పది వేల గ్రామాల విద్యూదీకరణ 11 వ వార్షిక ప్రణాళికలో 60 సౌరశక్తి నగరాలు దేశంలో సౌరశక్తి నగరాలుగా అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమము ప్రారంభించబడింది. మహారాష్ట్రలో ఉన్న నాగపూర్ మనదేశంలో మొట్టమొదటి సౌరశక్తి నగరం అవుతుంది. కేంద్ర నూతన మరియు తరగని ఇంధన వనరుల మంత్రిత్వశాఖ 11 వ వార్షిక ప్రణాళికతో 60 అటువంటి సౌరశక్తి నగరాలుగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో ఒకటి చొప్పున లేక 5 నగరాల వరకు ప్రతి రాష్ట్రంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతిపాదించబడ్డాయి. నగరాలకు అవసరమైన అత్యధిక విద్యత్ చ్ఛక్తి అవసరాలను తట్టుకోవడానికి, శిలాజపు ఇంధనాలు మరియు ఖరీదైన ఇంధన మరియు వాయు ఇంధనములు మీద ఆధారపడటాన్ని తగ్గిస్తూ తరగని ఇంధన మరియు ఇంధనవనరులను ఎక్కువగా ఉపయోగించుకొనుటకు ఎక్కువ ప్రోత్సాహమిస్తూ ఈ స్కీము అభివృద్ధి చేయబడింది. నాగపూర్ 2012 నాటికి ఒక నమూనా సౌరశక్తి నగరంగా ఈ స్కీములో చేయబడుతుంది నగర విద్యుత్ శక్తి వినియోగంలో 10% వరకు తరగని ఇంధన వనరుల ద్వారా మరియు ఇంధన పొదుపు చర్యల ద్వారా పొందటాన్ని లక్ష్యంగా నిర్ధేశింపబడింది. ఇతర నగరాల్ని సౌరశక్తి నగరాలుగా అభివృద్ధి చేయడానికి నమూనా నగరాలుగా రెండు నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్రముల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ రెండింటిని నమూనా సౌరశక్తి నగరాలుగా చేయడానికి ఈ స్కీములో బృహత్తర ప్రణాళికగా అమలు చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక్కొక్క నమూనా నగరానికి 9.50 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ సాయం, అయిన ఖర్చులో 50% భాగం వాటాగా సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ / నగరపరిపాలన విభాగం / రాష్ట్ర ప్రభుత్వాలు భరించవలసి ఉంటుంది. తమిళనాడులోని రెండు జిల్లాలలో సి.ఎఫ్.ఎల్ సౌకర్యం పొందనున్న 9 లక్షల మంది వినియోగదారులు విద్యుత్ పొదుపు ప్రణాళిక (బి.ఎల్.వై.) క్రింద కడలూరు మరియు విల్లుపురం జిల్లాలలోని సుమారు 9 లక్షల మంది గృహ వినియోగదారులకు ప్రయోజనం కలగనున్నది. ఇంధన వినియోగంలో సామర్ధ్యం పెంపొందించే పధకంలో భాగంగా వీరికి అధిక వ్యయమయ్యే సాధారణ బల్బుల స్థానంలో ఇమడ్చబడిన మేలైన ఫ్లోరోసెంట్ దీపాలను (సి.ఎఫ్.ఎల్) సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పధకం క్రింద ప్రతి వినియోగదారుడు ఒక్కొక్క ఫ్లోరోసెంట్ దీపానికి రూ. 15/- చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 1.3 లక్షల వినియోగదారులకు - అంటే 60 శాతం మందికి ప్రయోజనం చేకూర్చడం ఈ పధకం యొక్క ఉద్దేశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ మండలి నిర్వహించిన ఒక నివేదిక ప్రకారం, గృహ వినియోగదారుల వాడకం మొత్తం వినియోగించబడే విద్యుచ్ఛక్తిలో 30 శాతం పైగా ఉందని తెలిసింది. ఈ నూతన పధకం ప్రకారం, 60 వాట్లు మరియు 100 వాట్ల సాధారణ బల్బుల స్థానంలో 11-15 వాట్లు మరియు 20-25 వాట్లు సామర్ధ్యం గల ఫ్లోరోసెంట్ దీపాలను అమర్చడం జరుగుతుంది. ఇక జాతీయ స్థాయిలో, ఇంధన సామర్ధ్యాభివృధ్ధి సంస్థ ఈ పధకం క్రింద విద్యుత్తుని ఉపయోగించే గృహవినియోగదారులందరికీ రూ.15/- కే ఒక్కొక్క శక్తివంతమైన ఫ్లోరోసెంట్ దీపాన్ని అందజేస్తూ స్వచ్ఛంద కార్యకలాపాలనన్నింటిని సమన్వయ పరుస్తున్నది. సాధారణ బల్బుకు మార్కెట్లో ఉన్న ధర లోనే ఈ ఫ్లోరోసెంట్ దీపాన్ని సరఫరా చేయటం గమనించ తగినది. ఈ రోజున ఒక ఫ్లోరోసెంట్ దీపాన్ని బజారులో కొనాలంటే సుమారు రూ.80/- నుండి 100/- వరకూ ఖర్చవుతుంది. వీటిని రాయితీ యివ్వడం ద్వారా తక్కువ ధరకే అందుబాటులో ఉంచటం వలన, ప్రతి ఇంటికీ ఫ్లోరోసెంట్ దీపం అందించాలన్న లక్ష్యానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. దేశంలో 400 మిలియన్ల మమూలు బల్బుల స్థానంలో ఫ్లోరోసెంట్ దీపాల్ని అమర్చడం ఈ పథకం యొక్క ప్రధానోద్దేశం. తద్వారా ప్రతి సంవత్సరం విద్యుచ్ఛక్తికి ఉన్న గిరాకీలో 10000 ల మెగావాట్ల వరకూ తగ్గించడం మరియూ 24 మిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సయిడ్ విషవాయువును నిరోధించడం అనే లక్ష్యాలు నెరవేరతాయి. ఆధారము: http://www.hindu.com ప్రత్యేక కేటగిరి రాష్ట్రాలు ప్రతి సోలారు లాంతరు కు రూ. 2400 సబ్సిడీ పొందవచ్చు ప్రత్యేక రాష్ట్రాలలో దారిధ్ర్య రేఖకు దిగువన ఉన్న, పాఠశాలకు వెళుతున్న బాలికలు సోలారు లాంతరును పొందవచ్చు.కొత్త మరియు సహజ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వారు ప్రత్యేక కేటగిరి రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, దీవులలో విధ్యుద్ధీకరించని గ్రామాలకు సోలారు లాంతరును పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సోలారు లాంతరులో కాంపాక్టు ప్లోరోసెంట్ బల్బు ను కాంతివనరుగా వాడుతున్నారు. సోలారు లాంతరు ఖరీదు సుమారు రూ. 3500 లు. మంత్రిత్వ శాఖ వారు రూ.2400 లు సబ్సిడీ గా అందిస్తున్నారు. అదనంగా దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న బాలికలు పైన చెప్పిన రాష్ట్రాలలో తొమ్మిది నుండి ఇంటర్మీడియట్ లోపు చదువుతున్నవారయితే వారు కూడా ఉచితంగా ఒక సోలార్ లాంతరును పొందవచ్చు.సోలారు లాంతరు ఖరీదును తగ్గించడానికి మంత్రిత్వ శాఖ వారు కాంపాక్ట్ ప్లోరోసెంట్ బల్బు బదులుగా వైట్ లైట్ ఎమిటింగ్ డియోడ్ అనే బల్బును వాడాలనుకుంటున్నారు. ఆధారం - http://www.pib.nic.in/release/release.asp?relid=43903 సోలార్ మరియు బయో ఇంధన శక్తి ద్వారా గ్రామాల విద్యుధ్ధీకరణ కొత్త, సహజ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వారు విద్యుత్ అందుబాటులేని, అర్హత కల్గిన, జనాభా లెక్కలలో ఉన్న గ్రామాలు, కుగ్రామాలలో సోలార్ శక్తి లేదా సహజ ఇంధన వనరుల ద్వారా కనీస విద్యుత్, వీధి దీపాలు సౌకర్యాలను కల్పించడానికి రిమోట్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. 2008-09 సంవత్సరానికి ఈ క్రింది పేర్కొన్న అర్హతలు ఆధారంగా గ్రామాలు, కుగ్రామాలను ఎంపిక చేస్తారు. జనాభా లెక్కలలో ఉండి రాజీవ్ గాందీ గ్రామీణ విద్యుద్ధీకరణ యోజన లో భాగంగా గ్రిడ్ అనుసంధానం అందుబాటులో లేకపోవడం వల్ల లబ్ధిపొందని గ్రామాలు 100 జనాభా తక్కువ కాకుండా విద్యుద్ధీకరణ లేని అన్ని కుగ్రామాలు మరియు జిల్లాలలో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ యోజన పేజ్-1 లో ఆర్.ఇ.సి. క్రింద లబ్ది పొందని 100 కంటే ఎక్కువ 300 కంటే తక్కువ ఉన్న జనాభా గల కుగ్రామాలు దేశంలో 6680 గ్రామాలను గుర్తించారు. ఇందులో జనాభా లెక్కలలో ఉన్న 417 గ్రామాలు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవి. కేంద్ర ఆర్థిక సహాయం 8719 గ్రామాలకు నిధులు మంజూరు చేసినది. 2008-09 సంవత్సరానికి గానూ 1500 గ్రామాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజస్థాన్ లో మంత్రిత్వ శాఖ ఆర్ధిక సహాయంతో గుర్తించిన 417 గ్రామాలలో 292 గ్రామాలు రాష్ట్ర అమలు సంస్థ విద్యుధ్దీకరంచినది. మిగతా 125 గ్రామాలకు సంబంధించి ప్రపోజ్ చేయలేదు. అవి ఇప్పటికే విద్యుద్దీకరణ అయినదా లేదా ప్రజలు వలస వెళ్లారా తెలియాల్సి ఉంది. 1986 గ్రామాలకు చెందిన గృహాలలో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు 90 శాతం ఖర్చును కేంద్ర ఆర్థిక సహాయం ఆమోదించినది. ఈ పధకాలను అమలు చేయడానికి రాష్ట్రాలలో రాష్ట్ర అమలు సంస్థలను గుర్తించారు ఉదాహరణకు అసోం ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ, అసోం స్టేట్ ఎలక్ట్రిసిటి బోర్డు, రాష్ట్ర అటవీ శాఖ. బయోగ్యాస్ ద్వారా గ్రామాలను విద్యుద్ధీకరించడానికి రాష్ట్రాలనుండి ఎటువంటి ప్రపోజల్స్ అందలేదు. బార్పేట, కోక్రాజ్ హర్, బోంగాయ్ గాన్ జిల్లాలోని , కొత్త జిల్లా చిరాంగ్ కాకుండా 92 గ్రామాలకు ఆర్ధిక సహాయం ఆమోదం లభించినది. రాష్ట్ర అమలు సంస్థల నుండి నల్బరి జిల్లాలోని గ్రామాలకు సహాయం కోరుతూ ఎటువంటి ప్రపోజల్స్ అందలేదు. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=43913 104 కు చేరిన ఆధిత్యా సోలార్ షాపులు 16 రాష్ట్రాలలో 165 అక్షయ ఇంధన షాపులు కొత్త, సహజ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వారు ముందు పధకంలో భాగంగా దేశంలో మొత్తం 104 ఆదిత్యా సోలార్ షాపులను ఏర్పాటు చేసినది. ఇదే పధకాన్ని ప్రభుత్వం మార్పులు,చేర్పులు చేసి కొత్త పధకం కింద అక్షయ సోలారు షాపులను (అక్షయ ఉర్జా షాపు) ఏర్పాటు చేసినది. ఈ మార్పు చేసిన పధకం యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రతి జిల్లాలో ఒక షాపు ఏర్పాటు చేయడం. 16 రాష్ట్రాలలో 165 అక్షయ ఉర్జా షాపులను ఆమోదించారు. షాపును ప్రారంభించడానికి అవసరమైన పైనాన్స్ ను 10 లక్షల రూపాయలను ఏడు శాతం వడ్డీ రేటుతో అప్పును ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాకుండా కొన్ని నిబంధనలతో కొంత రికరింగ్ నిధిని మరియు రెండు సంవత్సరాల పాటు నెలకు పదివేల రూపాయలు –ప్రోత్సాహం అందిస్తారు ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=43900 రాష్ట్రాలు- సౌర శక్తి ని వినియోగించండి కేంద్ర కొత్త, సహజ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ వారు కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సౌరశక్తి ని వినియోగించుకోమని, తమ కార్యలయాలలో దానికి సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. అదేవిధముగా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలను కూడా తమ స్థానిక సంస్థలు వాటి భవనాలను ఆధునికరించుకునేటప్పుడు అందులో సౌరశక్తి పరికరాలు అమర్చుకోవడం తప్పనిసరి చేయాలని కోరింది. దీని కోసం బిల్డింగ్ బైలాస్ లో నిభంధన పెట్టాలని కోరింది. దీని ఆధారంగా 18 రాష్ట్రాలలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. 7 రాష్ట్రాలలోని 26 మున్సిపల్ కార్పోరేషన్లు, డెవలప్ మెంట్ ఆధారిటీలు తమ బిల్డింగ్ బైలాస్ లో దిద్దుబాటు చేశారు.సౌరశక్తిని ప్రవేట్ రంగంలో ప్రోత్సహించడానికి, మంత్రిత్వ శాఖ వివిధ పధకాలను, ఆర్థిక ప్రోత్సహాకాలను అందిస్తుంది. ఈ క్రింది పేర్కొన్న విధముగా ప్రభుత్వం సబ్సిడీ, సహాయ కార్యక్రమాలు ప్రవేట్ రంగానికి అందిస్తుంది. సౌర శక్తి ద్వారా నీటిని వేడి చేసే పరికరాలను తయారు చేసేవారికి వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుదల కోసం ఇరెడా ద్వారా ఐదు శాతం వడ్డీతో అప్పును అందిస్తున్నారు. సోలార్ ధర్మల్ ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుతు కిలో వాటుకు రూ.10 ల వరకు, సోలార్ పోటోవోల్టిక్ పవర్ ప్లాంట్స్ సామర్ధ్యం ఒక మెగావాట్ మరియు పైన రూ.12 లు పరిశ్రమలు సౌరశక్తి పై పరిశోధనా పధకాల కొరకు 50 శాతం రాయితీ ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=43898 సౌరశక్తితో 8000 గ్రామాలు, కుగ్రామాలు మన దేశము భూమి ప్రాంతములో ఐదు ట్రిలియన్ కిలోవాట్ హవర్స్ సౌరశక్తి జనిస్తుంది. దేశంలో సౌరశక్తిని ప్రోత్సహించడానికి కొత్త, సహజఇంధన వనరుల మంత్రిత్వ శాఖ పధకాలను అమలు చేస్తుంది. దేశం మొత్తం మీద 70,500 వీధి సౌర దీపాలు, 4.04 లక్షల గృహ సౌర దీపాలు, 6.7 లక్షల సౌరశక్తి లాంతర్లు, 7148 సౌర శక్తితో నడిచే పంపు సెట్లు, 6.2 లక్షల సోలార్ కుక్కర్లు ఏర్పాటు చేశారు. అదనంగా 8000 గ్రామాలకు, కుగ్రామాలను సౌరశక్తితో విద్యుద్దీకరించడం జరిగింది. జాతీయ వాతావరణ మార్పుల కార్యాచరణ ప్రణాళిక లో సౌరశక్తిని అభివృద్ధి చేయడానికి సోలార్ మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సోలారు మిషనుకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=44190 సహజ వనరుల ఇంధన పధకాలకు ఇరెడా ఋణాలు భారతీయ సహజవనరుల శక్తి అభివృద్ధి సంస్థ ( ఐఆర్‌ఇడిఏ- ఇరెడా) 2005-08 సంవత్సరాల కాలంలో 17 రాష్ట్రాలకు సహజ శక్తి వనరుల పధకాలను అందించారు. ఆరు సంవత్సరాల కాలంలో 160 కోట్ల రూపాయలను ఈ పధకాల కోసం వెచ్చించారు. సహజవనరుల శక్తి, ఇంధన సంరక్షణ పధకాలకు అర్హులైన ప్రోత్సాహికులకు, అభివృద్దిని కాక్షించే వారికి ఋణాలను అందిస్తున్నారు. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఋణాలను అందించడం లేదు. గత మూడు సంవత్సరాలలో (2005-06, 2006-07, 2007-08 మరియు 2008-09 –సెప్టెంబరు 2008 వరకు) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా ప్రోత్సాహికులకు, అభివృద్దినికాక్షించే వారికి ఇరెడా ఇచ్చిన ఋణాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సంవత్సరము 2005-06 2006-07 2007-08 2008-09(*) క్రమ సంఖ్య రాష్ట్రం 1 ఆంధ్రప్రదేశ్ 37.49 6.01 25.21 8.34 2 ఛత్తీష్ గడ్ 35.72 21.56 0.00 0.00 3 గోవా 0.00 0.00 0.13 0.00 4 గుజరాత్ 0.00 3.99 77.75 0.00 5 హర్యానా 0.40 0.00 0.00 0.00 6 హిమాచల్ ప్రదేశ్ 27.30 37.74 46.99 1.03 7 కర్ణాటక 115.87 86.69 118.00 76.25 8 మధ్యప్రదేశ్ 0.65 0.87 0.00 20.79 9 మహారాష్ట్ర 26.04 162.45 137.41 7.09 10 నాగాలాండ్ 0.04 0.07 0.00 0.00 11 ఒరిస్సా 28.37 31.75 14.22 3.02 12 పంజాబ్ 4.13 0.51 0.00 0.00 13 రాజస్థాన్ 2.34 41.14 1.00 6.00 14 తమిళనాడు 20.19 17.15 17.30 1.80 15 ఉత్తరప్రదేశ్ 0.44 0.40 68.30 0.00 16 ఉత్తరాఖంఢ్ 0.00 0.00 46.79 36.57 17 పశ్చిమ బెంగాల్ 3.53 0.54 0.54 0.00 మొత్తం 302.51 410.87 553.64 160.89 ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=44191 పదకొండవ పంచవర్ష ప్రణాళిక – గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య లక్ష్యం 2007-2012 పదకుండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో గాలిమరల ద్వారా 10,500 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశం మొత్తం మీద సెప్టెంబర్ 5, 2008 నాటికి ఏర్పాటు చేయబడిన గాలిమరల విద్యుత్ సామర్థ్యం 2007-08 లోని 1663 మెగావాట్ల సామర్థ్యం కలుపుకుని మొత్తం 9522 మెగావాట్లు.వ్యాపార గాలి మరల విద్యుత్ ప్రాజెక్టులను ప్రవేట్ సెక్టారు ద్వారా దేశంలో అనుకూల ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేటట్టు భారత ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటుంది. గాలి మరల విద్యుతు పధకాలకు గ్రిడ్ అనుసంధానం చేయడానికి ఈశాన్య రాష్ట్రాలలో అనుకూల ప్రాంతాలను గుర్తించలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహాకాలను ప్రకటించినది. ఈశాన్య రాష్ట్రాలలో అనుకూల పరిస్థితులను అధ్యయనం చేసి ప్రదేశాలను గుర్తించడానికి మంత్రిత్వ శాఖ చెన్నై లోని వైండ్ ఎనర్జీ టెక్నాలజీ కేంద్రానికి అప్పగించారు. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=43901 225 కిలోవాట్ల నుండి 1650 కిలోవాట్లకు గాలిమరల సామర్థ్యం సెప్టెంబరు 2008 నాటికి దేశం మొత్తం మీద 9522 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం జరిగింది. రాష్ట్రాలవారీగా సామర్థ్యం ఈ క్రింది విధంగా ఉంది క్రమ సంఖ్యSl. No. రాష్ట్రం సామర్థ్యం (30.09.2008 నాటికి) (మె.వా.) 1. ఆంధ్రప్రదేశ్ 122.50 2. గుజరాత్ 1414.70 3. కర్ణాటక 1164.10 4. కేరళ 18.00 5. మధ్య ప్రదేశ్ 187.70 6. మహారాష్ట్ర 1823.90 7. రాజస్థాన్ 671.00 8. తమిళనాడు 4115.80 9. పశ్చిమ బెంగాల్ 1.10 10. ఒరిస్సా 3.20 మొత్తం 9521.80 పదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో గాలిమరల ద్వారా వచ్చే విద్యుత్ 5456 మెగావాట్లయితే పదకొండవ పంచవర్ష ప్రణాళికలో అదనపు సామర్థ్యపు లక్ష్యం 10,500 మెగావాట్లు. ఈ రెండింటిని మనము ఇక్కడ పోల్చవచ్చు. దేశంలో 225 కిలోవాట్ల నుండి 1650 ఉత్పత్తి సామర్థ్యం గల టర్బిన్స్ ఏర్పాటు చేశారు. 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో 216 ప్రదేశాలను టర్బిన్స్ ను ఏర్పాటు చేయుటకు అనుకూల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ప్రదేశాలుగా గుర్తించారు. మూడు రాష్ట్రాలలో కొత్తగా ఐదు ప్రదేశాలను గుర్తించారు. ఈ క్రింద పట్టిక రాష్ట్రాలవారీగా అనుకూల వాతావరణ ప్రదేశాలుగా గుర్తించినవి ఎన్ని న్నాయో తెలియజేస్తుంది. క్రమ సంఖ్య రాష్ట్రం అనుకూల వాతావరణ ప్రదేశాలు గుర్తించినవి 2005-08 సంవత్సరాల మధ్య కొత్తగా గుర్తించిన ప్రదేశాల సంఖ్య 1 తమిళనాడు 41 - 2 కేరళ 17 1 3 కర్ణాటక 26 1 4 ఆంధ్రప్రదేశ్ 32 - 5 మహారాష్ట్ర 31 3 6 మధ్య ప్రదేశ్ 7 - 7 గుజరాత్ 38 - 8 రాజస్థాన్ 7 - 9 ఉత్తరాఖంఢ్ 1 - 10 ఒరిస్సా 6 - 11 పశ్చిమ బెంగాల్ 1 - 12 అండమాన్ నికోబార్ దీవులు 1 - 13 లక్ష్యద్వీప్ 8 - మొత్తం 216 5 ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=44245 3ఏళ్లలో 2వేల కోట్ల రూపాయలతో 10వేల సుదూర గ్రామాల విద్యుద్ధీకరణ - శ్రీ విలాస్ ముత్తెంవర్ 2వేల కోట్ల రూపాయలతో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్థీకరణ యోజన కింద ............... 2వేల కోట్ల రూపాయలతో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్థీకరణ యోజన కింద పల్లెటూర్లతో సహా 10వేల సుదూర గ్రామాల విద్యుదీకరణని చేపడతామని సంప్రదాయక శక్తివనరుల శాఖ మంత్రి శ్రీ విలాస్ ముత్తెంవర్ ప్రకటించారు. రాబోయే 3ఏళ్లలో విద్యుదీకరణని పూర్తిచేసి దాదాపు ఒక మిలియన్ గ్రామీణ గృహాల్లో విద్యుత్ దీపాలు వెలిగిస్తామని మంత్రి ప్రకటించారు. గ్రామీణ భారతానికోసం పనిచేసే ఎన్జిఓల సమాఖ్య(సిఎన్‌ఆర్‌ఐ) జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యాన్నీ, యుపీఏ ప్రభుత్వంలో దానికిచ్చిన ప్రముఖ పాత్రనీ ఆయన నొక్కి వక్కాణించారు. భారత్ నిర్మాణ్ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాథ మిక వనరులను పటిష్ట పరిచేందుకై దాదాపు 1,74,000 కోట్ల రూపాయల కేటాయింపు చేయడం జరిగింది . దానిలో భాగంగానే సుదూర గ్రామాల విద్యుదీకరణని చేపట్టడం జరుగుతోంది . ఈ సుదూర గ్రామాల విద్యుదీకరణలో పంచాయితీలూ, ఇతర సేవాసంస్థలు ఎంతో ప్రముఖ పాత్రనిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తించి తమవంతు పూర్తి సహకారాన్నీ అందించాలని కూడా ఆయన చెప్పారు. అన్ని రకాల పద్ధతులను వాడుకొనే శక్తివనరుల కార్యక్రమాలను చక్కగా అమలు చేయడానికి జిల్లాలవారీగా సలహా కమిటీలను తమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిందనీ వాటిలో సేవాసంస్థలకు ప్రాముఖ్యతనివ్వడం జరుగుతోందని కూడా ఆయన తెలిపారు. ఆధారము: www.mnes.nic.in తియ్యటి జొన్ననుంచి ఇథనాల్ ఉత్పత్తిని ఆరంభించిన ఇండియా దేశంలోనే మొదటిసారిగా బహుళసాధక వర్షాధార పంట అంటే తియ్యటి జొన్న. ఈ జొన్న నుంచి .................. దేశంలోనే మొదటిసారిగా బహుళసాధక వర్షాధార పంట అంటే తియ్యటి జొన్న. ఈ జొన్న నుంచి ఇథనాల్‌ను వ్యాపారాత్మకంగా ఉత్పత్తి చేసే తొలి కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని మహ్మద్పూర్లొ ఆరంభమైంది. ఈ మొదటి ప్రాజెక్టు రైతు పంటలను లాభదాయకంగా పండించి ఇథనాల్ ఉత్పత్తిచేయడానికి దొహదం చేసింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్), రష్‌ని డిస్టిలరీస్‌లు సంయుక్తంగా రూపొందించాయి. ఈ కర్మాగారం జొన్న పండించే రైతులతో ఆకృతి అగ్రికల్చరల్ అసోసియేట్స్ అనే సంస్థ(ఏఏఐ) ద్వారా అనుబంధాన్ని పంచుకొంది. ఈ సీజన్లో దాదాపు 1600 హెక్టార్లు(4000 ఎకరాలు) వివిధ అభివృద్ధి చేసిన జొన్న రకాలను పెంచడానికి నిశ్చయించారు. దీనికోసం గ్రామ ప్రజలు తియ్యని జొన్నను పండించే రైతులను గుర్తించడం జరిగింది. మామాలు జొన్న లాగే తియ్యటి జొన్న కూడా ఖరీఫ్(వర్షాకాల) పంటయే ఐనా, ఇక్రిశాట్ ఈ సమస్యను అధిగమించి హైబ్రిడ్ రకాలను ఏడాదిలో ఎప్పుడైనా పండించుకొనెలా రూపొందించింది. దీనివల్ల రష్‌ని డిస్టిలరీస్‌కు ఏడాది పొడవునా సప్లై ఉంటుంది. చెరకు, జొన్నల కన్నా తియ్య జొన్న వల్ల లాభాలధికంగా ఉన్నాయి. బయో ఇంధనానికి ఇది ముడి సరకుగా పనికొస్తుంది. జొన్న పంటకు కావలసిన నీటి అవసరానికన్నా సగమే ఈ పంటకు చాలు. అలాగే, చెరకు పంటకు కావలసిన నీటి అవసరాల్లొ 8వ వంతు నీరు దీనికి సరిపోతుంది. నిజానికి తియ్యజొన్న పంటకయ్యే వ్యయం చెరకు పంటకయ్యే వ్యయంలో ఐదోవంతే అవుతుందంటారు ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు. తియ్యజొన్న నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేసే విషయంలో మామాలుగా వచ్చే ఎలాంటి విమర్శలు లేవు. ఎందుకంటే, ఇది ఆహారోత్పత్తికి అవసరమయ్యే భూమిని తీసుకొని ఆహార రక్షణకు అపాయాన్ని కల్గించదు. కేవలం వాటి కాడలనుంచి వచ్చే రసాన్ని మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి వాడతారు. జొన్నను యధాప్రకారం ఆహారంగా వాడుకోవచ్చు. ఇదికాక తియ్య జొన్నను కర్బన తటస్థంగా ఒక అంతర్జాతీయ సంస్థ గుర్తింపునిచ్చింది. ఇది ఎంత కర్బనాన్ని తీసుకొంటుందో, పంట పెరిగేటపుడు, ఇథనాల్‌గా మారి, మండేదాకా అంతే కర్బనాన్ని వదులుతుంది. దీనివల్ల పర్యావరణానికి, పరిసరాలకి అనుకూలంగా ఉండే బయో ఇంధనం ఉత్పత్తి చేయడానికి ఆధారంగా వ్యవహరిస్తుంది. సురీందంర్ సూద్, కొత్త ఢిల్లీ జూన్ 15, 2007, బిజినెస్ స్టాండర్డ్, జూన్ 29, 2007 గ్రామీణ భారతానికి యుఎన్ సాయంతో బయోమాస్ గ్యాస్ ప్రాజెక్ట్ నూతన బయో మాస్ గ్యాసిఫయ్యర్ ప్లాంట్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బోరెగుంటెలో నేడు యుఎన్‌డిపి నిర్వాహకులు ...................... 24 మార్చి 2008: నూతన బయో మాస్ గ్యాసిఫయ్యర్ ప్లాంట్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బోరెగుంటెలో నేడు యుఎన్‌డిపి నిర్వాహకులు శ్రీ కెమల్ డెర్విస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఈ పథకం కేవలం వారి జీవితలలో మార్పులను తేవడమే కాదు, దానిని వారే స్వయంగా నిర్వహించుకోగలరు. అది వారికి అదనపు ఆదాయాన్ని చేకూర్చగలదని' అన్నారు. ఈ పథకం కింద ఆరంభించిన రెండో ప్లాంట్ ఇది. ఇది 250 కిలో వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థకు అమ్మనున్నారని యుఎన్‌డిపి తెలిపింది. ఈ పథకం కింద తొలి ప్రాజెక్ట్‌ను కబ్బిగిరె గ్రామంలో 24 జనవరి 2008నాడు ఆరంభమైంది. ఇది అప్పటినించి 4 గ్రామాలకు దాదాపు 10వేల వాట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది.పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ, కర్ణాటక ప్రభుత్వం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యుఎన్‌డిపి) లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. గ్రామీణులకు పర్యావరణ సురక్షిత కర్బన తటస్థ మార్గంలో విద్యుత్‌ను దీనిద్వారా అందించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీనికి యుఎన్ గ్లోబల్ ఎన్విరోన్మెంట్ ఫెసిటిలిటీనించి నిధులు సమకూర్చారు.ఈ రకమైన మూడో ప్లాంట్‌ను త్వరలో 250 కిలోవాట్ల సామర్ధ్యంతో పనిచేసేవిదంగా 2008 అంతానికి సీబిరాయనపాలెంలోను, మరోటి చిన్నెనహళ్లిలోనూ ఆరంభించనున్నారు. ఆధారము: http://www.un.org/apps/news/story.asp?NewsID=26079&Cr=undp&Cr1=energy ఆంధ్రప్రదేశ్‌లో బయో డీజిల్ మొక్కల పెంపకం రాష్ట్రంలోని 16 జిల్లాలలో దాదాపు 8800 హెక్టారుల్లో పొంగామియా జాతి బయో డీజిల్ మొక్కలను ................... రాష్ట్రంలోని 16 జిల్లాలలో దాదాపు 8800 హెక్టారుల్లో పొంగామియా జాతి బయో డీజిల్ మొక్కలను ఆంధ్రప్రదేశ్ పెంచనుంది. దీనికి దాదాపు రు. 2341.49 లక్షలు ఖర్చవుతాయని అంచనా. దీని కోసం ఆంధ్ర ప్రదేశ్‌కు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) గ్రామీణ మౌలికాభివృద్ధి నిధి(ఆండిఐఎఫ్) కింద నిధులను కేటాయించింది. అంచానా వేసిన రూ. 2341.49 లక్షలలో రూ. 2224.46 లక్షలు నాబార్డు నుంచి రుణంగా పొందునుండగా, మిగిలిన రూ. 117.03 లక్షలు తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతోంది. దానికి సూచనా ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహార పూర్వకమైన అనుమతిని ఇవ్వాల్సి ఉంది. ఐతే, 2007--08లో రు. 20.00 కోట్లు పాత ఆర్ఐడిఎఫ్ బయోడీజిల్ పథకం కింద విడుదల చేసింది. కాగా అందులో రు. 13.28 కోట్లను బయో డీజిల్ మొక్కలను పెంచడానికి ఖర్చు చేసింది. చెట్లలో వచ్చే నూనె గింజలను వెజిటబుల్ నూనెలకు ప్రత్యామ్నాయంగా వాడే అవకాశం మెండుగా ఉంది. ఈ నూనె గింజలను వర్షపాతం సరిగా లేని ప్రాంతాల్లో కూడా పండించ వీలుగా ఉన్నాయి. అలాటి పంటలను పండించడానికి ప్రోత్సాహాన్నివ్వడం వల్ల పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, గ్రామీణ ప్రజల ఉపాధి కల్పన, పెట్రో ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కల్పించడం తద్వారా విదేశీ మారకాన్ని ఆదా చేయడం సాధ్యమౌతుంది. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=36975 9 సౌరశక్తి కేంద్రాల ఏర్పాటు దేశంలో 2007--08లో ఆరు రాష్ట్రాల్లో 9 సౌరశక్తి కేంద్రాల ....................... దేశంలో 2007--08లో ఆరు రాష్ట్రాల్లో 9 సౌరశక్తి కేంద్రాల ఏర్పాటుకు కొత్త & పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖ ప్రోత్సాహాన్నందించింది. ఈ జాబితాలో 3కేంద్రాలను ఆరంభించి మహారాష్ట్ర అగ్ర స్థానాన్ని సంపాందించింది. జమ్మూ, కాశ్మీరు రెండు కేంద్రాలను ఆరంభించింది. ఛత్తీస్ గడ్, హర్యానా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తలా ఒక కేంద్రాన్ని ఆరంభించాయి. వీటన్నిటి ఉత్పాదక సామర్ధ్యాన్ని 2000 కి.వా. లోపే ఉండేలా నిర్ణయించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చే ఉత్పాదక శక్తి 800 కి.వా. కన్నా ఎక్కువే ఉంటుంది. వివిధ ప్రాజెక్టులలో ఈ 6 రాష్ట్రాలూ తలా ఒక సౌర ఫోటో వోల్టాయిక్ విద్యుత్ ప్లాంటు ప్రాజెక్టును పొందాయి. వీటిలో పశ్చిమ బెంగాల్ అన్నిటికన్నా గరిష్టంగా 945.0 కి.వా.ల సామర్ధ్యంతో, ఛత్తీస్గడ్ 646.8 కి.వా. ల సామర్ధ్యంతో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. ఇవిగాక, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర రాష్ట్రాలు బిఐపివి(బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్) - అంటే భవనాలతో సమీకృతంగా ఉండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 18 కి.వా. సామర్ధ్యం గల ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లను, 8 కి.వా. సామర్ధ్యంతో ఉండే పవర్ ప్యాక్లనూ ఆరంభించేందుకు అనుమతి పొందాయి. సౌర ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లను దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహిస్తోంది. పాక్షికంగా ఆర్థిక సహాయాన్నిస్తూ కుగ్రామాల్లో సైతం విద్యుదీకరణ కార్యక్రమాలకి తోడ్పడుతోంది. ఆయా రాష్ట్రాలో ఈ పథకాలను అమలుచేసే సంస్థలు ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలో అమలు చేసే సంస్థలకు దాదాపు 40 కోట్ల నిధులు ఏర్పాటు చేసారు. దానిలో ప్రస్తుతం అమలౌతున్న 4 పథకాలకూ అందులో ఆర్థిక సాయం అందుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ 2008--09లో పూర్తవుతాయి. సౌర ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లను/పవర్ ప్యాక్‌లను ఏర్పాటు చేసేందుకు మంత్రిత్వ శాఖ అనుమతులను జారీ చేయడానికి ఆ పథకం పరిధిని, నిధుల లభ్యతనూ దృష్టిలో ఉంచుకొంటోంది. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=36976 సౌరశక్తి పథకాలకు ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు దేశంలో గరిష్టంగా 50 మె.వా. సామర్థ్యం ఉండే మెగా గ్రిడ్-ఇంటరాక్టివ్ .................. దేశంలో గరిష్టంగా 50 మె.వా. సామర్థ్యం ఉండే మెగా గ్రిడ్-ఇంటరాక్టివ్ సౌరశక్తి ఉత్పత్తి పథకాలకు ఊతాన్ని ఇచ్చే రీతిలో కొత్త, పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రదర్శనా కార్యక్రమాన్ని ప్రకటించింది. బిల్డ్ ఓన్ ఆపరేట్ పద్ధతిలోరిజిస్టర్ అయిన ఎలాటి సంస్థైనా ఒక ప్రాజెక్ట్ అభివృద్ధిదారుగా సౌరశక్తి ప్రాజెక్టులను ఆరంభించడానికి అర్హులే. ప్రతి ప్రాజెక్ట్ అభివృద్ధిదారు కూడా కనిష్టంగా 1మె.వా. సామర్ధ్యం ఉండే ఒకటి లేదా అంతకుమించి ప్రాజెక్టులను గరిష్టంగా 5మె.వా. సామర్ధ్యంతో ఏర్పాటుచేసేందుకు పంపే ప్రతిపాదనలను పరిశీలిస్తారు. ఒక రాష్ట్రంలోసౌరశక్తి ప్రాజెక్టులను గరిష్టంగా 10మె.వా. సామర్ధ్యం ఉండేలా చూడటం జరుగుతుంది. అలాగే ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్లు(ఎస్ఇఆర్సి) ప్రకటించిన లేదా ప్రకటించే టారిఫ్ ఆధారంగా ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. అనుమతిపొంది 31 డిశంబర్ 2009 నాటికెల్లా ఆరంభం అయ్యే ప్రాజెక్టులకు ప్రభుత్వం ఉత్పాదకత ఆధారంగా అది సోలార్ ఫోటోవోల్టాయిక్ శక్తి అయితే కి.వా.కు 12రూపాయలనూ, సోలార్ ధర్మల్ శక్తి ఫీడ్ అయితే 10 రూపాయలనూ ఆయా ప్రాజెక్టు అభివృద్ధిదారులకు ప్రోత్సాహకాన్నివ్వడానికి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్లు(ఎస్ఇఆర్సి) ప్రకటించిన లేదా ప్రకటించే టారిఫ్‌లను పరిగణనలోకి తీసుకొంటారు. సౌర శక్తి పథకాలను అమలు చేసే అలాటి సౌకర్యాలకు, రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకూ కూడా మంత్రిత్వశాఖ ప్రోత్సాహకాలనిస్తుంది. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=36998 మొత్తం33గ్రిడ్ ఇంటరాక్టివ్ ఫోటో వోల్టాయిక్ సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటుఏడాదిలో2.55మిలియన్ల యూనిట్లకు చేరనున్న విద్యుదుత్పత్తిదేశంలో మొత్తం 33 గ్రిడ్ ఇంటరాక్టివ్ ఫోటో వోల్టాయిక్ సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా అందింది. ఈ ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం 2.12 మెగావాట్లు. ఇవి ఒక ఏడాదిలో 2.55 మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తాయని అంచనా. దీనికి అదనంగా దేశంలో సుమారు 14.5 లక్షల వికేంద్రీకరించిన 125 మెగావాట్ల ఫోటో వోల్టాయిక్ సౌరశక్తి వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. సౌరశక్తితో నీళ్లను వేడిచేయడానికి దాదాపు 2.15 మిలియన్ల సమీకరణ స్థలాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎంత విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేదీ ఆయా ప్రాంతాల వాతావరణ స్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 2 చదరపు మీటర్ల వైశాల్యం గల స్థలంలో ఏడాదికి 300 రోజులు వాడితే దాదాపు 1500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ప్రభుత్వం ఈ సౌరశక్తి వ్యవస్థలను ఏర్పాటు చేయడానికయ్యే ఖర్చును తగ్గించటానికిె ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో (అ) అవసరమయ్యే ముడి పదార్థాల వాడకాన్ని తగ్గించి, సౌరశక్తి ఉపకరణాల పనితీరును మెరుగుపరిచే పరిశోధనాభివద్ధి పనులు చేపట్టడం, (ఆ) ఎంపిక చేసిన సౌరశక్తి వ్యవస్థలపై సబ్సిడీలివ్వడం, (ఇ) తయారీదారులకు, వాడకందారులకు లోన్లు ఇస్తూ వాటిపై వడ్డీలకు సబ్సిడీలివ్వడం, (ఈ) ముడిపదార్థాలపై, ఉత్పత్తులపై రాయితీలివ్వడం లేదా దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం, (ఉ) ఎక్సైజు సుంకాన్ని రద్దుచేయడం, ఇంకా (ఊ) మొదటి ఏడాది అంతానికి వేగవంతం చేసిన 80 శాతం తరుగు విధింపు వగైరా కొన్ని. ప్రవేటు ఏజెన్సీలకు సౌరశక్తి రంగంలో పరిశోధన, ఉత్పత్తికిగానూ అనేక ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగింది. అన్ని విద్యా, పరిశోధనా సంస్థలూ, పరిశ్రమలూ (ప్రవేటు సంస్థలతో సహా) సౌరశక్తి రంగంలో పరిశోధనల్లో మునిగి ఉన్నాయి. పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా వారందరికీ గ్రాంటు అందుతుంది కూడా. ప్రవేటు సంస్థల పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకయ్యే ఖర్చుకు ఆదాయపు పన్ను మినహాయింపుకూడా ఉంది. గ్రిడ్ ఇంటరాక్టివ్ సౌరశక్తి ఉత్పాదన కింద ప్రవేటు ఏజన్సీలు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలందుకొనే అవకాశం ఉంది. దేశంలో బిల్డ్, ఓన్, ఆపరేట్ పద్ధతిలో మెగావాట్ సౌరశక్తి ఉత్పాదనా కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా చేసే ప్రతి సంస్థకూ ఇది వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి ప్రాజెక్ట్ అభివృద్ధిదారు కూడా కనిష్టంగా 1మె.వా. సామర్ధ్యం ఉండే ఒకటి లేదా అంతకుమించి ప్రాజెక్టులను గరిష్టంగా 5 మె.వా. సామర్ధ్యంతో ఏర్పాటుచేసేందుకు పంపే ప్రతిపాదనలను పరిశీలిస్తారు. ఐతే రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్లు సౌరశక్తి ద్వారా ఉత్పాదన అయ్యే విద్యుత్‌కు టారిఫ్‌ను నిర్ణయించి ఉంటే, ఆయా రాష్ట్రాల్లోని సంస్థలు పంపే ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. 31 డిశంబరు 2008 అంతానికి ఏర్పాటై పనిచేసే ప్రాజెక్చటులకు ఉత్పాదకత ఆధారంగా సోలార్ ఫోటో వోల్టాయిక్ శక్తికి కిలో వాట్ అవర్‌కు 12 రు.ల చొప్పునా, సౌర ఉష్ణశక్తికి కిలో వాట్ అవర్‌కు 10 రు.ల చొప్పునా ప్రోత్సాహకాలనివ్వడం జరుగుతుంది. ఇది విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్లు సౌరశక్తి ద్వారా ఉత్పాదన అయ్యే విద్యుత్‌కు నిర్ణయించిన టారిఫ్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=36997 10,250 మె.వా.లకు చేరిన పునరుజ్జీవ శక్తి వనరులనించి ఉత్పత్తి అయ్యే గ్రిడ్-ఇంటరాక్టివ్ శక్తి సామర్థ్యం. మన దేశంలో 10వ ప్రణాళికా కాల అంతానికి అంటే, 31.03.2007 ...................... మన దేశంలో 10వ ప్రణాళికా కాల అంతానికి అంటే, 31.03.2007 నాటికి పునర్వినియోగ శక్తి వనరులనించి ఉత్పత్తి అయ్యే గ్రిడ్-ఇంటరాక్టివ్ శక్తి సామర్థ్యం 10,250 మె.వా.లకు చేరింది. 11వ ప్రణాళికా కాలంలో ఈ సామర్థ్యానికి అదనంగా 14,000 మె.వాల శక్తిని ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు. వాటిలో పవన శక్తి, బయోమాస్, సౌరశక్తి, చిన్నపాటి నీటి వ్యవస్థలనించి, శక్తి వనరులనుంచి ఈ శక్తిని ఉత్పత్తి చేయనున్నారు. పునరుజ్జీవ శక్తి రంగంలో కార్పొరేట్ / ప్రవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం, వారికి పెట్టుబడి/ వడ్డీలపై సబ్సిడీ, వేగవంతమైన తరుగు, ఎక్సైజు కస్టమ్స్ సుంకాలనించి మినహాయింపు/ ప్రోత్సహకాలవంటి వివిధ రకాల ఆర్థిక రాయితీలను ఇస్తోంది. ఈ రకమైన పథకాలకు సెక్షన్ 80-1ఏ, ఆదాయపన్ను చట్టం 1961 కింద మినహాయింపులనీ వర్తింప జేస్తున్నారు. గ్రిడ్-ఇంటరాక్టివ్ శక్తి కై వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక టారిఫ్‌ను కూడా ప్రకటిస్తున్నారు. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=37032 జాతీయ బయో ఇంధనాభివృద్ధి బోర్డు ప్రభుత్వం జాతీ య బయో ఇంధనాభివృద్ధి బోర్డును ఆరంభించే -------- ప్రభుత్వం జాతీ య బయో ఇంధనాభివృద్ధి బోర్డును ఆరంభించే యోచనలో ఉంది. వ్యాపార నియమాల కేటాయింపు కిందకొత్త, పునరుజ్జీవ శక్తి మంత్రిత్వ శాఖకు జాతీయ బయో ఇంధనాభివృద్ధి బోర్డును ఆరంభించే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. బోర్డును ఆరంభించడానికి, బోర్డ్ ప్రవర్తనా నియమావళితో కూడిన ముసాయిదాను రూపొందించి ప్రభుత్వ అనుమతికోసం సమర్పించడం జరిగింది. జాతీయ నూనె విత్తనాలు, వెజిటబుల్ నూనె బోర్డు(ఎన్ఓవిఓడి) ద్వారా వ్యవసాయ మంత్రిత్వశాఖ రైతులకు, ప్రభుత్వేతర సంస్థలకు(ఎన్జిఓ), ఇతరులకు చెట్లద్వారా వచ్చే నూనెగింజలకు(టిబిఓ) సబ్సిడీని ఇస్తోంది. వీటిలోచెట్లద్వారా వచ్చే నూనెగింజల ఏకీకృత పథకం కింద బ¸ూ ఇంధన పంటలకు సైతం సబ్సిడీ లభిస్తోంది. ఈ పథకం కింద 30 శాతం అప్పుతో కూడిన సబ్సిడీని ఇస్తున్నారు. దీనిలో 50 శాతం నియమిత కాల అప్పుగా బ్యాంకునించి ఇస్తున్నారు. 20 శాతం భూమి, కూలి పనివంటివాటి రూపంలో లబ్దిదారు పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది. ఇంకా, రాష్ట్ర /కేంద్ర రంగాల అభివృద్ధి పథకాల కింద జట్రోపా, పొంగామియా విత్తనాల ఉత్పత్తి కోసం, ఆయా మొక్కల పెంపకం కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2005-06లో 9 గుర్తించిన రాష్ట్రాలకు రు. 49.00 కోట్ల మేరకు, 2006-07లో 15 గుర్తించిన రాష్ట్రాలకు రు. 49.50 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందించింది. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=37033 గ్రామీణ భారతానికి యుఎన్ సాయంతో బయోమాస్ గ్యాస్ ప్రాజెక్ట్ నూతన బయో మాస్ గ్యాసిఫయ్యర్ ప్లాంట్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బోరెగుంటెలో నేడు --------- 24మార్చి 2008:నూతన బయో మాస్ గ్యాసిఫయ్యర్ ప్లాంట్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బోరెగుంటెలో నేడు యుఎన్‌డిపి నిర్వాహకులు శ్రీ కెమల్ డెర్విస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఈ పథకం కేవలం వారి జీవితలలో మార్పులను తేవడమే కాదు, దానిని వారే స్వయంగా నిర్వహించుకోగలరు. అది వారికి అదనపు ఆదాయాన్ని చేకూర్చగలదని' అన్నారు. ఈ పథకం కింద ఆరంభించిన రెండో ప్లాంట్ ఇది. ఇది 250 కిలో వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థకు అమ్మనున్నారని యుఎన్‌డిపి తెలిపింది. ఈ పథకం కింద తొలి ప్రాజెక్ట్‌ను కబ్బిగిరె గ్రామంలో 24 జనవరి 2008నాడు ఆరంభమైంది. ఇది అప్పటినించి 4 గ్రామాలకు దాదాపు 10వేల వాట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ, కర్ణాటక ప్రభుత్వం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యుఎన్‌డిపి) లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. గ్రామీణులకు పర్యావరణ సురక్షిత కర్బన తటస్థ మార్గంలో విద్యుత్‌ను దీనిద్వారా అందించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీనికి యుఎన్ గ్లోబల్ ఎన్విరోన్మెంట్ ఫెసిటిలిటీనించి నిధులు సమకూర్చారు. ఈ రకమైన మూడో ప్లాంట్‌ను త్వరలో 250 కిలోవాట్ల సామర్ధ్యంతో పనిచేసేవిదంగా 2008 అంతానికి సీబిరాయనపాలెంలోను, మరోటి చిన్నెనహళ్లిలోనూ ఆరంభించనున్నారు. ఆధారము: http://www.un.org/apps/news/story.asp?NewsID=26079&Cr=undp&Cr1=energy 2012కెల్లా సుదూర గ్రామాల పూర్తి విద్యుదీకరణ పునర్నవ శక్తి ఉత్పాదనకవసరమయ్యే ఉపకరణాలను తయారుచేసే ............. పునర్నవ శక్తి ఉత్పాదనకవసరమయ్యే ఉపకరణాలను తయారుచేసే సెజ్‌లను ఆరంభించాలని కేంద్ర కొత్త, పునర్నవ శక్తి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలు ఈ విషయంగా భూమిని కేటాయించడానికి ముందుకొచ్చాయి.దేశంలోని అన్ని మారుమూల గ్రామాలలో కూడా కనీసం 1 యూనిట్ విద్యుత్ 11 వ పంచవర్ష ప్రణాళికలో అంటే మార్చి 2012 నాటికి పునర్నవ శక్తి కింద లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని ప్రకటిస్తూ, రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన కింద ఇప్పటికే 4000 సుదూర గ్రామాల్లో, వాడల్లో విద్యుదీకరణ పూర్తైందని మంత్రి తెలిపారు. మరో 2700 గ్రామాల్లో పని ఆరంభంకానున్నదనీ ఆయన అన్నారు.10వ ప్రణాళికలో మొత్తం విద్యుత్ సామర్థ్యానికి 25 శాతం అదనంగా జోడించడం జరిగింది. పవన శక్తి వనరుల వాడకం 16 శాతం. ఇది యూరప్‌లో కన్నా 2 శాతం తక్కువ, అమెరికాలో కన్నా 1 శాతం తక్కువ ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=30960 సుదూర గ్రామాలనీ, వాడలనీ చేరుతోన్న కొత్త, పునర్నవ శక్తి 2007-08 సంవత్సర లక్ష్యమైన 1500 మె.వా. లో భాగంగా ........... 2007-08 సంవత్సర లక్ష్యమైన 1500 మె.వా. లో భాగంగా 192 మె.వా. గ్రిడ్ ఇంటరాక్టివ్ రెన్యువబుల్ పవర్‌ని ఆరంభించడం జరిగింది. 55 మె.వా.స పవన శక్తి సామర్థ్యాన్ని గత నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. బయోమాస్ రంగంలో 17.5 మె.వా. సామర్థ్యాన్ని గత నెలలో ఆరంభించారు. దీనితో 2007-08 లక్ష్యమైన 275 మె.వా.ల సాధనకు54.5 మె.వా. కు చేరడం జరిగింది. ఇదే సమయంలో చిన్న జల విద్యుచ్ఛక్తి రంగంలో 5మెవా సామర్థ్యాలను ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటిదాకా 3000కు పైగా గ్రామాలు, 830 వాడలు ఈ సుదూర గ్రామాల విద్యుదీకరణ కార్యక్రమంలో భాగంగా విద్యుదీకరించడం జరిగింది. గతనెలలో 36 గ్రామాలలో పని పూర్తయ్యింది. 2007-08 జూన్, జూలై మాసాల్లో గ్రామీణ శక్తి రక్షణ కింద 5 పరిక్షాత్మక ప్రాజెక్టులను ఆరంభించారు. దీంతో మొత్తం పరీక్షాత్మక ప్రాజెక్ట్‌ల సంఖ్య 13కు చేరింది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజన్సి(ఇరెడా) గత నెలలో 12.44 కోట్ల రూపాయల రులనిచ్చింది. 2007-08 కిగాను మంత్రిత్వ శాఖ రు. 550 కోట్ల లక్ష్యాన్ని ఉంచింది. దీనిలో రు, 156.26 కోట్ల వితరణ పూర్తి చేయగలిగింది. ఆధారము: //www.pib.nic.in/release/release.asp?relid=30822 వెదురునించి శక్తి సైన్స్ & టెక్నాలజీ శాఖ జాతీయ వెదురు సంబంధిత అప్లికేషన్ల మిషన్‌ని (ఎన్ఎంబిఏ) అమలుచేస్తోంది. వెదురు ముడి సరకుగా ఎన్ని రకాల ఉత్పత్తులను అభివృద్ధి చేయవచ్చో చూపి, వాటి సంబంధ పరిజ్ఞానాలను ప్రదర్శించడం దీని ఉద్దేశ్యం. ఈ మిషన్‌లో భాగంగా విద్యుత్ తయారు చేయగల గ్యాసిఫయ్యర్లను వెదురుతో రూపొందించడం జరిగింది. ఈ గ్యాసిఫయ్యర్లు వెదురు వ్యర్థాలు, ఇతర బయోమాస్‌ను వాడగలవు.ఏఏ రాష్ట్రాల్లో అయితే వెదురు సమృద్ధిగా లభ్యమౌతున్నదో ఆయా రాష్ట్రాల్లో ఈ గ్యాసిఫయ్యర్లు వాడి విద్యుత్ తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా వగైరా. ఆధారము: http://www.pib.nic.in/release/release.asp?relid=30725 గ్రామీణ విద్యుదీకరణ లక్ష్యాలు ఏప్రిలు 2005లో భారత ప్రభుత్వం 'రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకం' అనే ఒక గ్రామీణ .................. ఏప్రిలు 2005లో భారత ప్రభుత్వం 'రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకం' అనే ఒక గ్రామీణ మౌలిక సదుపాయాలు, గృహవిద్యుదీకరణ చెయడానికి ఒక పధకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా 2009 నాటికల్లా విద్యుత్తే లేకుండా మిగిలిన గ్రామాల్లో సైతం విద్యుదీకరణ పూర్తి చేయడం (మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ చేపట్టిన గ్రామాల మినహా) దీని ఉద్దేశ్యం. దీని కార్యాచరణ ప్రణాళిక ఇలా ఉంది :2007-08: 40,000 గ్రామాలు2008-09: 10,000 గ్రామాలు, మిగిలిన గ్రామాలేవన్నా ఉంటే వాటితో సహా ఈ విషయాన్ని కేంద్ర శక్తి వనరుల మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండే రాజ్య సభలో ఒక సభ్యుని లిఖిత ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమలు చేస్తున్న ఏజన్సీలు 24.08.2007నాటికి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆర్జిజివివై కింద 43,100 గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి అయ్యింది. గ్రామీణ విద్యుదీకరణ రాష్ట్రాలవారీ అభివృద్ధి కింది పట్టికలో చూపడం జరిగింది : రాష్ట్రాలవారీ, సాలువారీ విద్యుదీకరణ పనులు చేపట్టిన గ్రామాల సంఖ్య - ఆర్జిజివివై కింద ఆయా అమలుచేసే సంస్థలు ఇచ్చిన సమాచారం వివరాలు ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు