థర్మల్ పవర్ ప్లాంట్స్ భారత దేశంలోపర్యావరణం, అడవుల పై ప్రభుత్వ విధానాలు- ప్రణాళికలు చెయ్యడం, ప్రోత్సాహించడం, సమన్వయపరచడం, వాటిని అమలు చెయ్యడం లాంటి వన్నీ పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్) ఆద్వర్యంలో అమలు అవుతాయి. దక్షిణ భారత దేశంలో ధర్మల్ పవర్ ప్లాంట్స్ స్థాపించడం వలన వాతావరణం పైన ప్రభావం, ఫలితాలు గురించి ఆయా ప్రాంతాల పజ్రలకు విశ్లేషించి, సరైన అవగహన కలిగించే ధర్మల్ వాచ్, సిటిజెన్ కన్సూమర్ మరియు సివిక్ యాక్షన్ గ్రూప్ వారి మానస పుత్రిక. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ను చూడండి. పవర్ ప్లాంట్స్ ప్రభావాలు కలుషితమైన గాలి: బొగ్గు నుపయోగించే పవర్ ప్లాంట్స్ అనేక కాలుష్య కారకాలయిన వాయువులు మొదలైనవి గాలిలోకి విడుదల చేస్తాయి. వాటిలో సల్ఫర్ డైఆక్సయిడ్ (SO2),కార్బన్ మోనాక్సైడ్ (CO), ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజెన్(NOX),ఓజోన్ (O3), గాలిలో కలిసిన బొగ్గు నుసి, దుమ్ము (SPM), లెడ్,నాన్ మీతేన్ హైడ్రో కార్బన్స్ లాంటివి వుంటాయి. ఏ రకమైన దహన క్రియ(కంబషన్)లో నైనా సాధారణంగా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజెన్(NOX) ఉత్పత్తి అవుతాయి. దహన క్రియ లో ఇంధనం లోని నైట్రోజెన్‌తో, గాలిలోని ఆక్సిజెన్ కలిసి మండి నప్పుడు, ఈ నైట్రోజెన్ ఆక్సైడ్స్ ఉత్పత్తి అవుతాయి.దహన క్రియలోవేడిమి ఎక్కువైనకొద్దీ,ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజెన్ ( NOX) ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అంతే కాదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ (వాతావరణంలోని వాయువులు- నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్ ) కూడా ఉత్పత్తి అవుతాయి. వాతావరణంలోని ఆక్సిజెన్‌తో, కార్బన్ మోనాక్సైడ్ (CO)కలిసి కార్బన్డ యాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజెన్ కలిసి నైట్రస్ ఆక్సైడ్ N2O ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా, ఇంధనంలోని సల్ఫర్‌తో వాతావరణం లోని ఆక్సిజెన్ కలిసి ,ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఉత్పత్తి అవుతాయి. ఈ ఆక్సైడ్స్ అఫ్ సల్ఫర్ లో సల్ఫర్ డై ఆక్సైడ్(SO2) బొగ్గుతో నడిచే పవర్ ప్లాంట్స్ లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒకో సారి, ఆక్సిజెన్ ఎక్కువగా వున్నప్పుడు SO3 కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇది వాతావరణం లోని నీటితో కలిసి ఆమ్ల వర్షం కురుస్తుంది. బొగ్గు నుపయోగించే పవర్ ప్లాంట్స్ లో వెలువడే బొగ్గు నుసి, దుమ్ము,పొగ—వీటిని సస్పెండెడ్ పార్టిక్యులేట్ మాటర్ అంటారు. ఇవి పీల్చిన వారికి ఆస్తమా, మరికొన్ని శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. నీటి కాలుష్యం: బొగ్గునుపయోగించే పవర్ ప్లాంట్స్ లో నీటిని బొగ్గును కడగడానికి, బాయిలర్‌లో స్టీమ్ ఉత్పత్తి చెయ్యడానికి, పరికరాలు చల్లబరిచేందుకు వాడతారు. ఇలా బొగ్గును కడిగిన నీటిని వదిలినందువల్ల, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. వేడి నీటిని వదిలినందువల్ల కాలువలలోని, నదులలోని జీవ రాసి మనుగడకు ముప్పు వస్తున్నది. భూసారం లో తగ్గుదల: కాలుష్య శుద్ధి చెయ్యని గాలి, నీరు వల్ల ఈ పవర్ ప్లాంట్స్ చుట్టుపక్కల గల ప్రాంతాలన్నీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కి, జీవకోటి మనుగడకు ప్రమాదంగా తయారవుతున్నాయి. శబ్ద కాలుష్యం: ఈ పవర్ ప్లాంట్స్ లోని బాయిలర్లు , టర్బైన్లు,క్రషర్లు చేసే శబ్దాలు ఎక్కువగా వినడం వల్ల, అక్కడ పని చేసే వారికి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆరోగ్య సమస్యలు రసాయనిక కాలుష్య కారకం ఆరోగ్యంపై దాని ప్రభావం సల్ఫర్ డై ఆక్సైడ్ శ్వాసావయవాలకు , వూపిరితిత్తులకు ప్రమాదకరం ఆస్తమా, తీవ్రమైన బ్రోం కైటిస్ వ్యాధుల కారకం. కళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. గుండె జబ్బులకు కారణం అవుతుంది. నైట్రస్ ఆక్సైడ్స్ ఆస్తమాకు కారణమవుతుంది. ఎలక్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మోనరి డిసీజ్ ( శ్వాస కోసం సన్న బడడం వల్ల వూపిరి తీసుకునేందుకు కష్టం) పిల్లల్లో వూపిరితిత్తుల ఎదుగుదల తగ్గుతుంది. గుండె జబ్బులకు కారణం పార్టిక్యులేట్ మాటర్ PM కోర్స్ పార్టిక్యులేట్స్ PM10 ఫైన్ పార్టిక్యులేట్స్ PM2.5 ఆస్తమాకు కారణం ఎలక్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మోనరి డిసీజ్ ( శ్వాస కోసం సన్న బడడం వల్ల వూపిరి తీసుకునేందుకు కష్టం) పిల్లల్లో వూపిరితిత్తుల ఎదుగుదల తగ్గుతుంది. లంగ్ కాన్సర్ కు కారణం గుండె జబ్బులకు కారణం కంజస్టివ్ హార్ట్ ఫైల్యూర్ కు కారణం అవుతుంది అమోనియా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి చర్మం పైన, కళ్ళలోమంటలు పుడతాయి హైడ్రోజెన్ క్లోరైడ్,ఫ్లోరైడ్ చర్మం పై దురదలు,కళ్ళలో ,ముక్కులో ,గొంతులో,శ్వాసకు ఇబ్బంది కలిగిస్తుంది డై ఆక్సిన్స్,ఫురాన్ స్టమక్ కాన్సర్ కు ఇవి కారకాలు కావచ్చు పునరుత్పత్తి, ఎండోక్రైన్,రోగనిరోధక శక్తులను దెబ్బతీస్తుంది పాలి సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రో కార్బన్స్ కార్సినోజేన్స్(కాన్సర్ కారకాలు)తయారు అవవచ్చు లివర్,కిడ్నీలు,వృషణాలపై చెడు ప్రభావం వీర్య కణాలు నిర్విర్యమై పునరుత్పత్తి పడిపోతుంది బొగ్గు నుసి,దుమ్ముతో కలిసి వూపిరితిత్తులలో చేర వచ్చు మెర్క్యురీ మెదడుకు,నరాలకు,కిడ్నిలకు,లివర్‌కు అపకారం చేస్తుంది. నరాల సమస్యలకు కారణమై, పుట్టే బిడ్డలలో లోపం ఏర్పడవచ్చు. లెడ్ పిల్లల నరాల జబ్బులకు కారణం అవుతుంది పిల్లల చదువులో, జ్ఞాపక శక్తిలో చివరికి వారి ప్రవర్తనలో లోపం ఏర్పడుతుంది. కిడ్నిలకు అపకారం చేస్తుంది. కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ కు కారణం అవుతుంది. రక్త హీనత ఏర్పడుతుంది యాన్టిమోని,ఆర్సెనిక్,బెరిలియం,కాడ్మియం, క్రోమియం,నికెల్,సెలీనియం,మాంగనీస్ కార్సినోజేన్స్(లంగ్,బ్లాడర్ ,కిడ్ని,స్కిన్ కాన్సర్ కారకాలు)తయారు అవవచ్చు నరాల పైన, గుండె జబ్బులకు సంబంధించి,చర్మ వ్యాధులకు,శ్వాస కోస వ్యాధులకు కారణం అవుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రేడియం కార్సినోజేన్స్(లంగ్, బోన్ కాన్సర్ కారకాలు) తయారుఅవుతాయి రక్త హీనత ఏర్పడుతుంది మెదడు వాపు రావచ్చు యురేనియం కార్సినోజేన్స్(లంగ్, లిమ్ఫటిక్ కాన్సర్ కారకాలు)తయారుఅవుతాయి కిడ్ని జబ్బులకు కారణం అవుతుంది పర్యావరణ శాఖ అనుమతి పొందే విధానం 2006 వ సంవత్సరంలో ఇ.ఐ.ఏ. చేసిన ప్రకటన ప్రస్తావన భారత దేశంలోపర్యావరణం, అడవుల పై ప్రభుత్వ విధానాలు - ప్రణాళికలు చెయ్యడం, ప్రోత్సాహించడం, సమన్వయపరచడం, వాటిని అమలు చెయ్యడం లాంటి వన్నీ పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ ) ఆద్వర్యంలో అమలు అవుతాయి . పర్యావరణ పరిరక్షణ చట్టం,1986 (ఇ.పి.ఏ.): ఏదైనా పరిశ్రమను స్థాపించడం, నడపడం , లేదా స్థాపించే విధానం కొన్ని ప్రాంతాలలో నిషేధించడం, లేదా కొన్ని పరిమితులకు లోబడి అనుమతించడం లాంటి వాటికి ప్రభుత్వానికి ఈ చట్టం ప్రకారం అధికారం వున్నది. (క్లాజు5,సబ్ సెక్షన్(2), సెక్షన్3 ఆఫ్ఇ.పి.ఏ.) ఇ.ఐ.ఏ. ప్రకటన 2006 : ఈ ప్రకటన పర్యావరణ పరిరక్షణ చట్టం కింద విడుదల చేయ్యడమైంది. పర్యావరణ ప్రభావ అంచనా (ఇ.ఐ.ఏ.) :పర్యావరణ పరిరక్షణ చట్టం కింద, యాభై కోట్లు అంతకు మించిన పెట్టుబడితో చేసే ముఫై తొమ్మిది రకాల అభివృద్ది పనులకు, ఇప్పుడు ఇ.ఐ.ఏ. పర్యావరణ ప్రభావ అంచనా తప్పనిసరి. ఈ క్రింది వాటిలో ముందుగా పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాలని ఇ.ఐ.ఏ. నిర్దేసిస్తోంది. కొత్తగా మొదలెట్టే అన్నీ ప్రాజెక్టులకు, పనులకు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ పనులకు, అధునాతన పరిచేందుకు ప్రకటన (నోటిఫికేషన్) లో ఇచ్చిన ఇతర పనులకు ఈ ప్రకటన(నోటిఫికేషన్) లోని పట్టికలో 1(డి) కింద ధర్మల్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వబడినవి. ధర్మల్ పవర్ ప్లాంట్లు పర్యావరణ అనుమతి ఎప్పుడు తీసుకోవాలి? ఒక కొత్త ప్లాంటు మొదలు పెట్టే ముందు. వున్నటువంటి ప్లాంటు అభివృద్ది పనులకు, లేదా, అధునాతన పరిచేందుకు నడుస్తున్న ప్లాంటులో ప్రాడక్ట్ మిక్స్ మార్చేందుకు పర్యావరణ అనుమతి ఎవరిస్తారు? పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ(ఎమ్.ఒ.ఇ.ఎఫ్.) రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల శాఖ (ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.) ఇ.ఐ.ఏ. నోటిఫికేషన్(ప్రకటన) ప్రకారము పై రెండింటికి మాత్రమే పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం ఉన్నది. పట్టికలో A క్యాటగిరి కిందకు వచ్చే పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటికి మంత్రిత్వ శాఖ మాత్రమే అనుమతి ఇస్తుంది. చిన్న ప్రాజెక్టులకు ఎస్.ఇ.ఐ.ఎ.ఎ.– వివిధ రాష్ట్రాలలో వున్న భారత ప్రభుత్వ సంస్థ అనుమతి ఇస్తుంది. ఎస్.ఇ.ఐ.ఎ.ఎ.: భారత ప్రభుత్వ పర్యావరణం, అడవుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించే సంస్థ ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. దీనిలో ముగ్గురూ సభ్యులు వుంటారు. మెంబర్ సెక్రెటరి__ పర్యావరణ చట్టం తెలిసిన, ఆయా రాష్ట్ర ప్రభుత్వాని చెందిన లేదా, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వానికి చెందిన ఇంకా సర్విస్ లో ఉన్న అధికారిని నియమిస్తారు. అద్యక్షుడు (చైర్ పర్సన్): పర్యావరణ ప్రభావ అంచానా విషయాలలో నిష్ణాతుడు అయిన వ్యక్తిని చైర్పర్సన్ గా మూడు సంవత్సరాల పాటు నియమిస్తారు. నాన్ అఫీ షియో సభ్యుడు: పర్యావరణ ప్రభావ అంచానా విషయాలలో నిష్ణాతుడు అయిన వ్యక్తిని నాన్ అఫిషియో సభ్యుడిగా మూడు సంవత్సరాలు నియమిస్తారు. ఏ రాష్ట్రంలో నైనా రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ ఏర్పాటు కాకపోయి వుంటే, అనుమతి పొందాల్సిన అన్ని ప్రాజెక్టులకు పర్యావరణ,అడవులు మంత్రిత్వ శాఖే అనుమతులు ఇవ్వాలి. ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. సమావేశంలో చేసే నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాలి. అధిక సభ్యుల ఆమోదం పొందిన నిర్ణయమైతే, ఆ నిర్ణయాలను సమర్ధించిన వాదనలు, కాదన్న వాదనలు రెండు కూడా రికార్డు చెయ్యాలి. అలా రికార్డు చేసిన మినిట్సు పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపాలి. పర్యావరణ అనుమతి ఇచ్చేదెవరు పర్యావరణ,అడవుల మంత్రిత్వ శాఖ (MoEF) రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ SEIAA బొగ్గు,లిగ్నైట్,నాఫ్తా ,గ్యాస్ వీటి ఆధారంతో నడిచే పవర్ ప్లాంట్స్ >500 MW <500 MW ఆయిల్ రిఫైనరీ లో వచ్చే పెట్‌కోక్,డిజెల్, రిఫైనరీలో చివర మిగిలే ఆయిల్ వేస్ట్,తదితర ఇంధనాలు (బయోమాస్ కాకుండా) >50 MW 5 MW- 49 MW బయోమాస్ లేక, తదితర హానికరంకాని చెత్త లాంటి వాటి ని ఉపయోగించే ప్లాంట్స్ >20 MW 16 MW – 19 MW ఇ .సి. ఫోరా ప్రాజెక్టు ఇవ్వడానికి ఎవరు సిఫార్సు చేయగలరు ? ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ రాష్ట్ర ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సిఫార్సులననుసరించి మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతి విడుదల చేస్తుంది. అలాగే రాష్ట్ర ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సిఫార్సుల ననుసరించి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల కమిటీ విడుదల చేస్తుంది. రాష్ట్ర నిపుణుల అప్రైజల్ కమిటీ( ఎస్.ఇ.ఎ.సి.): రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటిని నియమిస్తుంది. ఈ కమిటీ నియమాకం కాక పోయినట్లయితే, అప్పుడు B కేటగిరి ప్రాజెక్టులకు కూడా పర్యావరణ అనుమతులు మంత్రిత్వ శాఖే జారి చేస్తుంది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, రాస్ష్ట్ర కమిటీ నియామకం మరియు పని విధివిధానాలు : పర్యావరణం పరిస్థితుల గురించి పూర్తి అవగాహన, ప్రాజెక్టు మేనేజ్మెంట్లో వివిధ విభాగాల్లో అనుభవం, పర్యావరణ ప్రభావ అంచనా విధానంలో , రిస్క్ మేనేజ్మెంట్ గురించీ అవగాహన వివధ వృక్ష జాతులు,పక్షులు, జంతువులకు సంబంధించిన లైఫ్ సైన్స్ నిపుణులు, అడవులు, వన్య ప్రాణుల గురించి, పర్యావరణ ఆర్ధిక శాఖ :- ఈ రంగాలలో అనుభవం వున్న నిపుణులను,అనుభవజ్ఞులను 15 మందితో ఈ కమిటీలు నియమిస్తారు. పర్యావరణ విదివిదానాలలో మంచి అనుభవం, యాజమాన్య పద్ధతులలో (మేనేజ్మెంట్ శాఖలో) గాని,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో గాని అపార అనుభవం వ్యక్తినే ఈ కమిటిలకు చైర్పర్సన్ గా నియమిస్తారు. అనుభవజ్ఞులైన వృత్తి నిపుణులు (ఎక్స్పిరియన్సడ్ ప్రొఫెషనల్స్) ఉండాల్సిన అర్హతలు: ఆయా శాఖలలో 5 సంవత్సరాల కు తగ్గకుండా యునివర్సిటి లో ఎం .ఎ. ,ఎం .ఎస్. డిగ్రీల కొరకు ట్రైనింగ్ పొంది వుండాలి . ఇంజనీరింగ్ , టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ విభాగాలలో 4 సంవత్సారాలకు తగ్గకుండా బి .యి. ,బి .టెక్. , బి .ఆర్క్. డిగ్రీల కోసం ప్రాక్టికల్ మరియు ప్రొఫెషనల్ చదువు చదివి ఉండాలి. లా కాని, మరే ఇతర డిగ్రీ చదువులయితే,యునివర్సిటి లోను, నిర్దేశించిన విషయంలో మొత్తం 5 సంవత్సరాలు తగ్గకుండా ట్రైనింగ్ పొంది వుండాలి . చార్టర్డ్ అక్కౌంటెన్ట్స్ లాంటి వారివిషయంలో సంబంధిత ప్రొఫెషనల్ సంస్థ నిర్దేశించిన అప్రెంటిస్ షిప్ గాని, ఆర్టికల్స్ గాని పూర్తి చేసి, వారి పరీక్షలను పాసయి వుండాలి . ఎం.బి.ఏ, ఐ.ఎ.ఎస్.లేదా, ఐ.ఎఫ్.ఎస్. ,ఏదైనా యునివర్సిటి డిగ్రీ తో పాటు యూనివర్సిటిలో గాని, సర్విస్ అకాడెమీ లో గాని రెండేళ్ళ పాటు ఫార్మల్ ట్రైనింగ్ అయివుండాలి. నిపుణులు, ప్రొఫెషనల్స్ ను ఎంపిక చెయ్యడంలో వాళ్ళ వాళ్ళ సంబంధిత రంగంలో వున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అనుభవజ్ఞులకు (ఎక్స్పర్ట్స్) కావాల్సిన అర్హతలు: పైన పేర్కొన్న వాటితో పాటు అనుభవజ్ఞులకు ఈ క్రింది అర్హతలు కూడా నిర్దేశించ బడ్డాయి. సంబంధిత రంగంలో పదిహేను సంవత్సరాల అనుభవం, సంబంధిత రంగంలో పి .హెచ్.డి. లాంటి అత్యధిక అర్హత, పది సంవత్సరాల కనీస అనుభవం ఉండాలి . ఈ అనుభవజ్ఞుల వయసు పరిమితి 70సంవత్సరాలు. అయితే, సంబంధిత రంగంలో తగిన అనుభవజ్ఞులు లభించనప్పుడు, నిపుణుల కమిటీ సభ్యుల వయసు 75సంవత్సరాల వరకూ సడలింప వచ్చు. చైర్పర్సన్ తో సహా సభ్యులు రెండు దఫాలు వరకూ పని చెయ్య వచ్చు. ఒక్కో టర్మ్ కాల పరిమితి మూడు సంవత్సరాలు. ప్రతి నెలా సమావేశం నిర్వహించాలి. సమావేశ అజెండా, మినిట్స్ లిఖించాల్సి వుంటుంది. సమావేశంలోని మినిట్స్ అయిదు రోజులలో నిర్ధారించి పర్యావరణ మంత్రిత్వ శాఖ వారి వెబ్ సైట్ లో ఉంచాలి. తక్కువ కెపాసిటి గల ధర్మల్ ప్లాంట్స్ కు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ బదులుగా రాష్ట్ర కమిటీ, అలాగే మంత్రిత్వ శాఖ బదులు రాష్ట్ర పర్యావరణ ప్రభావ కమిటీ లు ఆయా బాధ్యతలు నెరవేరుస్తాయి. కొత్త ధర్మల్ ప్రాజెక్ట్స్ పర్యావరణ అనుమతి పొందే విధానం: ప్రాజెక్ట్ దరఖాస్తుదారుడు మంత్రిత్వ శాఖకు లేదా, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటికి గాని ప్రాజెక్టు దరఖాస్తును సమర్పించుట. సదరు మంత్రిత్వ శాఖ లేదా, కమిటీ విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్) జారి చేయుట అభ్యర్ధి పర్యావరణ ప్రభావ అంచనా (ఇ.ఐ.ఏ.)ను సమర్పించుట, దానిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ(ఎస్.పి.సి.బి.) పబ్లిక్ హియరింగ్ నిర్వహించుట మంత్రిత్వ శాఖ లేదా,రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ పర్యావరణ అనుమతి ఇచ్చుట లేదా అనుమతి నిరాకరించుట. అభ్యర్ధి తన దరఖాస్తు సమర్పించుట అభ్యర్ధి ప్లాంటు స్థాపించబోయే ప్రాంతాన్ని నిర్ధారించాక మాత్రమె పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుఅనుబంధంలో ఇచ్చిన ఫారం 1 లో ఇవ్వాల్సి వుంటుంది. దానితో పాటు ప్లాంటు స్థాపనకు అనుకూల పరిస్థితులు ( ప్రీ ఫిజిబిలిటి రిపోర్టు) వివరిస్తూ రిపోర్టు జత చెయ్యాలి. ప్లాంటు కేపాసిటిని బట్టి ఈ దరఖాస్తు పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేదా, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటికి గాని సమర్పించాలి. ఈ దరఖాస్తులో (ఫారం 1 )అభ్యర్ధిరాసిచ్చే విధివిధానాలు ( టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్)కూడా పూర్తి చెయ్యాలి. పర్యావరణ అనుమతి వచ్చేదాకా అభ్యర్ధి స్థలం చుట్టూ ఫెన్సింగ్, క్లీనింగ్, పని వాళ్ళకోసం తాత్కాలికంగా షెడ్లు వెయ్యడం లాంటివి తప్ప, ప్లాంటుకు సంబంధించి ఎటువంటి పనులు మొదలు పెట్ట కూడదు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాకమిటికి (ఎస్.ఇ.ఐ.ఎ.ఎ.) ఇచ్చిన అభ్యర్ధి దరఖాస్తును కేటగిరి B1, లేక B2 కింద వర్గీకరిస్తారు.* ఈ విధానాన్ని స్క్రీనింగ్ అంటారు. B2 కింద వర్గికరించబడ్డ ప్రాజెక్టుకు పర్యావరణ ప్రభావం అంచనా అవసరం ఉండదు. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ,ఏ ప్రాజెక్టులు B1,B2 కింద వస్తాయో ఆయా సందర్భాలలో తెలియజేస్తుంది. ప్రస్తుతం బొగ్గు, లిగ్నైట్,నాప్తా,మరియు గ్యాస్ తో నడపబడే ధర్మల్ పవర్ స్టేషన్లు 5M.W.పైగా కెపాసిటి ఉన్నవన్ని B1 కేటగిరి కింద వర్గికరిస్తున్నారు. వీటికి ఇ.ఐ.ఏ. కావాలి. పర్యావరణ మంత్రిత్వ శాఖ,లేదా ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. టర్మ్స్ ఆఫ్ రెఫెరెంస్ జారి చేయుట, దీనికి నిర్ణీతమైన సమయం 60 రోజులు అభ్యర్ధి దరఖాస్తు అందగానే, ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. లేక, పర్యావరణ మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయో లేదో పరిశిలిస్తారు. మరికొన్ని వివరాలు కావాల్సి ఉన్నట్లయితే, అభ్యర్ధిని వెంటనే సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆమోదించాక, మంత్రిత్వ శాఖ,లేదా ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. అభ్యర్ధికి ప్రాజెక్టు వివరాలు పరిశీలించే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, లేదా రాష్ట్ర కమిటీ వారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్రైజల్ కమిటీ పరిశీలినకు నిర్ణయించిన అన్ని పర్యావరణ అంశాలు ఆ సమావేశంలో విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్)లో చేర్చి,మంత్రిత్వ శాఖ లేదా, రాష్ట్ర కమిటీ జారి చేస్తాయి. దీన్ని స్కోపింగ్ అంటారు. నోట్: దరఖాస్తు పరిశీలనలో ప్లాంటు కేంద్రాన్ని చూడాలన్న ప్రతిపాదన సభ్యుల దగ్గర నుంచి వచ్చినట్లయితే, ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాతే ఇ.ఐ.ఎ./ ఎస్.ఇ.ఎ.సి. టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్ విడుదల చేస్తాయి. ఆ ప్రాంత సందర్శనార్ధం ఏర్పాట్లు చెయ్యడానికి వారం రోజులు ముందు మంత్రిత్వ శాఖ లేదా,ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. అభ్యర్ధికి నోటిస్ పంపుతాయి. ఇనస్పెక్షన్ కు అవసరమైన ఏర్పాట్లు అభ్యర్ధి చెయ్యాల్సి వుంటుంది. టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్ ఈ క్రింది వాటిపై ఆధారపడివుంటుంది. ఫారం 1 అభ్యర్ధి సమర్పించిన దరఖాస్తులో వివరించిన విధానాలు ఇ .ఎ.సి. ,లేదా, ఎస్ .ఇ.ఎ.సి. నియమించిన సభ్యులు ప్లాంటు సందర్శన అనంతరం ఇచ్చే రిపోర్ట్ ఇ .ఎ.సి. , లేదా, ఎస్ .ఇ.ఎ.సి వారి వద్ద గల మరేదైనా అదనపు సమాచారం ఈ టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్,ఇ .ఎ.సి. లేదా ఎస్.ఇ.ఎ.సి. వారికి ఫారం 1 అందిన 60 రోజులలోగా తెలియజేయాలి . అలా చెయ్యకపోతే, అభ్యర్ధి సమర్పించిన టర్మ్స్ అఫ్ రెఫెరెన్స్ ఇ .ఐ.ఎ. (పర్యావరణ ప్రభావ అంచనా ) నిమిత్తం అంగీకార యోగ్యమైనదిగా తీసుకోబడును. ఇలా అంగీకరించిన టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లోను, సంబంధిత ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. వెబ్ సైట్ లోను పెట్టాలి. తీర ప్రాంతాలలో పెట్టబోయే ప్లాంట్స్ విషయంలో టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ లో మరిన్ని వివరాలకోసం సమాచారం కోరడం వుంటుంది. ఇ.ఎ.సి.లేదా,ఎస్.ఇ.ఎ.సి. చేసే సిఫార్సులను బట్టి ఈ స్థాయిలో దరఖాస్తు తిప్పివేయ వచ్చు. అలా చేసినప్పుడు, తిప్పి వేయడానికి గల కారణాలు వివరిస్తూ, 60 రోజులలోగా అభ్యర్ధికి తెలియజేయాలి. అభ్యర్ధి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్, ఫారం 1 మంత్రిత్వ శాఖ వారి వెబ్ సైట్ లోగాని, ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. వారి వెబ్ సైట్ లో గాని ఈ సంస్థలు తమ టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ జారి చేసే లోగా పెట్టాల్సి వుంటుంది. అభ్యర్ధి పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించుట,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయుట - దీనికి నిర్ణయింపబడిన సమయం 45 రోజులు అభ్యర్ధి టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ అందుకున్న తర్వాత,గుర్తించబడిన నిపుణుని చేత పర్యావరణ ప్రభావ అంచనాలను పరిశీలించి, డ్రాఫ్టు అంచనా రిపోర్టు తయారు చేయిస్తాడు.(ఈ డ్రాఫ్టు అంచనా రిపోర్టు తయారు చెయ్యడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే, టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ లో ఎన్ని సిజన్లు నిర్దేశించి బడినవో, అన్నీరుతువులు వరకు అంచనా రిపోర్టులో విషయ పరిశీలన చూపించాలి. ఈ డ్రాఫ్టు రిపోర్టు అభ్యర్ధి మంత్రిత్వ శాఖకు గాని,రాష్ట్ర కమిటికి గాని సమర్పించాలి. అదే సమయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారిని ప్రాజభిప్రాయ సేకరణ (పబ్లిక్ కన్సల్టేషన్) ఏర్పాటు చేయ వలసినదిగా రాత పూర్వకంగా కోరడం జరుగుతుంది. ఈ పబ్లిక్ కన్సల్టేషన్ రెండు భాగాలుగా వుంటుంది. ప్రాతీయ నివాసుల తో ఒక సమావేశం ఏర్పాటుచేసి, అక్కడ ప్లాంటు స్థాపనకు వారి అభ్యంతరాలు ఏవైనా వుంటే అవి రికార్డు చేస్తారు. రాత పూర్వక జవాబులు: ప్రాజెక్టు యొక్క సామాజిక, పర్యావరణ విషయాలలో చొరవ చూపించే వారి నుండి రాత పూర్వకంగా వారి అభ్యంతరాలను తీసుకుంటారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ,ఎస్.ఇ.ఐ.ఎ.ఎ.మరియు కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్టు స్థాపించడం పై ప్రజల అభిప్రాయాలను కోరుతారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసి, ఆ సమావేశ విషయాలతో సమగ్రంగా తయారు చేసిన రిపోర్టు, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేదా, రాష్ట్ర కమిటికి అందజేయాలి. అది అభ్యర్ధి నుండి దరఖాస్తు అందిన 45 రోజులలోగా సమర్పించాలి. ఈ రిపోర్టులో ప్రజలు లేవనెత్తిన సమస్యలు, దానికి దరఖాస్తుదారుడు ఇచ్చిన సమాధానం, సమావేశం వీడియో రికార్డింగ్ , రాత పూర్వకంగా అందిన ప్రశ్నలు, జవాబులు అన్ని వుంటాయి. మరిన్ని వివరాలకోసం ప్రజాభిప్రాయ సేకరణ విధానం అనే చాప్టర్ లో చుడండి. పబ్లిక్ హియరింగ్ రిపోర్టుకాలుష్య నియంత్రణ మండలి ఆఫీసులోనే కాకుండా పంచాయతి ఆఫీసులోను ,జిల్లా పరిషత్ ఆఫీసులోను,జిల్లా న్యాయాధికారి గారి ఆఫీసులోను కూడా ప్రదర్శించాలి. కాలుష్య నియంత్రణ మండలి తమ వెబ్ సైట్ లో కూడా ఈ రిపోర్టు ప్రదర్శించాలి. పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఎ.ఎ. ఈ పబ్లిక్ కన్సల్టేషన్ ప్రాసెస్స్ లో ప్రజల స్పందన అభ్యర్ధికి తెలిజేయాలి. డ్రాఫ్టు ఇ.ఐ.ఏ.రిపోర్టులో ఈ కింది అంశాలు వుంటాయి ప్రాజెక్టు వర్ణన పర్యావరణం సాధారణంగా అక్కడ ఎలా వుంటుంది,ప్లాంటు స్థాపించేస్థల వివరాలు, ఏ ప్రాంతం,ఎక్కడ వున్నది, నేల వివరాలు,హరిత వాతావరణ మార్పులు ప్లాంటు స్థాపన వల్ల అక్కడ రాబోయే పర్యావరణ మార్పులు,సామాజిక మార్పులు ఇతర వనరుల,టెక్నాలజీ లభ్యత పర్యావరణ పర్యవేక్షణ ప్రణాళిక ఇతర పరిశీలనలు : ప్రాజెక్టు వల్ల నష్టపోయిన కుటుంబాలకుపరిహారం, ఆ ప్రాంతంలో సామాజికఆర్ధిక అభివృద్ది కార్యక్రమాలు,ప్రాజెక్టురిస్క్ అంచనా, దానికి చేపట్టే రక్షణ చర్యలు పర్యావరణ మేనేజ్మెంట్ ప్రణాళిక - చేపట్టబోయే నష్టం పూరించేచర్యలు,వాటిని పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు, ప్రాజెక్టులో పనిచేసే వారికీ, దానికి సంబంధించి ప్రాజెక్టు అవతల పనిచేసే వారికి ప్రమాద నివారణ రచనప్రణాళిక పర్యావరణ అనుమతి జారి చేయడం లేదా, నిరాకరించడం - నిర్ణిత సమయం 135 రోజులు ప్రజాభిప్రాయ సేకరణలోలేవనెత్తిన సామాజిక పర్యావరణ సమస్యల గురించిఅభ్యర్ధిచెప్పాలి. అవసరమైన మార్పులు తన డ్రాఫ్టు ఇ ఐ ఏ రిపోర్టులో చెయ్యాలి. అలా సరిచేసిన ఈ రిపోర్టును ఫైనల్ ఇ ఐ ఏ రిపోర్టు అంటారు. అభ్యర్ధి ఈ ఫైనల్ ఇ. ఐ. ఏ. రిపోర్టు పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేదా, ఎస్.ఇ.ఐ. ఏ. ఏ. కు గాని పరిశీలనకు సమర్పించాలి. (అభ్యర్ధి ప్రజాభిప్రాయ సేకరణలో లేవనెత్తిన ముఖ్య అంశాలు చర్చిస్తూ ఒక సప్లిమెంటరి రిపోర్టు తన మొదటి డ్రాఫ్టు రిపోర్టు తో కలిపి సమర్పించవచ్చు. అప్పుడు రెండూ కలిపి ఫైనల్ ఇ.ఐ.ఏ.రిపోర్టు అవుతాయి.) ప్రాజెక్టు ప్రపోజల్ అభ్యర్ధి మంత్రిత్వ శాఖకు లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.కు ఫైనల్ ఇ.ఐ.ఏ.రిపోర్టు (20 హార్డు కాపీలు,ఒక సాఫ్టు కాపీ) 20 ఫైనల్ లే అవుట్ ప్లాను కాపీలు ప్రాజెక్టు ఫిజిబిలిటి రిపోర్టు ఒక కాపీ పంపాలి. అభ్యర్ధి పబ్లిక్ హియరింగ్ వివరాల వీడియో టేపు గాని,సిడి గాని ఒక కాపీ కూడా పంపవచ్చు. ఈ పత్రాలు అందిన ముఫై రోజుల లోగా పర్యావరణ మంత్రిత్వ శాఖ విధివిధానాల ప్రకారం ఉన్నదో లేదో పరిశీలించి ఆ పత్రాలతో తమ పరిశీలనజత చేసి, ఆన్ లైన్ ద్వారా గాని, లేక మరో విధంగా గాని,ఇ.ఏ.సి. లేదా,ఎస్.ఇ.ఏ.సి. పంపాలి. ఏవైనా పూర్తి చెయ్యాల్సినవి, లేని పత్రాలు వుంటే అవి కుడా తమ పరిశీలనలో రాయాలి. ఈ పరిశీలన పత్రంతో పాటు,ఫైనల్ ఇ.ఐ.ఏ. రిపోర్టు,ప్రజాభిప్రాయ సేకరణ రిపోర్టు,ఫారం 1 జత చెయ్యాలి. ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. దరఖాస్తు పరిశీలనకు తేది నిర్ణయించి తెలియజేయాలి. అభ్యర్ధి స్వయంగాకాని, అనుమతించిన ప్రతినిధి ద్వారా కాని సమావేశానికి హాజరు అవ్వాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. పదిహేను రోజుల ముందుగా ఉత్తరం రాసి సమావేశం తేదిని అభ్యర్ధికి తెలియ పరచాలి. ప్ర్రాజెక్టు గురించి అవసరమైన వివరాలు అభ్యర్ధి ఆ సమావేశంలో తెలియజేయాలి. ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. దరఖాస్తు అందిన 60 రోజులలోగాపరిశీలన పూర్తిచేయాలి. పర్యావరణ అనుమతికి వారు సిఫార్సు చేసే పద్ధతిలో, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు,షరతులు కుడా వారి సిఫారసులో రాయాలి. అనుమతి నిరాకరించేటప్పుడు, దానికి కారణాలు తెలపాల్సి వుంటుంది. ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి.మినిట్స్, 5 పని రోజులలో పూర్తిచేసి,పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. వెబ్ సైట్ లోవుంచాలి. .ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. నుంచి వివరం అందిన 45 రోజులలోగా పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.పర్యావరణ అనుమతి ఇవ్వడమో ,నిరాకరించడమో అభ్యర్ధికి తెలియజేయాలి. అనుమతి ఇవ్వడానికి లేదా నిరాకరించడానికి ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. సిఫార్సులు,45 రోజుల తర్వాత ,పబ్లిక్ డాక్యుమెంట్లు అవుతాయి. ఆ విధంగా మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. ఈ 45 రోజులలోగా అభ్యర్ధికి పర్యావరణ అనుమతి ఇచ్సినట్లో,నిరాకరించినట్లో తెలియజేయకపోతే ఫైనల్ ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. సిఫార్సులుఅనుసరించి అనుమతి లభించినట్లు గాని,లేదా నిరాకరించినట్లు గాని నిర్ధారించవచ్చు. పర్యావరణ అనుమతి ఇంగ్లీష్ వార్తా పత్రిక లోను, ప్రాంతీయ భాషలో ప్రచురించే వార్తా పత్రికలోను, ప్రచురించడమే కాకుండా ఒక వారం రోజులలోగా మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. వెబ్ సైట్లో కూడా ఉంచాలి. అనుమతి పత్రం మంత్రిత్వ శాఖ నోటిస్ బోర్డు లోను, దాని ప్రాంతీయ శాఖల ఆఫీసులలో 30 రోజుల వరకు ప్రదర్శించాలి. ప్రాజెక్టు అభ్యర్ధి తన వెబ్ సైట్ లో ఎప్పటికీ కనబడేలా అనుమతి పత్రం ఉంచాలి. పర్యావరణ అనుమతి పై పునరాలోచన : 1 3 5 రోజులు మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. సాధారణంగా ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. సిఫార్సులను అంగీకరిస్తుంది. ఒక వేళ అలా జరగక పొతే, మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. సిఫారసులు అందిన 45 రోజులలోగా తమ అభ్యంతరాలు/కారణాలు తెలుపుతూ ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. వారి సిఫారసు మరొక మారు సరి చూడమని కోరుతూ జవాబు పంపించాలి. అదే సమయంలో తమ నిర్ణయం అభ్యర్ధికి కూడా తెలియజేయాలి. ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఎ.సి. మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ,తిరిగి తమ సిఫారసు లను 60 రోజులలోగా పంపాలి. మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. అలా అందిన సిఫార్సులను పరిశీలించి పర్యావరణ అనుమతి పై నిర్ణయం తీసుకోవాలి. మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. తీసుకున్న నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఆ నిర్ణయం ప్రాజెక్టు అభ్యర్ధికి ౩౦ రోజులలోగా తెలియజేయాలి. పర్యావరణ అనుమతి ఎంత కాలం వరకు చెల్లుతుంది అనుమతి ఇచ్చిన తేది నుండి ప్రొడక్షన్ ఆపరేషన్ మొదలయ్యే వరకు పర్యావరణ అనుమతి 5 సంవత్సరాలు చెల్లుతుంది. అనుమతి రెన్యూ చేసుకోవాలంటే, మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. వారికి అనుమతి సమయం పూర్తి అయ్యేలోగా ,ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. దానితో పాటు సరి కొత్త ఫారం 1 కుడా ఇవ్వాలి. మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. అవసరం అయితే ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి ని సంప్రదించవచ్చు. అనుమతి రద్దు చెయ్యడం: అభ్యర్ధి ప్రయత్నపూర్వకంగా సమాచారాన్ని దాచి పెట్టి ,లేదా తప్పుడు సమాచారం ఇచ్చి, అనుమతి పొంది ఉండవచ్చు. దాని వల్ల పర్యావరణానికి ముప్పు, సామాజిక ఆర్ధిక నష్టాలు కలగ వచ్చు. అలాంటి సమయంలో,అనుమతి రద్దు చేయ వచ్చు. ప్రాజెక్టు అభ్యర్ధి వివరణ విన్నాక, న్యాయమైన పద్ధతి అనుసరించి మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే నడుస్తున్న ప్లాంట్స్ యొక్క విస్తరణ/ఆధునికీకరణ/ప్రాడక్ట్ మిక్స్ మార్చేందుకు ప్లాంటు విస్తరణ కొరకు, లేదా ఇ .ఐ.ఏ నోటిఫికేషన్ అనుబంధంలో తెలిపిన ప్రొడక్షన్ సామర్ధ్యం కన్నా ఎక్కువ సామర్ధ్యం కోసం ఆధునికీకరణ తలపెట్టినప్పుడు, ప్రాడక్ట్ మిక్స్ లో మార్పు చేయ తలపెట్టినప్పుడు ముందుగా పర్యావరణ అనుమతి పొందటానికి దరఖాస్తుదారుడు సరికొత్త ఫార్మ్ 1 తో దరఖాస్తు చేసుకోవాలి. విస్తరణ సామర్ధ్యాన్ని బట్టి ,అభ్యర్ధి మంత్రిత్వ శాఖకు లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.కు తన దరఖాస్తు పంపాలి. దరఖాస్తులు అందిన 60 రోజుల లోగా ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. నిర్ణయం తీసుకోవాలి. ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి. జాగ్రత్తగా పరిశీలించి, ఇ.ఐ.ఏ. తయారు చెయ్యడం పైనా, ప్రజాభిప్రాయసేకరణ పైనా దృష్టి పెట్టాలి. దరఖాస్తు పద్ధతి ప్రకారం పర్యావరణ అనుమతి ఇవ్వడం కోసం పరిశీలిస్తారు. ధర్మల్ పవర్ ప్లాంట్స్ కు 5౦౦ MW సామర్ధ్యం ఒక గుమ్మం లాంటిది. ఇక్కడ వరకే ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. అనుమతి ఇవ్వగలదు. ఒక 3౦౦MW సామర్ధ్యం కల ప్లాంటు ,ఆధునికీకరణ వల్ల 500 MW పైన సామర్ధ్యం పొందితే, ఆ ప్లాంటు విస్తరణ పర్యావరణ అనుమతి ఇ.ఐ.ఏ. దగ్గరనుంచి మొదలుపెట్టి అన్ని విధానాలు పాటిస్తూ మంత్రిత్వ శాఖ నుండి పొందాల్సి వుంటుంది. పర్యావరణ అనుమతి వచ్చాక పర్యవేక్షణ ప్రాజెక్టు అభ్యర్ధి ప్రతి సంవత్సరం జూన్ నెల 1 వ తారీకు, డిసెంబర్ నెల 1 వ తారీకు రోజులలో మంత్రిత్వ శాఖకు గానీ, ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. గానీ పర్యావరణ అనుమతి పత్రంలో నిబంధనలు పాటిస్తున్నట్లు హామీ పత్రం (కంప్లయన్స్ రిపోర్టు) ఒక హార్డు కాపీ, ఒక సాఫ్టు కాపీ రూపంలో పంపాలి. ఈ పత్రాలు పబ్లిక్ డాక్యుమెంట్లు అవుతాయి కనుక మంత్రిత్వ శాఖకు గానీ, ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. గానీ రాసి తెప్పించుకోవచ్చు. మంత్రిత్వ శాఖ లేదా , ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. తాజా రిపోర్టును తమ వెబ్ సైట్ లో ప్రదర్శించాలి. పర్యావరణ అనుమతి బదిలీ ఒక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి జారి చేశాక, దాని చెల్లుబాటుకిచ్చిన కాల పరిమితి లోగా మరొక వ్యక్తికి బదిలీ చెయ్యవచ్చు. ఆ వ్యక్తి ఆ ప్రాజెక్టు చేయగలవాడై వుండాలి.ఈ బదిలీ కొరకు, బదిలీ చేసే అభ్యర్ధి ఒక దరఖాస్తు చేసుకోవాలి. లేదా, తీసుకునే అభ్యర్ధి దరఖాస్తు చేసుకునేటట్లయితే, బదిలీ చేసే అతను, తనకు ఏమి అభ్యంతరంలేదు అని రాసివ్వాలి. పర్యావరణ అనుమతి లో మొదట ఇచ్చిన నిబంధనలు, షరతులు ,దాని చెల్లుబాటు సమయం, అనుమతిలో ఇచ్చిన విధంగానే వుంటాయి. వీటికి మళ్ళీ ఇ.ఏ.సి./ఎస్.ఇ.ఏ.సి వారి అనుమతి అక్కరలేదు. తరచుగా అడిగే ప్రశ్నలు సాధారణ ప్రశ్నలు 1. ఏ) పరిశ్రమ వర్గీకరించడం ప్రశ్న: ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఏ రకమైన పరిశ్రమగా వర్గీకరిస్తారు? పర్యావరణం,అడవుల మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.ఇ .ఎఫ్.) ధర్మల్ పవర్ ప్లాంట్లను 1 7 రెడ్ కేటగిరి పరిశ్రమలలో ఒకటిగా వర్గికరించింది. రెడ్ కేటగిరి అంటే, చాలా ఎక్కువ కాలుష్యం వెదజల్లే పరిశ్రమ అన్నమాట. పర్యావరణ అనుమతి పొందడానికి కేటగిరి A ప్రాజెక్టులు ఏవంటే ≥5౦౦ MW సామర్ధ్యం కలిగి, బొగ్గు,లిగ్నైట్,నాఫ్తా మరియు గ్యాస్ ఇంధనంతో నడిచేవి ≥5౦ MW సామర్ధ్యం కలిగి, పెట్రోల్ ,డిజిల్,ఆయిల్ రిఫైనరీలలో చివరికి మిగిలే ఆయిల్ వేస్త్ట్, (బయో మాస్ వదిలేసి)లాంటి ఇతర ఇంధనాలు వాడే ప్లాంట్ లు ≥2౦ MW సామర్ధ్యం కలిగి జీవరాసుల సంబంధించి,లేదా ప్రమాదకరం కాని మునిసిపాలిటి ఘన పదార్దల వెస్ట్ ఇంధనంగా ఉపయిగించే ప్లాంట్స్ కేటగిరి B ప్రాజెక్టులు ఏవంటే: ≤5౦౦ MW సామర్ధ్యం కలిగి, బొగ్గు,లిగ్నైట్,నాఫ్తా మరియు గ్యాస్ ఇంధనంతో నడిచేవి ≤5౦ MW లేదా,≥3 MW సామర్ధ్యం కలిగి, పెట్రోల్ ,డిజిల్,ఆయిల్ రిఫైనరిలలో చివరికి మిగిలే ఆయిల్ వేస్త్ట్ (బయో మాస్ వదిలేసి)లాంటి ఇతర ఇంధనాలు వాడే ప్లాంట్ లు ≤ 2౦ MW లేదా,≥ 15సామర్ధ్యం కలిగి జీవరాసుల సంబంధించి,లేదా ప్రమాదకరం కాని మునిసిపాలిటి చెత్త (ఘన పదార్దల చెత్త ) ఇంధనంగా ఉపయిగించే ప్లాంట్స్ 1. బి) ప్లాంట్స్ నెలకొల్పే స్థలం ప్ర) తీర ప్రాంతాలలోనే ధర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టాలన్న ఆశ ఎందువల్ల? జ) తీర ప్రాంతాలలో నెలకొల్పడంవల్ల ప్రాజెక్టు అభ్యర్ధికి ముఖ్యమైన రెండు లాభాలు ఒనగూడుతాయి. బొగ్గు రవాణా తేలిక. సముద్రం దగ్గరగా వుండడం,కంపెనీలు పోర్టులలో కట్టుకునే జేట్టిల వల్ల ఎగుమతులు,దిగుమతులు తేలిక అవుతాయి. సముద్రపు నీరు కావాల్సినంత లభ్యమౌతుంది. అంతేకాదు, సముద్రపు నీటిలో ఉప్పు తొలగించి మంచి నీటిని కూలింగ్ కోసం, బాయిలర్స్ నింపేందుకు రెండు అవసరాలకూ లభ్యమౌతుంది. ధర్మల్ ప్లాంటు నడపటానికి మంచి నీరు అవసరం ఈ విధంగా తీరుతుంది. ప్ర) ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ స్థాపించవచ్చో చెప్పే రూల్సు ఉన్నాయా? జ) ధర్మల్ ప్లాంట్స్ ఎక్కడ పెట్ట వచ్చో తెలిపే మూడు గీటురాళ్ళు ఉన్నాయి. అవి: ఇ.ఐ.ఏ. 2006లో ఇచ్చిన ప్రకటనలో ఇచ్చిన అర్హతల ప్రకారం జాతీయ పర్యావరణ నియంత్రణ మండలి పరిశ్రమల స్థాపనకుఇచ్చిన గైడ్ లైన్లు రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి పెట్టిన నిబంధనలు 2006లో ఇ.ఐ.ఏ.ప్రకటన ప్రకారం,500MW కంటే తక్కువ సామర్ధ్యం వున్న ప్లాంట్స్ ఎస్.ఇ. ఐ.ఏ.ఏ. పర్యావరణ అనుమతి ఇచ్సినప్పటికి కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం,1972 ప్రకారం, రక్షిత ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం లోపల ప్లాంటు స్థలం ఉన్నట్లయితే, అత్యధిక కాలుష్య ప్రాంతంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోపల ఉన్నట్లయితే, పర్యావరణ పరిరక్షిత ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరం లోపల ఉన్నట్లయితే, అంతర్ రాష్ట్ర సరిహద్దులకు గాని, అంతర్జాతీయ సరిహద్దులకు గాని 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్లయితే పై అన్నిటిలోనూ కేంద్ర పర్యావరణం,అడవుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాలి. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి అక్టోబర్ 2013 వరకు ఈ క్రింది ప్రాంతాలను అత్యధిక కాలుష్య ప్రాంతాలుగా గుర్తించింది. అంకలేశ్వర్ (గుజరాత్ రాష్ట్రం) చంద్రాపూర్ (మహారాష్ట్ర ) పాలి (రాజస్థాన్) వటవా (గుజరాత్) వెల్లూరు (తమిళనాడు) నజఫ్ఘర్ డ్రైన్ బేసిన్ (ఢిల్లీ) జోధ్‌పూర్ (రాజస్థాన్) ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఈ ప్రాంతాలలో ఉండరాదు. ఇవే కాకా, రాష్ట్రాలు కూడా కొన్ని ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించాయి. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధిక కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు (వాటిలో ధర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా వున్నాయి) ఈ క్రింద ఇచ్చిన లింకు లో చూపిన నదుల పరివాహక ప్రాంతాలకు ఒక కిలోమీటరు దూరంలోపల ఉండరాదని, అలాగే కావేరి నది, దాని ఉప నదులైన పెన్నియార్,పాలార్,వైగై, మరియు తామ్రపర్ణి నదుల పరివాహక ప్రాంతాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఏ పరిశ్రమలు పెట్టరాదని ఆదేశించింది. (http://www.tnpcb.gov.in/ జాతీయ రహదారులకు 100మీటర్ల అవతల, రాష్ట్ర రహదారులకు 50 మీటర్ల అవతల,పల్లె రహదారులకు 25 మీటర్ల అవతల మాత్రమే ఏ పరిశ్రమ సరిహద్దులైనా ఉండవచ్చని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య రాష్ట్ర నియంత్రణ మండలి ఆదేశించింది. అయితే, పారిశ్రామిక వాడలకు ఈ నిబంధనలు వర్తించవు. (http://www.appcb.ap.nic.in/cm/siting.htm) కర్ణాటక రాష్ట్రంలో ఈ క్రింది ప్రాంతాలకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి కొత్త పరిశ్రమలు పెట్టరాదని నిబంధనలు ఉన్నాయి. కావేరి,కబిని,అర్కవతి,శింశ,పెన్నార్,హేమవతి,లక్ష్మణ్ తీర్ధ,గుండాల్ నది,లోకపావని,పాలార్,తుంగభద్ర,కృష్ణ,భీమా,వరద,ఘటప్రభ,మాలప్రభ,వేదవతి,కారంజ,హగరి, పడమటి దిక్కుగా ప్రవహించే అన్ని నదులు, వర్షా కాలలో మాత్రం గానీ, లేక సంవత్సరం పొడుగూతా కానీ పారే నదులు,ప్రవాహాలు అన్ని ముఖ్య డాములు, తాగు నీరు లభించే చెరువులు లాంటివి అన్ని ముఖ్య నీటి పారుదల కాలువలు తాగు నీటి వనరులున్న ప్రాంతమైతే, అవి కాలుష్యం కాకుండా ఉండడానికి ఎంత దూరంలో ప్లాంటు ఉండవచ్చో నిర్ణయించడం చేస్తారు . ధర్మల్ పవర్ ప్లాంట్స్ మునిసిపల్ లేదా సిటీ హద్దులలో, నివాసిత ప్రాంతాలలో ఉండరాదు .* మరిన్ని వివరాల కోసం ఆయా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళను సంప్రదించండి. (http://kspcb.gov.in/sitingguidelines.html) ప్ర. సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక (CEPI --కాం ప్రహేన్సివ్ ఎంవిరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్) అంటే ఏమిటి? ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఏ ప్రాంతంలో ఉండాలో అదెలా నిర్ణయిస్తుంది? ఒక ఎన్నుకున్న ప్రాంతంలో పర్యావరణ స్వచ్చత ఎంతవరకు ఉన్నదో లెక్క వేసే అంకె ఈ సూచిక. కాలుష్య నియంత్రణ మండలి నిర్ణీత సమయాలలో ఆయా ప్రాంతాలలో గాలి, నీరు,నేల -ఈ మూడింటిని పరీక్షించి ఈ సూచిక లెక్కించి, అధిక కాలుష్యంబారిన పడిన ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు గుర్తించడం జరుగుతుంది. ఈ సూచికపారిశ్రామిక వాడలలో ముఖ్యంగా ఉపయోగించి, కాలుష్యం ఎంత పెరిగిందో లెక్కగట్టి పరిశ్రమల విస్తరణగాని ,లేక కొత్తవాటిని అనుమతించడం గాని ఆపేస్తారు. 2010 వ సంవత్సరంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ 43 ప్రమాదకరమైన కాలుష్య ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాలలో కొత్త ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇవి సెప్టెంబర్ 2013 నాటికి ఏడు పారిశ్రామిక వాడలుగా తగ్గాయి. ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఇలాంటి ప్రాంతాలలో నెలకొల్ప రాదు. 1. (సి) బొగ్గు రవాణా ప్ర) నౌకాశ్రయం నుంచి సాధారణంగా బొగ్గు ఎలా రవాణా చేస్తారు? రోడ్డు ద్వారా గాని లేక రైలు మార్గం ద్వారా గాని మూసేసిన కన్వేయర్ బెల్ట్ లనుపయోగించి రవాణా చేస్తారు. దూర ప్రాంతానికి బొగ్గు చేర వేయాల్సినప్పుడు, ప్రాజెక్టు అభ్యర్ధి రైలు ఆ ప్రాంతం వరకు వచ్చే అవకాశం ఏర్పాటు చేసుకోవాలి. రైలు వాగన్లోకి బొగ్గు చేరవేయడం కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు నిలవ చేసే భూమిలోపల గదులలో (పిట్)నింపాలి. కొత్తప్లాంటులకు పర్యావరణ అనుమతి, ఇ.ఐ.ఏ. విధానం 2. (ఏ) ప్రజాభిప్రాయ సేకరణ విధానం : దీనిపై విడిగా వున్న చాప్టర్ చూడండి. 2. (బి) పర్యావరణ అనుమతి రాక మునుపు: ప్ర: అనుమతి రాక పూర్వం ప్రాజెక్టు స్థలంలో అభ్యర్ధి ఏ ఏ పనులు చేయ వచ్చు? జ)పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనుమతి రాక పూర్వం అభ్యర్ధి ఈ కింది పనులు ప్రాజెక్టు స్థలంలో మొదలుపెట్ట వచ్చు. స్థల ప్రాంతం చుట్టూ అన్యాక్రాంతం కాకుండా కంచె కట్టించడం కాపలాదారులకు నివాసం ఉండడానికి షెడ్డులు వేయించడం ప్ర: ప్లాంటు స్థాపనకు సుమారు ఎంత కాలం పడుతుంది? జ) అది ప్లాంటు సామర్ధ్యాన్ని బట్టి వుంటుంది. అభ్యర్ధి దరఖాస్తు ఇచ్చాక సుమారు ఒక సంవత్సర కాలం నుండి ఒకటిన్నర సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఇ.ఐ.ఏ. వారు ఇచ్చిన ప్రకటన ప్రకారం ఆయా పనుల పూర్తి అయ్యేందుకు ఈ కింది నిర్ణీత సమయాలు నిర్ణయించడం జరిగింది. విధివిధానాల పత్రం (టి.ఒ.ఆర్.) జారి చెయ్యడం: ప్రాజెక్టు అభ్యర్ధి దరఖాస్తు ఇచ్చిన 60 రోజులలోగా విధివిధానాల పత్రం జారి చెయ్యాలి. పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చెయ్యడం: ప్రాజెక్టు అభ్యర్ధి పబ్లిక్ హియరింగ్ కోరిన 45 రోజులలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సమావేశం రిపోర్టు మంత్రిత్వ శాఖకు లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.కు పంపాలి. పర్యావరణ అనుమతి : అభ్యర్ధి ఫైనల్ ఇ.ఐ.ఏ. సమర్పించిన 105రోజులలోగా పర్యావరణ అనుమతి జారి చెయ్యాలి. 2. (సి) బొగ్గు మిక్స్ ప్ర) పర్యావరణ అనుమతి నిర్ణయించిన బొగ్గు మిక్స్ మార్చదలచినప్పుడు ప్రాజెక్టు అభ్యర్ధి ఏంచెయ్యాలి? జ) ప్రాజెక్టు అభ్యర్ధి సరికొత్త అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి(ఇ.ఐ.ఏ.నోటిఫికేషన్ 2 (111) ప్రకారం అలా విధించబడింది.) ప్ర) పర్యావరణ అనుమతి పొందేలోగా,అభ్యర్ధి బొగ్గు సరఫరాకు ఏర్పాటు చేసుకోవచ్చా? జ) చెయ్యవచ్చు. నిజానికి అనుమతి ఇవ్వడానికి ఇది ఒక షరతు. బొగ్గు వనరులు, సరఫరా సంబంధించి బొగ్గు గనితో లేదా కోల్ బ్లాక్స్ ఏదైనా ఏర్పాటు ఉన్నదేమో అనే వివరం ఇ.ఐ.ఏ.లో తెలియజేయాలి. బొగ్గు దిగుమతి చేసునేట్లయితే, బొగ్గు సరఫరా చేసే కంపెనీకి, ప్రాజెక్టు అభ్యర్ధికి మధ్య రాసుకున్న అంగీకార పత్రం ఇ.ఐ.ఏ.లో జత చెయ్యాలి. ఈ ఏర్పాటు ఒక బొగ్గు గనితో గాని, లేదా కొన్ని బొగ్గు గనులు కలిపి గాని,కోల్ బ్లాక్ గాని ( బొగ్గు మంత్రిత్వ శాఖ వారి స్టాండింగ్ కమిటీ కేటాయించినది) లేదా బొగ్గు సరఫరా అగ్రిమెంట్ అయివుండవచ్చు. ప్ర) : పర్యావరణ అనుమతి ఇచ్చినబొగ్గు కాక, బొగ్గు నాణ్యతవేరేరకం కావాల్సి వచ్చినప్పుడు ప్రాజెక్టు అభ్యర్ధి ఎం చెయ్యాలి? జ) : అనుమతిలో పేర్కొన్న బొగ్గు కాకుండా వేరే రకం కావాల్సి వచ్చినప్పుడు, మంత్రిత్వ శాఖకు తెలియపరచాలి. మంత్రిత్వ శాఖ దాన్ని పరిశీలించి అవసరమైన మరికొన్ని షరతులు విధిస్తుంది. 2. (డి) ఇ.ఐ.ఏ. విధానాలలో ప్రమేయమున్న ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులు ప్ర): పర్యావరణ అనుమతి జారీ చెయ్యడంలో ఏ ఏ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అధికారుల ప్రమేయం వుంటుంది? జ): కేటగిరి A కింద వర్గీకరించబడ్డ ప్రాజెక్టులకు పర్యావరణ,అడవుల మంత్రిత్వ శాఖ వారు పర్యావరణ అనుమతి ఇస్తారు. కేటగిరి B కింద వర్గీకరించబడ్డ ప్రాజెక్టులకు ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. అనుమతి ఇస్తుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ,రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ప్రజాభిప్రాయ సేకరణ రిపోర్టు తయారు చేసి పంపే పని అప్పగించింది. ప్ర): ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. రాష్ట్ర ప్రభుత్వ శాఖా లేక, కేంద్ర ప్రభుత్వ సంస్థా? జ): అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అయితే, దానికి ఒకతను సభ్యుడు,సెక్రెటరీ అయిన వ్యక్తి, చైర్మను ఇద్దర్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. సభ్యుడు,సెక్రెటరీ అయిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం సర్వీసులో పనిచేస్తున్న వాడై వుండాలి. 2. (ఇ) ప్రాంతీయ భాషలో అన్ని పత్రాలు లభ్యం కావాలి. ప్ర): ఇ.ఐ.ఏ. విధానంలో ఏ ఏ పత్రాలు ఒక్క ఇంగ్లీషులోనే కాకుండా ప్రాంతీయ భాషలో కూడా లభ్యం కావాల్సి వుంది? జ): ఈ కింది పత్రాలు 1. డ్రాఫ్టుఇ.ఐ.ఏ. ఎగ్జిక్యూటివ్ సమ్మరి పబ్లిక్ హియరింగ్ కంటే ముందుగా అందుబాటులోవుంచాలి. 2. పబ్లిక్ హియరింగులో ప్రజలు లేవనెత్తిన సమస్యలు,వాటికి ప్రాజెక్టు అభ్యర్ధి ఇచ్చిన జవాబులు ఒక స్టేట్ మెంట్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాయారు చేస్తుంది. 2. (ఎఫ్) ప్రాజెక్టు స్థల సందర్శనం: ప్ర): పరిశీలనార్ధం కాని, సమీక్షించడం కోసం గాని, గుర్తింపు పొందిన ఇ.ఐ.ఏ. కన్సల్టెంట్లు ప్రాజెక్టు స్థలాన్ని,ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని చూడవచ్చు. జాతీయ గ్రీను ట్రిబ్యునల్ వారి ఆర్డర్ ప్రకారం*,కన్సల్టెంట్లు అక్కడి ప్రజల ప్రాధమిక అవసరాలను తెలుసుకునేందుకు ఆ ప్రాంతాలలో సామాజిక,ఆర్ధిక పరిస్థితులు గురించి ప్రాధమిక సమాచారంసేకరించాలి.అలా సేకరించిన సమాచారంతో పర్యావరణ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చెయ్యాల్సి వుంటుంది. టర్మ్స్ అఫ్ రిఫెరెంస్(విధి విధానాల పత్రం) ప్రాజెక్టు ప్రాంతానికి ఎంత దూరం వరకు ఈ సమాచార సేకరణ జరపాలో నిర్ణయిస్తుంది. ప్ర): ఇ.ఏ.సి.లేదా,ఎస్.ఇ.ఏ.సి సభ్యులు ఎప్పుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించ వచ్చు? జ): ఇ.ఏ.సి.లేదా,ఎస్.ఇ.ఏ.సి సభ్యుల సబ్ కమిటీ పర్యావరణ అనుమతి ప్రాసెస్ జరిగే లోపల ఎప్పుడైనా సందర్శించవచ్చు. సాధారణంగా డ్రాఫ్టు ఇ.ఐ.ఏ. సమర్పించిన తర్వాత, టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ జారి కాక పూర్వం, ప్రాజెక్టు స్థలాన్ని చూడడం జరుగుతుంది. 2. (జి) విధి విధానాలు ( టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్) : ప్ర): విధి విధానాలు,మరియు పర్యావరణ ప్రభావ అంచనా (ఇ.ఐ.ఏ.) ఎవరు తయారు చేస్తారు? జ): ఇ.ఏ.సి లేదా ఎస్.ఇ.ఏ.సి. ఇ.ఏ.సి లేదా ఎస్.ఇ.ఏ.సి. జారి చేసే టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ లో పర్యావరణ ప్రభావ అంచనా (ఇ.ఐ.ఏ.) ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఉదాహరణకు,ఎన్నాళ్ళు,అంటే ఎన్ని రుతువులు,ఈ ప్రాజెక్టు గురించి పరిశోధన చెయ్యాల్సి వుంటుందీ, ఆ ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల వరకు పరిశోధన కొనసాగించాల్సి వుంటుంది అన్నది స్పష్టం చేస్తుంది. 2. (హెచ్) ఫైనల్ ఇ.ఐ.ఏ: ప్ర): డ్రాఫ్టు ఇ.ఐ.ఏ.కు, ఫైనల్ ఇ.ఐ.ఏ.కు ఏ మేర వరకు తేడాలు అంగీకరించ బడతాయి? జ): ఫైనల్ ఇ.ఐ.ఏ.లో ఎక్కువ తేడాలు ఉండరాదు. ప్రజాభిప్రాయ సేకరణలో తీసుకున్న నిర్ణయానుసారం మార్పులు చెయ్యాల్సి వచ్చిన మేరకు మాత్రమే చేయ వచ్చు. పబ్లిక్ హియరింగ్ కు ముందు తయారు చేసి సమావేశంలో అందుబాటులో ఉంచే ఇ.ఐ.ఏ.ను డ్రాఫ్టు ఇ.ఐ.ఏ. అంటారు. ప్రాజెక్టు నెలకొల్పడానికి సంబంధించిన ప్రాధమిక సమాచారం అంతా ఇందులో వుండాలి. ప్రాజెక్టు వల్ల పర్యావరణ, సామాజిక, ఆర్ధిక రంగాలలో జరగబోయే నష్టం పూరించే చర్యల గురించి వివరిచాలి.టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ లో ఇచ్చిన ఇంకా ఏదైనా విషయం గురించి పరిశోధన వివరాలు ఉండాలి. ప్రజాభిప్రాయ సేకరణ విధానం పూర్తయ్యాక, ప్రజల సలహాలు, సమస్యలను స్వీకరించి, అవసరమైన మార్పులు చేర్పులతో సరిచేసిన ఇ.ఐ.ఏ. , ఫైనల్ ఇ.ఐ.ఏ. అవుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత,ప్రాధమిక సమాచారంలో మార్పులు చేర్పులు కాని, టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ లో సూచించిన ప్రత్యేక విషయ సమాచారం చేర్చడం లాంటివి గాని ఉండరాదు. ప్ర): ప్రాజెక్టు నెలకొల్పే ప్రాంత పర్యావరణ పరిస్థితి పరిశోధించడం ఉంటుందా? జ): అవును. ప్రాజెక్టు ప్రాంతం, దాని చుట్టూ పక్కల ప్రాంతాల పర్యావరణ స్థితిని గుర్తిపు పొందిన ఇ.ఐ.ఏ. కన్సల్టెంటు ప్రాధమిక సమాచార సేకరణ చేస్తారు. మంత్రిత్వ శాఖ లేదా ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. వారు ఇ.ఐ.ఏ. పరిశీలనకు ఎంత ప్రాంతాన్ని పరిశో ధించాల్సినదీ టర్మ్స్ ఆఫ్ రిఫెరెంసులో ఆదేశిస్తారు. ఇ.ఐ.ఏ.లో జీవ జాతులు శ్వాసించే గాలి, ధ్వని,భూగర్భ జలాలు, జీవరాశి,సామాజిక ఆర్ధిక అంశాలు లాంటి పర్యావరణానికి సంబంధించి 12 నిర్దిష్ట విషయాలలో అంచనాలు వుండాలి. ప్ర): ఇ.ఐ.ఏ.నిశిత పరిశీలన పూర్తిచెయ్యడానికి ఎన్ని రోజులు కావాలి? జ): అది టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ లో ఇచ్చిన దాన్ని బట్టి వుంటుంది. కనీసం మూడు నెలల (అంటే ఒక రుతువు) నుంచి ఒక సంవత్సరం దాకా పట్ట వచ్చు. ప్ర): ఫైనల్ ఇ.ఐ.ఏ. ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంటుందా? జ): పర్యావరణ,అడవుల మంత్రిత్వ శాఖ 2013 వ సంవత్సరంలో సర్క్యులర్ జారి చేసింది. దాని ప్రకారం పర్యావరణ అనుమతి జారి చేసే లోగా మంత్రిత్వ శాఖ ఫైనల్ ఇ.ఐ.ఏ. తమ వెబ్ సైట్ లో పెట్టాలి. ఫైనల్ ఇ.ఐ.ఏ. లో ఏదైనా అభ్యంతరకరమైన అంశం వుంటే, ప్రజలు దానిని మంత్రిత్వ శాఖకు తెలిజేయ వచ్చు. లేదా గ్రీను ట్రిబ్యునల్ లో పిటిషను వెయ్య వచ్చు. 2. (ఐ) ఇ.ఐ.ఏ. కన్సల్టెంట్: ప్ర): ఇ.ఐ.ఏ. కన్సల్టెంట్ ను నియమించాల్సిన అవసరం ఏమిటి? అతని బాధ్యతలు ఏమిటి? జ): తలపెట్టిన ప్రాజెక్టు వలన ఏర్పడే పర్యావరణ దుష్ఫలితాలు అంచనా వెయ్యడానికి, జాతీయ ఎక్రేడిషన్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్/ క్యాలిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారిచే గుర్తింపబడిన కన్సల్టెంటును, ప్రాజెక్టు అభ్యర్ధినియమించాల్సి వుంది. ప్రాజెక్టు వలన ఏర్పడే పర్యావరణ దుష్ఫలితాల అంచనా,గుర్తింపబడిన కన్సల్టెంటుతో వేయించకపోతే, పర్యావరణ అనుమతి లభించదు. ధర్మల్ పవర్ ప్లాంటు వలన ఏర్పడే పర్యావరణ దుష్ఫలితాలు అంచనా వెయ్యడానికి నియమించబడిన కన్సల్టెంటు ఆ రంగంలో ఎక్రేడిషను (గుర్తింపు ) పొంది వుండాలి. అలా గుర్తింపబడిన కన్సల్టెంట్ల వివరాలు ఈ కింది వెబ్ సైట్ లో దొరుకుతాయి. ప్ర): ఇ.ఐ.ఏ. కన్సల్టెంట్ టీం లో ఎంతమంది వుంటారు? వాళ్ళు ఎవరేం చేస్తారు? జ): ఇ.ఐ.ఏ. కన్సల్టెంట్ టీంకు ఒక కోఆర్డినేటర్ అధ్యక్షుడిగా వుంటారు. ఇ.ఐ.ఏ.విధానాలు, నిబంధనలు,చట్టాలు, ఆయా రంగాల్లో అనుభవం, ఆ రంగాల్లో పర్యావరణ ప్రభావం గురించి అవగాహన, అంచనా తయారు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రచించి,టీంను ముందుండి నడిపించే సామర్ధ్యం ఉన్నవాడై వుండాలి. ఈ కోఆర్డినేటర్ కాకుండా పర్యావరణ ప్రభావం వుండే 12 నిర్దిష్ట రంగాలలో నిపుణులు సభ్యులుగా వుంటారు. ఆ రంగాలు ఇవి: భూములు, వాటిలో రకాలు,ఏవి ఎలా ఉపయోగించవచ్చో తెలిసిన నిపుణుడు గాలిలో కాలుష్యం గురించి,దాని పర్యవేక్షణ, నియంత్రణ ముందుగా సూచించ గల నిపుణుడు భూవాతావరణ శాస్త్రం, జీవ జాతులు పిల్చే గాలిలో కాలుష్యాన్ని చెదరగొట్టే ఎయిర్ క్వాలిటి మోడలింగ్ ముందు సూచించే నిపుణులు నీటి కాలుష్యం నియంత్రణ పర్యవేక్షించే నిపుణుడు జీవులకు పర్యావరణంతో సంబంధం,ఒక ప్రాంతంలో వివిధ జీవ జాలం నివసించే విధానం ధ్వని కాలుష్యం, ధ్వని తరంగాల సామర్ధ్యం సామాజిక,ఆర్ధిక అంశాలు జల అధ్యయన శాస్త్రం, భూగర్భ జలాలు, నీటి పొదుపు, భూగర్భ శాస్త్రం నేల సారాన్ని కాపాడుకోవడం ప్రమాదాలు, వాటిని అధిగమించే మేనేజ్మెంట్ ప్రమాద కారకమైన, పనికిరానివైన చెత్త మేనేజ్మెంట్ ( మునిసిపాలిటి వారి సాలిడ్ చెత్తతో సహా ) అవసరమైన అర్హతలు వున్నఒక టీం సభ్యుడు ఇ.ఐ.ఏ. కో ఆర్డినేటరు గాను, పర్యావరణ రంగ పని నిపుణుడుగాను కూడా వుండ వచ్చు. పర్యావరణ రంగ పని నిపుణుడుగా అయితే 4 రంగాలలో పని చెయ్యవచ్చు. కో ఆర్డినేటరుగా 5 రంగాలలో పని చేయవచ్చు. 2. (జే) పర్యావరణ అనుమతి జారి అయ్యాక: ప్ర): పర్యావరణ అనుమతి వచ్చాక ప్రాజెక్టు అభ్యర్ధి ప్లాంటు కట్టుబడి పని మొదలు పెట్ట వచ్చా? జ): అలా చెయ్యడానికి వీల్లేదు. ప్రాజెక్టు అభ్యర్ధి ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కట్టుబడి మొదలుపెట్టేందుకు అనుమతి (కన్సెంట్ టు ఎస్టాబ్లిష్)కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి లభించాక, కట్టుబడి పని మొదలు పెట్టాలి. ప్లాంటు పని చెయ్యడం ప్రారంభించే ముందు, కన్సెంట్ టు ఆపరేట్ అనుమతి కుడా పొందాలి. 2. (కే) చిమ్నీ ఎత్తు : ప్ర): చిమ్నీ ఎత్తు ఎంత ఉండాలో చెప్పే నిబంధనలు ఉన్నాయా? జ): పర్యావరణ పరిరక్షణ చట్టం,1986 ఈ కింది కొలతలు నిర్దేశించింది. ప్లాంటు సామర్ధ్యం చిమ్నీ ఎత్తు 500 MW 275 మీటర్లు 210 MW-500 MW 220 మీటర్లు 210 MW H=14 Q 0.3 (Q= అనేది గంటకు ఎన్నికిలోగ్రామ్స్ సల్ఫర్ డై ఆక్సైడ్ వెలువడుతుందో తెలిపే సంఖ్య.H మీటర్లలో ఎత్తు. 2. (ఎల్) కాలుష్యం ఎంత వరకు వుండ వచ్చు? జ): పర్యావరణ రక్షణ చట్టం 1986 కింద ఏరకమైన కాలుష్యం ఎంతవరకు ఉండవచ్చో ఆయా సమయాల్లో ప్రభుత్వం వారు ఇచ్చిన ప్రకటనలలో తెలియజేస్తుంటారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ సంబంధించిన మాన్యువల్ వుంది. దాని అనుబంధంలో పర్యావరణ ప్రభావ అంచనాలసాంకేతిక గైడెన్స్ చూసినట్లయితే వివిధ కాలుష్యాలు ఎంత వరకు వుండవచ్చునో చూడవచ్చు. మాన్యువల్ ఈ కింది వెబ్ సైట్ లో (ఇంగ్లీష్ లో) చూడ వచ్చు: http://environmentclearance.nic.in/ 2. (ఎం) భూమి కొనుగోలు ప్ర): ప్రాజెక్టు అభ్యర్ధి ఏ సమయంలో ప్రాజెక్టు స్థలం కొనుగోలు చెయ్యవచ్చు? జ): పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చెయ్యక మునుపే, స్థల కొనుగోలు చెయ్య వచ్చు. అయితే, ప్రాజెక్టుకు అవసరం అయ్యే మొత్తం భూమి అప్పుడే కొనాలని లేదు. ఎందుకంటే, ఆ ప్రాంతాన్ని గుర్తిపు పొందిన ఇ.ఐ.ఏ. కన్సల్టెంటు సంస్థ పరిశీలించి, ఏవైనా సామాజిక ఆర్ధిక సమస్యలు, జనావాసాలను ఖాళీ చేయించడం, వాళ్లకు పునరావాసం కల్పించడం లాంటి ముఖ్య సమస్యలు వస్తాయేమో చూడాల్సి వుంది. ప్ర): ప్రాజెక్టు కోసం భూమి కొనుగోలు చేసేటప్పుడు, దాని విలువ ఎలా నిర్ణయించాలి? జ): ఈ మధ్య కాలంలో చేసిన చట్టం, రైట్ టు ఫెయిర్ కాంపెన్పెంసేషన్ అండ్ ట్రాన్స్ఫ రెంసి ఇన్ లాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్,రిసేటిల్మెంట్ యాక్టు 2013 ప్రకారం భూముల కొనుగోలులో నష్ట పరిహారం లెక్క వేసేందుకు ఒక సూత్రం(ఫార్ములా) ఇవ్వబడింది. జిల్లా కలెక్టరు మాత్రమే పద్ధతి ప్రకారం లెక్కేయడం నిర్ధారించాలి. నడుస్తున్న ప్లాంట్లు ప్ర): గ్రీన్ ఫీల్డ్ ఇ.ఐ.ఏ. కు, బ్రౌన్ ఫీల్డ్ ఇ.ఐ.ఏ. కు తేడా ఏమిటి? జ): ఒక ప్రాంతంలో నెలకొల్పబోయే ప్రాజెక్టు కొత్తగా మొదలుపెడుతున్నది అయితే, దాన్ని గ్రీను ఫీల్డ్ ప్రాజెక్టు అంటారు. అలాంటి ప్రాజెక్టు స్థల విషయంలో ప్రాధమిక పరిశోధన, ప్రాజెక్టు పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తాయో అనే అంచనా, అందువల్ల ఏర్పడే పర్యావరణ, సామాజిక ఆర్ధిక నష్టాలు పూరించే చర్యలు- ఇవన్నీ ఈ ప్రాజెక్టులకు అవసరం అవుతాయి. బ్రౌను ఫీల్డ్ ప్రాజెక్టు ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టు విస్తరణ. దీనికి కూడా ముందు తీసుకున్న నష్టాలు పూరించే చర్యలు తగినంత ఉన్నాయా లేదాని, పర్యావరణ అనుమతిలో పెట్టిన షరతులు పూర్తిగా అమలు చేసేరా లేదాని, ప్రాజెక్టు విస్తరణ వల్ల మార్పులు, మొత్తంగా వాటి ప్రభావ అంచనాలు,అవసరమైన నష్టాలు పూరించే చర్యలు-వీటిని సమగ్రంగా పరిశీలించాలి. ప్ర): స్థాపించిన ప్లాంట్లు ఎలా పర్యవేక్షిస్తారు? జ): రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నెలకో, మూడు నెలలకో నియమంగా పెట్టుకుని ధర్మల్ పవర్ ప్లాంట్స్ తో సహా అన్ని పరిశ్రమలు ఇన్స్పెక్షన్ చేస్తుండాలి. అనుమతించబడినంత వరకు మాత్రమే కాలుష్యవాయువులు వెలువడుతున్నాయా, పర్యావరణ అనుమతిలో ఇచ్చిన ఇతర షరతులు పాటిస్తున్నారా అనేవి వారు పరిశీలించాల్సి వుంది. ఇక ప్రాజెక్టు అభ్యర్ధి ఈ కింది రిపోర్టులు సమర్పించాలి: త్రైమాసిక పర్యవేక్షణ రిపోర్టు - కాలుష్య నియంత్రణ మండలికి పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆరు నెలలకొకసారి నిబంధనలు, షరతులు పాటి స్తున్నట్లుగా హామీ రిపోర్టు (కంప్లయన్స్ రిపోర్టు) సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటి వారికి ప్రత్యేకంగారూపొందించిన సంవత్సర రిపోర్టు (ఫ్లై యాష్ వినియోగ నిబంధనల ప్రకారం) పంపాలి. ఒక కాపీ కాలుష్య నియంత్రణ మండలికి కూడా పంపాలి. ప్రతి సంవత్సరం కాలుష్య నియంత్రణ మండలికి పర్యావరణ పరిస్థితి ఒక స్టేట్మెంటు లోపంపాలి. మరేవైనా కాలుష్య నియంత్రణ మండలి అడిగే రిపోర్టులు (ప్రజల పిర్యాదులను బట్టి) కూడా పంపాలి. ప్ర): కంప్లయన్స్ రిపోర్టులో ఏమి వుండాలి? ఎవరైనా దాన్ని చూడవచ్చా? జ): ప్రతి ధర్మల్ పవర్ ప్లాంటుకు ఇచ్చే పర్యావరణ అనుమతిలో తప్పక పాటించాల్సిన నిబంధనలు, అవి పాటిస్తున్నట్లు హామీ ఇస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖకు రిపోర్ట్లు పంపించాలని వుంటుంది. ఇవి మంత్రిత్వ శాఖ ప్రజా విభాగం లో లభ్యమౌతాయి. సరికొత్త రిపోర్టు మంత్రిత్వ శాఖ /ఎస్.ఇ.ఐ.ఏ.ఏ. వారి వెబ్ సైట్లో చూడవచ్చు. అంతే కాదు, మంత్రిత్వ శాఖ /ఎస్.ఇ.ఐ.ఏ.ఏ ఎవరైనా కోరితే కంప్లయన్స్ రిపోర్టు అందజేస్తుంది. ప్ర): ప్రజలకు అందుబాటులో వుండే ఇతర పత్రాలు ఏమిటి ? కాలుష్య నియంత్రణ మండలికి పంపే త్రైమాసిక కంప్లయన్స్ రిపోర్టు కాలుష్య నియంత్రణ మండలికి ప్రతి సంవత్సరం పంపే పర్యావరణ పరిస్థితి పై రిపోర్టు కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటి వారికి, వారితో పాటు పర్యావరణమంత్రిత్వ శాఖకు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పంపే ఫ్లై యాష్ వినియోగరిపోర్టు ఇతర అనుమతులు 4. (ఏ) తీర ప్రాంత నిబంధనల జోన్ (coastal regulation zone CRZ) అనుమతి : ప్ర): సి ఆర్ జడ్ అనుమతి అంటే ఏమిటి? దానికీ, ఇ.ఇ.ఏ. విధానాలకు సంబంధం ఏమిటి? జ): నది తీర ప్రాంతాలకు దగ్గరలో వున్న ప్లాంట్లకు కోస్తాల్ రెగ్యులేటరి జోను అనుమతి అవసరం. 2011 వ సంవత్సరంలో సి.ఆర్.జెడ్. ఏ ఏ పరిశ్రమలకు తమ అనుమతి అవసరమో ప్రకటించింది.ఏదైనా కొత్తగా ప్రారంభించబోయే ధర్మల్ పవర్ ప్లాంటు స్థలం ఈ జోనులో వుంటే, రాష్ట్ర తీర ప్రాంత మేనేజ్మెంట్ అథారిటి వారు సి ఆర్ జెడ్ అనుమతికి సిఫారసు చెయ్యాలి. అందువల్ల, పర్యావరణ అనుమతి కూడా ఆ సిఫార్సులపైనే ఆధారపడి వుంటుంది. రాష్ట్ర తీర ప్రాంత మేనేజ్మెంట్ అథారిటిసమావేశపు మినిట్స్ వారి వెబ్ సైట్లో పెడతారు. అది చూసినట్లయితే, ఒక ప్రాజెక్టు సి.ఆర్.జెడ్ అనుమతికి సిఫారసు చేసారా, లేదా అన్నది తెలుస్తుంది. 4. (బి) అటవీ శాఖ అనుమతి: ప్ర): అటవీశాఖ వారి అనుమతి ఎవరు ఇస్తారు? జ): ఏదైనా ఒక ప్రాజెక్టు అటవీ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, సెక్షన్ 2, ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం,1980 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ వారి అనుమతి జారీ చేస్తుంది. 4. (సి) మరిన్ని అనుమతులు: ప్ర): పర్యావరణ మంత్రిత్వ శాఖ వారిచ్చే పర్యావరణ అనుమతి కాక, ఇంకా ఇతర అనుమతులు ఏమి కావాలి? జ): అలా కావాల్సిన ఇతర అనుమతులు కొన్ని దిగువ చూడండి: ఏ పంచాయతి లో ఈ ప్లాంటు స్తాపిస్తున్నారో, ఆ పంచాయతి నుంచి ప్లాంటు పెట్టడానికి ఏ అభ్యంతరం లేదని - ఎన్.ఒ.సి. (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారి నుంచి ప్లాంటు నిర్మించడానికి అనుమతి (కన్సెంట్ టు ఎస్టాబ్లిష్), పని ప్రారంభించడానికి అనుమతి (కన్సెంట్ టు ఆపరేట్) అనుమతులు ప్లాంటు కోసం నది జలాలు వాడుతున్నట్లయితే, రాష్ట్ర నీటి పారుదల శాఖ వారి నుంచి అనుమతి ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా నుంచి చిమ్నీ ఎత్తు గురించి అనుమతి ప్లాంటు స్థలం దాకా రైల్వే లైను వేయిచుకునేందుకు రైల్వే వారి అనుమతి నివారణా విధానం ప్ర): ఒక ప్లాంటుకు పర్యావరణ అనుమతిలోని ఏ అంశం గురించి అయినా పిర్యాదు చెయ్యాలంటే, ఎవరికి చెయ్యాలి? జ): ఇ.ఐ.ఏ. విధానంలో ఏ సమయంలో నైనా, ఎటువంటి ఉల్లంఘన అయినా, మంత్రిత్వ శాఖకు రిపోర్టు చెయ్య వచ్చు. ఒక వేళ పర్యావరణ అనుమతి ఇవ్వడం జరిగితే, అప్పుడు దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చెయ్య వచ్చు. ప్ర): ప్రస్తుతం నడుస్తున్న ప్లాంటులో ఉపాధి కల్పన, కార్పోరేట్ సామాజిక బాధ్యత లాంటి విషయాలలో పర్యావరణ అనుమతి ఇచ్చే టప్పుడు పెట్టిన నిబధనలు పాటించక పోతే ఎవరికి పిర్యాదు చెయ్యాలి? జ): పర్యావరణ అనుమతిలో పెట్టిన షరతులు పాటించక పోతే వెంటనే మంత్రిత్వ శాఖకు గాని ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.కు గాని పిర్యాదు చెయ్యాలి. ప్ర): జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎం.జి.టి.) అంటే ఏమిటి? జ): ఎం.జి.టి., జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక క్వాజి జుడిషియల్ సంస్థ. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ లాంటి ప్రకృతి వనరుల సంరక్షణ సంబంధించిన కేసులను ఈ గ్రీన్ ట్రిబ్యునలు పరిష్కరిస్తుంది. ఈ ట్రిబ్యునలు ముఖ్య సమావేశ ప్రాంతం న్యూ ఢిల్లీ. సెంట్రల్ జోను భోపాల్, వెస్ట్రన్ జోను పూనే, ఈస్ట్రన్ జోను కోల్ కత్తా, సౌత్ జోను చెన్నై కూడా ట్రిబ్యునల్ సమావేశమయ్యే ఇతర ప్రాంతాలు. ప్ర): జాతీయ గ్రీను ట్రిబ్యునల్ లో కేసులు ఇంత సమయంలోగా ఫైల్ చెయ్యాలని వున్నదా? జ): జాతీయ గ్రీను ట్రిబ్యునలుకు వేసే కేసులు నిర్ణీత సమయం లోపలే వెయ్యాలి. ఏదైనా ఒక విషయంపై కేసు ఫైల్ చెయ్యాలంటే, ఆ విషయం జరిగిన తేదీనుంచి 30 రోజులలోగా కేసు ఫైల్ చెయ్యాలి. సరైన కారణాలు చూపించ గలిగినప్పుడు,ఆ సమయం 90 రోజుల వరకు పొడిగిస్తారు. ఉదాహరణకు, ఏదైనా ఒక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై ఒక వ్యక్తి కేసు ఫైల్ చెయ్యాలంటే, ఆ పర్యావరణ అనుమతి జారి చేసిన తేది నుంచి 30 రోజులలోగా కేసు ఫైల్ చెయ్యాలి. అరుదుగా, ఆ వ్యక్తి సరైన కారణాలు చూప గలిగి నప్పుడు సమయం 90 రోజుల వరకు ఇవ్వవచ్చు. ఆర్.టి.ఐ. వాడుక ఆర్.టి.ఐ. ద్వారా ఈ.సి./ఈ.ఐ.ఎ కొరకు దరఖాస్తు ఆర్.టి.ఐ అప్లికేషన్ కొరకు సంప్రదించాల్సిన చిరునామాలు మరియు చెల్లింపులు సమాచారహక్కును గురి౦చి తరచుగా అడిగే ప్రశ్నలు ఆర్.టి.ఐ. ద్వారా ఈ.సి./ఈ.ఐ.ఎ కొరకు దరఖాస్తు మొదటి దశ డాక్యుమెంట్ పబ్లిక్ కు అందుబాటులో వుంచుట(వారు కోరినట్లయితే) ఆర్.టి. ఎ దరఖాస్తు లను500 మెగావాట్ల కంటే తక్కువ వుంటే ఈ క్రింది వారికి పంపాలి ప్రాజెక్టు సామర్ధ్య౦ 500 మెగావాట్ళ కంటే ఎక్కువ వుంటే ఈ క్రింది వారికి పంపాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అప్పలేట్ ఆధారిటీ రెండవ అప్పీల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అప్పలేట్ ఆధారిటీ రెండవ అప్పీల్ టి. .ఓ.ఆర్ కి ముందు 1.అభ్యర్ధి ఇచ్చే టిఓఆర్ తో సహా2.ముందస్తు అనుకూల అవకాశాల రిపోర్టు3.ప్రాజెక్ట్ అభ్యర్ధి నుంచి అదనపు సమాచారం4.రాష్ట్ర / ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ వారి సమావేశ తేదీని గురించి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ / పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖ వారి లేఖ5.రాష్ట్ర ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ/ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ జరిపిన మీటింగ్ మినిట్స్6.రాష్ట్ర ఎక్స్పర్ట్స్ అప్రైజల్ సంస్థ/ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ సైట్ రిపోర్టు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ (SEIAA) రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ (SEIAA) సి.ఐ.సి (CIC) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& ఫారెస్ట్ (MoEF) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& ఫారెస్ట్ (MoEF) సి.ఐ.సి (CIC) టిఓఆర్ జారీ చేశాక 7.రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ / పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన విధి విధానాలు ప్రాభిప్రయ సేకరణ తేది ప్రకటిం ప్రకటించాక 8.అభ్యర్ధి సమర్పించిన డ్రాఫ్టు ఇ.ఐ.ఏ.9.దాని ఎగ్జిక్యుటివ్ సమ్మరి ప్రజాభిప్రాయ సేకరణ జరిగాక 10.పరిశీలించిన రాతపూర్వక జవాబులు11.పబ్లిక్ హియరింగ్ రిపోర్టు12.దాని వీడియో టేపు ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.ఐ.సి. (SIC) ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.ఐ.సి. (SIC) పర్యావరణ అనుమతి ఇవ్వక మునుపు/లేదా తిరస్కరించక మునుపు 13.అభ్యర్ధి ఫైనల్ ఇ.ఐ.ఏ.14.అది టి.ఒ.ఆర్.కు అనుగుణంగా ఉన్నదీ,లేనిది .ఎం.ఒ.ఇ.ఎఫ్./ఎస్.ఇ.ఐ.ఏ.ఏ.అభిప్రాయం 15.ప్రాజెక్టు అభ్యర్ధి ఎస్.ఇ.ఏ.సి./ఇ.ఏ.సి.తో జరిపిన సమావేశం మినిట్స్16.ఎస్.ఇ.ఏ.సి./ఇ.ఏ.సి. అనుమతి లేక,తిరస్కరించడానికి సిఫారసు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ (SEIAA) రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ (SEIAA) సి.ఐ.సి (CIC) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& ఫారెస్ట్ (MoEF) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& ఫారెస్ట్ (MoEF) సి.ఐ.సి (CIC) పర్యావరణ అనుమతి ఇచ్చాక 17.పర్యావరణ అనుమతి18.అభ్యర్ధి పంపే పర్యవేక్షణ రిపోర్టులు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ (SEIAA) రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ (SEIAA) సి.ఐ.సి (CIC) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& ఫారెస్ట్ (MoEF) మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట& ఫారెస్ట్ (MoEF) సి.ఐ.సి (CIC) 19.ఎస్.పి.సి.బి.ఇన్స్పెక్షన్ రిపోర్టు ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.ఐ.సి. (SIC) ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.పి.సి.బి. (SPCB) ఎస్.ఐ.సి. (SIC) ఆర్.టి.ఐ అప్లికేషన్ కొరకు సంప్రదించాల్సిన చిరునామాలు మరియు చెల్లింపులు నం. ఆధారిటీ చిరునామా అంగీకరించిన చెల్లింపు దరఖాస్తు రుసుము అప్పీల్ ఫీజు 1 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అప్లికేషన్ ఫార్మెట్ పర్యావరణ భవన్సి.జి.ఓ కాప్లెక్స్న్యూ డిల్లీ -110003ఫోన్ ; 11-24362064 క్యాష్, పోస్టల్ ఆర్డర్ , డి.డి మరియు చెక్కు పే అండ్ అక్కౌంట్స్ ఆఫీసరు,ఎం.ఒ.ఇ.ఎఫ్. పేరిట గాని పంపవచ్చు రూ. 10 లేదు 2 SEIAA, ఆంధ్ర ప్రదేశ్ పర్యావరణ్ భవన్,A-3ఇండస్ట్రియల్ ఎస్టేట్ , సనత్ నగర్, హైదారాబాద్ -500 018 ఫోన్; 040 -23887594 క్యాష్, పోస్టలు ఆర్డర్ పబ్లిక్ ఆధారిటీవిలేజ్: ఫీజు లేదుమండల్: రూ.5 మిగిలినవి రూ.10 లేదు 3 SEIAA, ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక 7th ఫ్లోర్ ,M.S బిల్డింగ్ , ఫోర్త్ ఫేజ్, బెంగుళూరు;560001కర్ణాటకపిహెచ్ఎన్;080 22032497 క్యాష్, పోస్టలు ఆర్డర్ రూ.10 లేదు 4 SEIAA, కేరళ పల్లిముక్కు, పెట్టా పోస్ట్ , త్రివేండ్రం ;95024కేరళఫోన్; 0471 2742264 కోర్ట్ ఫీ స్టాంపు/బ్యాంకర్’స్ చెక్కు,డిపార్ట్ మెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మరియు క్లైమేట్ ఛేంజ్, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి పేరీట రూ.10 లేదు 5 SEIAA, తమిళ నాడు 3rd ఫ్లోర్, పానగల్ మలిగై , నం. 1 జీనిస్ రోడ్ , సైదాపేట, చెన్నై ;600015,తమిళ నాడుపిహెచ్ఎన్; 044 24359974 కోర్ట్ ఫీజు స్టాంపు, డిమాండ్ డ్రాఫ్ట్ రూ.10 లేదు దారిద్ర రేఖకు దిగువన వున్న అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు లేదు. వారి ఆర్ధిక స్థితిని తెలియజేసే కార్డ్ జతపరచాల్సి వుంటు౦ది. సమాచార హక్కు ను గురి౦చి తరచుగా అడిగే ప్రశ్నలు సమాచార హక్కు చట్టం అ౦టే ఏమిటి? దీనికి సంబంధి౦చిన అధికారులు ఎవరు.? అడిగిన ప్రశ్నలకు సమాచారం అందజేసే బాధ్యత ఎవరిది? సమాచార కమిషన్ కు రాసేదరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది ? సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా.? సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి? సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి..? సమాచార హక్కు ద్వారా పొందడం సాధ్యం కాని విషయాలు ఏమయినా వున్నాయా ? సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి ? నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి? నాకు కావాల్సిన సమాచారం అధికారుల ఏ రూపంలో ఇవ్వగలరు ? సమాచార హక్కు కింద సమాచారం కోరేందుకు నమూనా దరఖాస్తులు ఏవైనా ఉన్నాయా? ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా? జవాబు పొందడానికి ఎంత సమయం పడుతుంది? సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా ? సమాచారం తీసుకోవడానికి నేను ఏమయినా ఫీజు చెల్లించాలా.? ఆర్.టి. ఐ. దరఖాస్తుకి, జవాబు లేకపోతే ఏం చెయ్యాలి ? నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి ? సమాచారాన్ని నాకు ఇవ్వడానికి తిరస్కరించవచ్చా ? అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి ? నేను కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా? కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 1. సమాచార హక్కు చట్టం అ౦టే ఏమిటి? సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చింది. కేంద్ర , రాష్ట్ర పభుత్వాల పాలనకు ఒక పార దర్శకత, జవాబుదారీ తనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. రెండు ప్రభుత్వాల పని తీరుకి సబంధించిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో వుంచడానికి ఇది కృషి చేస్తుంది. 2. పబ్లిక్ ఆధారిటీలు అ౦టే ఎవరు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా గాని , రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు వల్ల గాని, స్వంతంగా పాలనా నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలు పబ్లిక్ అధారిటి అంటారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ స్వంత సంస్థలు –ఇవి కూడా పబ్లిక్ అధారిటిల కిందే వస్తాయి. ప్రభుత్వం చేసే చాలినంత ఆర్ధిక సహాయం వల్ల నడిచే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి. 3. కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు? సమాచార ఇవ్వడ౦ కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థ లోను నియమించబడతారు.వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్.టి. ఐ. దరఖాస్తులు కూడా వీరిని అడ్రస్ చేసి పంపాలి.సబ్ డివిజినల్ స్థాయిలో అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వుంటారు. వీరు తమకు చేరిన దరఖాస్తులను , అప్పీల్స్ ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరుకు పంపుతారు. 4. సమాచార కమిషనుకు రాసే దరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది? సమాచార హక్కు చట్టం ప్రకారం ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు, అప్పీళ్ళకు తప్పనిసరిగా స్పందించి,పరిమిత సమయంలో అందించాల్సి వుంటుంది. అలా జరగని పక్షంలో ఆ అధికారిపై చట్ట ప్రకారం శిక్ష విధించ వచ్చు. అంతే కాదు, అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఆర్.టి.ఐ. నుపయోగించి, పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్టం ప్రకారం, పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసన సభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు ఆర్.టి.ఐ. ద్వారా పొంద వచ్చు. ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ, తమ వ్యక్తిగత వివరాలు కానీ,ఒక్క కాంటాక్టు అడ్రసు తప్ప, అధికారికి చెప్పాల్సిన పనిలేదు. 5. సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా? ఔను. ఆర్.టి ఐ అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు. అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకి రాదు. అయినాకానీ , పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు.. 6. సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి? నిర్దేశించిన రుసుము చెల్లించి,సంబంధిత పబ్లిక్ అధారిటి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట, దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు.ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే , మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి ఎవరినాయినా సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు. 7. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి? సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు. డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు . సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, రిపోర్టులు, పేపర్స్, సర్క్యులర్స్, శాంపిల్స్, మోడల్స్ ఎలెక్ట్రానిక్ ఫారంలో వున్న డేటా, డాక్యుమెంటు ఒరిజినల్ కాపీ, మైక్రోఫిల్మ్, ఇమేజ్ రూపంలో వున్న మైక్రో ఫిల్మ్ 8. ఏ ఏ విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు ? ఈ క్రింది విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం దేశ భద్రత, వ్యూహాత్మక , వైజ్ణానిక, ఆర్ధిక ప్రయోజనాలపై , విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదయినా న్యాయస్థానం లేక ట్రిబ్యూనల్ ఆదేశించి వున్న పక్షంలో అలాంటి సమాచారం , సమాచార వెల్లడి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనుకుంటే ఆ సమాచారం సమాచార వెల్లడి పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం వాణిజ్య పరమయిన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయిటే అలాంటి సమాచారం . అయితే , అలా వెల్లడి చెయ్యడం వల్ల ప్రజలకుఎక్కువ మేలు కలుగుతుందంటే ,ఆ సమాచారం ఇవ్వవచ్చు . ఉద్యోగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో వున్న సమాచారం విశాల ప్రజాప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు . ఏదయినా విదేశ ప్రభుత్వం నుంచి అంది,గోప్యంగా ఉంచాల్సిన సమాచారం సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణ హాని కానీ, ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం, చట్టాల అమలుకోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన,లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్తులను పట్టుకునేందుకు గానీ,వారిని శిక్షించేందుకు అవరోధాలు కలిగించే సమాచారం ఏదైనా అంశాలపై మంత్రి మండలి నిర్ణాయక పత్రాలు,అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు . సమాచారం ప్రజా ప్రయోజనాలకు కాని, ప్రజా కార్యక్రమాలకు సంబంధంలేని, వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు 9. సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి? మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ లేక ఈ దరఖాస్తు పంపుతున్న మీ ప్రాంతంలోని అధికార భాష గ గుర్తించిన ప్రాంతీయ భాషలో గాని వుండవచ్చు. 10. నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి? డాక్యుమెంట్స్ , మాన్యుస్క్రిప్టులు, మరియు రికార్డులు తనిఖీ చేయవచ్చు. నోట్స్ తీసుకోవచ్చు., సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కాపీలు లేక వాటి అనుబంధ కాపీలు, పదార్ధాల సర్టిఫైడ్ శాంపుల్స్ , సీడీ ల రూపంలో వున్న సమాచారం, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్స్, ప్రింట్ అవుట్స్ (కంప్యూటరులో వున్న సమాచారం), లేక ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారం 11. నాకు కావలసిన సమాచారం అధికారులు ఏ రూపంలో ఇవ్వగలరు? పబ్లిక్ సంస్థ వనరులలో వ్యత్యాసాలతో కూడిన మార్పులు జరగకపోతే, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు. ఆ డాక్యుమెంటుకు హాని లేని పక్షంలో , లబ్దిదారులు కోరిన విధంగా, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు . 12. ఆర్. టి. ఐ. అప్లికేషన్ నింపడానికి ఏదయినా ఖచ్చితమైన ఫార్మెట్ వుందా? లేదు. సమాచారాన్ని కోరుతూ దాఖలు చేస్కునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమయిన ఫార్మెట్ ఏమీ లేదు. కానీ దరఖాస్తు దారుడు ఈ క్రింది వివరాలు రాయాల్సి వుంటుంది. దరఖాస్తు తేదీ. సంబ౦ధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామా దరఖాస్తుదారుని చిరునామా కోరదల్చుకున్న సమాచారం ( స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ , టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది . దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో వుంటాయి.) కోరిన సమాచారం ఎలాంటి రూపంలో - ప్రింట్ అవుట్స్ , సిడి , ఈ మైయిల్స్ చెల్లించాల్సిన రుసుము స్టాంపు రూపంలో అయితే అంటించండి చెల్లింపు విధానం తెలపండి. సంతకం అనేక కే౦ద్ర, రాష్ట ప్రభుత్వ సంస్థలు శాంపిల్ ఫార్మేట్స్ ను రూపొందించాయి.పర్యావరణ , అడవుల మంత్రిత్వ శాఖల కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను వెబ్ సైట్ లో చూడగలరు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు కూడా ఒక దరఖాస్తు ఫార్మెట్ తయారు చేశారు. ఇది దరఖాస్తు సౌలభ్యం కోసం మాత్రమే తప్ప తప్పనిసరిగా పాటించితీరాలని నిబంధన ఏమీలేదు. ఈ ఫార్మెట్ లేదనే కారణం గా దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు. 13. ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా? అది పబ్లిక్ అధారిటి మిద ఆధార పడి వుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే సమాచారహక్కు www.rtionline.gov.in పేరిట ఒక పోర్టల్ నూ రూపకల్పన చేసింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలపై మాత్రమే వినియోగదారుడు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కు గురించి వెబ్ సైట్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. 14. జవాబు పొందడానికి ఎంత సమయం పడుతుంది? సమాచారం ఎవరయినా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు అవసరమయినది అయితే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు సమాచారం అందించాలి . దరఖాస్తు చేరిన ౩౦ రోజులలోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం అందించాలి. అప్లికేషన్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి ప౦పినట్టయితే అతను సంబంధిత అధికారిని దాన్ని చేర్చి సమాచారం సేకరించే నిమిత్తం మరొక 5 రోజులు అవసరమవుతుంది. ఒకవేళ ఆ సమాచారం ఎవరయినా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు అవసరమయినది అయితే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు సమాచారం అందించాలి. 15. సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా? మీ దరఖాస్తు సంబంధిత అధికారికి చేరకుండా మరొకరికి చేరినా కానీ, దాన్ని తిప్పి పంపంచడానికి వీల్లేదు. ఈ చట్టం పకారం దాన్ని అందుకున్న వ్యక్తి, లేక సంస్థ 5 రోజుల్లోగా నిర్దేశిత అధికారికి తిరిగి చేర్చితీరాలి. 16. సమాచారం తీసుకోవడానికి నేను ఏమయినా ఫీజు చెల్లించాలా? సమాచార హాక్కు కింద సమాచారం కోరుతూ పంపే అప్లికేషను ఒక కాపీ మీ దగ్గర అట్టిపెట్టు కొండి. అప్లికేషను రిజిష్టర్ పోస్టు అక్నాలేడ్జిమేంట్ లో పంపండి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ అథారిటి సమర్పించబోయే సమాచారానికి ఒక నియమిత ఫీజును నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆ మొత్తాన్ని రూ. 10 గా ప్రకటించింది.(ఈ పైన ఇచ్చిన పట్టికలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు ఎంతెంత నిర్ణ యిన్చిందో, ఎలా ఫీజు కట్టలో ఇవ్వడం జరిగింది.) ఒకవేళ దరఖాస్తు దారుడు దారిద్యరేఖ దిగువున వున్నా వాడితే,( ఫీజు చెల్లించలేని పరిస్థితిలో) వుంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డును సమర్పించాల్సి వుంటుంది. అప్లికేషను ఫీజు కాకుండా, కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రి౦టవుట్స్ కి పేజీకి రూ.2 చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన వుంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు. ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు సమాచారం ఇవ్వడంలో 30 రోజులకంటే ఎక్కువ జాప్యం చేస్తే, అప్పుడు ఎటువంటి ఫీజు వసూలు చెయ్యకుండా ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. 17. ఆర్.టి.ఐ దరఖాస్తుకి స్పందన లేకపోతే ఏం చెయ్యాలి? సమాచారం కోసం సమర్పించిన దరఖాస్తుకి సంబంధిత అధికారి నుంచి స్పందన లేకపోతే అప్పిలేట్ ఆధారిటీ కి అప్పీల్ చేసుకోవచ్చు. అన్ని పబ్లిక్ అథారిటిల తాలూకు అప్పిళ్ళను చూసేది అప్పలేట్ అధారిటి. మీ మొదటి అప్లికేషనుకు జవాబు రావాల్సిన తేది నుంచి 30 నుంచి 60 రోజుల వ్యవధిలోపల అప్పీలు చేసుకోవాలి. 18. నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి? ఇచ్చిన సమాచారం అవాస్తవంగానో , అసంపూర్తిగానో వుంటే అప్పిలేట్ ఆధారిటికి అప్పీల్ చేసుకోవాలి. సమాధానం చేరిన 30 రోజులలోపు అప్పీలుచేయాలి. సరైన కారణాలు వున్నప్పుడు అంతకంటే ఎక్కువ జాప్యం జరిగిన కూడా అప్పీలు అంగీకరిస్తారు. 19. సమాచారాన్ని నాకు ఇవ్వడానికి తిరస్కరించవచ్చా? తిరస్కరించవచ్చు. కొన్ని సమాచార విషయాలు ఆర్.టి.ఐ. సహాయంతో అందరితో పంచుకునే వీలులేదు. అలాంటప్పుడు సంబంధిత అధికారులు మీ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. అయితే, ఆర్.టి.ఐ చట్టం కింద సదరు సమాచారం ఇవ్వ యోగ్యమైనదే అనిపిస్తే, మీరు అప్పీలు చెయ్యవచ్చు. మీరు ఈ అప్పీలును మీకు జవాబు వచ్చిన 30 రోజుల లోగా చేసుకోవాలి.మీ అప్లికేషన్ తిరస్కరించినప్పుడు, దానికి కారణాలు, మీరు దానిపై ఎలా అప్పీలు చేసుకోవచ్చో, మీరు పంపాల్సిన అప్పలేట్ అధారిటి ,ఇవన్ని కూడా తిరస్కరిస్తున్న పబ్లిక్ అథారిటి ఇవ్వాల్సి వుంది. 20. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి? అలాంటప్పుడు, మీరు కేంద్ర సమాచార కమిషన్ కు లేదా, రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండో సారి అప్పీలు చేయవచ్చు. మీరు మొదట పంపిన అప్పీలుకు జావాబు ఇవ్వాల్సిన సమయం అయిన తరవాత 90 రోజులోగా రెండో అప్పీలు పంపుకోవాలి. లేదా, మొదటి అప్పీలుకు జావాబు వచ్చిన తరవాత 90 రోజులలోగా రెండో అప్పీలు పంపాలి. సరైన కారణం వున్నప్పుడు, ఈ సమయం దాటి పోయినా కూడా అప్పీలు అనుమతించబడుతుంది. 21. నేను కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా? అటువంటి సమయ నిబంధన ఏది లేదు. 22. కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎం చర్యలు తీసుకుంటారు? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ క్రింద వివరించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అతను దరఖాస్తూ స్వీకరించే వరకు,లేదా, సమాచారం ఇచ్చే వరకు కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రు .250 లు చొప్పున పెనాల్టి విధించ వచ్చు. గరిష్టంగా రు.25,000లు వరకు పెనాల్టి వేయవచ్చు. సరైన కారణం లేకుండానే ఆర్.టి.ఐ. దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం నిర్ణయించబడిన సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం సమాచారం కావాలని ఆలస్యంగా ఇవ్వడం తెలిసి కూడా తప్పుడు సమాచారం/అసంపూర్తి సమాచారం/తప్పు దోవ పట్టించే సమాచారం ఇవ్వడం అడిగిన సమాచారాన్ని అసలు లేకుండా చెయ్యడం, సమాచారం ఇవ్వడానికి ఏదో విధంగా అడ్డుపడడం నమూనా ఫారం 1 1. ప్రాధమిక సమాచారం ప్రాజెక్ట్ పేరు స్వభావం ప్లాంట్ సామర్ధ్యం ప్లాంటుకు సమీప పట్టణం, నగరం, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్,ఎంత దూరంలో వున్నాయో ఆ వివరం గ్రామ ప౦చాయితీ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, లోకల్ బాడీ తాలూకు పోస్టల్ చిరునామా మరియు కాంటాక్ట్ నంబర్లు కింది చట్టాల ప్రకారం ప్రాజెక్ట్ కుఅనుమతి అవసరం అయితే సంబంధించిన వివరాలు, అటవీ సంరక్షణచట్ట౦ ; 1980 వన్య మృగ సంరక్షణ చట్టం ;1972 సి. ఆర్. జెడ్ ( కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ) నోటిఫికేషన్; 1991 ప్రత్యామ్నాయ ప్రాంతాలు ఏవైనా వుంటే వాటి భౌగోళిక వివరాలు అనుబంధ ప్రాజెక్టులు,సమర్పించినదరఖాస్తు ఫారంవివరాలు అభ్యర్ధి పేరు, చిరునామా, మరియు హోదా వివరాలు ప్రాజెక్టు సైట్ కి సంబంధించిన ప్రభుత్వ ఆర్డర్, పాలసీ వివరాలు అటవీ భూమి ప్రాజెక్ట్ లేదా ప్రాంతానికి సంబంధించి ఏవైనా వివాదాలు వుంటే వాటి వివరాలు 2. యాక్టివిటీ వివరాలు నిర్మాణం ప్రాజెక్టునిర్వహణ లేక నిలుపుదల సంబంధి౦చించిన వివరాలు -ఆ ప్రాంత వర్ణన, ఆ భూమి వాడుకలో వున్నదా, నీటి బిల్లు కడుతున్నారా లాంటివి భూమి వాడకంలో తాత్కాలిక, శాశ్వత మార్పులు ప్రాజెక్టు ప్రాంతాన్నీ ఉపాధి అవసరాలకు, పెరిగిన ఉపయోగించే వారి సంఖ్య -ఆ వివరాలతో భూమి మ్యాప్ ప్రస్తుతం ఉన్న భూమి తాలూకు క్లియరెన్స్ చెట్లూ చేమలూ మరియూ నిర్మాణాలు భూముల కొత్త వినియోగాలు కనిపెట్టడం నిర్మాణానికి ముందు చేపట్టిన కార్యక్రమాలు అనగా బోర్ వెల్, భూమి పరీక్షలు కట్టడం పనులు కూల్చివేత పనులు నిర్మాణానికి ముందు భవన కూలీలకు , నిర్మాణ పనిముట్లకు, తవ్వకం పనులకు ఉపయోగించిన తాత్కాలిక జాగా మరియు ఇళ్ళు కాలవలు లాంటివి తవ్వి, గట్టులు నిర్మించడం, మరియు తవ్వకాలు గనులు, సొరంగాలు లాంటి భూమి గర్భ పనులు భూమి బాగు చేసి ఉపయోగంలోకి తెచ్చే పనులు కాలువల నుండి బురదను తీసే పనులు సముద్ర తీర నిర్మాణాలు ఉత్పత్తి ,మరియు యాంత్రిక ఉత్పత్తి సామగ్రిని భద్రపరచే సౌకర్యం ఘన, ద్రవ వ్యర్ధాల తరలింపు నిర్వహణకు సౌకర్యం దీర్ఘ కాలంగా పని చేస్తున్న నిర్మాణ కార్మికుల సౌకర్య కల్పన కొత్త రోడ్లు నిర్మాణ సమయంలో,లేదా ప్లాంటు నడుస్తున్న సమయంలో రైలు, సముద్ర రవాణా రద్దీ కొత్త, లేక ప్రత్యామ్నాయ రైలు, విమాన, సముద్ర౦ లాంటి ఇతర రవాణా మార్గాలు మూసేసిన ప్రస్తుతరవాణా మార్గాలు, మళ్లి౦పు రహదారులు , దానికి అవసరమైన చేపట్టిన పనులు కొత్త లేక మళ్ళి౦పు విద్యుత్ మరియు నీటి పైపులు ఆనకట్టలు, డ్యాములు, కల్వర్టులు కట్టి నీటిని నిల్వ చేయడం, నీటి వనరుల్ని క్రమ బద్ధీకరించడం,భూమిలోని నీటి పొరల్ని మార్పులు, నిలవ చేయడం నదీ నదాల ప్రవాహాల్ని మళ్ళించడం , భూమి లోపల, ఉపరితల నీటిని దారి మళ్ళింపు, తరలింపు డ్రైనేజీ నీటి కలయిక వల్ల వాడుక నీటిలో,భూమిలో ఏర్పడిన కాలుష్యం ప్లాంటు నిర్మాణానికి మనుషులు , నిర్మాణ సామగ్రి రవాణా :లేదా నిర్వహణ కోసం, లేదా( ఎక్కువ కాలం పట్టే) నిర్మాణాల కూల్చివేత నిరుపయోగమైన ప్లాంటు నిలుపుదల సమయంలో జరిగే పన్ల వల్ల ఏర్పడే కాలుష్యం ప్రాజెక్ట్ పని నిమిత్తం తాత్కాలికంగానో,శాశ్వతంగానో వలస వచ్చి పెరిగిన జనాభా కొత్త జాతులను ప్రవేశ పెట్టుట ఆయా ప్రాంతాల లభ్యమయ్యే జాతులు నశించిపోవుట, ఆనువంశికవై విధ్యం ఇతర కార్యక్రమాలు 3. సహజ వనరుల వినియోగం-వాటి లభ్యత వివరాలు భూములు:వ్యవసాయ భూములు లేక బంజరు భూములు -హెక్టార్లలో , నీరు: నీటి లభ్యతా వివరాలు, వినియోగదారుల పోటి- రోజుకు అవసరమయినకిలో లిటర్ల యూనిట్లలో, మినరల్స్ మెట్రిక్ టన్నులతో , నిర్మాణ సామగ్రి,- మొత్తంగా కావాల్సినరాయి, ఇసుక,మన్ను , ఎక్కడ లభ్యమౌతాయి , మెట్రిక్ టన్నుల్లో , అడవులు, కలప లభ్యత - మెట్రిక్ టన్నులలో శక్తీ- విద్యుత్తు, ఇంధనాలు వాటి లభ్యత, వాడకందార్ల పోటీ, మెట్రిక్ టన్నులలో ఇంధనం, మెగా వాట్లలో విద్యుత్తు ఇతర సహజ వనరులు ( సరైన కొలమానం ఉపయోగించండి) 4. ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే నిల్వల,రవాణా,ఉత్పత్తి, తాలూకు కాలుష్యం వ్యాధులు రావడంలో కలిగే మార్పులు . వ్యాధి కారకాలు ( ఉదాహరణకు క్రిములు, నీటి సంబంధిత కాలుష్యం)వదిలే దోమలు లాంటి వాటి ప్రభావం . ప్రజారోగ్యానికిహాని కలిగించేవి ( జీవన పరిష్టితుల్లో వచ్చిన మార్పులవల్ల) ఈ ప్రాజెక్టు వలన ఎక్కువ హాని పొందే ప్రజలు ( ఆస్పత్రి లో వున్న రోగులు, పిల్లలు, వృద్ధులు) ఇతర కారణాలు 5. నిర్మాణ సమయంలో, పని చేస్తున్నప్పుడు, కూల్చి వేసేటప్పుడు ఏర్పడుతున్న ఘన వ్యర్ధాలు చెడిపోయినవి చట్టు రాతి పై పేరుకున్న మట్టి, గనిలో వ్యర్ధం మునిసిపాలిటి వారి వ్యర్ధం (గృహ, వ్యాపార సంబంధిత వృధా) హానికరమయిన వ్యర్ధాలు (హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం ) పరిశ్రమల తాలూకు ఇతర వ్యర్ధాలు అధిక ఉత్పత్తి మానవ విసర్జితాలు,లేదా అధిక సరఫరా వల్ల విసర్జిన్పబడడం, నిర్మాణ, కూల్చివేతలకు సంబంధించిన వ్యర్ధాలు అధిక మెషినరీ లేక సామగ్రి కాలుష్య మయమైన నేల లేక ఇతర మూలకాలు వ్యవసాయ వ్యర్ధాలు, ఇతర ఘన వ్యర్ధాలు 6. విడుదలయ్యే కాలుష్యకారకాలు, హాని కరమైన, మత్తు కలిగించే, ఎక్కువ ప్రమాదకరమైన గాలిలోకి విడుదలయ్యే పదార్ధాలు జీవ జాతుల అవశేషాల దహనం వల్ల విడుదలై ,ఒకే చోట కాని, లేదా వ్యాపించే వ్యర్ధాలు, వాయువులు ఉత్పత్తి విధానంలో విడుదల అయ్యే వ్యర్ధాలు,వాయువులు సామగ్రి స్టోర్సు లో నిలవ చేసేటప్పుడు, వాడుకలోను విడుదలయిన వ్యర్ధాలు నిర్మాణ కార్యక్రమాల వల్ల (ప్లాంటు, పనిముట్లతో సహా) విడుదలయిన వ్యర్ధాలు నిర్మాణ సామగ్రి వాడుక వల్ల, పదార్ధాల ద్వారా, మానవ విసర్జితాల వల్ల,వ్యర్ధాల వల్ల విడుదలయిన దుమ్మూ, ధూళీ, వ్యర్ధాల్ని కాల్చడంద్వారా విడుదలయిన కాలుష్యం (ఎక్కువ కోతపని వ్యర్ధాలు, కట్టుబడి పనిలో వ్యర్ధాలు) వ్యర్ధాల్ని కొలిమిలో కాల్చడం ద్వారా ఏర్పడిన కాలుష్యం ఇతర విడుదల పదార్ధాలు 7. ధ్వని, ప్రకంపనాలు, కాంతి ద్వారా విడుయదలయ్యే వేడి యాంత్రిక సామగ్రిని వాడటం ద్వారా విడుయదలయ్యే ధ్వని ( ఉదాహరణకు ఇంజన్లు, ప్లాంట్ వెంటిలేషన్, క్రషర్స్) పరిశ్రమల ద్వారా, ఇతర విధానాల ద్వారా నిర్మాణ, కూల్చివేతల ద్వారా పేల్చివేతల ద్వారా, కుప్పగా చేర్చడం ద్వారా నిర్మాణం ద్వారా లేక రవాణా ద్వారా వెలుతురు మరియు చల్లబరచు పద్దతుల ద్వారా ఇతర పద్దతులద్వారా 8. భూమి లేక నీటి కాలుష్యం వల్ల వచ్చే విపత్తు నూతులు, ఉపరితల జలాలు, భూ జలాలు కోస్టల్ వాటర్స్ మరియు సముద్ర జలాల లోకి వదులుతున్న కాలుష్యం ప్రమాద కారి అయిన సామగ్రిని, పదార్ధాల్ని నిల్వ మరియు వాడుక వల్ల విసరివేయడం వల్ల వచ్చిన కాలుష్యం భూమిపై, నీటిలో మానవ , జంతు విసర్జితాలు గాలిలోకి, నేలమీదికి,నీటిలోకి వదిలిన కాలుష్యాలు పై కారణాల వల్ల దీర్ఘ కాలికంగా వెదజల్లుతున్న కాలుష్యం దానివల్ల పాడవుతున్న పర్యావరణం ఇతర కారణాలు 9. నిర్మాణ సమయంలో గురవుతున్న ప్రమాదాలుఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ కాలుష్యం పేలుళ్ళు, విధ్వంసాలు, పడటం వల్ల గాయాలు స్టోర్ చేసిన సామాన్ల వాడకం, హానికర పదార్ధాల ఉత్పత్తిలో మరే విధమైన కారణాల వల్ల భూకంపాలు , వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో సహా , సంభవించే పర్యావరణ కాలుష్యం 10. పర్యావరణం దెబ్బతినడానికి దారితీసిన కారణాలు సహాయ కారకాలైన ఇతర ప్రాజెక్టుల అబివృద్దికి,ప్రాజెక్టు వలన అభివృద్ధికి సహాయపడేవి, పర్యావరణం పై ప్రభావం చూపేవి అయిన ఇతర అంశాలు (ఉదాహరణకు దోహదపడే హంగులు, రోడ్లు, విద్యుత్తు, వ్యర్ధ జలాల నిర్వహణ ఇళ్ల నిర్మాణం ఒక ముడి పదార్ధం నుంచి మరొక ఘన/వాయు/ద్రవ పదార్ధాన్ని తీసే పరిశ్రమలు సరఫరా చేయు పరిశ్రమలు ఇతరములు ప్రాజెక్ట్ సైట్ వాడుక తర్వాత పర్యావరణాన్ని దెబ్బతీసే వాహకాలు భవిష్యత్తులో కాలుష్య పెరుగుదలకు కారకాలుగా నిలిచిపోయేవి మున్ముందు రాగల ప్రాజెక్టులు, లేదా ఇప్పటికే వున్న ప్రాజెక్టులకు దగ్గరగా వుండడం వల్ల రాబోయే మొత్తం మార్పులు 11. పర్యావరణ మార్పులకు స్పందన అంతర్జాతీయంగా సమ్మతించిన రక్షిత ప్రాంతాలు, జాతీయ లేక స్థానిక చట్టాల వల్ల రక్షిత ప్రాంతాలుగా గుర్తింపబడిన అందమైన ప్రకృతి ప్రాంతాలు,లేదా ఒకనాగరికతకు సంబంధిచిన రక్షిత ప్రాంతాలు తడి భూములు, నదుల పరీవాహక ప్రాంతాలు, చెరువులు, సెలయేళ్ళు , తీర ప్రాంతాలు, పర్వతాలు, అడవులు లాంటి తప్పనిసరిగా పర్యావరణ సమతుల్యం పాటించాల్సిన ప్రాంతాలు వృక్షాలు, సున్నితమైన రక్షిత వన్య ప్రాణులు, పక్షులు , లాంటి వాటి పెరుగుదలకు, ఆహార సంపాదనకు, చలి ప్రాంతాల నుంచి నివాసం కొరకు, వలసలు దేశీయ,తీర ప్రాంత ,సముద్ర ఒడ్డున లేక, భూగర్భ జలాలు రాష్ర, జాతీయ సరిహద్దులు విహార స్థలాలు, పర్యాటక ప్రాంతాలు లాంటి ప్రజా వికాస సౌకర్యాలు , రహదారులు రక్షణ శాఖకు అవసరమయిన కట్టడాలు అధిక జనాభా నివసించు ప్రాంతాలు లేక నిర్మాణాలున్న ప్రాంతాలు ఆస్పత్రులు, స్కూళ్ళు, దేవాలయాలు లాంటి కమ్యూనిటీ అవసరాలకు ఉపయోగించిన ప్రాంతాలు భూజలాలు, భూ ఉపరితల వనరులు, అటవీ ప్రాంతాలు,వ్యవసాయ భూములు, చేపల చెరువులు, పర్యాటక ప్రాంతాలు, మినరల్స్ లాంటి విలువయిన భూములు చట్ట బద్ధమయిన నిబంధనలను అతిక్రమించి కాలుష్యానికి , పర్యావరణ సమతుల్యత పోయిన భూములు సహజ ప్రకృతి వైపరీత్యాలకు అవకాశమున్న సున్నితమైన ప్రాంతాలు (భూకంపాలు,భూమి క్రుంగి పోవడాలు, భూమి కోసుకుపోవడాలు, కొండ చరియలు విరిగి పడటాలు,వరదలు, ప్రతికూల వాతావరణ కారణాలు ) 12. ఉద్దేశించిన విధి విధానాలు అఫిడవిట్ ఈ విధంగా వుంటుంది. ఈ దరఖాస్తు (అప్లికేషన్) లో, జత పరిచిన పత్రాలలో ఇచ్చిన వివరాలు అన్నీ నాకు తెలిసినంత వరకు నిజమైనవని హామీ ఇస్తున్నాను. ఒక వేళ ఇచ్చిన వివరాలలో ఏ కొన్ని అసత్యమైన విషయాలు ఉన్నా, ఏ స్థితి లో నైనా తప్పుదోవ పట్టించేవిగా వున్నా, నా స్వంత పూచి మీద, నా ఖర్చుతో ప్రాజెక్టు దరఖాస్తు తిరస్కరించబడుతుందనీ, అనుమతి ఇచ్చినట్లయితే, అది రద్దు చేయబడుతుందని నాకు పూర్తిగా తెలుసునని తెలియజేయడమైనది. తేది: అభ్యర్ధి సంతకం స్థలం: పేరు, అడ్రసు వివరాలతో పంపాలి. నోట్: తీర ప్రాంత నిబంధనల జోన్ (సి.ఆర్.జెడ్)నోటిఫికేషన్ 1991 ప్రకారం , అనుమతి పొందాల్సిన ప్రాజెక్టులకు,దరఖాస్తుతో పాటి ఈ కింది పత్రాలు కూడా జత చెయ్యాల్సి వుంది. టర్మ్స్ ఆఫ్ రిఫెరెంస్ ఇచ్చే సమయంలో, ప్రాజెక్టు పనులు తీర ప్రాంత నిబంధనలకు అనుగుణంగా వున్నది, లేనిది చూపుతూ గుర్తింపబడిన ఏజెన్సి తయారు చేసిన సి.ఆర్.జెడ్ మ్యాపు పర్యావరణ అనుమతికి ముందు రాష్ట్ర తీర ప్రాంత నిబంధనల మేనేజ్మెంట్ అథారిటి వారి సిఫారసులు జాతీయ పార్కులు, వన్య మృగ రక్షిత ప్రాంతాలు, వన్య మృగాలు, పక్షులు నివసించు రక్షితప్రాంతాలు వన్య మృగాలు తిరుగాడు ప్రాంతాలకు పది కిలో మీటర్ల దూరంలో వున్న ప్రాజెక్టులకు, ఈ కిందివి కూడా దరఖాస్తుతో జత చేసి పంపాలి. పై విషయాలు వివరిస్తూ ప్రాజెక్టు ఎక్కడ పెట్టేది గుర్తింపు చేసి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ధృవపరిచిన మ్యాపు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి వాఖ్యలు విధి విధానాలు ప్రాజెక్టు సైటు తాలూకు దీర్ఘ కాలిక లక్ష్యం తెలియజేసే డాక్యుమెంట్ వుంటే దాన్ని సమర్పించాలి తీర ప్రాంత నిబంధనల జోన్ అనుమతి, పర్యావరణ అనుమతులలో విధించిన షరతులు జరిగి పోయిన స్థాయి వరకు పాటిస్తున్నట్లు హామీ పత్రం సమర్పించాలి. అప్రూవ్ అయిన పాజెక్ట్ సైట్ తాలూకు పూర్తి వివరాలను తెలిపే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ,దానితో పాటు అనుమతించబడిన సైట్ తాలుకుఇటీవలీ ఫోటోగ్రాఫ్ లను సమర్పించాలి. పబ్లిక్ హియరింగ్ లో, రాత పూర్వక జవాబుల్లోనూ, లేవనెత్తిన సమస్యలు, వాటికి సంబంధించిన సమాధానాలు ,బడ్జెట్ కేటాయింపుతో పాటు, ఆ సమస్య సరిచేసేందుకు సమయ పాలన –ఇవన్నీ కుడా ఒక పట్టిక రూపంలో ఇవ్వాలి. ప్లాంటు స్థలంలో, బిల్డింగ్ పైన, ఇంకా లభ్యమైన ప్రాంతాలలో సూర్య రశ్మి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని పొందికగా రూపొందించడమే కాకుండా, ఆచరణలో ఎలా జరుగుతోందో పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. ప్లాంటు స్థాపనకు అనుమతించిన స్థలాన్ని యాష్ పాండ్ ఉన్న ప్రాంతంతో పాటు 1:50,000 నిష్పత్తిలో బౌగోళిక వర్ణన సమర్పించాలి.అంతే కాక, ప్లాంటు సరిహద్దులు జి.పి.ఎస్. (గ్లోబల్ పొజిషన్ సిస్టం) తో తీసిన వివరాలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి ద్వారా ఆ ప్రాంత శాటిలైట్ మ్యాప్ సమర్పించాలి.కాలవలు, నదులు,సెలయేళ్ళు మొదలైన వాటికి దగ్గరలో ప్లాంటు కడుతుంటే, భూమి ఉపరితలానికి ఎంత ఎత్తులోప్లాంటు,యాష్ పాండ్ ఉండబోతున్నాయో తెలియజేయాలి. కాలవల నుంచి, నదుల నుంచి, సెలయేళ్ల నుంచి,పంపుల నుంచి వరద రాగలిగిన ఎత్తుకు (హై ఫ్లడ్ లెవెల్ ) మించి ,ప్లాంటు ఎత్తు ఎంత పెంచుతున్నారో తెలియజేయాలి. ప్లాంటు స్థలం లే అవుట్ ప్లాను సమర్పించాలి. ఈ ప్లానులో ప్లాంటు ఏరియా,యాష్ పాండ్, హరిత ప్రాంతం,ప్లాంటుకు అవసరమైన మూలకాలు, రోడ్లు మొదలైనవి –అన్నీ సమర్పించాలి. ప్లాంటు నిర్మాణానికి స్థలాన్ని అవసరమైనంత మాత్రమే ఏదైనా, ఆయా సమయాల్లో సి.ఇ.ఏ. నిర్దేశించినంత వరకే కొనాలి. విడివిడిగా ఆయా విభాగాలకు ఎంతెంత స్థల కావాలో (ఇ.ఏ.సి. మార్చిన) మళ్ళీ సరిచేసిన లే అవుట్ తెలియజేయాలి. రెవెన్యు రికార్డుల ప్రకారం (ఎటువంటి తనఖాలు లేని స్థలం –దీనికి సంబంధించిన రికార్డులు తీసుకోవాలి )ప్రాజెక్టు స్థాపించే స్థలం ప్రస్తుతంఎలా ఉపయోగపడుతున్నది తెలియజేయాలి.ఎందుకంటే, బొగ్గు రవాణాకు, పైపులైన్లు (ఆర్.ఒ.డబ్యు తో సహా) వేయడానికి ఈ సమాచారం చాలా అవసరం. భూమి కొనుగోలు, స్వాధీనం చేసుకోవడంలో సమస్యలు, రెవెన్యు రికవరీ యాక్టు లాంటి వాటి అవసరం, దీనికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా ముఖ్యం.ఈ వివరాలు ఇ.ఐ.ఏ. రిపోర్టులో పేర్కొనాలి. శాటిలైట్ ఫోటోలు గాని, లేదా సెర్టిఫై చేసిన భౌగోళిక మ్యాపు గాని పంపాలి.ఇందులో మురుగు నీరు, వ్యవసాయ భూములు,మాగాణి భూములు, నది పరివాహకప్రాంతాలు, సెలయేళ్ళు, చెరువులు లాంటివి, చుట్టుపక్కల పల్లెలు, చిన్న కాలవలు, సముద్ర, నది తీరాలలో పెరిగే చెట్ల తోపులు,నదులు, రిజర్వాయర్లు లాంటివి, ప్రాజెక్టు ప్రాంతంలో ఏమేమి వున్నాయో అవన్నీ గుర్తించాలి. నేషనల్ పార్కులు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు, ఏనుగుల/పులుల రిజర్వ్ ఫారెస్టు(ఇప్పటికే వున్నవి,లేదా పెట్టబోయేవి),పక్షులు వలస వచ్చే తోవలు వగైరాలు ప్రాజెక్టు ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే మ్యాపులో గుర్తించి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి చేత సెర్టిఫై చేయించాలి. పరిశీలనార్ధం ఎంచుకున్న ప్రాజెక్టు స్థలం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాపు 1 :50,000 స్కేలుపై చిత్రించినది, దానితో పాటు మరొక మ్యాపు 1:25,000 స్కేలుపై చిత్రించినది సమర్పించాలి. ఇందులో ప్రాజెక్టు ప్రాంతంలో పూడ్చాల్సిన గోతులులాంటివి, కందకాలు లాంటివి వుంటే, దాని వివరాలు, అది పూడ్చడానికి కావాల్సిన మట్టి లాంటివి ఎంత కావాలి, వాటిని ఎక్కడ నుంచి ఎలా రవాణా చేసి తీసుకొస్తారు లాంటి వివరాలు మ్యాపుతో పాటు పంపాలి. ప్రాజెక్టు ప్రాంతాలలో భూమి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది సవివరంగా తెలియజేయాలి. అందులో అందరికి ఉపయోగపడే ప్రాంతాలు ( పశువుల దాణా కొరకు గడ్డి పెంచుతున్న భూములు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూములు, నీటి వనరులు లాంటివి),వాటి రక్షణకు సరైన ప్రణాళిక ఏర్పరుచుకోవాలి. ఒక వేళ గడ్డి భూములను ప్లాంటు కోసం కొనుగోలు చెయ్యడం జరిగితే, అంతే భూమిని పశువుల మేత కోసం కొనుగోలు చేసి పశువుల మేత పెంచే ప్రణాళిక కూడా ఇవ్వాలి. ప్రాజెక్టు ప్రాంతానికి చెందిన ఖనిజ లోహ మ్యాపు ( మట్టి లక్షణాలతో సహా) తయారు చేసి, ఆ ప్రాంతం ఖనిజాలు కోసం గనులు తవ్వడం లాభదాయకం కాని ప్రాంతమని తెలియజేయాలి. భారత ప్రభుత్వ ఫ్లై యాష్ వినియోగ సరికొత్త ప్రకటన ఫ్రకారం, నూటికి నూరు శాతం ఫ్లై యాష్ వినియోగ ప్రణాళికను, కాంట్రాక్టు పార్టీల ఒడంబడిక వివరాలను సమర్పించాలి. ఆ ప్రణాళికలో బాటం యాష్ ఎలా పరిష్కరిస్తారో కూడా తెలపాలి. ప్రాజెక్టు నీటి అవసరాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథారిటి వారి లెక్కప్రకారం ఆయా సమయాల్లో ఎంత కావాలో , నీటి వనరులు ఎంత వున్నాయో చూపిస్తూ బొమ్మ గీసి తెలియజేయాలి. నీటి నిల్వలు ఎంతెంత వున్నాయో లెక్క వేసినప్పుడు, నీటిని రిసైకిల్ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాజెక్టు ప్రాంతన్లోంచి పారే నీటి వనరులు (నల్ల, చిన్న కాలువలు, ఏరులు) దిశను మార్చ రాదు. ఒక వేళ మార్చాల్సి వస్తే, మార్చిన దిశ వల్ల మురుగు నీరు (డ్రైనేజి) సిస్టం పాడవకుండా చూడాలి. అలా మార్చాల్సిన దిశ వివరాలు ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారణ చేసి పంపుతారు. నదులు, సెలయేళ్ళు లాంటి వాటికి దగ్గరున్న ప్లాంటు హద్దులు వరద ముంపు ప్రాంతానికి కనీసం 500 మీటర్ల దూరం వుండాలి. భూగర్భ జలాలు ,భూ గర్భ అంశాలకు సంబంధించి ఒక పేరుపొందిన సంస్థ లేదా ఏజెన్సితో ప్రాజెక్టు ప్రాంతంలో, ప్రాజెక్టు వలన భూమి ఉపరితలం , భూ గర్భం జలాలలో ఏర్పడే ప్రభావం పూర్తిగా పరిశోధన చేయించాలి. కాలుష్య సమస్యను ఎదుర్కొనే ప్రణాళిక తెలియజేయాలి. ప్లాంటు కోసం కాలువలు,నది,లేక సముద్రం, లేదా ఏటి నుంచి నీరు తీసుకుని,మళ్ళీ నీటి వ్యర్ధాలు ఆ కాలువల్లో, నదిలో, సముద్రంలో, ఏటిలోకి వదలడం జరుగవచ్చు. దీనివల్ల, జీవ జంతువుల పై, నదుల్లో, కాలువల్లో,సముద్రంలోని మత్స్య సంపదపై ప్రభావం ఎలా వుండబోతోందో పరిశోధించి, ఆ రిపోర్టు ఇ.ఐ.ఏ. తో జత చేసి పంపాలి. మెరైన్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి పరిశోధన చెయ్యాల్సి వస్తే, ఎక్కడినుంచి,ఎంత నీటిని తీసుకోవడం జరుతుందో,అలాగే ఎంత నీటి వ్యర్ధాలు వదలడం జరుగుతుందో కూడా తెలియజేయాలి. నీటి వనరుల వివరాలు ,ఉత్పత్తి లేని లేదా, తక్కువ వున్న సమయంలో కూడా ప్లాంటుకు నీటి సరఫరా చేసే అవకాశాలు, నీటిని ప్లాంట్ కోసం తీసుకున్నందువల్ల, జీవ జాతుల పర్యావరణం లో మార్పు, ఒక వేళ ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాలు ఉన్నట్లయితే పై అంశాలన్నీఈ సందర్భంలో కూడా పరిశీలన అవసరమవుతుంది. అంతే కాదు, ప్లాంటు కోసం తీసుకునే నీటికి మరో ప్రాజెక్టుతో పోటీ ఉందేమో చూడాలి. నీటిని సరఫరా చెయ్యగలమని సంబంధిత నీటి వనరుల అధికారులు ఇచ్చే హామీ పత్రం కూడా జత చెయ్యాలి. వర్షపు నీరు ఆదా చేయడంపైన,దాన్ని ప్లాంటులో ఉపయోగించడం పైన సవివరమైన ప్రణాళిక సమర్పించాలి. జీరో కాలుష్య విడుదల అనే భావన (కాన్సెప్ట్)గురించి, దాని సాధించే అవకాశాల గురించి బాగా పరిశీలించి , ఆ వివరాలు సమర్పించాలి. పవర్ ప్లాంటులో నీరు సైకిల్ చక్రం లాగ మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం అవుతుంది. అలా ఉపయోగించే నీటిని పూర్తిగా ఉపయోగించే పద్ధతి(సైకిల్స్ ఆఫ్ కాన్సంట్రే షన్ , COC), మిగతా నీటి పొదుపు విధానాలతో సహా వివరించాలి. యాష్ పాండ్ నీటిని తిరిగి ఉపయోగించే ప్రణాళిక, అది అమలు చేసే విధానం చెప్పాలి. నీటి నాణ్యత ఒకేలా ఉండేలా పర్యవేక్షించే ప్లాను, అది ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చెయ్యడం విధించాలి. ఈ పర్యవేక్షణ వివరాలు, ఏ ఏ చోట్ల పర్యవేక్షణ (ప్లాంటు నుండి డ్రైనేజ్ పోయే మార్గం -భూమి ఉపరితలంపైన,భూగర్భంలోని నీటి వనరుల వరకు) చేయడం అన్నది వివరంగా సమర్పించాలి. ప్లాంటుకు 10 కిలో మీటర్ల వరకు వున్నప్రాంతంలో సామాజిక ఆర్ధిక అంశాలపై పేరుపొందిన సంస్థ చేత పరిశోధన చేయించాలి. ఆ ప్రాంతాల ప్రజల జీవనాధారంపై ప్లాంటు ప్రభావం వివరం ఇవ్వాలి. ఆ ప్రాంతంలో నివసించే పని చేయగల యువకులను గుర్తించి వాళ్లకు ప్లాంటులో పనిచేసేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇచ్చే ప్రణాళిక తయారు చెయ్యాలి. ప్లాంటు నిర్మాణ సమయంలో, నడుస్తున్న సమయంలో ఎంతమందికి ఉపాధి కల్పించగలరో వివరించాలి. ప్రాజెక్టు ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్నట్లయితే, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాలి. ఆ యా ప్రాంతాల గిరిజన చట్టాల ప్రకారం, గిరిజనుల సమస్యలు, ప్రాజెక్టు అభ్యర్ధి గుర్తించాలి. కార్పోరేట్ సంస్థలు తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత(C S R-కార్పోరేట్ సస్టెయిన్బిలిటి అండ్ రెస్పాన్సిబిలిటి) గురించి ఒక పూర్తి ప్రణాళిక, దానిలో ప్రతి అంశానికి కేటాయించిన మొత్తంతో సహా తయారు చెయ్యాలి. ప్రతి అంశం కూడా అవసరాన్నిబట్టి గుర్తించాలి. సాంప్రదాయ పరమైన నిపుణులతో సమానంగా అబివృద్ది చెందే పద్ధతిలోబీద వారికి జీవనాధార ఉపాధి కల్పించే అవకాశాలు గుర్తించాల్సి వుంది.సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వేరే బడ్జెట్, మరియు ఆదాయం ఉత్పత్తి చేసే కార్యక్రమాలు తెలియజేయాలి. సి.ఎస్.ఆర్. స్కీములు తయారు చేసేటప్పుడు, ఏ ఏ స్కిములలో, పర్యవేక్షణ కూడా నిబిడికృతమై వుందో వాటినే చేర్చాలి. దగ్గరలోని పేరున్న ప్రభుత్వ సంస్థ చేత సోషల్ ఆడిట్ చేయించాలి. ప్రాజెక్టు అభ్యర్ధి ఈ స్కీం లు ఆయా సమయాల్లో అమలు చెయ్యడానికి ఒక ప్రణాళిక ఏర్పరుచుకుని, ఏదైనా ప్రభుత్వ స్కీం తో కలిపి అమలు చేయచేయ్యాలి. ప్రాజెక్టు నిర్మాణం వలన హక్కులు ,జీవనాధారం కోల్పోయిన ప్రజలకు పునరావాసం,పరిహారం(ఆర్.ఆర్)ఏర్పాటు చెయ్యడం గురించి దృష్టి పెట్టాలి. ప్లాంటు స్థలం లో ఉపాధి పనులు చేస్తూ బతుకుతున్న వారు, ఆ ప్రాంతం స్వంతదార్లు , , సామాజిక ఆర్ధిక అవసరాల సమగ్ర సర్వేజనాభా ప్రాతిపదికన నిర్వహింఛి అప్పుడు ఆర్.ఆర్ ప్లాను తయారు చెయ్యాలి. ఆ ప్రాంతంలో ఆ ప్లాంటులో పనిచేసే వారికి, పర్యావరణం మూలంగా రాగల వ్యాధుల గురించి తెలుసుకుని , వాటి నివారణకు ఒక ప్రణాళిక తయారు చెయ్యాలి. ప్లాంటులో పనిచేసేటప్పుడు నిర్వహరణలో వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించి,ముందు జాగ్రత్తలు, నివారణ చర్యలు సూత్రీకరిచుకోవాలి. కంపెని పని నిర్వహరణలో వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన వున్న, పూర్తి సమయం కేటాయించే , పట్టా పొందిన డాక్టర్‌ను నియమించాలి. క్రమం తప్పకుండా, నిర్ణిత సమయాల్లో పనివారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. వారి ఆరోగ్య రికార్డులు నిర్వహించాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాల గురించి, ముందు జాగ్రత్త చర్యలు వారికి సూచించాలి.అవసరమైన సామాగ్రి వారికి అందజేయాలి. అలా తీసుకున్న ఆరోగ్య జాగ్రత్త చర్యల ఫలితాలను ,రెండేళ్ళకొక సారి సమీ క్షించి, అవసరమైతే మరింత చక్కని పర్యవేక్షణ అమలు చేయ వచ్చు. పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ 16.11.09 వ తేదిన చేసిన ఆదేశాల ప్రకారం (వర్షా కాలం వదిలేసి)ఒక పూర్తి సీజన్ కు సంబంధించిన భూ వాతావరణం, జీవజాతులు పిల్చుకునే గాలి స్వచ్చత డేటా అంతా తేదిలతో సహా, పర్యవేక్షించి రికార్డు చెయ్యాలి. A.A.Q. (యాం బి ఎంట్ ఎయిర్ క్వాలిటి )జీవ జాతులు పిల్చుకునే గాలి స్వచ్చత డేటాలో సస్పెండేడ్ పార్టిక్యులేట్ మేటర్, రెస్పిరబుల్ సస్పెండేడ్ పార్టిక్యులేట్ మేటర్(పి.ఎం 10 ,పి.ఎం.2.5),ఎస్.ఒ.2 (SO2),NOX ,Hg,మరియు O3 (భూమి ఉపరితలంపై ) అన్ని కూడా వుండాలి. ఈ పర్యవేక్షణ కేంద్రాలు ఎక్కువ గాలి వాలు వున్న ప్రాంతాలు, జనాభా వున్న ప్రాంతాలు, చుట్టు పక్కల వున్న పల్లెలు, అడవులు లాంటి వాయువులు గ్రహించే సున్నితమైన ప్రాంతాలు –ఇవన్ని దృష్టిలో వుంచుకోవాలి. కనీసం ఒక పర్యవేక్షణ కేంద్రం ఎగువ వైపు వీచే గాలి దిశలో, మరొకటి దిగువ వైపు బలంగా వీచే గాలి దిశలోను ఆయా ప్రాంతాలలో నేల మీద ఎక్కడ ఎక్కువ దట్టంగా చేరే అవకాశం వుందో అక్కడ ఇవి నెలకొల్పాలి. ప్రాజెక్టు స్థాపించబోయే ప్రాంతంలో అప్పటికే వున్న,పెట్టబోయే పరిశ్రమల లిస్టు తాయారు చేసి సమర్పించాలి. రవాణా సమయం తో కలుపుకుని , మొత్తంగా ఈ వెలువడే హానికరమైన వాయువులు, పదార్ధాలు , జీవ జాతి పిల్చే గాలి స్వచ్చతను ఎంత మేర కాలుష్య పరుస్తున్నాయో జాగ్రత్తగా అంచనా వెయ్యాలి.ఏ మోడల్ వాడడం జరిగిందో, నింపిన సమాచారం గురించి వివరాలు తెలపాలి.ఆ ప్రాంత గాలి స్వచ్చత చూపించే మ్యాపులో, ప్రాజెక్టు ప్రాంతం, జనావాస ప్రాంతాలు, కాలుష్య గాలి వలన హాని కలిగే అడవులు లాంటివి గుర్తించాలి. గాలి దిశ, వేగం చూపించాలి. ప్లాంటులో ఉపయోగించే బొగ్గు వలన ఉత్పన్నమయ్యే రేడియో యాక్టి విటి , హెవీ మెటల్స్ వున్న విషయాన్ని పరీక్షించి,మిగిలిన లాబొరేటరి పరీక్షలతో పంపాలి. ఇంధనం గురించిన విశ్లేషణ వివరాలు ఇవ్వాలి. అనుబంధ ఇంధనం ఏదైనా ఉన్నట్లయితే, దాని నాణ్యత, ఎంత కావాలి, దాన్ని ఎక్కడ నిలవ చేస్తారు –ఇవన్ని వివరించాలి. ఇంధనం ఎంత కావాలో,అది లభించే చోటు, దాని లక్షణాలు , క్రమ పద్ధతిలో ఇంధన సరఫరాకు చేసుకున్న ఒప్పందం సమర్పించాలి. ఇంధన సరఫరా పోర్టు నుంచి మొదలుపెట్టి ప్లాంటు వరకు తీసుకురావడంలో గాలి స్వచ్చతలో ఎలాంటి మార్పులు రావచ్చో అంచనా వేసి సమర్పించాలి. ప్లాంటుకు ఇంధన సరఫరా ఎక్కువ దూరం నుంచి తెవాల్సి వస్తే, రైల్వే రవాణా ద్వారా సరఫరా జరిగేటట్లు చూడాలి. ఇంధనం రైల్వే వాగాన్లోకి నింపేటప్పుడు,కన్వేయర్ బెల్ట్ ద్వారా గాని, సిలో నుపయోగించి గాని చెయ్యాలి. బొగ్గు దిగుమతి చేసుకునే ప్రాజెక్టులలో , ప్రాంతీయ రవాణా, పోర్టులో బొగ్గు ఎక్కించడం, దింపడం ,రోలింగ్ స్టాక్స్, రైల్వే రవాణా లాంటి చిక్కు సమస్యలను జాగ్రత్తగా పరీక్షించి వివరాలు సమర్పించాలి. పరిసరాల శుభ్రత, ఇంధనం, విశ్రాంతి గృహాలు,వైద్య సదుపాయాలూ, ప్లాంటు స్థాపించే సమయంలో తగు జాగ్రత్తలు మొదలగు ప్రాధమిక అవసరాలు,ప్లాంటు కట్టుబడి సమయంలో కూలీలకు, ప్లాంటు నడుస్తున్న సమయంలో తాత్కాలిక పని వారికి, ట్రక్కు డ్రైవర్లకు అవసరమైనంత మేర అందించాలి. ఆవివరాలు తెలిజేయాలి. ప్లాంటు వల్లహాని కరమైన ప్రభావం తగ్గించే అవసరమైన చర్యలు, దానికి అయ్యే ఖర్చు నిర్ణిత సమయానికి కార్యాచరణ ఉండేలా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏర్పరుచుకోవాలి. విపత్తులు సంభవించినప్పుడు ఆచరించాల్సిన మేనేజ్మెంట్ ప్లాను(డి సాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్-DMP) , అగ్ని ప్రమాదాలు, ఇంధనం నిలవ చేయడం ,వాడకం వలన పేలుళ్లు లాంటి వాటితో సహా విపత్తులు సంభవించే అవకాశాలను పరిశీలించాలి. ఏ సమయంలో నైనా ప్లాంటులో అధికంగా ఇన్వెంటరి (సరుకు, ఫర్నిచర్ లాంటివి) ఎంతవరకు ఉంచవచ్చో గుర్తించాలి. ప్లాంట్ లే అవుట్ మ్యాపులో ప్రమాద హేతువులు కాదగిన చోట గుర్తులు పెట్టడం వల్ల, ప్రమాదం జరిగినప్పుడు ఏ ఏ పనులు ఆటంకం ఏర్పడ వచ్చో తెలుస్తుంది.దాన్ని బట్టి, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. అగ్ని ప్రమాదాలనుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తాయారు చేసిన డి. ఎం.పి. ప్లానులో సునామీలకు, సైక్లోన్లకు, తుఫానులకు, భూ కంపాలకు వర్తించే అవసర చర్యలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ డి.ఎం.పి.ప్లాను ప్రాజెక్టు ప్రాంతంలోపల, బయట కూడా అవకాశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. జరగే అవకాశమున్న ప్రమాదాలను ఎలా అరికట్టాలో, ఆ కార్యాచరణ ఎవరికి అప్పగించబడిందో వివరించాలి. ప్లాను సంక్షిప్తంగా ఇంగ్లీషులో, ప్రాంతీయ భాషలో తాయారు చెయ్యాలి. ప్లాంటు సరిహద్దులో(అవకాశం లేని ప్రాంతాలలో తప్ప),50 నుండి 100 మీటర్ల వెడల్పున ,మూడు వరసలలో ఆప్రాంతంలో పెరిగే మొక్కలను పెంచాలి. ఇవి ఒక హెక్టారుకు 2000 నుంచి 2500 వరకు దట్టంగా పెరిగే మొక్కలు , నూటికి 80% పెరిగేవిగా వుండాలి. ఇలా చెట్లను పెంచుతున్నట్లు (గ్రీన్ బెల్ట్ )ధ్రువ పరుస్తూ ఫోటోలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సి రేపోర్తులతో సహా సమర్పించాలి. గ్రీన్ బెల్ట్ పైన కార్బన్ వాయువులను పీల్చుకునేందుకుఅడవి కొట్టివేసినప్రాంతమలో అదనపు చెట్ల తోపు పెంచాలి.ఇది జిల్లా అటవీ శాఖ వారి సహకారంతో జరగాలి. దీనికి సంబంధించిన ప్లాను వివరాలు, సమయ పాలనా, బడ్జెట్ తాయారు చేసుకోవాలి. మంత్రిత్వ శాఖకు ఆరు నెలలకొక సారి కార్యాచరణ వివరాలు రిపోర్టు చెయ్యాలి. కార్పోరేట్ పర్యావరణ విధానం కంపెనీకి పద్దతిగా తయారు చేసిన పర్యావరణ విధానం ,డైరెక్టర్ల అనుమతి పొంది వున్నదా? వుంటే, అది ఇ.ఐ.ఏ. రిపోర్టులో వివరించాలి. పర్యావరణ అనుమతి, అటవీ శాఖ వారి నిబంధనలు, షరతులు వదిలి వేయ్యడం కాని, మార్పు చేసుకోవడం కాని, అతిక్రమించడం కాని, బయట పెట్టేందుకు ఈ పర్యావరణ విధానంలో నిర్దేశించిన పద్ధతులు ఏవైనా ఉన్నాయా? వుంటే అవి ఇ.ఐ .ఏ. లో వివరించాలి. పర్యావరణ సమస్యల గురించి, లేక పర్యావరణ అనుమతిలో ఇచ్చిన షరతులను పాటించే విషయంలోగాని, కంపెనీలో పై అధికారుల విధానంలేక, ఆదేశం ఏమిటి? వివరాలు ఇవ్వాలి. పర్యావరణ నిబంధనలు పాటించకపోయినా, అతిక్రమించినా, డైరెక్టర్లకు, షేర్ హోల్డర్లకు/పెట్టుబడి దార్లకు రిపోర్టు చేసే పద్ధతి వున్నదా?ఆ రిపోర్టింగ్ విధానం ఇ.ఐ.ఏ. రిపోర్టులో వివరించండి. పైన సూచించిన వివరాలు అన్నీ సమగ్రంగా ఇ.ఐ.ఏ. రిపోర్టులో చూపించాలి. అలాగే కమిటిలో చెప్పాలి. ప్రాజెక్టుకు సంబంధించి ఏ కోర్టులో నైనా,లేదా ట్రిబ్యునల్ లో అయినా కేసు నడుస్తున్నట్లయితే,ఆ వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి. తీరప్రాంతంలో నెలకొల్పే ప్రాజెక్టులకు అదనపు విధివిధానాలు పైన ఇచ్చిన షరతులతో పాటు, తీర ప్రాంతంలో నెలకొల్పే ప్రాజెక్టుల విషయంలో ఈ కింది వాటిని కూడా పాటించాల్సి వుంది : రాంసర్ ప్రతినిధుల సమావేశంలో నిర్ణయించిన లక్షణాలు పల్లపు ప్రాంతాలలో కనబడితే మాగాణి నేలలుగా గుర్తించి, ప్రాజెక్టు ప్రాంతానికి, ఆ భూములకు స్పష్టమైన సరిహద్దులు ఏర్పరచుకోవాలి. ప్రాజెక్టు ప్రాంతం బురద నేలలో వున్నాదగ్గరలో వున్నా, బాక్ వాటర్స్ ప్రాంతం దగ్గరలో వున్నా, ప్రాజెక్టు స్థలం నుంచి అవి మినహాయించాలి. తీర ప్రాంత నిబంధనల ననుసరించి, ప్రాజెక్టు సరిహద్దు ఇలాంటి వాటికి దూరంగా వుండాలి. సి.ఆర్.జెడ్ వారి సర్టిఫై చేసిన మ్యాపు కుడా జత చెయ్యాలి. నేల చదును చెయ్యడం గాని, ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా చెయ్యడంలో కాని, అప్పటికే సహజంగా వున్న డ్రైనేజి సిస్టం కు ఎటువంటి సమస్యా రాకుండా చూడాలి. ఒక వేళ, చిన్న కాలువల త్రోవ మార్చాల్సి వస్తే,ప్లాంటు ప్రాంతంలోను, చుట్టుపక్కలా చేరే వరద నీటిని, బురద నేలలలోకి గాని, లేదా పెద్ద కాలవలోకి గాని ప్రవహించేటట్లు, అక్కడినుంచి ఈ వరద నీరు సముద్రంలోకి చేరే విధంగా ఏర్పాటు చెయ్యాలి. ప్లాంటు స్థలాని ఎత్తు పెంచడానికి గాని, మరొక దాని కోసంగాని, అదనంగా మట్టి కావాల్సి వస్తే, ఆ మట్టిని ప్లాంటు ప్రాంతాల నుంఛి, ఉన్న డ్రైనేజ్ సిస్టం దెబ్బతినకుండా తీసుకోవాలి. బురద నేలలలో ఎక్కువ వరద నీరు వచ్చి చేరుతుంది కనుక వాటిని ప్లాంటు కోసం ఏ రకంగాను ఉపయోగించరాదు. ఏ రకమైన వ్యర్ధాలు కూడా, కాలుష్య నియంత్రణ చేయకుండా కాలువలలోకి గాని, బురద నేలలలోకి గాని, నదు ల్లోకి గాని, సముద్రంలోకి గాని వదిలివేయరాదు. ప్రాజెక్టు ప్రాంతాలలో మాంగ్రోవ్ తోపు లు వుంటే, వాటి రక్షణకు, మళ్ళీ పెరుగుదలకు నిర్ణీత కాలంలో అమలు చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాను తయారుచెయ్యాలి. ప్రాజెక్టు అభ్యర్ధి పర్యావరణ మేనేజ్మెంట్ ప్రణాళిక బడ్జెట్ లో భాగంగా,గ్రీన్ ఎండోవ్ మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఫండ్ లో వచ్చే వడ్డీతో ప్లాంటు ప్రాంతం అంతా చెట్లు నాటి , పచ్చదనాన్ని పెంచాలి. సామాజిక ఆర్ధిక రంగాలలో మత్స్య సంపద, మత్స్యకారులపై ప్లాంటు యొక్క ప్రభావం అంచనా వెయ్యాలి. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద గ్రాంట్ చేసిన మొత్తంలోంచి, మత్స్యకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవాలి. అది మత్స్యకారులకు అవసరమైన ఫిష్ లాండింగ్ ఫ్లాట్‌ఫా రాలు,ఫిష్ హార్బర్లు,కోల్డు స్తోరేజిలు ఏర్పాటు చేసి వారి జీవన స్థాయిని పెంచేందుకుకృషి చెయ్యాలి. అల్లకల్లోలంగా వున్న సముద్రంపై ప్రయాణిస్తున్నవారు,ఉష్ణ మండల తుఫాన్లలో చిక్కుకున్న వారు, వగైరా అత్యవసర సమయాల్లో, వాళ్ళకు సహాయం చెయ్యాలి. ప్లాంటు కట్టుబడి పని మొదలుపెట్టే ముందే,సునామీ లాంటి ప్రమాద పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు చేసే ప్రణాళిక సిద్ధంచేసి సమర్పించాలి. ప్రాజెక్టు ప్రాంతాలలో వున్న కాలువలు,చిన్న నీటి కయ్యలు, చెరువులలో నీరు, నేల ఇవేవి సముద్రంలోకి పంపే వ్యర్ధా జలాల వల్లకలుషిత కాకూడదు. పైపులైన్ల నుంచి లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే వ్యర్ధ జాలాలు సముద్రంలోకి చేరే ముందు గార్డు పాండ్స్ లోకి వస్తాయి. వీటి లైనింగ్ తో లీకేజీ అరికట్టవచ్చు. అలాగే నీరు లోపలి తెచ్చేవి, వ్యర్ధాలు వదిలేసే నీటి పైపుల అనుసరించి వుండే ఆర్.సి.సి. కట్టుబడులకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్లాంటు సరిహద్దుల అవతల అంతా పంట పొలాలు. పర్యావరణ ప్రభావ అంచనా పత్రం(E.I.A.) మరియు ఎగ్జిక్యూటివ్ సంగ్రహ సమాచారం పర్యావరణ ప్రభావ అంచనా నిర్మాణం వివరాలు ఉపోద్ఘాతం ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ప్రాజెక్ట్ గుర్తింపు, ప్రాజెక్ట్ నిర్వహించువాని వివరాలు ప్రాజెక్ట్ గురి౦చినవివరణ - స్వభావం, పరిధి, ప్రాంతం, దేశానికి , ప్రాంతానికి దాని ప్రాముఖ్యం ఈ ప్రాజెక్ట్ గురించి ఏ మేర పరిశీలన అవకాశం( టి.ఒ.ఆర్ ప్రకారం) ప్రాజెక్ట్ వివరణ ఈ ప్రాజెక్ట్ పర్యావరణ౦లో మార్పులు కలగజేసే అవకాశం వున్న అంశాలపై వివరణ . స్పష్టమైన వివరాలతో కూడిన నిర్ధారణ ప్రాజెక్ట్ టైప్ అవసరం ప్రాంతం (మ్యాపులో ప్రాజెక్ట్ నెలకొల్పే ప్రాంతం సరిహద్దులు, సైట్ లే అవుట్ ) నిర్వహణ పరిధి అంగీకారం, అమలుకి సమర్పించిన షెడ్యూల్ సాంకేతికత , జరిగే తీరు ప్రాజెక్ట్ వర్ణన ( బొమ్మలతో , లే అవుట్లతో కూడిన వివరాలు) స్కీము ప్రకారం సమర్పి౦చిన ప్రాజెక్టు వివరాలు ( పర్యావరణ ప్రభావ అంచనా కు అవసరమైన వివరాలను ఇవ్వగల డ్రాయింగులు ) పరిహార చర్యలు (పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ఉండాలు,మరియు ఇ.ఐ.ఏ.కు అవసరమైనవి) కొత్త టెక్నాలజీ గురించి అంచనా ( తదనంతరం సమస్య లేకుండా ) పర్యావరణ అంచనా వివరాలు స్టడీ ఏరియా సమయం అంశాలు, విధానం బేస్ లైన్ స్థిరపరచుట ( గుర్తించినముఖ్య పర్యావరణ అంశాలు ) పర్యావరణ అంశాలతో కూడిన బేస్ మ్యాప్స్ ఊహించిన పర్యావరణ ఫలితాలు మరియు పరిహార చర్యలు పరిశోధనల ఫలితంగా తెలుసుకున్న పర్యావరణ వివరాలు : ప్రాతం డిజైన్ నిర్మాణం క్రమబద్ధమైన నిర్వహణ ఫైనల్ గా కూలగోట్టుట,పునరావాసం ( పూర్తి ప్రాజెక్ట్ పరిధిలో ) గుర్తించిన దుష్ఫలితాల్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు పర్యావరణ భద్రత విషయంలో రాజీలేని నిబద్ధత ఫలితాల ప్రాముఖ్యత గురించిన అంచనా నష్టాలు పూరించే పరిహార చర్యలు ప్రత్యామ్నాయ విధానాల విశ్లేషణ (సాంకేతికమైనవి,ప్లాంటు స్థలానికి సంబంధించినవి ) అన్నిటి ప్రత్యామ్నాయ వివరాలు ( ప్రత్యామ్నాయ విధానాల అవసరం వుంటే ) వివరణ దుష్ఫలితాల వివరణ తలపెట్టిన పరిహార చర్యలు ప్రత్యామ్నాయాల ఎంపిక పర్యావరణ మానిటరింగ్ ప్రోగ్రామ్ చేపట్టిన పరిహార చర్యల ఉపయోగాల్ని సాంకేతికంగా పర్యవేక్షించడం లో విధానాలు కొలిచి చూడడం ఫ్రీక్వెన్సీ ప్రాంతం డేటా విశ్లేషణ షెడ్యూల్ రిపోర్టు చెయ్యడం అత్యవసర పద్ధతులు వివరణాత్మకమయిన బడ్జెట్ సేకరించిన షెడ్యూల్స్ అదనపు స్టడీ పబ్లిక్ కన్సల్టేషన్ రిస్క్ అంచనా సామాజిక ఫలితాల అంచనా ప్రాజెక్ట్ ప్రయోజనాలు మౌలిక , సామాజిక అభివృద్ధిలో మెరుగుదల ఉపాధి అవకాశాల పెరుగుదల(స్కిల్డ్,సెమి స్కిల్డ్,అ న్ స్కిల్డ్) ఇతర స్పష్టమైన ప్రయోజనాలు పర్యావరణ కాస్ట్ బెనిఫిట్ విశ్లేషణ విస్తృత పరిధిలో సిఫారసు చేసినప్పుడు పర్యావరణ మేనేజ్మెంట్ ప్లాను ఇ.ఐ.ఏ. అనుమతి లభించాక, పరిహార చర్యలకార్యాచరణ, పర్యవేక్షణ గురించి కార్యనిర్వహణ అంశాల వివరాలు . సారా౦శం మరియు ముగింపు (ఇది పర్యావరణ ప్రభావ అంచనా రిపోర్టు సంగ్రహమై వుండాలి .) ప్రాజెక్ట్ అమలుచెయ్యడంలో పూర్తి నిబద్ధత దుష్పలితాలు / నష్టాలను పూరించే చర్యల వివరణ ఈ ప్రాజెక్ట్ లో వున్న కన్సల్టేంట్స్ వివరణ కన్సల్టెంట్స్ వివరాలు; పేరు బయోడేటా కన్సల్టెన్సీ స్వభావం పర్యావరణ ప్రభావ అంచనా కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సమ్మరి వివరాలు ఇ.ఐ. ఏ. ఎగ్జిక్యుటివ్ సమ్మరి రిపోర్టు ఇ.ఐ .ఏ. పూర్తిఈ సారాంశం తో కూడిన రిపోర్టు అయి వుండాలి. 10 A 4 సైజు పేజీల దాటకుండా కుదించవచ్చు. ఇ.ఐ .ఏ. పూర్తి రిపోర్ట్ లోని ఈ క్రింది చాప్టర్ల గురించి క్లుప్తంగా వర్ణించి వుండాలి. ప్రాజెక్ట్ వివరణ పర్యావరణ౦ తాలూకు విశ్లేషణ భవిష్యత్తులో రాగల పర్యావరణ మార్పులు మరియు అవసరమయిన పరిహార చర్యలు పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రాం అదనపు పరిశోధనలు ప్రాజెక్ట్ ప్రయోజనాలు పర్యావరణ నిర్వహణ తాలూకు ప్లాన్ ఆధారము: థర్మల్ వాచ్