ పోయిందని ఒక స్వీయ ప్రకటన సమర్పంచాలి. సరియైన పత్రాలు లేకుండా సిలిండర్లు మరియు ప్రెషరు రెగ్యులేటరు కలిగిన వ్యక్తి సరియైన పత్రం (SV / DGCC) లేకుండా ఎల్పీజీ పరికరాలు కలిగిన వ్యక్తి స్వీయ ప్రకటన సమర్పించి అతకుముందు రేటుతో భద్రతా డిపాజిట్‌ను చెల్లించాలి. ఎస్వీ హోల్డర్ మరణం కారణంగా కనెక్షన్ బదిలీ దగ్గరి బంధువు ఎస్వీతో పాటు (i) మరణ సర్టిఫికెట్ (ii) చట్టపరమైన వారసులుల సర్టిఫికేట్లను అవసరమైన నమూనాలో సమర్పించాలి. తాజా ఎస్వీ అసలు ఎస్వీ డిపాజిట్ల ఆధారంగా లబ్దిదారుని పేరుతో జారీ చేస్తారు కస్టమర్ జీవించి ఉన్నప్పుడు వేరే కుటుంబ సభ్యుల పేరుపై మార్చటం కుటుంబంలో ఎల్పిజి కనెక్షన్ బదిలీ (అనగా తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, సోదరి) చేసుకోవచ్చు. నమోదిత వినియోగదారు కుటుంబ సభ్యుల పేరుపై మార్చడానికి లిఖిత పూర్వకంగా అప్లికేషను ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఫార్మాటు అందుబాటులో ఉంటుంది. బదిలీ చేసుకొనే కుటుంబ సభ్యుడు ఆయిల్ కంపెనీ కి ఆ బదిలీపై ఎలాంటి క్లెయిము చెయనని వాగ్దానాన్ని సమర్పిచాలి. ఫార్మాటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది. అసలు కనెక్షన్‌ను TV ద్వారా తొలగిస్తారు. తాజా ఎస్వీని లబ్దిదారుని పేరుపై జారీ చేస్తారు. పూర్వపు ఎస్వీ డిపాజిట్లపైనే దీనిని ఇస్తారు గమనిక: పైన పేర్కొన్న క్రమబద్ధీకరణ/పేరు మార్పు సందర్భాల్లో గుర్తింపు & చిరునామా, కెవైసి రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్వీని డి-డుప్లికేషను పరిశీలన తర్వాత తయారు చేస్తారు. మూలం : My LPG.in