భారతదేశంలో సౌర విప్లవం భారత్ సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ కాలుష్య రహిత భవిష్యత్తు వైపు వేగంగా ప్రయాణిస్తోంది. నిర్దేశిత గడువుకు ముందే 100 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్య సాధన లక్ష్యాన్ని అధిగమించింది. అలాగే, 2030 నాటికి 500 గిగావాట్ల కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పాదనను, 2070 నాటికి నికర శూన్య ఉద్గార లక్ష్యాన్ని సాధించాలని లక్ష్య నిర్దేశం చేసుకుంది. ఇంధన రంగంలో దేశాన్ని, కుటుంబాలను స్వయంసమృద్ధం చేసే కృషిలో భాగంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం భారత సౌర విప్లవానికి ఈ పథకం సారధిగా రూపొందింది. భారత్లో వేగంగా పెరుగుతున్న ఇంటి పైకప్ప సౌర విద్యుత్ వ్యవస్థలు (గణాంకాలు 2026 అక్టోబర్ 13 వరకు) 91,34,675 దరఖాస్తులు అందాయి.52,32,058 ఇంటి పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు.62,03,315 కుటుంబాలు ఈ పథకంలో భాగమయ్యాయి. ఆదర్శ సౌర గ్రామ పథకం ఈ పథకంలో భాగమైన 'ఆదర్శ సౌర గ్రామం' కింద దేశంలోని ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని సారశక్తి సమన్వితంగా తీర్చిదిద్దాలి. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాలను ఇంధన స్వయంసమృద్ధం చేయడం దీని లక్ష్యం ఇందుకోసం ప్రభుత్వం ₹800 కోట్లు కేటాయించగా, ఎంపికైన ప్రతి ఆదర్శ సౌద గ్రామానికీ ఈ నిధుల నుంచి ₹1 కోటి వంతున లభిస్తుంది. ఒక రెవెన్యూ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కావాలంటే అందులో జనాభా 5,000కు పైగా ఉండాలి. ప్రత్యేక హోదాగల రాష్ట్రాల్లో గ్రామ జనాభా 2,000కు పైగా ఉండాలి. గ్రామాల ఎంపిక కోసం పోటీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ఆదర్శ గ్రామాలన్నీ సౌరశక్తి వైపు విజయవంతంగా మళ్లాలని, దేశంలోని ఇతర గ్రామాలకు వాటిని ఆదర్శంగా నిలపాలని ప్రభుత్వం లక్ష్య నిర్దేశం చేసుకుంది. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ఆదాయం ఉపాధి పర్యావరణ పరిరక్షణ మార్గం గృహ పొదుపు ఆదాయ సృష్టి: విద్యుత్ బిల్లులపై గణనీయ పొదుపుతో కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ఇంటి పైకప్పు మీద 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థతో నెలకు సగటున 300 యూనిట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి, సొంత సౌర వ్యవస్థల ద్వారా ఒనగూడే మిగులు విద్యుత్తును వారు పంపిణీ సంస్థలకు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చు. పౌర సామర్థ్యం విస్తరణ: నివాస రంగంలో ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తే దేశంలో అదనంగా 30 గిగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యం సమకూరుతుందని అంచనా. ఇది భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు గణనీయంగా దోహదం చేస్తుంది. పర్యావరణ ప్రయోజనాలు: ఈ రూప్టాప్ వ్యవస్థల జీవిత కాలం 25 ఏళ్లు కాగా, దాదాపు 1000 జలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దీంతో 720 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలు తగ్గి, పర్యావరణంపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఉపాధి సృష్టి: దేశవ్యాప్తంగా తయారీ రంగం సహా రవాణా, సరఫరా వ్యవస్థ, విక్రయాలు, వ్యవస్థాపన, కార్యకలాపాలు-నిర్వహణ వంటి వివిధ రంగాలతోపాటు ఇతరత్రా సేవల రంగాల్లో సుమారు 1.7 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టికి ఈ పథకం తోడ్పడుతుందని అంచనా. ఎంత రాయితీ లభిస్తుంది? ఇంటి పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుపై రాయితీ కోసం పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం జాతీయ పోర్టల్ ద్వారా ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ పరిమాణంగల వ్యవస్థ అవసరమో, దాని ఏర్పాటు ద్వారా ఎంత ప్రయోజనం పొందగలరో కూడా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లో నమోదు చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన వినియోగదారు సంఖ్య, మొబైల్ నంబరును ఉపయోగించి అందులో లాగిన్ కావచ్చు. అటుపైన ఫారం నింపి, విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి ఆమోదం పొందాలి. అనంతరం ఒక నమోదిత డీలర్ ద్వారా సౌర వ్యవస్థను అమర్చుకుని, సంబంధిత సమాచారంతో నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేయాలి. విద్యుత్ సంస్థ దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి ధ్రువీకరిస్తుంది. చివరి దశలో మీ బ్యాంకు ఖాతా వివరాలను ఆన్లైన్లో సమర్పిస్తే, 30 రోజుల్లోగా రాయితీ సొమ్ము అందులో జమ అవుతుంది. వ్యక్తిగత గృహాలకు 'కిలోవాట్ పీక్' సామర్థ్యం ప్రకారం తొలి 2 కిలోవాట్లకు రూ.30,000, ఆపైన ప్రతి అదనపు 'కిలోవాట్ పీక్'కు రూ.18,000 వంతున రాయితీ లభిస్తుంది. అయితే, మొత్తం మీద ప్రతి వ్యక్తిగత గృహానికి రాయితీ 3 కిలోవాట్ల స్థాయి వరకూ మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ హౌసింగ్ లేదా 'ఆర్ డబ్ల్యూఎ'లకు, 500 కిలోవాట్ పీక్ సామర్థ్యం వరకు ప్రతి కిలోవాట్ పిక్కు రూ.18,000 మేర కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే, ప్రత్యేక హోదాగల ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లదాఖ్, ఈశాన్య రాష్ట్రాలు సహా అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో కేంద్ర ఆర్థిక సహాయం 10 శాతం అధికంగా లభిస్తుంది. కేంద్ర సహాయంతో పాటు పైకప్పు సౌర వ్యవస్థల ఏర్పాటుకు 5.75 శాతం వడ్డీతో హమీరహిత రుణం. ఆధారం: న్యూ ఇండియా సమాచార్